సంకలనాలు
Telugu

స్విస్ బ్యాంక్ ఉద్యోగం వదిలేసి... బైకులపై సాహస యాత్రల బిజినెస్

స్విస్ బ్యాంక్ ఉద్యోగం వదిలేసి....ఎన్‌ఫీల్డ్ బైకులు రిపేర్ చేసుకున్నబల్జీత్ సింగ్సాహస యాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంపెనీతిరుగులేని సక్సెస్ సాధించిన ఎన్‌ఫీల్డ్ రైడర్స్

ABDUL SAMAD
31st May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బల్జీత్ సింగ్‌కు మోటర్ సైకిల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. బైకులపై ప్రయాణం, పలు ప్రాంతాల సందర్శన ఆయనకు ప్యాషన్. ఇదే బల్జీత్‌ను ఎన్‌ఫీల్డ్ రైడర్స్ ప్రారంభించడానికి ప్రోత్సాహమిచ్చింది. కాలేజ్ రోజుల నుంచి టూవీలర్లపై లెక్కకు మించిన యాత్రలు చేయడం సరదా. దశాబ్దానికి పైగా ఇలాంటి టూర్స్ చేశారు బల్జీత్ సింగ్. తన అనుభవాలన్నిటినీ పరిశీలించుకున్నాక మోటార్ సైకిల్ టూర్లను నిర్వహించే ఓ కంపెనీ ఉంటే బాగుండేదనే ఆలోచన వచ్చింది. ఇలాంటి సదుపాయం ఉంటే యాత్రల్లో రవాణా, వసతి, వాహనాల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులుండవని... ఒకవేళ వచ్చినా ఆ కంపెనీ చూసుకునే విధంగా ఉంటుందని ఆతని ఆలోచన. దీనికి సరైన సమాధానం దొరకలేదు బల్జీత్ సింగ్ దంపతులకు. దశాబ్దానికి పైగా విద్యారంగంలో పని చేసిన ఆమె కూడా తరచూ ప్రయాణాలు చేసే యాత్రీకురాలే. వారిద్దరూ తమ ఆలోచన, కోరికలను ఓ కంపెనీగా రూపాంతరం చేశారు. అదే ఎన్‌ఫీల్డ్ రైడర్స్. వీరు 20 సొంత ఎన్‌ఫీల్డ్ బుల్లెట్స్‌తో తమ ఫ్లీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 100కి పైగా ట్రిప్స్ కూడా పూర్తి చేశారు.

ఇదే బల్జీత్ సింగ్ బులెట్ల ఫ్లీట్

ఇదే బల్జీత్ సింగ్ బులెట్ల ఫ్లీట్


అలా మొదలైంది...

ఏప్రిల్ 2012లో 2 బుల్లెట్స్‌తో ఎన్‌ఫీల్డ్ రైడర్స్ మొదలైంది. ఈ రెండు బైకులు బల్జీత్ సొంత సొమ్ములతో కొనుగోలు చేసినవే. వారి పార్కింగ్ గ్యారేజ్‌నే వర్క్‌షాప్‌గా నిర్వహించేవారు ఆ సమయంలో. మొదట్లో కేవలం మోటార్ సైకిల్స్ అద్దెకి ఇచ్చే కంపెనీగా ఉండాలని భావించినా... ఇప్పుడు నాలుగు విభాగాలుగా సేవలందిస్తోంది ఎన్‌ఫీల్డ్ రైడర్స్. బైక్ రెంటల్స్, బైక్ యాత్రలు, ఎన్‌ఫీల్డ్ సర్వీస్ స్టేషన్, అలాగే ట్రావెలర్స్ కేఫ్‌గా ఈ సంస్థ నడుస్తోంది. రోడ్‌పై బైక్ ప్రయాణాల ద్వారా సాహస యాత్రలు చేసేవారికి డెస్టినేషన్‌గా మారింది ఎన్‌ఫీల్డ్ రైడర్స్. సోలో రైడర్లు, కపుల్స్, గ్రూప్స్, కార్పొరేట్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోందంటున్నారు బల్జీత్ సింగ్. వీకెండ్ ప్రోగ్రామ్స్‌గా షార్ట్, లాంగ్ టూర్స్ కోసం లడఖ్,ఈశాన్య ప్రాంతాలు, భూటాన్, థాయ్‌లాండ్ లాంటి ప్రదేశాలకు మోటార్ సైకిల్ యాత్రలు చేస్తున్నారని చెబ్తున్నారు.

ఇలా పెరిగింది ఎన్‌ఫీల్డ్ రైడర్స్

"2012లో సంస్థ మొదలనపుడు మా దగ్గర 2 రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు మాత్రమే ఉండేవి. రెండేళ్ల కాలంలో ఈ సంఖ్యను 20కి పెంచుకోగలిగాం. 2013లో మోటార్ సైకిల్ యాత్రల విభాగం ప్రారంభించాం. అలాగే సర్వీస్ స్టేషన్ కూడా. మొదట్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సియట్, స్టార్ యూనియన్ డాయిచి, లోధా డెవలపర్స్ వంటి కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు యాత్రల కోసం బైకులు సరఫరా చేసేవాళ్లం. 2013లో 21 రోజులపాటు 3500కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర నిర్వహించాం. ముంబై నుంచి లడఖ్ వరకు చేపట్టిన ఈ టూర్‌లో... స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ సీనియర్ మేనేజ్మెంట్ స్టాఫ్ పాలు పంచుకున్నారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ పేరుతో చేపట్టిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా... ఓ ఎన్‌జీఓను సపోర్ట్ చేసేందుకు ఈ టూర్ చేశాం" అంటార్ బల్జీజ్ సింగ్.

కొండలను చీల్చుకుంటూ బుల్లెట్లపై సాగిపోయే పయనం

కొండలను చీల్చుకుంటూ బుల్లెట్లపై సాగిపోయే పయనం


2014 మే నుంచి సెప్టెంబర్ వరకూ 120మంది క్లయింట్లకు వ్యక్తిగతంగానూ, బ్యాచ్‌లుగానూ లడఖ్ యాత్రలో సేవలదించింది ఎన్‌ఫీల్డ్ రైడర్స్. ఈ సంస్థకు ఈకామర్స్ వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ పోర్టల్‌లో మోటార్ సైకిళ్ల అద్దె, యాత్రలు, జాకెట్స్, గ్లోవ్స్, హెల్మెట్స్, కెమేరాలు, వాటర్ ప్రూఫ్ టెంట్స్ వంటివాటిని బుక్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లింపులు చేయచ్చు. లడఖ్‌ కాకుండా ఇతర ప్రాంతాలకు ఏడాదిలో 200మంది ఈ కంపెనీ సేవలు వినియోగించుకున్నారు. ముఖ్యంగా భూటాన్, నేపాల్, థాయ్‌లాండ్, గోవా, రాజస్థాన్, రణ్ ఆఫ్ కచ్ వంటి ప్రదేశాలకు... 15-20 రోజుల యాత్రల కోసం ఎన్‌ఫీల్డ్ రైడర్స్ సేవలందిస్తోంది.

"సోషల్ మీడియాలో మాకు మాంచి ఫాలోయింగ్ ఉంది. మా ఫేస్‌బుక్ పేజ్‌కు 53వేల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. బైకింగ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఎనలేని క్రేజ్ ఉంది. బైకింగ్ ప్రియుల కోరిక... రెండేళ్లలో మమ్మల్ని సముచిత స్థాయికి చేర్చింది " అంటారు బల్జీత్ సింగ్.

రైడర్స్ వెనకున్న డ్రైవర్స్ వీరే

ఎన్‌ఫీల్డ్ రైడర్స్ సక్సెస్‌లో ప్రధాన పాత్ర టీమ్ మొత్తానిదే అని చెప్పాలి. సంస్థ ప్రారంభించినపుడు ఇద్దరితో మొదలైన టీం ఇప్పుడు 25 మందిని దాటింది. ముంబై, మనాలి, లెహ్ వంటి ప్రాంతాల్లో రోడ్ కెప్టెన్స్, రైడ్ కోఆర్డినేటర్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్టిఫైడ్ మెకానిక్స్, బ్యాక్అప్ వ్యాన్ డ్రైవర్లుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఎంత సంతోషంగా ఉంటే... యాత్రీకుల టూర్‌లు అంత ఉల్లాసంగా ఉంటాయంటారు బల్జీత్ సింగ్. గతంలో వ్యక్తిగతంగా టూర్స్ అడిగేవారికి సేవలందించడం కష్టంగా ఉన్నా... ఇప్పుడు టీం పెరిగాక అన్నీ సాధ్యమయ్యాయని చెబ్తున్నారు. ఈ టీం అంతా కార్పొరేట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే కావడం విశేషం. ఉదాహరణకు సంస్థ ఆపరేషన్స్ హెడ్ దీపక్ చంద్రశేఖర్, ఎంబీఏ ఫైనాన్స్ చదివి.. ఏడేళ్లపాటు కార్పొరేట్ సంస్థలో మీడియాప్లానింగ్ విభాగంలో పని చేశారు. రోడ్ కెప్టెన్ అక్షయ్ జోషి ఒక సర్టిఫైడ్ చెఫ్.

గుర్తుకొస్తున్నాయి...

ఓ ఔత్సాహికునికి స్టార్టప్ స్థాయిలో కష్టాలు ఎప్పుడూ తప్పవు. కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు.. ఇలా అంతా ఈ సంస్థ ప్రారంభించద్దని వారించినవారే... సలహా ఇచ్చినవారే. స్విస్ బ్యాంక్‌లో ఉద్యోగాన్ని వదులుకుని... బుల్లెట్ రిపేర్లు చేస్తావా అంటే వెనక్కు లాగిన వారే. అయితే... ఆరంకెల జీతాన్ని వదులుకుని రావడం అంత సులభం కాదు. కానీ నాకు ఈ బైకులపై ఉన్న పిచ్చి ప్రేమ, అనుబంధమే నన్ను ఇటువైపు నడిపించింది. ఇండియాలో బెస్ట్ మోటార్ సైకిల్ టూర్ కంపెనీగా అవతరించడానికి కారణమైంది. కస్టమర్లుగా వచ్చి మా స్నేహితులుగా మారి తిరిగివెళ్తున్నవారే మా సక్సెస్‌ మూలకారణం అంటారు బల్జీత్ సింగ్.

కొండలు, కోనలు.. ఏవైనాసరే అడ్డేలేదు ఈ ప్రయాణానికి....!

కొండలు, కోనలు.. ఏవైనాసరే అడ్డేలేదు ఈ ప్రయాణానికి....!


ఎదగాలి ఎంతవరకైనా...

ఇప్పటికే ఉత్తరాదిలో సాహసయాత్రలు నిర్వహించడానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎన్‌ఫీల్డ్ రైడర్స్.... త్వరలో దక్షిణ భారతదేశంలోనూ సేవలు అందించాలని భావిస్తోంది. బెంగుళూర్, పూనే, చెన్నైల్లో శాఖలు ప్రారంభించే యోచనలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, కాంబోడియో, లావోస్, శ్రీలంకల్లోనూ ఇలాంటి యాత్రలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఎన్‌ఫీల్డ్ రైడర్స్ మూలస్తంభం బల్జీత్ సింగ్.

website - enfieldriders

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags