సంకలనాలు
Telugu

హిట్‌వికెట్‌తో టీ-20 టీమ్ మీ సొంతం చేసుకోండి

13th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


భారత ఉపఖండంలో క్రికెట్టే మతం.. క్రికెటర్లే దేవుళ్లు. ఏ గల్లీలో చూసినా క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుకుంటున్న చిన్నారులే కనిపిస్తారు. అలాంటి దేశంలో క్రికెట్‌ను మించిన వ్యాపారం మరొకటి ఉండదు. క్రికెట్ మీద ఈ అభిమానాన్ని సొంతం చేసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘హిట్‌వికెట్’ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు విదేశాల్లో కూడా పట్టు సంపాదించే ప్రయత్నంలో ఉంది.

ఏదైనా స్పోర్టింగ్ ఈవెంట్‌లో పాల్గొనే ముందే ఏ టీమ్‌లోనైనా అంతర్గతంగా చిన్నపాటి యుద్ధాలు జరగడం సహజం. అంటే ఆటకు ముందే అసలు ఆట ప్రారంభమవుతుంది. కోచ్‌లు, ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ వ్యూహాలను రచించి, క్రీడాకారులను గేమ్‌కు సిద్ధం చేయడానికి అంతర్గతంగా పెద్ద తతంగమే నడుస్తుంది.

క్రికెట్ మ్యాచ్ ఉందంటే భారత్‌లో అందరూ టీవీలకే అతుక్కుపోతారు. టీమ్ ఎలా ఆడోలా కూడా బయట ఉండే చెప్పేస్తారు. ధోనీ అలా చేసి ఉండాల్సింది కాదు.. కోహ్లీ ఇలా కొట్టి ఉండాల్సింది కాదు.. అంటూ ఓపెన్‌గానే అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. ఈ క్రికెట్ అభిమానాన్ని సొంతం చేసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ హిట్‌వికెట్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో స్ట్రేటజీ బేస్డ్ క్రికెట్‌ను అనుసరించే స్టార్టప్.

హిట్‌వికెట్ టీమ్

హిట్‌వికెట్ టీమ్


వార్మింగ్ అప్..

హిట్‌వికెట్‌ను కశ్యప్ రెడ్డి, రిషవ్ రస్తోగీ ప్రారంభించారు. సీఈవో కశ్యప్‌. అతనికి ఫుట్‌బాల్ మేనేజర్ గేమ్స్ అంటే మహా ఇష్టం. రిషవ్‌తో కలిసి 2009లో స్ట్రేటజీ బేస్డ్ క్రికెట్ గేమ్‌కు రూపకల్పన చేశారు. అయితే అప్పుడు వారి స్థాయికి అది చాలా పెద్దది. దీంతో నిధులను సమీకరించేందుకు వెబ్ సర్వీస్ ప్రాజక్ట్‌లను చేపట్టారు.

2011లో మరో ఇద్దరు డెవలపర్లు రజత్ సింఘాల్ (సీటీఓ), వీఐటీకి చెందిన సౌరభ్ మహేశ్వరీని హిట్‌వికెట్‌లోకి తీసుకున్నారు. అదే సంవత్సరం మేలో హిట్‌వికెట్ ప్రైవేట్ బీటా వెర్షన్‌లో రిలీజ్ చేశారు. 2013లో ప్రజల కోసం ఓపెన్ చేశారు.

image


కల్పిత టీ-20 క్రికెట్ టీమ్ మేనేజిరియల్ కంట్రోల్‌ను చేయడంతోపాటు, ఐపీఎల్‌లో మేనేజర్లు చేసినట్టుగానే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అలాగే ప్లేయర్లతో డీల్స్ కూడా చేయొచ్చు. మ్యాచుకు ఏ ప్లేయర్‌ను తీసుకోవాలి. ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు డబ్బెంత ఖర్చుపెట్టాలి వంటి నిర్ణయాలను కూడా ఐపీఎల్‌లో మేనేజర్లు తీసుకున్న విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఐపీఎల్ మ్యాచ్‌లను నేరుగా ఆడుతున్న భావనతోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

క్రికెట్ ఓ మైండ్ గేమ్. తమ వద్ద ఉన్న డబ్బుతోనే పటిష్ఠమైన ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. హిట్‌వికెట్‌లోని ఇతర యూజర్లను ఓడించాలంటే ఎకనామిక్స్, ప్రాబబిలిటీస్, స్టాటిస్టిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

‘‘బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో చక్కటి నైపుణ్యం ఉన్న క్రికెటర్లను ఎంచుకునేందుకు జట్టుపై మంచి నియంత్రణ కలిగి ఉండాలి. యూజర్లు తీసుకునే నిర్ణయాలు, ప్లేయర్ల నైపుణ్యం, మ్యాచ్‌ల లైనప్‌ల ఆధారంగానే హిట్‌వికెట్ మ్యాచ్ ఇంజిన్ నడుస్తుంది’’ అని హిట్‌వికెట్ ఆపరేషన్స్ హెడ్ కీర్తి సింగ్ చెప్పారు.

image


కూల్ ఇన్నింగ్స్..

మే 2014 కల్లా హిట్‌వికెట్ 34 మంది యూజర్లను సంపాదించింది. అలాగే ఇండియాతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల్లో కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యేందుకు, ఫీడ్ బ్యాక్ సంపాదించేందుకు తరచుగా ఆఫ్‌లైన్ మీటింగ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఆరంభంలో సొంత నిధులతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత హిట్‌వికెట్ పేరెంట్ కంపెనీ ఆక్టాథోర్ప్ వెబ్ కన్సల్టెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ ది చెన్నై ఏంజెల్స్ (టీసీఏ) నుంచి 2,50,000 డాలర్లను సమీకరించింది.

ప్రస్తుతం హిట్ వికెట్‌లో 14 మంది ఉద్యోగులున్నారు. ఆరుగురు డెవలపర్స్ కాగా, మిగతావారు మార్కెటింగ్, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషన్స్ వ్యవహారాలను చూస్తారు. ఈ గేమ్ ప్రీమియం మోడల్‌లో పనిచేస్తుంది. తొలుత గేమ్ కరెన్సీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానితో టీమ్ కూర్పు, టీమ్ లోగోస్ వంటివి కొనాలి.

విస్తార అవకాశాలు..

నాలుగు దశాబ్దాల క్రితం చిన్న పిల్లల కాలక్షేపం కోసమే ప్రవేశపెట్టిన వీడియో గేమ్స్ ఇప్పుడు మల్టీ బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా మారిపోయింది. పీసీలు, ఎక్స్ బాక్స్, ప్లే స్టేషన్స్ వంటివాటి కోసం ఇప్పుడు మల్టీ ప్లేయర్ గేమ్స్ ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్ కోసం కూడా గేమ్స్ రూపొందిస్తున్నారు. పెద్దల కోసం కూడా ఇప్పుడు డెమోగ్రాఫిక్‌లను తయారు చేస్తున్నారు.

image


ఈ గేమ్స్ కూడా చిన్నపిల్లలు ఆడుకునే సింపుల్ విజువల్ సినారియో నుంచి సంక్లిష్టమైన స్ట్రేటజిక్ ఎన్విరాన్‌మెంట్స్ స్థాయి వరకు రూపొందించారు. ఎన్నో వ్యూహాలు అమలు చేయాల్సి ఉండే ఫుట్‌బాల్‌ లాంటి క్రీడల్లో మేనేజర్లు కూడా క్రీడాకారుల స్థాయిలో పాపులారిటీ సాధించారు. కొత్త క్రీడాకారులను ఎంపికచేసుకునేందుకు చాలా ప్రీమియర్ లీగ్ క్లబ్‌ ఫుట్‌బాల్ మేనేజర్ల సేవలను ఉపయోగించుకుంటాయి. అలాగే ఇప్పుడు హిట్‌వికెట్‌లో కూడా యూజర్లు ‘ఫుట్‌బాల్ మేనేజర్ల’ మాదిరిగా వ్యూహాలు రచించడంతోపాటు, ప్లేయర్ల కొనుగోలులో కూడా కీలక పాత్ర పోషించాలి. ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతున్న హిట్‌వికెట్‌కు ఇవి ఎర్లీ డేస్. ఈ ఫాంటసీ లీగ్‌ను క్రికెట్ ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

ఫేవరబుల్ పిచ్..

‘‘హిట్‌వికెట్ రోజు రోజుకు ఆదరణ పొందుతున్నది. ఈ గేమ్‌లోకి ఎంటరవుతున్న యూజర్లు సగటున 21 నిమిషాలు అందులో గడుపుతున్నారు. ఇండియాతోపాటు క్రికెట్ ఆడే దేశాలు బంగ్లాదేశ్, యూకే, మరికొంతమంది ఎన్‌ఆర్‌ఐలు మా హిట్‌వికెట్‌ను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు’’ అని కీర్తి వివరించారు.

ఇప్పటికే ఎన్నో దేశాల అభిమానులను ఆకట్టుకున్న హిట్‌వికెట్ ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, సౌతాఫ్రికాలలో కూడా విస్తరించాలనుకుంటున్నది. ప్రస్తుతం ఈ హిట్‌వికెట్‌కు 5 లక్షల మంది యూజర్లున్నారు. అందులో 80 % మంది మొబైల్ యాప్ ద్వారా యాక్టీవ్‌గా ఉన్నారని కీర్తి చెప్తున్నారు. ఒక్క భారత దేశంలోనే బిలియన్లకు పైగా అభిమానులు ఉన్న నేపథ్యంలో హిట్‌వికెట్‌కు కూడా సుదీర్ఘ అవకాశాలుంటాయి.

‘‘ప్రీమియర్ క్రికెట్ గేమ్‌గా గుర్తింపు పొందిన తర్వాత మా ప్లాట్‌ఫామ్‌పై హకీ, టెన్నిస్, ఫార్ములా వన్ వంటి గేమ్స్‌కు కూడా రూపకల్పన చేస్తాం’’ అని కీర్తి వివరించారు. క్రికెటైన్‌మెంట్ రంగంలో అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తూ ఆంట్రప్రెన్యూర్‌గా ఎదుగుతున్న హిట్ వికెట్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.

వెబ్‌సైట్: 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags