సంకలనాలు
Telugu

మహిళలపై అకృత్యాలను కళ్లకు కట్టిన 'షి ఈజ్ మి'

లైంగిక వేధింపులపై అవగాహన కల్పించే ఉద్దేశమే 'షీ ఈజ్ మీ'స్త్రీల పట్ల ఆలోచన మారాలనే తపనతో ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన యామిని రమేష్

ABDUL SAMAD
7th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతు దేవతా.. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా విరుద్ధం. ఆడపిల్లగా పుట్టిన పాపానికి లైంగిక వేధింపులకు గురవుతున్నామనే ఆవేదన చాలా మందిలో ఉంది. అమ్మ చేయి పట్టుకుని మార్కెట్ వెళ్లినప్పుడు, స్నేహితురాలితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు...సందర్భం ఏదైనా సరే.. స్త్రీని మాంసపు ముద్దగా చూసే మగాళ్లున్న ఈ దేశంలోఆడది అడుగడుగునా అరాచకానికి గురవుతూనే ఉంది..నేటి భారతంలో నిస్సిగ్గుగా కనిపించే నిజం ఇదొక్కటే ఏమో.

“ఈ దేశంలోని ప్రతీ బాలిక లైంగిక వేధింపులకు లక్ష్యంగా మారుతోంది. నేను కూడా అలాంటి ఓ బాధితురాలినే. ఈ వ్యాసం చదువుతున్న ప్రతీ స్త్రీ, ఏదో ఒక విధంగా.. ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యే ఉంటారు. ఈ నిజాన్ని ప్రపంచానికి చాటేందుకే నేను ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. మంచి కోసం నినదించే గొంతును ప్రపంచం కచ్చితంగా వింటుంది. మార్పును కోరుకునే ఏ చిన్న ప్రయత్నమైనా విజయ తీరాన్ని చేరుతుంది. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ కోసం నా ప్రాణం పెట్టాను. ఇందుకోసం నేను కలిసిన వ్యక్తులు అనుభవిస్తున్న నరకయాతన, వాళ్లకు జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియాలి” అంటున్నారు She is me డైరెక్టర్ యామిని రమేష్

యామిని రమేష్, She is Me director

యామిని రమేష్, She is Me director


ముంబైలో ఓ మీడియా సంస్థలో పనిచేసే యామిని రమేష్‌కు ఫిల్మ్ మేకింగ్‌లో పూర్వానుభవం లేదు. ఇక ముందు నేర్చుకునే ఆలోచన కూడా లేదు. అయితే She is me’ తీయడం మాత్రం యామినికి సంథింగ్ స్పెషల్. ఆ నిర్ణయం తీసుకున్న క్షణాలు ఉద్విగ్నభరితమైనవి

“అరుణా షాన్‌బాగ్, భన్వరీ దేవి, నిర్భయ, గోవాలో జరిగిన స్కార్లెట్ దారుణకాండ ఇవన్నీ మన సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలకు పరాకష్ట...బయటపడుతున్నవి కొన్నైతే ప్రపంచం పట్టించుకోని ఎన్నో దారుణాలను మహిళ మౌనంగా భరిస్తోంది. అందుకే ఆడవాళ్లపై జరుగుతున్న అరాచకాలకు దృశ్యరూపం ఇవ్వాలనుకున్నాను..She is me తీశాను...ఢిల్లీ చుట్టుపక్కల స్త్రీలపై జరిగిన ఘోరాలను నా ఫిల్మ్ లో చూపించాను. ఢిల్లీనే ఎందుకు ఎంచుకున్నానంటే దేశంలోని ప్రతీ ప్రాంతానికి చెందినవారు ఇక్కడ ఉంటారు. అందుకే దేశ రాజధానిని ఎంచుకున్నాను. ఇక ఫిల్మ్ లోని ప్రతీ ఒక్క స్టోరి కడుపులోని పేగును కచ్చితంగా కదిలిస్తుంది. సానుభూతి చూపించినంత మాత్రన సమస్య పరిష్కారం కాదు. మనమంతా ఒక్కటే అన్న తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అన్యాయానికి గురైన ఆడవాళ్ల బాధను మనం కూడా ఫీల్ కావాలి. మీడియాలో వినిపించే బాధితురాలి పేరు మనదే అనుకోవాలి. ఆ బాధితురాలు నేనే అనుకోవాలి. క్లియర్ గా చెప్పాలంటే she is me అనుకోవాలి” అంటున్నారు యామిని రమేష్

అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే she is me తీయాలనుకున్నారు యామిని రమేష్. అందుకు కావాల్సిన వనరులు చాలా పరిమితంగానే ఉన్నాయి. కాని కొంతమంది స్నేహితులు సహాయం చేశారు. “ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలన్న ఆలోచన వచ్చినప్పుడు నలుగురు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. మా దగ్గర రెండు డిజిటల్ కెమెరాలు ఉండేవి. షూటింగ్ కోసం ఏదైనా ప్లేస్‌కు వెళితే అక్కడున్న బంధువుల ఇంట్లోనే ఉన్నాం. బాధితులను కలుసుకునేందుకు మెట్రో, లోకల్ బస్సుల్లోనే వెళ్లాం. ఆడంబరాలకు పోకుండా ఉన్నదాంట్లో సర్దుకుపోవడంతో మా దృష్టి అంతా ఫిల్మ్ పైనే ఉంచగలిగాం” అంటారు యామిని రమేష్.


వనరులు పరిమితంగా ఉన్నా కూడా యామిని రమేష్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.. ప్రముఖులతో ఫిల్మ్ లో అభిప్రాయాలను చెప్పించారు..అయితే She is me ఫిల్మ్ లో కొన్ని విషయాలు ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదన్న విమర్శలున్నాయి. అయితే అవి టెక్నికల్ విషయాలే.. “మా దగ్గర మైక్ లు లేవు. ఉంటే క్లిస్టర్ క్లియర్ ఆడియో రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడూ బాగానే ఉంది. కాని ఫ్రొఫెషనల్‌గా లేదు. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. నాకు ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా పరిమితంగానే తెలుసు. అంతముకు ముందు ఇలాంటివి తీసిన అనుభవం కూడా లేదు. అందుకే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ కూడా సరిగా కుదరలేదు. నా ఫిల్మ్‌పై వస్తున్న విమర్శ అదొక్కటే. చాలా వరకు ఫిల్మ్‌కు సూపర్బ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ మంది she is me చూశారు. కాని చూసినవాళ్లంతా మెచ్చుకున్నారు.” - యామిని రమేష్ ..

డబ్బులు మాత్రమే పెట్టి తీసిన సినిమా కాదు She is me..ప్రాణం పెట్టి తీస్తేనే అది పూర్తైంది..అందుకే ఫిల్మ్ తో సంపాదించుకోవాలన్న ఆలోచన ఎవరికీ లేదు..ఫిల్మ్ మేకింగ్ లో తన అనుభవాలను డాక్యుమెంట్ చేయాలని యామిని అనుకుంటున్నారు..అయితే మరికొంతమంది ఆడియన్స్ కు సినిమాను మార్కెట్ చేసే ఆలోచన ఐతే యామిని లేదు..

image


“నేనీ సినిమా 2012లో తీశాను.ఎక్కడా ప్రదర్శించలేదు.అయితే ఈ మధ్యకాలంలో సమాజంలో ఆడవాళ్లపై జరుగుతన్న ఆకృత్యాలను చూసిన తర్వాత మనసు మార్చుకున్నాను..నా సినిమాతో ఏ చిన్న మార్పు కలిగినా సంతోషిస్తాను..మొత్తం దేశం నా సినిమా చూడాలనుకుంటున్నా..ఈ సినిమా చూసిన వాళ్ల ఆలోచనా విధానం మారితే మరింత ఆనందిస్తా..అయితే అదెలా అన్న ప్రశ్నకు నా దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు”

image


“She is me నన్ను ఎంతగానే మార్చింది.బాధితుల కష్టాలు వింటుంటే నా గుండె తరుక్కుపోయేది. పిల్లలు పుట్టడం లేదని అత్తింటివాళ్ల చేతిలో చనిపోయిన ఓ అభాగ్యురాలి తల్లితో కలిసి నేను బోరును ఏడ్చాను..ఆ సంఘటనను జీవితంలో ఎన్నడూ మరిచిపోలేను”అంది యామిని రమేష్

image


ఇక ఈసినిమా విషయంలో తమ టీం గొప్ప నిర్ణయం తీసుకుందని యామిని చెప్పింది. “ఫిల్మ్ కోసం నా టీం చాలా కష్టపడింది...డెడ్ లైన్ పెట్టుకుని మరీ పనిచేశాం...అయితే ఢిల్లీ ట్రిప్ తర్వాత అసలు విషయం గురించి సినిమాలో చర్చించలేదన్న అనుమానం వచ్చింది...అందుకే మరోసారి ఢిల్లీ వెళ్లాం..ఫిల్మ్ విషయంలో మేం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే..ఆ ట్రిప్ లోనే మా టీంలోని ఆడవాళ్లం ఢిల్లీ వీధుల్లో వేధింపులకు గురి అయ్యాం”అంటూ నాటి సంగతిని గుర్తుచేసున్నారు యామిని

image


యామిని లాగా ఆలోచించే వాళ్లు సమాజంలో ఎంతో మంది ఉన్నారు..వాళ్లు కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు..ఆ ప్రయత్నాలకు యామిని స్పూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..ఈ ఫిల్మ్ తో మన చుట్టూ ఉన్న సమాజంలోని చీకటి కోణం బయటపడింది..ఇది కేవలం న్యూస్ ఐటం కాదు..అందుకే సినిమాతో యామినికి ఎమోషనల్ బాండ్ ఏర్పడింది.. “ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ నేను ఒకటే చెపుతున్నా..అందులో కనిపించింది వేరే ఎవరో కాదు అది మీరే...లేదంటే మీరు ఎంతగానో ఇష్టపడే మీ ఆత్మీయులే..ఈ సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంది..నా అన్న మనవాళ్లు అత్యాచారానికి గురైనట్టు ఒక్కసారి ఊహించుకోండి.. లేదంటే మీ కలల పంట అత్తింటి వేధింపులకు గురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అలా భావించిన మరుక్షణం ఈ సమస్య పరిష్కరించబడుతుంది.” అంటున్నారు యామిని రమేష్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags