సంకలనాలు
Telugu

అవినీతిపరుల అంతు తేలుస్తా..

నల్లధనంపై యుద్ధం ఆగదన్న ప్రధాని మోడీ

team ys telugu
1st Jan 2017
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

నల్లధనంపై ప్రకటించిన ఈ యుద్ధం ఆగదని ప్రధాని మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. నిజాయితీపరుల పక్షాన ప్రభుత్వం ఎల్లవేళలా నిలుస్తుందన్న మోడీ.. అవినీతిపరుల భరతం పడతానని హెచ్చరించారు. పాత పెద్దనోట్ల రద్దుని శుద్ధి యజ్ఞంతో పోల్చారు. ఈ యాభై రోజులపాటు ప్రజల అందించిన సహకారం మరిచిపోలేనిదని అన్నారు. డీమానిటైజేషన్ గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. త్వరలోనే పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. పేదలు, మధ్యతరగతి, మహిళలు, గ్రామీణులు, రైతులపై వరాల జల్లు కురిపించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2017 లో ఇంటి నిర్మాణానికి చేసిన 9 లక్షల వరకు రుణంపై వడ్డీలో 4 శాతం రాయితీ ఇస్తున్నట్టు మోడీ ప్రకటించారు. 12 లక్షల వరకు ఉన్న రుణంపై వడ్డీలో 3 శాతం సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కట్టబోయే ఇళ్ల సంఖ్యను 33 శాతం పెంచుతాం అన్నారు. ఇప్పటికే ఉన్న ఇంటిలో మార్పుల కోసం.. మరో అంతస్తు కట్టుకోవడం కోసం రెండు లక్షల రుపాయల వరకు ఉన్న అప్పుపై వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు.

గత కొన్ని రోజుల్లో దేశాభివృద్ధి ఆగిపోయిందని అవాస్తవాలను ప్రచారం చేశారు. అలాంటి వారికి రైతులు మంచి సమాధానమిచ్చారు. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈ యేడాది రబీ సాగులో 6 శాతం వృద్ధి సాధించాం. ఫర్టిలైజర్‌ ను 9 శాతం ఎక్కువగా కొనుగోలు చేశారని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జిల్లా కోఆప్‌రేటివ్‌, సొసైటీ బ్యాంకుల నుంచి లోను తీసుకున్న రైతులకు 60 రోజుల వడ్డీని మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. ఒకవేళ రైతులెవరైనా గత రెండు నెలల్లో ఈ వడ్డీ చెల్లించి ఉంటే అది వారికి బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ అయిపోతుందని భరోసా ఇచ్చారు. కోఆప్‌ రేటివ్‌, సొసైటీ బ్యాంకులు రైతులకు ఇచ్చే అప్పులను 20 వేల కోట్లకు పెంచామన్నారు ప్రధాని మోడీ.

వచ్చే మూడు నెలల్లో 3 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రూపే కార్డులుగా మారుస్తున్నామని ప్రధాని అన్నారు. వాటితో రైతులు ఎక్కడైనా కొనుగోళ్లు చేయవచ్చన్నారు.

image


చిరు వ్యాపారుల కోసం.. క్రెడిట్‌ గ్యారంటీని కోటి రుపాయల నుంచి రెండు కోట్లకు పెంచామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్నాచితకా వ్యాపారులకు ఎక్కువ లోన్‌ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరు ఉద్యోగుల క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌ను 20 శాతం నుంచి 25 శాతం చేయాలని బ్యాంకులను ఆదేశించామన్నారు. ఇంకా డిజిటల్‌ లావాదేవీల్లో వర్కింగ్‌ క్యాపిటల్‌ ను లోన్‌ ను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని ఆదేశించినట్టు ప్రధాని తెలిపారు. యేడాదిలో రెండు కోట్ల లోపు వ్యాపారం చేసే వారికి.. ట్యాక్స్‌ 8శాతం ఉండేది. ఇప్పుడు వారి ట్యాక్స్‌ 6 శాతం గా లెక్కిస్తామన్నారు.

ముద్రా యోజన సక్సెస్ కావడం ఉత్సాహాన్నిచ్చిందన్నారు ప్రధాని మోడీ. గతేడాది మూడున్నర కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందారుని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఎక్కువగా లబ్ధి పొందిన నేపథ్యంలో.. దాన్ని రెట్టింపు చేయబోతున్నామని ప్రకటించారు.

ఇక గర్భిణిల కోసం కూడా వరాలు ప్రకటించారు. 650 కు పైగా జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స, డెలివరీ, టీకా, పౌష్టికాహారం కోసం చేరిన వారికి 6000 ఆర్థిక సాయం ఇస్తామని తెలిపారు. ఈ అమౌంట్ మొత్తం గర్భిణిల బ్యాంకు ఖాతాల్లో ట్రాన్స్ ఫర్ చేస్తామన్నారు.

దేశంలో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారని.. వారికోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా బ్యాంకులో ఎక్కువ డిపాజిట్లు వస్తే.. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. అయితే సీనియర్ సిటిజన్లపై ఆ ప్రభావం పడకుండా ఏడున్నర లక్షల వరకు పదేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లకు ప్రతి ఏడాది 8 శాతం వడ్డీ రేటు ఇస్తామని తెలిపారు. ఆ వడ్డీని ప్రతినెల విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags