సంకలనాలు
Telugu

ఈ యాప్ మీకు గిటార్ నేర్పిస్తుంది..!!

మ్యూజిక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న బెర్లిన్ స్టార్టప్

SOWJANYA RAJ
7th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


గురువంటే పాఠాలు నేర్పాలి..!

తప్పొప్పులు ఎత్తి చూపాలి..!

కొత్త విషయాలు నేర్పాలి..!

పాఠంలో A టు Z అర్థమయ్యేలా చెప్పాలి..!...

ఇలా అన్నీ లక్షణాలు ఉంటేనే ఉత్తమ గురువు. ఇలాంటి అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న ప్రపంచ నెంబర్ వన్ గురువు ఒకరున్నారు. ఇలాంటి నెంబర్ వన్ కిరీటాలు పెడితే గిడితే... మాకు చదువు చెప్పిన మాస్టార్లకే ఇవ్వాలని మీ జడ్జిమెంట్. మీకే కాదు.. ఎవరి గురువు విషయంలోనే అయినా విద్యార్థులకు అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ నెంబర్ వన్ కిరీటం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాస్టారికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నెంబర్ వన్ అంటే ప్రథముడు అని కాదు.. మొట్టమొదటి మాస్టార్ అని..

నిజం..! ఇప్పటి వరకు మనకు ఏది నేర్పాలన్నా.. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్పోర్ట్స్, సంగీతం అన్నిటికీ టీచర్లు, మాస్టార్లే. కానీ ఓ బెర్లిన్ స్టార్టప్ మాత్రం సంగీతం నేర్పేందుకు ఓ కొత్తరకం టీచర్ ను రెడీ చేశారు. అయితే ఈ పంతులు మనిషి కాదు.. రోబో అంత కన్నా కాదు. లెటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లుగా ఆ టీచర్ ఓ యాప్. నమ్మశక్యంగా లేదా... ?

image


గిటార్ నేర్పుతున్న "ఉబెర్ చార్డ్"

సంగీతం నేర్చుకోవడం అంటే ఇంగ్లిష్, లెక్కలను కూడా బట్టీపట్టడం అన్నంత ఈజీ కాదు. ప్రతీ దానికో లెక్క ఉంటుంది. ముఖ్యంగా గిటార్ తో శ్రావ్యమైన సంగీతం పుట్టించాలంటే ఎంతో పరిజ్ఞానం ఉండి ఉండాలి. లేకపోతే శ్రావ్యం కాస్తా కర్ణకఠోరం అయిపోతుంది. అందుకే గిటారిస్టులు ఎంతో తదేకంగా తమ గిటార్, వాటిపై ఉన్న తంత్రులపైనే దృష్టి పెట్టి నాదవినోదాన్ని పంచుతుంటారు. మరి ఇలాంటి గిటార్ ను నేర్పించాలంటే దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న విద్వాంసుడే కరెక్ట్. కానీ అది నిన్నామొన్నటి వరకు. ఇప్పుడు మానవ తప్పిదాలకూ కూడా అవకాశం లేకుండా గిటార్ నేర్పే సరికొత్త సంగీతజ్ఞాని "ఉబెర్ చార్డ్" రూపంలో స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేశాడు.

ఉబెర్ చార్డ్. గిటార్ ను, అందులో ఉన్న తీగలను ఎలా ప్లే చేయాలో మాత్రమే వివరించదు. గిటార్ వాయించేవాళ్లు ఏమైనా తప్పు చేస్తే ఎత్తిచూపుతుంది. ఎలా చేయాలో కరెక్ట్ చేస్తుంది. తప్పు ఎక్కడ జరుతుందో ఎనాలసిస్ చేస్తుంది. మీ స్కిల్ ను విశ్లేషించి ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాలని సూచనలు చేస్తుంది. అంతే కాదు.. నేర్చుకునే ఇంప్రూవ్ మెంట్ ను బట్టి గిటార్ ప్లే చేసే డిఫికల్టీ లెవల్ ను పెంచుకుంటుంది. ఇలా నేర్చుకునేకొద్దీ మాస్టర్ గా తీర్చిదిద్దేలా ఉబెర్ చార్డ్ అపర సంగీత జ్ఞానిలా బోధన చేస్తుంది.

ఉబెర్ చార్డ్ లో చాలా టూల్స్ ఉంచారు. విభిన్నమై పద్దతుల్లో గిటార్ ను సాధన చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ట్యూన్ ను విద్యార్థులతో, బ్యాండ్ మేట్స్ తో, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతీ దాంట్లోనూ ఓ కొత్త విషయం నేర్పేలా టూల్స్ ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లో ఉండే మైక్రోఫోన్ ద్వారా యాప్ గిటార్ ట్యూన్ ని రికార్డు చేసుకుంటుంది. ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఆడియో ఎనాలసిస్ అల్గారిథమ్ ద్వారా మల్టిపుల్ పిచెస్ ని విశ్లేషణ చేసుకుంటుంది. అదే సమయంలో హార్మోనిక్స్ విషయంలో గందరగోళానికి తావియ్యకుండా విశ్లేషణను.. దానికి తగ్గట్లుగా గిటార్ ప్లేయర్ కు కావాల్సిన పాఠాలను అందిస్తుంది. ఇలాంటి ఫీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది.

image


ముగ్గురు ఇంజినీర్ల సృష్టి

ఉబెర్ చార్డ్ ఆలోచన ముగ్గురు ఇంజినీర్లది. ఎకార్డ్, మార్టిన్ పోలక్, సైమన్ బార్కో అనే ముగ్గురు ఇంజినీర్లు బెర్లిన్ లో దీనికి రూపకల్పన చేశారు. వీరిలో ఉకార్డ్.. లాయర్ గా శిక్షణ పొందినా.. అంట్రప్రెన్యూర్ గా పైకి ఎదిగారు. ఓ ఇంటర్నెట్ బేస్డ్ ఫోటో ప్రింటింగ్ కంపెనీ, మరో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టార్టప్ ను స్విట్జర్లాండ్ లో ప్రారంభించారు. జ్యూరిచ్ లో కంప్యూటర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న సైమన్ తో ఎకార్డ్ కు ఓ సందర్బంలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ మార్టిన్ తో జత కుదిరింది. మార్టిన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో మంచి నైపుణ్యం సాధించారు. వీరు ముగ్గురూ కలిసి కొన్ని చర్చలు జరిపి ఉబెర్ చార్డ్ కు ఊపిరి పోశారు. మార్టిన్ ఆధ్వర్యంలో "చార్డ్ సెన్స్" అనే టెక్నాలజీని ఉబెర్ చార్డ్ కోసం డెవలప్ చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఇమిడి ఉండే మైక్రో ఫోన్ ద్వారాఈ చార్డ్ సెన్స్ యూజర్ల గిటార్ టాలెంట్ ను, తప్పొప్పులను విశ్లేషిస్తుంది. చార్డ్ సెన్స్ కు పెటెంట్ పొందేందుకు ఈ బృందం అప్లయ్ చేసింది.

"టెక్నాలజీ సాయంతో సంగీతాన్ని మరింత బాగా నేర్చుకునేలా చేయాలనుకున్నాం. మా మొట్టమొదటి అడుగు చార్డ్ రికగ్నైజేషన్ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వారా గిటార్ ని ఎలా ప్లే చేయాలో సంపూర్ణంగా నేర్చుకోవచ్చు" ఎకార్డ్, ఉబెర్ చార్డ్ ఫౌండర్

ఒక భాషను ఏ విధంగా సింపుల్ గా నేర్చుకుంటామో సంగీతాన్ని కూడా అదే విధంగా నేర్చుకునేలా చేయాలనేదే వీరి ఆలోచన. దానికి తగ్గట్లుగానే మొదటి అడుగు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాప్ ద్వారా యూజర్ ఎలాంటి ట్యూన్ చేయాలనుకుంటున్నారు.. ఎలా చేయాలనుకుంటున్నారు.. అనేది మొత్తం సులువుగా తెలుసుకోవచ్చు. చార్డ్ మీద ఫింగర్స్ కదలికలను, ట్యూన్ పిచ్ ను కూడా ఎప్పటికప్పుడు యాప్ విశ్లేషిస్తుంది. ఇది పర్సనల్ స్కిల్ లెవల్ ను ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆరంభంలోనే ఫండింగ్

ఉబెర్ చార్డ్ అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ప్లే స్టోర్ నుంచి ఆరు అంకెల డౌన్ లోడ్లను నమోదు చేసింది. స్టార్టప్ కు కూడా ఫండింగ్ వెల్లువెత్తింది. యూరప్ లోని స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్, బిజినెస్ ఎంజెల్స్ మొదటి రౌండ్ ఫండింగ్ అందించారు. గత ఏడాది హాంకాంగ్ నుంచి రెండో రౌండ్ పెట్టుబడిని ఆకర్షించారు.

యాప్ స్టోర్ లో ఉబెర్ చార్డ్ కు దాదాపుగా అన్నీ గుడ్ రివ్యూసే వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నారు. అందివచ్చిన ఫండింగ్ తో మ్యూజిక్ ఎడ్యూకేషన్ లో ఉబెర్ చార్డ్ ను ప్రామాణికంగా నిలపాలని ఈ ముగ్గురు మిత్రులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క గిటారే కాకుండా అన్నీ మ్యూజికల్ రిలేటెడ్ లెర్నింగ్ అండ్ ఎడ్యూకేషన్ కు కేంద్రంగా చేయాలనుకుంటున్నారు. 2017 కల్లా కోటి డౌన్ లోడ్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎకార్డ్ ధైర్యంగా చెబుతున్నారు.

ఇప్పటికే మరికొన్ని మ్యూజికల్ఇన్ స్ట్రుమెంట్స్ కు సంబంధించిన పని ప్రారంభించారు. రాబోయే నెలల్లో ఒక్కొక్కటి ఉబెర్ చార్డ్ యాడ్ చేసే అవకాశం ఉంది. యాప్ ను ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. సేవలు మాత్రం ప్రీమియం పద్దతిలో నెలవారీ చందా రూపంలో వసూలు చేస్తున్నారు. విస్తరణ ప్రణాళికలు, ఆదాయ వివరాలను వెల్లడించడానికి ఉబెర్ చార్డ్ బృందం ఆసక్తి చూపించడం లేదు.

image


మ్యూజిక్ యాప్ లకు మంచి మార్కెట్

యూనిక్ లెర్నింగ్ టూల్ తో ఉబెర్ చార్డ్ సంచలనం సృష్టిస్తున్నప్పటికీ ఈ రంగంలో ఇప్పటికి కొన్ని యాప్ లు ఉన్నాయి. టాబ్ టూల్ కిట్, గిటార్ వరల్డ్ లెసన్స్ స్టీల్ గిటార్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా అంతో ఇంతో ఆదరణ పొందుతున్నాయి. మ్యూజిక్ విశ్వజనీనమైన లాంగ్వేజ్ కాబట్టి.. మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే ఉబెర్ చార్డ్ రాబోయే రోజుల్లో ఎంత వసూలు చేస్తుందో అంచనా వేయలేం కానీ... తనదైన ముద్ర వేయడం మాత్రం ఖాయం.

వెబ్ సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags