సంకలనాలు
Telugu

గుర్రపు డెక్కతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్న తెనాలి కుర్రాడు

team ys telugu
3rd Mar 2017
Add to
Shares
11
Comments
Share This
Add to
Shares
11
Comments
Share

గుర్రపు డెక్క గురించి మీరు వినేవుంటారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, జలాలనూ కలుషితం చేసే ఒకరకమైన కలుపుమొక్క. వీటిని తొలగించడానికి ప్రభుత్వాలు ఇప్పటిదాకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేశాయి. విదేశీ టెక్నాలజీ ఉపయోగించినా సమస్య తీరలేదు. చెరువు మీద చిక్కగా పచ్చగా పారుతూ, కొంతకాలం తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తుంది. పర్యావరణం మీద ప్రభావం చూపించే అనేకానేక అంశాల్లో గుర్రపు డెక్క ఒకటి.

image


గుర్రపుడెక్క నిర్మూలన విషయాన్ని కాసేపు పక్కన పెడితే, వాటి కాడలతో అద్భుత కళాఖండాలు తయారు చేయిస్తూ, 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అబ్దుల్ ముజీబ్. పనికిరాని గుర్రపు డెక్కను కుటీర పరిశ్రమకు ముడిసరుకుగా వాడి, నిరుపేద కుటుంబాల్లో ఆకలి లేకుండా చేశాడు. గుర్రపు డెక్కతో అద్భుతాలు చేయడమే కాదు.. మనిషి మనుగడకు అవసరమైన నీటి వనరులను కలుపు మొక్కల బారినుంచి తనవంతు ప్రయత్నంగా కాపాడుతున్నాడు.

మొదటగా గుర్రపు డెక్కను స్థానికంగా ఉండే చెరువు నుంచి సేకరించి ఎండబెట్టాడు. ఒక్కో కాడను సన్నగా చీరి, మ్యాట్ తయారు చేశాడు. తొలుత చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అలా మొదలైంది అతడి ప్రయాణం. పరిశోధనలో భాగంగా ఒకసారి అస్సాంకి వెళ్లాడు. అక్కడ ఇలాంటి కలుపు మొక్కలతోనే అందమైన హాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం గమనించాడు. అలా పదిరోజుల పాటు, అనేక ప్రాంతాలు తిరిగి, ఎన్నో రకాల కళాఖండాలను గమనించాడు.

image


తిరిగి ఆంధ్రాకు వచ్చాక, గుర్రపు డెక్క తీవ్రంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో సర్వే చేశాడు. అలా 2014 అక్టోబర్ లో అల్లిక అనే సంస్థను స్థాపించాడు. మొదటగా ఆరుగు మహిళలకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కో ఐటెం పెంచుకుంటూ మార్కెట్ మీద పట్టు సంపాదించాడు. రెండున్నరేళ్లలో ఊహించని విధంగా అల్లిక క్లిక్ అయింది. ప్రస్తుతం 70 మంది కళాకారులు తన సంస్థలో పని చేస్తున్నారు. హాండ్ బ్యాగులు, బుట్టలు, డైనింగ్ మ్యాట్స్, హోం డెకార్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, లాప్ టాప్ బ్యాగ్స్, కాన్ఫరెన్స్ బ్యాగులు, లాంప్ షేడ్స్ తదితర వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తారు.

గుర్రపు డెక్కను సేకరించడానికి కొందరిని నియమించుకున్నాడు. దాదాపు 30 మంది దానికోసమే పనిచేస్తారు. వాళ్లంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను కోసి తీసుకొస్తారు. తెనాలి, పెద్రవూరు, అంగల్ కుదురు, జగడగుంటపాలెంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని చెరువులు, కుంటల నుంచి వాటిని సేకరిస్తారు.

భారతదేశంలో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే వుంది. కొన్నేళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఏటా 20 శాతం ఆర్ధిక ప్రగతి సాధిస్తున్నదీ రంగంలో విప్లవాత్మక మార్పులు రావల్సిన అవసరం ఉందంటాడు అబ్దుల్ ముజీబ్. మార్కెటింగ్ అంతా ఫేస్ బుక్ ద్వారానే చేసుకుంటాడు. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ పెడతాడు. అయితే, డిమాండ్ అనుకున్నంతగా లేదనేది ముజీబ్ అభిప్రాయం. దాన్నిబట్టి భవిష్యత్తులో కొత్త ప్రాడక్ట్స్ తయారు చేయాలని భావిస్తున్నాం అంటాడు.

image


ఫ్యూచర్ ప్లాన్స్

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్ ముజీబ్ ఆలోచనంతా పర్యావరణ పరిరక్షణ మీదనే. ఇకో ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్ తయారుచేయడం మీదనే తన ఫోకసంతా. ఇప్పుడు గుర్రపుడెక్క కాడల నుంచే ప్రాడక్ట్స్ తీసుకొస్తున్నాడు. భవిష్యత్తులో దాని ఆకులు, వేర్లను ఎండబెట్టి సేంద్రియ ఎరువు తయారు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ మొక్కల నుంచి వచ్చే నార ద్వారా శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలన్నది అల్లిక మరో ప్రాజెక్ట్. ఏపీ, తెలంగాణలో ఎక్కడైతే గుర్రపు డెక్క అందుబాటులో వుంటుందో అక్కడ టీంని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. తద్వారా మహిళలకు ఆర్ధికంగా చేయూతనివ్వడమే కాకుండా, గుర్రపు డెక్క బారినుంచి చెరువులను తనవంతు సాయంగా కాపాడాలని చూస్తున్నాడు. 

Add to
Shares
11
Comments
Share This
Add to
Shares
11
Comments
Share
Report an issue
Authors

Related Tags