సంకలనాలు
Telugu

‘బ్రా'oడ్ వేల్యూ పెంచింది !

team ys telugu
26th Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బ్రా అంటే ఒక హృద‌యాన్ని ఇంకో హృద‌యం హ‌త్తుకున్న‌ట్టు ఉండాలి! కానీ అలా ఎక్కడుంది ? ఇండియాలో బ్రా అంటే కొన‌డం నుంచి తొడుక్కునే వ‌ర‌కూ అంతా మొహ‌మాటమే. కొనుగోలు నుంచి అంతా రహస్యమే. లోదుస్తులంటే మహిళ‌ల‌కు ఇక్క‌డున్న అభిప్రాయం అలాంటిది. 20 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న భార‌తీయ మ‌హిళ‌లు స‌రైన లోదుస్తులే ధ‌రించ‌డం లేదంటే విని ఆశ్చర్యపోవ్యాల్సిందే ! బ్రా అంటే అదో స‌ప‌రేట్ బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేసే సాధ‌నం. స‌రైన లోదుస్తులు తొడిగితే ఆత్మ‌విశ్వాసం రెట్టింప‌వుతుంద‌న్న విష‌య‌మే ప‌ట్ట‌దు. ‘సెకెండ్ హార్ట్ టు ద బాడీ.. ‘ ఇలా ఫీల‌య్యే వారికి బ్రా సైన్స్ ఏంటో తెలియ చేయాల‌నుకుంది అర్పిత‌.

బ్రా డిజైన్ చేస్తే అలా ఇలా ఉండ‌కూడ‌దు. అదో ఎక్స్ పీరియ‌న్స్ లా ఉండాలంతే.. అయినా జాకెట్లు, లంగాలు ఎవ‌రి సైజుల‌కు త‌గిన విధంగా వారు కుట్టించుకుంటారు. బ్రా మాత్రం రెడీమేడ్ గా ఉన్న‌వి కొనుక్కుంటారా? అవి ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటాయి. వేసుకున్నంత సేపు క‌ష్టంగా ఉంటాయి. అది బాడీలో ఒక భాగంలా అమ‌రిపోవాలి. అలా అమ‌రాలంటే ఎవ‌రి సైజులు వారు ఆర్డ‌రిచ్చి చేయించుకోవ‌డ‌మే క‌రెక్టు. ఎంత కొత్త ఆలోచ‌న‌..! థింక్ డిఫ‌రెంట్ అంటే ఇదేనేమో.. కొంద‌రు ఆడ‌వాళ్లైతే రెడీమేడ్ గా కొన్నవి క‌ష్టంగా ఉంటుంద‌ని తొడుక్కోడ‌మే మానేస్తారు. ఇండియాలో ఇలాంటి వాళ్లు చాలా మందే ఉంటారు. వీరి ఇబ్బందిని గుర్తించి మ‌రీ అర్పిత ఈ ఆలోచ‌న చేసింది.

ఇండియన్ బ్రా క్వీన్ అర్పిత

ఇండియన్ బ్రా క్వీన్ అర్పిత


బటర్ కప్ పేరెందుకు ?

పేరు నుంచి ప్ర‌తిదీ ప్ర‌త్యేకంగా క‌నిపించాలి. త‌న ప్రొడ‌క్ట్ కి ఏ పేరు పెట్టాల‌ని ఆలోచించిన ఆమెకు ఓ మంచి ఐడియా త‌ట్టింది. స్త్రీలంటే నిలువెత్తు పూలతో త‌యారు చేసిన‌ట్టు ఉంటారు. ఆడ‌వారి సుకుమారాన్ని పువ్వుల‌తో పోల్చి చెబుతుంటారు. కాబ‌ట్టి.. అలాంటి పేరైతే బావుండ‌ని ఆలోచ‌న చేసింది.. బ‌ట‌ర్ క‌ప్ అని నామ‌క‌ర‌ణం చేసింది. ప‌సుపుగా ఉండే చిన్న పువ్వుల‌ను బ‌ట‌ర్ క‌ప్స్ అంటారు. సున్నితంగా ఉండే ఈ పువ్వులు చూడ్డానికి ఎంతో బావుంటాయి. కంటికి ఆహ్లాదంగా క‌నిపిస్తాయి. అలాంటి పువ్వుల్లాంటి బ్రాల‌ను ఒంటికి తొడుక్కుంటే ఇంకెంత హాయిగా ఉంటుంది? అనుకుంది. అంతే త‌న బ్రా కంపెనీకి బ‌ట‌ర్ క‌ప్ అనే పేరు ఫిక్స్ చేసింది.

ఇల్లు అల‌క‌గానే పండ‌గ కాదు. పేరు పెట్ట‌గానే బ్రాండ్ అయిపోదు. ఈ విష‌యం అర్పిత‌కు బాగానే తెలుసు. బ‌ట‌ర్ క‌ప్ ను ఈ స్థాయికి తీసుకు రావ‌డంలో ఆమె చాలానే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంది. అస‌లు భార‌తీయ మ‌హిళ‌లు బ‌హు సిగ్గ‌రులు. బ్రా అన్న మాటెత్తితేనే దిక్కులు చూస్తారు. అలాంటి వారి నుంచి కొల‌త‌లు తీసుకుని దాన్ని కుట్టివ్వ‌డం అంటే అదేమంత తేలికైన విష‌యం కాదు. మొద‌ట వీరి మైండ్ సెట్ మార్చాలి. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక బ్లాగ్ ఓపెన్ చేసింది. దాని పేరు ఎ బ్రా ద‌ట్ ఫిట్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం 3వేల మంది మ‌హిళ‌ల‌కు బ్రా ఫిట్టింగ్ స‌ర్వీసుల‌ను అందించింది అర్పిత‌. కాన్ఫిడెన్స్ పెరిగింది. త‌న ప్ర‌య‌త్నం వృధా పోలేదు. మ‌హిళా ప్ర‌పంచాన్ని స్పందించ‌మ‌నాలే గానీ బ్రా మీద కూడా భారీగానే స్పందిస్తున్నారు. వారికి ఈ విభాగంలో త‌గిన స‌ర్వీసునందించే వ్య‌క్తులు, సంస్థ‌లు లేక పోవ‌డం వ‌ల్లే ఇన్నాళ్లూ త‌మ మ‌న‌సులో ఆందోళ‌న అలాగే ఉంచుకున్నారు. ఇక నుంచి అలా జ‌ర‌గ‌డానికి వీల్లేదు. స్త్రీ హృద‌యానికి గాయాలు కావ‌డానికి వీల్లేద‌నుకుంది అర్పిత‌.

ఎలాగైనా స‌రే భారతీయ మ‌హిళ మ‌న‌సెరిగిన బ్రాల‌ను ప‌రిచ‌యం చేయాలి. ఎస్ నాకు నేను ప్ర‌త్యేక‌మైన మ‌హిళ‌న‌ని ప్ర‌తి మ‌హిళా అనుకోవాలి. అలా అనుకోవాలంటే తాను ఇంకాస్త రీసెర్చ్ చేయాల‌నుకుంది అర్పిత‌. ఎం అండ్ ఎస్, ఫెడ్రిక్స్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీల‌ను సంప్రదించింది. ఒక భార‌తీయ స్త్రీ బ్రా గురించి బాహ‌టంగా మాట్లాడ్డ‌మా? అని వాళ్ల‌కు ఒక‌టే ఆశ్చ‌ర్యం. చూస్తుంటే త‌న ఆలోచ‌న క‌ష్ట‌సాధ్య‌మైందేమో అనిపించింది. ఖ‌నిజాన్ని తవ్వాలంటే ముందు క‌ఠిన‌మైన రాళ్లూ ర‌ప్ప‌లే ఎదుర‌వుతాయి. వాటిని దాటాకే విలువైన లోహం బ‌య‌ట ప‌డుతుంది. అని త‌న‌కు తాను స‌ర్ధి చెప్పుకుంది ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లింది. అర్పితకు ఈ ఆరేళ్ల ప్ర‌యాణంలో ఎంద‌రో అద్భుతమైన మ‌హిళ‌లు తార‌స‌ప‌డ్డారు. మా చేతినిండా ఫండ్స్ ఉన్నాయ్ కావాలంటే నీకోసం ఖ‌ర్చు చేస్తామ‌నే వాళ్లూ క‌నిపించారు. అవ‌స‌రానికి త‌గిన సాయ‌మందించ‌డానికి ముందుకొచ్చారు.

ఎలా వచ్చింది ఈ ఆలోచన ?

అర్పితా నీకెందుకిలాంటి ఆలోచ‌న వ‌చ్చింది? అంటే ఆమె ఒక‌టే చెప్పింది. హోటెల్స్ లో ఇష్ట‌మైన ఆహారం మ‌న‌మెలా ఆర్డ‌రిచ్చి చేయించుకు తింటామో ఇదీ అంతే అంటుందామె. ఎవ‌రి శరీర సౌష్ఠవానికి తగ్గట్టు వాళ్లు చేయించుకుని మ‌రీ తొడుక్కుంటే అది వారి జీవితాన్నే మార్చేస్తుంది. కావాలంటే మా క‌స్ట‌మ‌ర్ల‌ను వాక‌బు చేసుకోవ‌చ్చంటుంది అర్పిత‌. ప్ర‌తి భార‌తీయ మ‌హిళ సొంత బ్రా తొడుక్కోవాలి. జీవితాన్ని కొత్త‌గా ఆస్వాదించాలి. ఇదే త‌న ల‌క్ష్యంగా చెబుతుందామె.

అర్పిత షోరూమ్

అర్పిత షోరూమ్


అర్పిత‌ బ‌ట‌ర్ క‌ప్ బ్రా ఇప్పుడొక బ్రాండ్. ఆన్ లైన్, ఆఫ్ లైన్.. నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో పాపుల‌ర్. ఇదంతా ఎలా సాధ్య‌మైందంటే టెక్నాల‌జీని విస్తృతంగా వాడ్డం వ‌ల్ల‌. లేకుంటే, లోదుస్తుల వ్యాపారంలో ఈ కోణం ఆవిష్క‌రించ‌డం.. దాన్ని ఆచ‌ర‌ణ సాధ్యం చేయ‌డం ఎలా సాధ్య‌మ‌వుతుంది? ఈనాడు దేశంలోనే మొద‌టగా బ్రా మీద ఒక యాప్ రిలీజ్ చేసింది అర్పితాయే. ఆమె ఫేస్ బుక్ పేజ్ కూడా లోదుస్తుల ప‌రిజ్ఞానాన్ని ప్ర‌పంచానికి తెలియ చేసే సాధ‌నంగా మారింది. ఆన్ లైన్ బిజినెస్ వ‌ల్ల త‌న బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింద‌నీ.. త‌న ఆలోచ‌న ప‌దిమందిలోకి తీసుకెళ్ల గ‌లిగింద‌నీ అంటారీమె.

భార‌త‌దేశంలో దొర‌క‌ని మొత్తం 80 కి పైగా సైజుల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తోంది బ‌ట‌ర్ క‌ప్. అంతే కాదు జ‌ర్మ‌నీ డిజైన‌ర్స్, హాంకాంగ్ మ్యాన్ ఫాక్చ‌ర‌ర్స్ ను వినియోగించి మ‌రీ బ్రాల‌ను త‌యారు చేయిస్తోంది. ప‌ర్ఫెక్ట్ సైజ్ అండ్ ఫిట్స్ త‌మ మార్కెట్ మంత్రం. ఆన్ లైన్లో ఈ- కామ్, ఆఫ్ లైన్ లో ఫిట్టింగ్ రూమ్స్ ద్వారా సేవ‌లందిస్తోంది బట‌ర్ క‌ప్. అర్పిత నేతృత్వంలోని బ‌ట‌ర్ క‌ప్ కంపెనీ ధ్యేయ‌మ‌ల్లా ఒక్క‌టే.. భార‌తీయ మ‌హిళలు ప‌ట్టీ ప‌ట్ట‌ని లోదుస్తులతో ఇబ్బందులు ప‌డ‌కూడ‌దు.

ఇండియన్ బ్రా క్వీన్ !

ఇండియ‌న్ మార్కెట్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ద‌క్కించుకోడం ఎంతో క‌ష్టం. ఇక్క‌డి పెట్టుబ‌డిదారులు క‌ఠినంగా ఉంటారు. నీ ఐడియాలో అంత ద‌మ్ముంద‌ని ఎలా న‌మ్మ‌డం? అని య‌క్ష ప్ర‌శ్న‌లు వేస్తూనే ఉంటారు. వీట‌న్నిటికీ స‌మాధానం చెప్పాలంటే స్వీయ ఆర్ధిక విధానాల‌ను త‌యారు చేసుకోవాలి. మొద‌ట కొన్ని ఆర్డ‌ర్ల‌తో మ‌న ప్రొడ‌క్ట్ కి ఒక డిమాండ్ అంటూ క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో ఎత్తుగ‌డ‌ల‌ను అవ‌లంభిస్తే త‌ప్ప ఇక్క‌డి మార్కెట్ లో ప‌ట్టు సాధించ‌డం క‌ష్టం. ఇవ‌న్నీ అంచ‌లంచ‌లుగా సాధించ‌గ‌లిగింది కాబ‌ట్టే అర్పిత ఇండియ‌న్ బ్రా క్వీన్ గా అవ‌త‌రించ‌గ‌లిగింది. సాటి మ‌హిళ‌ల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వ‌గ‌లుగుతోంది. అర్పిత ఆల్ ద బెస్ట్‌. నీ ప్రొడ‌క్ట్స్ ప్ర‌పంచ మ‌హిళ‌ల హృద‌యాల‌ను దోచుకోవాల‌ని ఆశిస్తున్నాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags