సంకలనాలు
Telugu

డెయిరీ రంగంలో దుమ్మురేపుతున్న బిన్సర్ ఫామ్స్

Amuktha Malyada
15th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కరెక్టే. డబ్బు సంపాదించాలి. కానీ సంపాదనే ఏకైక మార్గంగా వుండొద్దు. పైసలతో పాటు పర్సనల్ లైఫ్ కూడా వుండాలి. అయితే, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రెండింటినీ బ్యాలెన్స్ చేయడం సాధ్యమా..? అయ్యే పనేనా..? సంకల్పం వుండాలేగానీ సాధ్యం కానిది లేదని నిరూపించారు పంకజ్ నవానీ. 

బిన్సర్ అంటే సూర్యోదయం. ఆ పేరునే ఆలోచనలకు శ్రీకారంగా పెట్టుకున్నారు. బిన్సర్ ఫాం లో ఇప్పుడు 240 ఆవులుంటే, అందులో 120 ఆవులు పాలిస్తున్నాయి. ఆ పాలను ఢిల్లీ లోని 600 కుటుంబాలకు, ఇంటింటికీ తిరిగి సప్లయ్ చేస్తున్నారు.

బిన్సర్ ఫాంస్

ఆదర్శ భావాలున్న 40 ఏళ్ల పంకజ్ నవానీ బిన్సర్ ఫాంస్ ను స్థాపించారు. ఉత్తరాంచల్ లోని బిన్సర్ అనే చిన్న పల్లెటూరుకు చెందిన పంకజ్ తాత అడుగుజాడల్లోనే నడవాలనుకున్నారు. 

మా తాత గ్రామం బాగుకోసం ఎంతో శ్రమపడ్డారు. పొఖర బ్లాక్ లో ఉన్న గవని అనే గ్రామంలోమూడు ప్రైమరీ స్కూల్స్, ఒక కన్యావిద్యాలయ్, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ స్థాపించారు"- పంకజ్. 

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో దీపక్, సుఖ్వీందర్ లు పరిచయం అయ్యారు. 35 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు పంకజ్ కింద ఇంటర్న్ లుగా పనిచేసేవారు. వారితో కలిసి 2009 లో బిన్సర్ లోని ఒక ప్రదేశానికి ట్రెక్కింగ్ కోసం పంకజ్ వెళ్లినపుడు బిన్సర్ ఫాంస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగింది. 

"దీపక్, సుఖ్వీందర్, నేను ముగ్గురం కలిసి కొండ దిగుతున్నపుడు దారి తప్పిపోయాం. ఆ సమయంలో ఒక గొర్రెల కాపరి ఆ రాత్రికి తన చిన్న గుడిసెలో మాకు ఆశ్రయం కల్పించాడు. తెల్లవారి ఎలా వెళ్లాలొ దారి చెప్పాడు. ఆ సమయంలో గొర్రెల కాపరుల కష్టాలను గమనించిన మేము, ఉత్తరాంచల్ లో ఉంటున్న ప్రజలకోసం ఏదైనా చేయాలని అనుకున్నాము. కొండ మీద దొరికే తృణధాన్యాలను తీసుకువచ్చి కింద అమ్మాలని మేము మొదట అనుకున్నాం. ఆ తర్వాత పక్కనున్న పల్లెటూర్ల నుంచి లెంటిల్స్, పండ్లు, గింజలు వంటివి సేకరించి ఒక కొ-ఆపరేటివ్ ను స్థాపించాలనుకున్నాం. కారణం, మైదానాల్లో పండే వాటి కంటే కూడా, కొండ ప్రాతాల్లో పండే వాటిలో ఎక్కువ పోషక విలువలుంటాయని అనుకున్నాం" అంటున్నారు పంకజ్.

ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూనే, వచ్చిన ఆలోచనకు ఎలా శ్రీకారం చుట్టాలో కలలు కనేవారు. ఈలోగా 2011లో ఉత్తరాంచల్ లో ఎన్నికలు రావడంతో, తమ ఆలోచనను ఎవరితో పంచుకున్నా, వారంతా సహకరిస్తామని చెప్పారు. ఇక అదే సమయంలో, పంకజ్ తను పనిచేస్తున్న డెల్ కంపెనీ తరుఫున న్యూజిలాండ్ వెళ్లారు. ఎక్కడికి వెళ్లినా, అక్కడి వ్యవసాయ పద్ధతుల్ని గమనించడం అలవాటు చేసుకున్న పంకజ్, న్యూజిలాండ్ లో కూడా స్థానిక ఫార్మింగ్ పద్ధతుల్ని చూశారు. అక్కడే ఫాంటెరా డెయిరీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎర్ల్ రాట్రే ను కలుసుకున్నారు. ఆయనకు ఉత్తరాంచల్ స్టోరీని చెప్పారు. అంతా విన్న ఎర్ల్, బిన్సర్ ఫాంస్ లో భాగస్వామిగా లేకుంటే పెట్టుబడిదారుడిగా నైనా ఉండడానికి ఒప్పుకున్నారు.

image


ఆలోచనలకు రూపం

ఎన్నికలకు ముందు తమ ఆలోచనకు ఓకే చెప్పిన వారంతా, ఎన్నిక తర్వాత తప్పుకున్నారు. కారణం, గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడమే. దాంతో చేస్తామన్న సహాయంపై ఎవరూ మాట్లాడలేదు. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆ ముగ్గురు తమ పంథాను మర్చుకోవాలనుకున్నారు. అదే సమయంలో, డెయిరీ రంగంలో తనకున్న అనుభవంతో ఎర్ల్ చెప్పిన ఆలోచన వైపు మొగ్గు చూపారు ముగ్గురు. అలా 2012 లో పంకజ్, దీపక్, సుఖ్వీందర్, ఎర్ల్ నలుగురు సమాన భాగస్వామ్యంతో బిన్సర్ డెయిరీ ఫాంస్ ను ప్రారంభించారు.

దీపక్, సుఖ్వీందర్ ల కుటుంబాలకు కూడా వివిధ సంఘాలతో పనిచేసిన నేపధ్యం ఉంది. దేశంలో కమ్యూనిజం ఏర్పడడానికి సుఖ్వీందర్ పూర్వీకులు తోడ్పడ్డారు. ఇక భూస్వామి అయిన దీపక్ వాళ్ల ఫాదర్, తనకున్న భూమిలో 10 ఎకరాలను వీరికి లీజుకిచ్చేందుకు సిద్ధమయ్యారు. హర్యానా లోని సోనేపట్ మార్కెట్ కు దగ్గర్లో ఉన్న అ స్థలం వీరి బిజినెస్ కు సహకరిస్తుందని ఆయన భావించారు. 

"2012 అక్టోబర్ లో మొదటగా ఒక కోడెదూడను కొనుగోలుచేశాము, ఆ తర్వాత మెల్లమెల్లగా మా ప్రొడక్షన్ ను ప్రారంభించాం. తన అనుభవంతో ఎర్ల్ ఇస్తున్న మేనేజ్మెంట్ టెక్నిక్స్ తో మా డెయిరీ ఈ ఏడాది మంచి లాభాలు ఇస్తుందని ఆశిస్తున్నాం" అంటున్నారు పంకజ్.

image


ఈ 80 ఎకరాల్లో, 40 ఎకరాలను అయిదుగురు రైతులకు లీజుకిచ్చారు. వారికవసరమైన విత్తనాలు, ఎరువులను సప్లై చేస్తూ, వారు పండించిన పంటను డెయిరీ అవసరాల కోసం కొంటారు. అలా ఆ అయిదుగురు రైతులకు మార్కెట్ ఒడిదిడుకులతో సంబంధం లేకుండా, రెగ్యులర్ ఆదాయం వస్తుంది. దీంతో వారు తమ కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, పిల్లల్ని చదివించుకుంటున్నారు.

ఇక పశు సంరక్షణలొ అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తుంది బిన్సర్ ఫాంస్. పశుగ్రాసం వీరి మొదటి ప్రాధాన్యత. నాచురల్ గా పండిన గడ్డినే వాటికి వేస్తారు. అందుకోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కోయడానికి 21 రోజుల ముందు ఎలాంటి పురుగు మందులు వేయొద్దని రైతులకు చెప్తారు. షెడ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా డెయిరీ ఫాంలలో మడుగులు కట్టిన నీరు కనిపిస్తుంది. అయితే బిన్సర్ ఫాం షెడ్లలో అలా వుండదు. చాలా డెయిరీల్లో సరైన అవగాహన లేకుండా, షెడ్లను కాంక్రీట్ తో నిర్మిస్తారు. దీంతో ఆవుల కాళ్లపై ఒత్తిడి పడ్తుంది. కాని వీరి షెడ్స్ ను పూర్తిగా మట్టితోనే ఉంటుంది. ఎందుకంటే వాటి కాళ్లపై ఒత్తిడి పడితే ఆవులు సరిగ్గా తినవు. ఫలితంగా పాల ఉతత్తిపై ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఇతర డెయిరీల్లో 12-13% ఆవులు వట్టిపోతుంటాయి. అయితే మా దగ్గర అది 1% మాత్రమే ఉంటుంది" అంటున్నారు పంకజ్. ఇలాంటి అన్ని విషయాలు చూసుకోవడానికవసరమైన మొత్తాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రీసెర్చ్ చేయడంతో పాటుగా, ఆవుల ఆరోగ్యం, పోషణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇక పశుపోషణ లో తాము అనుసరిస్తున్న పద్ధతుల్ని ఇతర రైతులకు కూడా పంచుతున్నారు.

ప్రణాళికలు

మరో 600 ఆవుల పెంపకం కోసం బిన్సర్ ఫాంస్ లో షెడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక త్వరలోనే, సమీపంలో ఉన్న రైతులకు ఆవులను డొనేట్ చేయాలని పంకజ్, దీపక్, సుఖ్వీందర్ భావిస్తున్నారు. పాల కోసం ఒక ధరను స్థిరీకరించాలని యోచిస్తున్నారు. ఇలా రైతు కుటుంబాలకు అదనపు రెవెన్యూ వస్తుందని, వారి జీవితాలు కూడా బాగుపడతాయని అనుకుంటున్నారు.

image


హర్యానా, పంజాబ్ లో ఉన్న ఇతర 12 డెయిరీ ఫాం లతో కలిసి బిన్సర్ ఫాంస్ ఇప్పుడు పనిచేస్తోంది. పాలతో పాటుగా, నెయ్యి, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తోందని అంటున్నారు పంకజ్.

చాలా డెయిరీ నిర్వాహకులకు బిన్సర్ లాంటి స్టోరీనే ఉంటుంది. ఇందులో కొంతమంది పెద్ద కార్పొరేట్లతో పనిచేసి, ఇప్పుడు 200 ఆవులతో షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అంబాలాలో ఒక బిజినెస్ మ్యాన్ ఇప్పుడు డెయిరీ ఫాం ను పెట్టుకున్నారు. ట్రయల్స్ ద్వారా ప్రతీ ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకున్నవారే. 

"మేము అనుసరిస్తున్న పద్ధతులనే మరో డెయిరీ ఫాం లో కూడా పాటించాం. అక్కడ ప్రతీ రోజు 1000 లీటర్ల పాలు వస్తాయి. అయితే పాల రుచిలో కొద్దిగా తేడా వచ్చింది. కారణం కోసం రీసెర్చ్ చేస్తున్నాం" అంటున్నారు పంకజ్.

సామాన్య మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఈ ముగ్గురు సస్టెయినబుల్ డెయిరీ ఫాం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి తరానికి మంచి మంచి సమాజాన్ని ఇవ్వడానికి ఇదే సరైన సమయమని ఆ ముగ్గురు భావిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags