సంకలనాలు
Telugu

ప్రపంచ టెక్ వేదికపై 9వ తరగతి అమ్మాయిల విజయం

Sri
24th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వాల్డ్ కాంపిటీషన్ లో గెలిచిన ఇండియన్ టీమ్.

స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సరికొత్త యాప్.

డ్రై వేస్ట్ మేనేజ్ మెంట్ కు సెల్లిక్సో యాప్.

టెక్నాలజీలో ప్రపంచస్థాయి కాంపిటీషన్... 60 దేశాలు... 400 టీమ్‌లు... విజేత ఒక టీమ్ మాత్రమే. టెక్నాలజీ అనేసరికి ఏ జపానో, సింగపూరో టాప్ ప్లేస్‌లో నిలుస్తుందిలే అనుకుంటారు. కానీ అక్కడ మన ఇండియా టీమ్ గెలిచింది. ఐదుగురు బెంగళూరు అమ్మాయిలు ప్రపంచస్థాయి పోటీలో సత్తా చాటారు. అందరూ స్కూలు పిల్లలే. తొమ్మిదో తరగతి విద్యార్థినులు. ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన టెక్నోవేషన్ ఛాలెంజ్‌లో భారతదేశం గర్వపడేలా చేశారు.

మహిమ, నవ్యశ్రీ, స్వస్తి, సంజన, అనుపమ

మహిమ, నవ్యశ్రీ, స్వస్తి, సంజన, అనుపమ


టెక్నాలజీ రంగంలో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఈవెంటే టెక్నోవేషన్. అమ్మాయిల సత్తా ఎంతో తెలుసుకోవడమే కాకుండా... ఆంట్రప్రెన్యూర్‌గా రాణించడానికి కావాల్సిన మెళకువల్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న బెంగళూరు అమ్మాయిలు తమ టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. అప్పటికే ఇండియాలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సారథ్యంలో వీ-టెక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ టీమ్ పార్టిసిపేట్ చేసింది. భారతదేశంలోని హైస్కూళ్లలో వీ-టెక్ పేరుతో కార్యక్రమం జరుగుతోంది. మొబైల్ అప్లికేషన్లను తయారుచేయడం, వాటిని టెక్నొవేషన్ లాంటి ప్రపంచస్థాయి వేదికలపై ప్రదర్శించడానికి కావాల్సిన సాయాన్ని వీ-టెక్ అందిస్తోంది. అలా నాలుగు టీమ్‌లు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన టెక్నొవేషన్ లో పాల్గొనేందుకు సహాయపడింది.

60 దేశాలు... 400 బృందాలు... విజేత పెంటెకాన్స్

ప్రపంచంలోని 60 దేశాల నుంచి వచ్చిన 400 టీమ్స్ ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నాయి. మూడు రౌండ్లలో కాంపిటీషన్ నిర్వహించారు. ప్రిలిమినరీ రౌండ్ లో అన్ని టీమ్స్ పాల్గొంటే... సెమీఫైనల్ కు 25 బృందాలు అర్హత సాధించాయి. ఫైనల్ రౌండ్‌లో పది టీమ్ లు చేరుకున్నాయి. వీటెక్‌కు చెందిన రెండు టీమ్స్ ఫైనల్ కు చేరుకోవడం విశేషం. ఇలాంటి ఈవెంట్‌లో ఇండియా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. బెంగళూరులోని హారిజన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిలు మహిమ, నవ్యశ్రీ, స్వస్తి, సంజన, అనుపమ కాంపిటీషన్ గెలవడం విశేషం. ఈ టీమ్ పేరు పెంటెకాన్స్. వారి యాప్ పేరు సెల్లిక్సో. ఇంట్లో ఉన్న పాత పేపర్లు, మ్యాగజైన్లను అమ్మిపెట్టేందుకు సాయం చేస్తుంది ఈ యాప్. అమ్మడమే కాదు... కొనాలన్నా ఈ యాప్ ద్వారా సాధ్యం. ఇంట్లో వేస్ట్‌గా పడి ఉన్న కాగితాలను, పత్రికలను సులువుగా అమ్మే అవకాశం కల్పిస్తుంది సెల్లిక్సో యాప్. స్థానికంగా ఉండే షాపులు, అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్సులు, పార్టీ హాల్స్ టార్గెట్. స్క్రాప్ పేపర్ డీలర్లను, రీసైక్లర్స్‌ని కొనుగోలు దారులను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. భారతదేశంలో డ్రై వేస్ట్ సమస్యకు ఇది చక్కనైన పరిష్కారం. వేస్ట్ మేనేజ్‌మెంట్ అనేది ఇండియాలో పెద్ద సవాల్. భారతదేశంలోనే కాదు... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే సమస్య. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ వీరికి ప్రేరణగా నిలిచింది. ఇదే యాప్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కాంపిటీషన్‌లో ప్రదర్శించారు. అక్కడ వాళ్లు ఏం నేర్చుకున్నారు ? వారి అనుభవలేంటీ ? కొన్నేళ్ల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారో వారి మాటల్లోనే...

సంజన, నవ్యశ్రీ, అనుపమ, స్వస్తి, మహిమ

సంజన, నవ్యశ్రీ, అనుపమ, స్వస్తి, మహిమ


మహిమ మెహెందలె

సమాజంలో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు, ప్రపంచాన్ని మార్చడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది అని మహిమ నమ్మకం. "శాన్ ఫ్రాన్సిస్కోలో న్యాయనిర్ణేతలు, వీక్షకుల ముందు మేము మా ఐడియాను వివరించాం. మా థీమ్ ని, యాప్ ని పరిచయం చేశాం. అది మాకు సరికొత్త, అద్భుతమైన అనుభవం. ఒక టీమ్ గా ఎలా పనిచేయాలో నేర్చుకున్నాం. అలా కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఎలా వస్తాయో అర్థమైంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారిని కలుసుకోగలిగాం. అంతేకాదు... అమెజాన్, ట్విట్టర్ లాంటి కంపెనీలను సందర్శించాం. వర్క్ షాప్స్ ఆసక్తికరంగా సాగాయి. అంత గొప్ప కార్యక్రమంలో మేం పాల్గొనడం సంతోషంగా ఉంది. పారిశ్రామికవేత్తగా ఎలా ఎదగాలో... విజయవంతం ఎలా కావాలో తెలిసింది."

సంజనా వసంత్

సంజన సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ అప్లికేషన్ నేర్చుకుంటోంది. "కలల్ని వేగవంతంగా నెరవేర్చుకోవడానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం. ఊహించని పరిణామాల్ని ఎలా ఎదుర్కోవాలో ఈ ఈవెంట్ ద్వారా నేర్చుకున్నా. టెక్నాలజీలో కెరీర్ ని తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన అవగాహన లభించింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల్ని కలుసుకున్నాం. భవిష్యత్తులో ఏదైనా ప్రముఖ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేయాలన్న ఆలోచన ఉంది. సెల్లిక్సోని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్నదానిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది."

నవ్యశ్రీ

నవ్యశ్రీ సైన్స్, కంప్యూటర్స్ చదువుతోంది. "మన జీవితాల్లో టెక్నాలజీ చాలా ముఖ్యమైనది. ఏదో ఒక విధంగా మనం టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు టెక్నాలజీని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో మా యాప్ ఐడియాను వివరించాం. గతంలో టెక్ ప్రొఫెషనల్స్, జడ్జెస్ ముందు మా యాప్ గురించి వివరించిన అనుభవం ఉంది. వ్యాపార ప్రపంచంపై నాకు చాలా అవగాహన వచ్చింది. నేను చాలా నేర్చుకున్నా. ఎంతో సంతోషంగా గడిపాం. ఒత్తిడిని జయించాం. టెక్నాలజీ అభిరుచి గల వ్యక్తులను కలుసుకున్నాం. గోల్డెన్ గేట్ బ్రిడ్జి... ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన పైర్ 39కి వెళ్లాం. వైజ్ఞానిక యాత్రలా సాగిపోయింది మా టూర్. అక్కడ పనిచేస్తున్న మహిళా సాంకేతిక నిపుణులను కలుసుకున్నాం. వాళ్లు టెక్నాలజీలోకి ఎలా అడుగుపెట్టారో వివరించారు. మా వయస్సులో వాళ్లు ఏం చేశారో అడిగి తెలుసుకున్నాం. అంతే కాదు... లింక్డ్‌ఇన్, యూట్యూబ్‌లో వర్క్ షాప్ లో పాల్గొన్నాం. భవిష్యత్తులో మా యాప్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కానీ నేను నా చదువును వదిలి పెట్టను. కాలేజీకి వెళ్లాలనుకుంటున్నా. ఏం చదవాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు."

నవ్యశ్రీ

నవ్యశ్రీ


స్వస్తి రావ్

స్వస్తికి మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇష్టమైన సబ్జెక్టులు. "టెక్నాలజీ అంటే నాకు ఎంతలా ఇష్టం అంటే ఒక్క మాటలో చెప్పలేను. ప్రస్తుతం మేం విడుదల చేసింది నమూనా మాత్రమే. మరో మూడు నెలల్లో చాలా మార్పులు, మరిన్ని హంగులతో యాప్ రానుంది. ఎప్పటికప్పుడు ఏ ప్రొడక్ట్ ఫైనల్ కాదు. మన ఐడియా పైన నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఇంకా మెరుగులు దిద్దుతూనే ఉండాలి. మరిన్ని ఫీచర్స్ తో కొత్తగా తీర్చిదిద్దాలి. ధరలు, బిజినెస్ మోడల్స్ విషయాల్లో వ్యూహాత్మకంగా ఉండాలి. ఈవెంట్ లో మా ప్రొడక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారంతో పోస్టర్‌ని తయారు చేయాల్సి వచ్చింది. ఫైనల్ కాంపిటీషన్ కోసం మేం మా ప్రొడక్ట్‌కి మెరుగులు దిద్దాం. ప్రజెంటేషన్‌ని మార్చాం. ధరలకు సంబంధించిన వ్యూహాలని, బిజినెస్ ప్లాన్‌ను మార్చాం. ఈ ఈవెంట్‌తో మా టీమ్ మేట్స్ మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఒకరి టాలెంట్‌ని, సామర్థ్యాన్ని ఇప్పుడు మేం బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. కలిసి పనిచేయగలుగుతున్నాం. ఒకరి కంటే ఇద్దరు ఇంకా బాగా ఆలోచిస్తారని మాకు అర్థమైంది.

స్వస్తి

స్వస్తి


నా స్టడీస్ తర్వాత తెలుసుకోవాలనుకున్న విషయాలను ఈ ఈవెంట్ లోనే నేర్చుకోవడం ఆనందాన్నిచ్చింది. టెక్నొవేషన్ కంటే ముందు నాకు బిజినెస్ ప్లాన్, సేల్స్ గురించి తెలియదు. కానీ ఇప్పుడు ఆ విషయాలు నాకు చాలా తెలుసు. అమెజాన్, ట్విట్టర్ భవనాల ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి చోట నేను వర్క్ షాపుల్లో పాల్గొనడం గర్వంగా ఉంది. నేనూ సెల్ఫీలు తీసుకున్నా. కాంపిటీషన్ లో ఫైనలిస్ట్ టీమ్స్ తో పలు విషయాలు చర్చించాం. వాల్ స్ట్రీట్ జర్నల్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత బిజినెస్, టెక్ విభాగంలో మా కథనాన్ని ప్రచురించింది. కానీ మా ఇంటర్వ్యూని అంతకంటే ముందే తీసుకోవడం విశేషం. 

ఐదేళ్లలో మంచి స్కోర్, స్కాలర్ షిప్ లతో గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తాను. నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ను అవుతానన్న నమ్మకం ఉంది. సెల్లిక్సోపై మరింత పనిచేయాలనుకుంటున్నా. ప్రస్తుతం మా నమూనాని ముందుకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నా. కమర్షియల్ మార్కెట్లోకి లాంఛ్ చేసిన తర్వాత మొదటి పదిహేను రోజుల్లోనే పదివేల మంది యూజర్లను సంపాదించాలన్నది టార్గెట్. "

అనుపమ

అనుపమ


అనుపమ ఎన్ నాయర్

అనుపమ ఫేవరెట్ సబ్జెక్ట్స్ కంప్యూటర్స్, మ్యాథ్స్. "శాన్‌ఫ్రాన్సిస్కో అద్భుతమైన ప్రదేశం. అక్కడ చాలా నేర్చుకోవచ్చు. కాలేజీ రోజుల్లో నేర్చుకునే విషయాల్ని మేం నేర్చుకున్నాం. ఐడియాస్ పై ఎలా వర్కవుట్ చేయాలి, మన ప్రొడక్ట్ ని ఎలా అమ్ముకోవాలి, కోడ్ ఎలా రూపొందించాలి, బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలని లాంటి విషయాలన్నీ నేర్చుకున్నాం. అక్కడ కొత్త స్నేహితులను సంపాదించుకున్నాం. ఇతర టీమ్స్ తో కలిసి పనిచేశాం. వచ్చే ఐదేళ్లలో కాలేజీలో ఉంటా. టెక్నాలజీ, కంప్యూటర్స్ కి సంబంధించిన ఇంజనీరింగ్ చేస్తుంటాను. మన ఐడియాలను మనం అనుకున్నట్టుగా అమలు చేయడానికి ఉపయోగపడేదే టెక్నాలజీ అని నేను నమ్ముతుంటాను. నాలా కలలు కనే వారికి వాటిని నెరవేర్చుకునేందుకు టెక్నాలజీ సరైన వేదిక.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags