సంకలనాలు
Telugu

హెల్దీ స్నాక్స్‌కు కేరాఫ్‌ స్నాకిబిల్..

GOPAL
18th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇదీ పోటీ ప్రపంచం. ఓ వైపు డెడ్‌లైన్లు, మరోవైపు బిజీ బిజీ లైఫ్. ఈ నేపథ్యంలో చాలామంది ప్రొఫెషనల్స్‌కు తమ ఆరోగ్యం గురించే ఆలోచించే తీరికే దొరకడంలేదు. వేళ కాని వేళలో ఏదో కొద్దిగా కడుపులో వేసుకుని తిన్నామంటే తిన్నాం అనిపిస్తున్నారు. ఇక సాయంత్రం వేళల్లో సైతం ఏది దొరికితే అది స్నాక్స్‌గా తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే స్నాకీబిల్. సరసమైన ధరలకే హెల్దీ ఫుడ్ అందిస్తూ దేశ స్నాకింగ్ ఇండస్ట్రీలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముంబైలోని థెమిస్‌లో పని చేసే సమయంలోనే ఆదిత్య సాంఘ్వీకి స్నాకీబిల్ పెట్టాలన్న ఐడియా వచ్చింది.

undefined

undefined


స్నాక్ క్రంచ్ సమస్యకు పరిష్కారం..

అన్ని ఆఫీసుల్లో ప్రతి ఉద్యోగి ఫుడ్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆదిత్య గుర్తించారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల మధ్యలో సహోద్యోగులు స్నాక్స్ కోసం రోడ్డున పడి ఏం తింటున్నారో ఎలాంటిది తింటున్నారో తెలియకుండా అడ్డమైన చెత్తా తినడం గమనించాడు. ఎంప్లాయిస్ అందరిదీ ఇదే సమస్య. బ్రేక్ పాస్ట్ ఫరవాలేదుగానీ, మిడ్ మీల్ స్నాక్ విషయంలోనే కాస్త ఇబ్బంది పడుతున్నారు. నేచర్స్ బాస్కెట్, ఫుడ్ హాల్‌ వంటి కొన్ని సూపర్ మార్కెట్లలో హెల్దీ ఫుడ్స్ లభిస్తున్నప్పటికీ, అవి కాస్త ఖరీదైనవి. అలాగే రుచి విషయంలో కూడా కాస్త రాజీ పడాల్సి వస్తున్నది.

‘‘మనం ఏదైనా ఫుడ్ స్టార్టప్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే, అందులో వెరైటీ స్నాక్స్. ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి లభిస్తాయా? వాటిని డోర్ డెలివరీ చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుందా? అయితే అలాంటి సౌకర్యాన్ని మనమే ఎందుకు కల్పించకూడదని నాకనిపించింది’’-ఆదిత్య  

బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీలో చదివిన ఆదిత్యకు ఈ రంగం కాస్త కొత్తదే. ఇందులో కొన్ని రకాల సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ ఉన్నాయి. కొంత కాలపరిమితికే ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆదిత్య కూడా కస్టమర్లకు సరసమైన ధరలకే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ బాక్స్‌ను ఇంటివద్ద అందించే మోడల్‌ను రూపొందించారు.

టీమ్ కంపోజిషన్..

వెబ్‌సైట్, మోడల్‌ ను ఏర్పాటు చేసిన తర్వాత స్నాకీబిల్ టీమ్‌ ను ఏర్పాటు చేశారు ఆదిత్య. కెనడా మెక్‌ గిల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, హిస్టరీలో డిగ్రీ పూర్తి చేసి, కొంతకాలంపాటు మిడ్ డే, లా ఫర్మ్ ఏజెడ్‌బీ పార్ట్‌నర్స్‌లో పనిచేసిన అర్జున్‌ను మార్కెటింగ్, స్ట్రేటజీ హెడ్‌గా తీసుకున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన అమన్ తుల్జాపుర్కార్‌ ను బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ హెడ్‌ గా, సీరియల్ ఆంట్రప్రెన్యూర్ నిబ్రాంత్ షాను స్ట్రేటజిక్ అడ్వయిజర్‌గా స్నాకీబిల్‌ లోకి చేర్చుకున్నారు. ప్రస్తుతానికి స్నాకీబిల్‌ లో ప్యాకేజింగ్, క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ ఇన్నోవేషన్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ రంగాల్లో 11 మంది ఎంప్లాయిస్ ఉన్నారు. అలాదే దేశంలోని అత్యుత్తమ ఫుడ్ టెక్నాలజిస్ట్స్, న్యూట్రిషనిస్ట్స్‌తో కూడా అవసరమైనప్పుడు కలిసి పనిచేస్తున్నామని ఆదిత్య అంటున్నారు.

undefined

undefined


తయారీ విధానం..

రా మెటీరియల్‌ను తీసుకొచ్చి, మానుఫాక్చరింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా అన్నీ ఒకే చోట పూర్తి చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాడక్ట్‌ను ప్రత్యేకంగా ప్రాసెస్‌ చేస్తామని ఆదిత్య చెప్పారు. ఒకసారి ప్రాడక్ట్‌ను ఫైనల్ చేసిన తర్వాత, దాని అవసరమయ్యే రా మెటీరియల్‌ను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పిస్తామంటున్నారు. హిమాలయన్ బ్లాక్ సాల్ట్ యాపిల్ చిప్స్ కోసం హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలాంటి రసాయనాలు లేకుండే పెంచే తోట నుంచి యాపిల్స్ తెప్పిస్తారు. ఈ యాపిల్స్‌ను ప్రాసెస్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఓ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ముంబైలోని ఘట్కోపర్‌ స్నాకీబిల్ వేర్‌హౌజ్‌కు తరలిస్తారు.

చిప్స్‌ రుచిని, నాణ్యతను వేర్‌హౌజ్‌లో చెక్ చేసి ప్యాకింగ్ చేయిస్తారు. సంస్థ ప్రారంభించిన కొత్తలో క్వాలిటీ కంట్రోల్ కోసం ఫుడ్ బిజినెస్‌కు దేశంలోనే పేరొందిన ఇష్మిత్ చందియోక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రాసెస్ సాఫీగా సాగిపోతున్నది. ప్రతి ఒక్క ప్రాడక్ట్‌కు మానుఫాక్చరింగ్, ప్రాసెస్ విధానం వేర్వేరుగా ఉంటుంది.

17 ఐటమ్స్..

ప్రస్తుతం స్నాకీబిల్ 17 రకాల ఫుడ్ ఐటమ్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నది. అన్నింటినీ స్నాకీబిల్ ఇన్‌హౌజ్‌లోనే తయారు చేస్తారు. ప్రతి నెలా మూడు కొత్త ఐటమ్స్‌ను ఈ జాబితాలో చేర్చుతున్నారు. తాజాగా హోల్‌ వీట్ వాఫ్లెస్, హిమాలయన్ బ్లాక్ సాల్ట్ యాపిల్ చిప్స్, సీడీ ట్రైల్ మిక్స్, హాట్ వాసబి పీనట్స్, బేక్‌డ్ భకర్‌వాడీ వంటి ఐటమ్స్ ఫుడ్ జాబితాలో చేర్చారు.

క్వాలిటీ చెక్..

కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, క్వాలిటీని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటున్నారు. ‘‘వెబ్‌సైట్‌లో ప్రతి క్షణం.. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిశాలిస్తాం. వచ్చిన సమాచారం ఆధారంగా ప్రాడక్ట్ పొర్టుఫోలియోను, టెక్నాలజీని మెరుగుపర్చుకుంటాం. కస్టమర్ల అనుభవాలను మెరుగుపర్చేందుకు, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌ సులభతరం చేసేందుకు టెక్నాలజీ మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆదిత్య వివరించారు.

రీటైల్ రంగంలోకి..

ప్రతివారం 25% వృద్ధి కనిపిస్తోందని స్నాకీబిల్ టీమ్ చెబుతున్నది. దేశంలోని 38 నగరాల్లో ఈ సంస్థకు కస్టమర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆరువేల ఆర్డర్లను ప్రాసెస్ చేశారు. ఇటీవలే రిటైల్ మార్కెట్‌లోకీ అడుగుపెట్టింది స్నాకిబిల్. తమ ప్రాడక్ట్స్‌ను సరఫరా చేసేందుకు ఒక్క ముంబైలోనే 3500 స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే మూడు నెలల్లో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కూడా రీటైల్ చానల్స్ ద్వారా తమ ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించాలని ఈ సంస్థ టార్గెట్‌గా పెట్టుకుంది.

ఫండింగ్..

స్నాకీబిల్‌కు సీడ్ ఫండింగ్ కూడా లభించింది. థెమిస్ సీఈవో నిబ్రాంత్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. కస్టమర్ల వ్యక్తిగత అనుభవాలు, డైట్ ప్రకారం తాము త్వరలోనే ఓ ఫుడ్ బాక్స్‌ను కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నామని ఆదిత్య వివరించారు.

యువర్‌స్టోరీ టేక్..

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపట్ల అవగాహన రోజు రోజుకు పెరుగుతున్నది. దీంతో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ అందించే వారి గురించి కస్టమర్లు వివరాలు సేకరిస్తున్నారు. దేశంలో ఫుడ్ బేవరేజెస్, స్నాక్ మార్కెట్ 14,500 నుంచి 15 వేల కోట్లుగా ఉన్నదని ఫిక్కీ తన నివేదికలో పేర్కొన్నది. ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. యోగా బార్స్, వాలెన్సియా, గ్రీన్ స్నాక్స్ వంటి కంపెనీలు ఆరోగ్యకరమైన ఫుడ్‌ను కస్టమర్లకు అందించి మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ దేశంలో హెల్దీ స్నాక్స్‌ అందించే ఇంకా అవకాశాలున్నాయి. ఒక్క హెల్దీరామ్స్ ఫుడ్ సంస్థే ప్రతి యేటా మూడు వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి సంస్థలైన మెక్‌డొనాల్డ్స్, డొమినోస్ రెండింటి ఆదాయం కూడా ఒక్క హల్దీరామ్స్ ఆదాయమంత కాదు. స్నాకింగ్ మార్కెట్‌లో అవకాశాలున్నప్పటికీ, మంచి బ్రాండ్ నేమ్ సంపాదించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సరికొత్త ప్రాడక్ట్స్‌తో, విభిన్నమైన మార్గంలో పయనించాలి. అప్పుడే మార్కెట్‌ను కొల్లగొట్టడం సాధ్యమవుతుంది. మరి స్నాకీబిల్ సత్తా చాటుతుందా? కాలమే సమాధానం చెప్తుంది.

వెబ్‌సైట్: 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags