సంకలనాలు
Telugu

చిన్న నగరాలకు వరం మెడికల్ సెకండ్ ఒపినియన్

80 మంది ఉత్తమ డాక్టర్లతో పనిచేస్తున్న మెడికల్ సెకండ్ ఒపీనియన్చిన్న నగరాలకు చెందిన 60 శాతం రోగులకు మేలు చేకూర్చుతుందిసేవల్ని మరింత విస్తృతం చేస్తున్న ఎంఎస్ఒ

Lakshmi Dirisala
4th Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

పశ్చిమ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆరోగ్య సంరక్షణ చాలా పేలవంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, వినూత్న ఆలోచనలను అన్వయం చేసుకోవడంతో ఆరోగ్య సంరక్షణ కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. మెట్రో, ప్రధమ శ్రేణి నగరాల్లో మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కానీ చిన్న నగరాల్లో ఇంకా నిపుణుల కొరత ఉంది.

ఈ లోటు భర్తీ చేయడానికి, రోగులు తమ సమస్యలకు సంబంధించి రెండో అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు, మెడికల్ సెకండ్ ఒపీనియన్ (ఎంఎస్ఒ) రూపంలో ఒక అద్భతమైన వేదిక ఏర్పాటైంది. దేశంలోనే గొప్ప గొప్ప డాక్టర్లను ఎంఎస్ఓ ద్వారా సంప్రదించొచ్చు. దూర ప్రాంతంలో ఉండే రోగులు ప్రయాణం చేసే శ్రమ లేకుండానే ఈ విధానం ద్వారా తమ వైద్య అవసరాలకి తగిన అత్యుత్తమ సలహాలను అందుకోవచ్చు.

డాక్టర్ల రెండో అభిప్రాయం తీసుకునే విషయంలో నమ్మకం కలిగించే విధంగా వ్యవహరిస్తోంది గుర్గావ్ కి చెందిన ఈ కంపెనీ. అత్యుత్తమ నిపుణులతో కూడిన ప్యానెల్‌ని కంపెనీ ఏర్పాటు చేసింది. “ఇటువంటి కొత్త ఆలోచనలో భాగస్వాములు అవ్వడానికి ఉత్తమ డాక్టర్లను ఒప్పించడం మొదట్లో కష్టమైంది. కానీ ఒకరిద్దరు పెద్ద డాక్టర్లు మాతో చేతులు కలిపాక, మిగిలిన నిపుణులని కూడా సులువుగానే చేర్చుకోగలిగాం,” అని చెప్తున్నారు ఎంఎస్ఒ సిఇఒ మరియు సహవ్యవస్థాపకుడు అయిన సచిన్ చౌదరి.

image


గత ఏడాది జూలైలో 20 డాక్టర్లతో మొదలైంది ఎంఎస్ఒ. ఇప్పుడు దేశంలోనే ప్రముఖులైన 80 మంది డాక్టర్లు ఇందులో భాగస్వాములయ్యారు. మెడాంటా మెడిసిటీ, గుర్గావ్‌కి చెందిన నరేష ట్రెహాన్, ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ముంబయికి చెందిన డాక్టర్ రమాకాంతా పాండా, నోవా స్పైన్ అండ్ ఆర్థోపెడిక్స్ ఇన్స్టిట్యూట్, న్యూడిల్లీకి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ హెగ్డే, అపోలో చెన్నైకి చెందిన డాక్టర్ ఆనంద్ ఖాఖర్, షాల్బీ హాస్పిటల్స్, అహ్మదాబాద్ కి చెందిన డాక్టర్ విక్రమ్ షాహ్ వంటి గొప్ప డాక్టర్లతో కూడిన బృందం ఉంది.

“గతంలో ఆన్ లైన్ ద్వారా వైద్య సలహా తీసుకోవడానికి క్లైంట్లు సంకోచించేవారు. కాకపోతే, ఏడాదిగా, మేము క్రమం తప్పకుండా చేపట్టిన ఆరోగ్య సంబంధిత చర్చలు, ఆరోగ్య సంబంధిత క్యాంపులు, నోటి ప్రచారం వల్ల మరింతమందిని ఈ వేదికపై తీసుకురాగలిగాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది,” అంటున్నారు సచిన్.

హాస్పిటల్ నెట్‌వర్క్ మోడల్‌ని అనుసరిస్తూ ఎంఎస్ఒ ఒక కాల్పనిక హాస్పిటల్‌లా పనిచేస్తోంది. ప్రచార కార్యకలాపాలను నడిపేందుకు వృత్తిపరమైన వాటా ద్వారా ఈ సంస్థ ఆదాయం సంపాదిస్తుంది మరియు రోగులతో నేరుగా మాట్లాడేందుకు అవసరమైన సదుపాయం కల్పించినందుకు డాక్టర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుంది. “ప్రముఖ హాస్పిటల్స్‌లో మెడికల్ బిల్లుల మీద ఇచ్చే డిస్కౌంట్ కార్డులు అంటే ఫ్రీడమ్ హెల్త్ కార్డులు, వార్షిక సభ్యత్వ కార్డుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది”, అని చెబుతున్నారు సచిన్.

మామూలుగా రూ.50 నుంచి రూ.1,000 మధ్య ధరలో లభించని డాక్టర్లని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావటం ఈ వేదికకి ఉన్న అసలైన ప్రత్యేకత. “ఒక్కో స్పెషాలిటీ విభాగంలో ఐదు నుంచి ఏడుగురు నిపుణులైన డాక్టర్లను అందుబాటులో ఉంచడానికి మేము కృషి చేస్తున్నాము,” అని చెప్తున్నారు సచిన్.

ఎంఎస్ఒ ట్రేడ్ మార్క్ సేవల్లో ముఖ్యమైనవి కొన్నున్నాయి. అవి మై హెల్త్ రికార్డ్ (తమ పోర్టల్ ద్వారా క్లౌడ్ స్పేస్‌లో రోగి ఆరోగ్య సమాచార రికార్డుని భద్రపరిచే సాఫ్ట్ వేర్), ఫ్రీడమ్ హెల్త్ కార్డ్ (భారతదేశ వ్యాప్తంగా ఎంచుకున్న హాస్పిటల్స్ లో డిస్కౌంట్లను పొందడం) మరియు ఒపిడి అనుసంధానిత (రోగులు తమ స్వంత ఊర్లలోనే నేరుగా డాక్టర్లను సంప్రదించడానికి వీలుగా ఎంఎస్ఒ, ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సర్వీస్‌ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ నగరాలకి ప్యానెల్ డాక్టర్లు తరచూ వెళ్తుంటారు).

రెండో అభిప్రాయ సంప్రదింపులకు సంబంధించిన ఏకైక పోర్టల్ కావడంతో దీనికి మరేదీ పోటీ లేదు. అంతేకాకుండా అత్యుత్తమ డాక్టర్ల ప్యానల్ కూడా ఉంది. “మా వినియోగదారులు ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ప్రజలే కావడం మాకు చాలా ఆనందాన్నిస్తుంది”, అంటున్నారు సచిన్. ఇందులో రిజిష్టర్ అయిన వారిలో దాదాపు 60% మంది వ్యక్తులు మరియు ఉద్యోగులు జైపూర్, అజ్మెర్, చండీఘడ్, పాట్నా, హరిద్వార్ ల నుంచే ఉన్నారు.

డాక్టర్లతో అనుసంధానమవ్వడానికి ఒక మార్గంగా వీడియో, మొబైల్ ద్వారా సంప్రదింపులు జరిపే విధంగా టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రణాళిక రచిస్తుంది. “వచ్చే ఆరు నెలల్లో మా నిపుణులని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాం. సింగపూర్, అమెరికా, లండన్ లకు చెందిన డాక్టర్లని సంప్రదించడానికి వీలుగా కూడా మా సేవల్ని మెరుగుపరుస్తాం. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయి,” అని చెప్తున్నారు సచిన్.

ఇటీవలే ఈ కంపెనీ నేపాల్, శ్రీలంక, ఆఫ్రికాలతో ఒక ఉమ్మడి ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఎంఎస్ఒ బ్రాంచిలను ఆయా దేశాల్లో ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈలోపులో యాపిల్, యాండ్రాయిడ్, బ్లాక్ బెర్రీల మీద పనిచేసే ఒక క్రాస్ ప్లాట్ ఫామ్ మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పనులు తుది దశలో ఉన్నాయి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags