సంకలనాలు
Telugu

ఇంగ్లిష్‌లో 'YES' అనే పదం తప్ప ఏమీ తెలియని రోజులూ ఉన్నాయ్ !

team ys telugu
22nd Sep 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

అంతా సినిమాల్లో మాదిరే సాగింది హీరో నాని లైఫ్. ఊళ్లో ఉంటే ఓ అతిసాధారణ విద్యార్థిలానే మొదలైన జీవితం అనుకోని స్థాయికి చేరింది. తెలుగు మీడియంలో చదివి.. ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మారి.. అక్కడ వాళ్లతో ఇమడలేక నానా కష్టాలుపడడం మనలో చాలామందికి అనుభవమే. అయితే అక్కడితో ఆగిపోయి.. ఆ భయంతో వెనుకడుగు వేసి మనలో చాలా మంది ఈ స్థాయికి వచ్చేవారు కాదు. ఇప్పుడు మనం చదవబోయే నాని స్టోరీ కూడా అలాంటిదే. రూ. 3500 జీతంతో ప్రారంభమై... ఇప్పుడు టాప్ స్టార్ స్థాయికి ఎలా ఎదిగాడో మనం చదివాం. మరో మూడు నాలుగేళ్ల పాటు డేట్లు ఖాళీ లేనంత బిజీ అయిపోయాడు ఇప్పుడు నాని.

ఇప్పుడు ఈ రేంజ్‌కు రావడానికి ఏ స్థాయిలో కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. అష్టా చెమ్మతో మొదలై.. ఈగగా మారి ఏటో వెళ్ళిపోయిన మనసును పిల్ల జమిందార్‌గా మార్చి భలే భలే మగాడు అనిపించుకున్నాడు నాని. మొన్నే జెంటిల్‌మెన్‌ అనిపించుకుని అప్పుడే మజ్నూగా మారిన నాని యువర్ స్టోరీతో అనేక విషయాలను పంచుకున్నారు.

image


'' నిజానికి నేను స్టార్ కిడ్ కాదు. డబ్బు పెట్టే నిర్మాతలూ నా వెనక లేరు. మూవీలో మెయిన్ లీడ్ చేసే ఫేస్ కూడా కాదు నాది. అందుకే నాకు ఫిల్మ్ మేకింగే పర్‌ఫెక్ట్ అనుకున్నా. పైగా టాలెంట్ ఉంటే ఈజీగా డైరెక్టర్ అయిపోవచ్చన్నది నా ఫీలింగ్. కానీ డెస్టినీ నన్ను హీరోని చేసింది ''.

ఇంగ్లిష్‌లో టకటకా ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నా చూశారా అంటూ నవ్వేసిన నాని... గతంలో ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

'' అసిస్టింట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక్క ముక్క ఇంగ్లిష్ కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇంగ్లిష్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఒకసారి స్కూల్‌లో నాకు వింతైన అనుభవం ఎదురైంది. నేను ఐదో తరగతి వరకూ తెలుగు మీడియం స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియంలోకి మారాల్సి వచ్చింది. అప్పుడు ఓ స్నేహితుడు నీ ఇనీషియల్ ఏంటి అని అడిగాడు. అప్పటి దాకా ఆ పదాన్ని కూడా నేను వినలేను. ఇనీషియల్ అంటే ఇంటి పేరు అనే సంగతి కూడా తెలీదు. అప్పుడు ఇంగ్లిష్‌లో నాకు తెలిసిన ఏకైక పదం 'యస్'. అందుకే యస్.. యస్.. అన్నా. వాళ్లు కూడా యస్. నవీన్ అనుకున్నారు నా పేరు. అంత దారుణంగా ఉండేది నా చదువు. అప్పుడే కాదు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు ఏమంత గొప్ప ఇంగ్లిష్ రాదు. ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సి వచ్చింది. నేను పనిచేసే హీరోయిన్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. వాళ్లతో మాట్లాడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి. అందుకే నానా తిప్పలు పడి.. నేర్చుకున్నా ''

యాక్టర్‌గా ఇప్పటివరకూ అత్యద్భుతమైన సక్సెస్, అత్యంత దారుణమైన ఫెయిల్యూర్‌ను ఇంకా చూడలేదని... భవిష్యత్తులో అలాంటివి ఎదురుకావొచ్చని అందుకు సిద్దంగా ఉన్నానంటున్నారు నాని. అయితే తన సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసేందుకు వెళ్లినప్పుడు ఎదురైన ఓ ఘటనను గుర్తుచేసుకుని లోలోపల మురిసిపోతారు.

" ఫస్ట్ మూవీ అష్టా చెమ్మా అనుభవం నన్ను చూడటానికి కూడా జనం థియేటర్లకు వస్తారంటే నమ్మలేకపోయా. ఆ రోజును నేను జీవితంలో మరిచిపోలేను. అష్టా చెమ్మా ఫస్ట్ డే మార్నింగ్ షోకి భ్రమరాంబ థియేటర్‌కు వెళ్లాం. థియేటర్ బయట ఒక్కరూ లేరు. ఖాళీ థియేటర్‌లోకి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు. ఒక్కడంటే.. ఒక్కరు కూడా బయట కనిపించలేదు. లోలోపల ఛీ అనుకున్నా. అందరి ముందరా పరువు పోయిందనే భావన వచ్చింది. తీరా లోపలికెళ్తే నమ్మలేకపోయా. లోపల జనాలంతా సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను లోపలికి వెళ్లే సరికి సినిమా స్టార్ట్ అయి.. బయట ఎవరూ జనాలు లేరని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా.

కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకి మీరు ఏం చెబుతారు.. అంటే.. '' సందేశాలిచ్చే అంత స్థాయి కాదు నాది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఒక గోల్ ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి అనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. సక్సెస్ కావాలంటే ఒళ్లు వంచి కష్టపడాలి. అదే నా పాలసీ '' అంటారు.

image


మజ్ను సినిమా గురించి ఏం చెప్తారు ?

'' మజ్ను సినిమా ఓ రికార్డులు తిరగరాసేస్తుందని చెప్పను. ఎవరికి ఏ సినిమా నచ్చుతుందన్న లెక్కలు నాకు తెలియవు. అలా ఆలోచించి సినిమాలు తీయడం నాకు రాదు. యాక్టర్ కన్నా ముందు నేనొక ప్రేక్షకుడిని. నాకు నచ్చిన సినిమాలు ప్రేక్షకులకూ నచ్చుతాయని నా గట్టి నమ్మకం. ఒక ప్రేక్షకుడిగా మజ్ను సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ కి కూడా సినిమా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా.


 Majnu Theatrical Trailer

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags