ఎలాంటి యాప్ లేకుండానే మ్యాజిక్ ట్యాప్

-ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్-నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ తో ఎన్నో అద్భుతాలు-మొదటి రోజే 250కి పైగా యూజర్లు

18th Jun 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మ్యాజిక్ ట్యాప్ అనేది ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్. నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్(ఎన్ఎఫ్‌సీ) ద్వారా స్మార్ట్ ఫోన్ లలో మీడియా సొల్యూషన్ ని చూపుతుంది. ఆదాయమార్గాలు, ట్రాఫిక్, బ్రాండ్ అవేర్నెస్, సోషల్ ఎంగేజ్‌మెంట్‌ లాంటి సేవలను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ తో మ్యాజిక్ ట్యాప్ కమ్యునికేట్‌ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యూజర్లకు నేరుగా కంటెంట్ చేరవేయడమే ఈ స్టార్టప్ పని. అవుట్ డోర్ ఎడ్వర్టైజింగ్, రిటైల్ లో షెల్వెస్, పోస్టర్లు లాంటి వాటిని స్మార్ట్ ఫోన్ ద్వారా చేరవేస్తారు. ఇటీవలే ఈ స్టార్టప్ స్పైసి సినిమాతో కలసి స్మార్ట్ ఫోన్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసింది.

జస్ట్ ట్యాప్ చేస్తే చాలు -యూజర్లు ట్రైలర్ చూసే అవకాశం ఉంది. బుకింగ్ కౌంటర్ దగ్గర ట్రైలర్ చూసి టికెట్ కొనుక్కునే వెసులుబాటూ ఉంది. అక్కడ ఫీడ్ బ్యాక్ ఫామ్ నింపే అవసరం లేకుండానే ఫోన్లోనే యూజర్ చెప్పాలనుకునే విషయం చెప్పొచ్చు అని మ్యాజిక్ ట్యాప్ ఫౌండర్ నిఖిల్ టుటేజా అన్నారు. నిఖిల్ సొంతూరు రాజస్థాన్ లోని అల్వార్. డిగ్రీ చదవడానికి ఢిల్లీ వచ్చిన నిఖిల్ తర్వాత అక్కడే ఉండిపోయారు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ.. మ్యాజిక్ ట్యాప్ స్టార్టప్ మొదలు పెట్టాలకున్నాడు. కంపెనీ ప్రారంభించిన మొదటి రోజే ఊహించని స్పందన వచ్చింది. 250మందికి పైగా యూజర్లు ట్యాప్ చేసి స్కాన్ చేశారని నిఖిల్ చెప్పారు.

ఎన్ ఎఫ్ సి ద్వరా నడిచే మ్యాజిక్ ట్యాప్

ఎన్ ఎఫ్ సి ద్వరా నడిచే మ్యాజిక్ ట్యాప్


ఫోన్ లో ఇచ్చే కంటెంట్ పూర్తిగా విషయాన్ని వివరిస్తుంది. మూవీ ట్రైలర్, మ్యాప్ లేదా కూపన్ ఏదైనా కావొచ్చు. ఎలాంటి విషయమైనా ఫోన్ లో అందుబాటులో ఉంటుంది. యూజర్లు ట్యాప్ చేసి పేమెంట్ పేజీని ఓపెన్ చేయొచ్చు. దీనిలో కొనుగొళ్లకు, బిల్ పేమెంట్ కు అవకాశం ఉంది. ఎన్‌ఎఫ్‌సీకి సంబంధించిన చిప్ లను మ్యాజిక్ ట్యాప్ ఉపయోగిస్తుంది. ఇవి పర్యావరణ సమతుల్యం కలిగినవి. కన్స్యూ మర్లకు ఎలాంటి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసే అవసం లేదు. మ్యాజిక్ ట్యాప్ కు హోటళ్లనేవి మరో రకమైన ఉపయుక్తాలు.

ఫౌండర్ నిఖిల్ టుటేజా

ఫౌండర్ నిఖిల్ టుటేజా


"ఎన్‌ఎఫ్‌సీలేదా క్యూఆర్ తో డిజిటలైజ్డ్ అయ్యేలా హోటల్ సమూహాలతో మ్యాజిక్ ట్యాప్ పనిచేస్తోంది. ముంబై మ్యాట్నీ, ది బాలీవుడ్ కెఫె లతో మేం ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దీంతో జనానికి రెండు వాల్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి చిన్న , పెద్ద సినిమాలతో నిండి ఉంటుంది. రెండోది లెజెంట్స్ అయిన గురుడ్యూటీ, రాజ్ కపూర్ సినిమాలతో ఉంటుంది. ఈ పోస్టర్లన్నీ ఎన్‌ఎఫ్‌సీ ఎనేబుల్ చేసినవి. వాల్స్‌ ట్యాప్ చేయడం ద్వారా బాలీవుడ్ పాటలను వినే అవకాశం ఉంటుంది. ఫేమస్ వీడియోలు చూడొచ్చు. మూవీ ట్రైలర్స్ చూడొచ్చు"- నిఖిల్.

ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత టెక్నాలజీలో చాలా రకాలైన ఉపయోగాలున్నాయి. యూజర్లు ఏరకమైన వాటిని కోరుకుంటున్నారనే విషయం క్లెయింట్లకు ఇట్టే తెలుస్తుంది. ఏఏ విషయాలపై అనాసక్తి ఉందో కూడా అర్ధమవుతుంది. దీంతో కంపెనీలు తమ స్టయిల్ మార్చుకొని టార్గెట్ ఆడియన్స్ కు కావల్సిన వాటిని సమకూర్చే అవకాశాలున్నాయి. మ్యాజిక్ ట్యాప్ కు వసంత్ కుంజ్ లో ఉన్న డిఎల్ఎఫ్ ప్రమెనెండో మాల్, గ్లూయిడ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి క్లెయింట్స్ ఉన్నారు.

Website: Magictap Solutions


  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India