సంకలనాలు
Telugu

ఇక ఆన్‌లైన్‌లో గిఫ్టులు కొనడం ఈజీ

వోచర్ కావాలంటే వోచర్... గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్...నచ్చిన, మెచ్చిన గిఫ్టులను అందించే గిఫ్టరీరెండో ప్రయత్నంలో సక్సెస్ అయిన జాహ్నవిస్టార్టప్ కు సపోర్ట్ గా నిలిచిన ఇన్వెస్టర్స్

Sri
1st Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఫ్రెండ్ పెళ్లి ఉంది. ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఏది చూసినా రొటీన్‌గా అనిపిస్తోంది. ఏం సెలక్ట్ చెయ్యాలో తెలియక అంతా కన్ఫ్యూజన్. సరిగ్గా ఇలాంటి అనుభవమే మీకు ఎదురై ఉంటుంది కదా. మీకే కాదు... ప్రతీ ఒక్కరు లైఫ్‌లో ఒక్కసారైనా ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. ఇలాంటి వారికోసమే ఓ వెబ్ సైట్ ఉంది. గిఫ్ట్ ఇవ్వాలా ? గిఫ్ట్ వోచర్ ఇవ్వాలా ? ఎవరికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనే ప్రశ్నలకు వారి దగ్గర సరైన సమాధానం ఉంటుంది.

రెండో ప్రయత్నం... సూపర్ హిట్

గిఫ్టరీ... ఆన్ లైన్ గిఫ్టింగ్ స్టార్టప్. ఫౌండర్ జాహ్నవి పరీఖ్ . ఇలాంటి స్టార్టప్ ల విషయంలో జాహ్నవికి ముందే కొంత అనుభవం ఉంది. రెండోసారి మొదలుపెట్టిన గిఫ్టరీతో లక్కు కలిసొచ్చింది. అంతకుముందు జాహ్నవి ముంబైలోని వీజేటీఆర్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేయడానికి సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి వెళ్లింది. అక్కడ కొంత అనుభవం సంపాదించిన తర్వాత... ఎంబిఏ చేసింది. ఆ తర్వాత స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పోడ్ క్యాస్ట్ టూల్ అయిన ఆరాలిటీతో తన తొలి అడుగు వేసింది. భవిన్ బధేకాతో కలిసి కో-ఫౌండర్ గా ఆరాలిటీని ప్రారంభించింది. ఈ స్టార్టప్‌కు మొదట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్లూమ్ వెంచర్స్, శ్రీజన్ క్యాపిటల్, గూగుల్‌కు చెందిన రాజన్ ఆనందన్‌తో పాటు మరికొందరు ఆర్థికంగా ప్రోత్సాహాన్నిచ్చారు. తమ సక్సెస్ గురించి ప్రపంచంలోని పలు వేదికలపై జరిగిన కాన్ఫరెన్సుల్లో డెమోలు చూపించింది ఆరాలిటీ బృందం. కానీ ఆ తర్వాత వారి డౌన్ ఫాల్ మొదలైంది. కొన్నేళ్ల తర్వాత నవంబర్ 2012 ప్రొడక్ట్‌ను నిలిపేశారు. 

కొత్త ఆలోచన

మళ్లీ కొత్తగా ఏదైనా ఆలోచించాలనుకున్నారు. కో-ఫౌండర్స్ అయిన భవిన్, జాహ్నవిలు చెరోదారి చూసుకున్నారు. ఆరాలిటీని నడిపించే బాధ్యతల్ని జాహ్నవి తీసుకుంది. అప్పుడే సోషల్ గిఫ్టింగ్ స్పేస్‌లో అవకాశాలను గుర్తించింది. అలా గిఫ్టరీ గిఫ్టింగ్ స్టార్టప్ మొదలైంది. యూజర్లు వెబ్ సైట్ లోకి రావడం... ఎంత అమౌంట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారో అంత ఓచర్ సెలెక్ట్ చేసుకోవడం... అందులో ఉన్న బ్రాండ్స్ వోచర్లు పంపడం... ఇదీ గిఫ్టరీ వెబ్ సైట్ నడిచే తీరు. కొద్ది రోజుల్లోనే గిఫ్టరీ వోచర్లకు మంచి గుర్తింపు వచ్చింది. వోచర్ స్వీకరించిన వాళ్లు అందులో ఉండే అమౌంట్ ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఏమైనా కొనుక్కోవచ్చు. అయితే గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ఈ వోచర్ ను ఎలా ఖర్చు చెయ్యాలో సూచనలు కూడా ఇవ్వొచ్చు. కానీ తుది నిర్ణయం మాత్రం గిఫ్ట్ వోచర్ స్వీకరించిన వాళ్లదే. ఈ ఆలోచన తన స్వీయానుభవం నుంచి వచ్చిందంటారు జాహ్నవి.

"గతంలో నేను ఎవరికైనా గిఫ్టులు ఇవ్వాలనుకున్న ప్రతీసారీ ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నదానిపై బుర్ర బద్దలుగొట్టుకునేదాన్ని. ఏమివ్వాలో అర్థమయ్యేది కాదు. ఇలాంటి వోచర్లు ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది. ఆ ఆలోచనే ఇప్పుడు కార్యరూపం దాల్చింది" - జాహ్నవి
జాహ్నవి పరీఖ్ , గిఫ్టరీ ఫౌండర్

జాహ్నవి పరీఖ్ , గిఫ్టరీ ఫౌండర్


కొన్ని నెలల తర్వాత... గిఫ్టింగ్ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి గిఫ్టులు సూటవుతాయో వెబ్ సైట్ నిర్వాహకులే మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు.

"ఉదాహరణకు... పిల్లలు మదర్స్ డే రోజు వారి తల్లులకు ఏవైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే... ఆ సందర్భానికి తగ్గ సలహాలు, సూచనలు, అనుభవాలు మా దగ్గర ఉంటాయి. వాటి ఆధారంగా గిఫ్ట్‌లు సెలెక్ట్ చేసుకోవచ్చు" అంటారు జాహ్నవి.

అయితే ఇలాంటి ట్రెండ్ సాధారణమే. ఎందుకంటే గిఫ్టింగ్ స్టార్టప్స్ అయిన Tushky, Poshvineలో కూడా ఈ విధానం మనం చూడొచ్చు.

  • 1) ఇంపర్సనల్ గిఫ్టింగ్- కార్పొరేట్ కంపెనీలు వారి ఉద్యోగులకు ఇచ్చే గిఫ్ట్‌లు, అంతగా క్లోజ్‌గా లేని వారికి ఇచ్చే గిఫ్ట్ లు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇలాంటివన్నీ వోచర్ల రూపంలో ఉంటాయి. వీటికి మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే... గిఫ్ట్‌లు ఇవ్వాలనుకున్న వాళ్లు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్‌లు తీసుకునే వాళ్లు వాటిని ఎలాగైనా, ఎక్కడైనా ఖర్చుచేసుకోవచ్చు.
  • 2) పర్సనల్ గిఫ్టింగ్- గిఫ్టులు ఇచ్చే వాళ్లు పర్సనల్ గిఫ్టింగ్ కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లిళ్లు, బర్త్ డేలు, ఇతర ఫంక్షన్లు లాంటివన్నమాట. ఇలాంటి గిఫ్టులన్నీ జీవిత భాగస్వాములు, కుటుంబసభ్యులు, స్నేహితుల్లాంటి సన్నిహితులకు ఇస్తుంటారు. ఇవన్నీ స్పెషాలిటీ గిఫ్టులు. ఎక్కువగా లగ్జరీ వస్తువులు ఉంటాయి. ఇలాంటి గిఫ్టులు అందించే Giveter, Giftease లాంటి మరిన్ని వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. పోటీగా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ కేటగిరీలో పోటీపడటం పెద్ద సవాలుగా కనిపిస్తుంది

కానీ... ఆ వెబ్ సైట్లేవీ యూజర్ల అంచనాలను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాయి. మొదట్లో ప్రత్యేకంగా ఆటవస్తువులను గిఫ్ట్‌లు ఇచ్చేందుకు మొదలైంది Giveter స్టార్టప్. కానీ ఆ తర్వాత Roposo షాపింగ్ వెబ్ సైట్ లో బ్రాంచ్ ఓపెన్ చేసింది. కానీ ఈ విషయంలో జాహ్నవి ఆశావాద దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే... ఇక్కడ ఎవరికి కావాల్సిన ఆప్షన్స్ వారికి కనిపిస్తాయి. అమ్మమ్మ, తాతయ్యలు మనవాళ్లకు ఇవ్వాలనుకున్నా... తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలనుకున్నా... అన్నయ్యలు చెల్లెళ్లకు ఇవ్వాలనుకున్నా... ప్రతీ ఒక్కరికీ వీరి దగ్గర మంచి గిఫ్ట్ ఆప్షన్ దొరుకుతుంది.

ప్రస్తుతం గిఫ్టరీ టీమ్‌లో నలుగురు ఉన్నారు. ప్రతీ నెలా తమ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోందని చెబుతోంది జాహ్నవి. స్టార్టప్ ను మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని అవకాశాల్ని చూస్తున్నారు. ఇప్పటికీ వారికి ఇన్వెస్టర్ల మద్దతు ఉండటం మరో ప్లస్ పాయింట్.

"మంచి వ్యవస్థాపకులకు మద్దతుగా నిలిస్తే, వాళ్లు కీలకంగా ఎదగడమే కాకుండా... మంచి వ్యాపారాన్ని నిర్మించేందుకు కావాల్సిన దారుల్ని వెతుక్కుంటారు" అని గిఫ్టరీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్న రాజన్ ఆనందన్ చెబుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags