సంకలనాలు
Telugu

సక్సెస్‌ఫుల్ మహిళలందరినీ ఒకేతాటిపైకి తెస్తున్న తెలుగమ్మాయి సీత

ashok patnaik
18th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నాయకత్వ లక్షణాలు అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ. వ్యాపార రంగంలో కూడా తక్కువ కాలంలో పెద్ద స్థాయికి చేరుకున్న వారిలో కూడా మగువలే ఎక్కువగా ఉన్నారు. అందుకే భారత దేశ సాంప్రదాయ పెళ్లిళ్లలో అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండేలా చూస్తారు. సాధారణంగా అమ్మాయిల ఆలోచన విధానం అబ్బాయిల కంటే మెచ్యూర్డ్‌గా ఉంటుందంటారు. అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించినప్పటికీ నంబర్ల విషయానికి వస్తే అబ్బాయిల కంటే తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి ఫౌండర్లుగా ఉన్న మగువల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా మగవారి కంటే తక్కువే. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. మన దేశంలో కూడా అమ్మాయిలు స్టార్టప్ ప్రారంభిస్తే వారికి ముద్ర పధకం ద్వారా రుణాలిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ పధకాన్ని అమలు చేసింది కూడా.

“అమ్మాయిలు వ్యాపార వేత్తలుగా రాణించకపోడానికి కారణం సరైన మెంటార్షిప్ లేకపోవడమే.” ది ఏంజిల్ హబ్ ఫౌండర్ - సీత

విమెన్ ఆంట్రపెన్యూవర్షిప్ డెవలప్‌మెంట్ కోసం నడుం బిగించిన సీత తన సంస్థ ద్వారా లక్షల సంఖ్యలో ముగువలను వ్యాపార రంగంలో రాణించేలా మెంటార్షిప్ అందిస్తానంటున్నారు. కొన్ని సంస్థలతో భాగస్వామ్యమై మరీ ఆమె ముందుకు సాగుతున్నారు. సింగపూర్, థాయిలాండ్‌లో దాదాపు ఆరేళ్ల వ్యాపార అనుభవం ఉన్న ఆమె స్టార్టప్‌లకు సాయం అందించడానికి ఇక్కడొక స్టార్టప్ మొదలుపెట్టారు. ఈ స్టార్టప్ ప్రధానంగా... మగువలు ఫౌండర్లుగా ఉన్న సంస్థలను ప్రమోట్ చేస్తుంది. దీంతో పాటు వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. దీనికోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంని ఏర్పాటు చేశారు.

image


ఆలోచనని వ్యాపారంగా మార్చడం

అమ్మాయిల్లో ఉండే కొత్త ఆలోచనల్ని బయటకు తీసుకొచ్చే విధానం ఇదొక్కటే. ఆలోచలపై ఇన్విటేషన్స్ పంపి వాటిని కలెక్ట్ చేస్తారు. దాన్ని వ్యాపారంగా మార్చడానికి కావాల్సిన మెంటర్షిప్ అందిస్తారు. దీనికోసం ప్రధానంగా రెండు పద్ధతులను ఉపయోగిస్తామని సీత వివరించారు.

1. ఆన్‌లైన్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏర్పాటు చేశారు. దీనికి హెర్ కొలాబ్ డాట్ కామ్ అనే ఒక ఆన్‌లైన్ కమ్యూనిటీ ఉంటుంది. దీని ద్వారా ఎక్స్‌పర్ట్స్, ప్రొఫెషనల్స్‌తో డైరెక్ట్ ఇంట్రాక్షన్ అయేందుకు అవకాశం ఉంటుంది.

2. క్రౌడ్‌ఫండ్ హెర్ లైవ్ డాట్ కామ్ ప్లాట్‌ఫాం ఫండ్స్ విషయంలో సాయపడుతుంది. మగువల స్టార్టప్‌లకు కావాల్సిన ఆర్థిక సాయం దీని నుంచి అందుతుంది. ఇందులో చాలా మంది సక్సెస్ అయిన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఫండ్ రెయిజింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది.

ఇలా ముగువలకు కావాల్సిన అన్ని రకాల సాయం అందించడం మా లక్ష్యమని సీత అంటున్నారు.

ఎడ్యుకేషన్ అండ్ కెరీర్

సీత పల్లచోళ్ల... హైదరాబాద్ సిబిఐటిలో 2007లో బిఈ పూర్తి చేసారు. తర్వాత సింగపూర్ వెళ్లిపోయారు. అక్కడ ఓ ఎడ్యుటెక్ కంపెనీ ప్రారంభించారు. ఐదున్నరేళ్లు దాన్ని నడిపారు. థాయ్‌లాండ్‌లో కూడా ఈ సంస్థ సేవలిందించింది. అనంతరం కొత్త వ్యాపారాలను ప్రారంభించి స్టార్టప్‌లకు మెంటార్‌గా మారారు. చాలా స్టార్టప్‌లను ప్రారంభ రోజుల నుంచి అవి వృద్ధి చెందిన తీరును దగ్గరి నుంచి గమనించారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఏంజిల్ హబ్ ఆలోచనకు బీజం పడింది. దాదాపు ఏడాది పాటు మార్కెట్ రీసెర్చ్, ఇతర టై అప్స్, ఇన్వెస్టర్లతో కలసి పనిచేయడానికి అన్ని విధాలా అనుమతులు, కాంట్రాక్ట్‌లు పూర్తి చేసుకొని ఎట్టకేలకు 2015లో దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో ఈవెంట్లను నిర్వహించారు. 

image


ఏంజిల్ హబ్ పనితీరు

ది ఏంజిల్ హబ్ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఇన్వెస్ట్‌మెంట్ స్టార్టప్ మగువలకు కావల్సిన మెంటార్షిప్ అందిస్తోంది. దీనికోసం భారీగా స్టార్టప్ లీడర్షిప్ ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడానకి సిద్ధపడుతున్నారు. వ్యాపార రంగం కావొచ్చు మరే ఇతర రంగమైనా కావొచ్చు, అందులో రాణించిన వారితోనే వారి అనుభవాలను చెప్పించడం ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూడొచ్చు. ప్యానెల్ డిస్కషన్ ఏర్పాటు చేసి ఆలోచనా సరళి తెలుసుకుంటారు. వారు ఏ వ్యాపారానికి సరిపోతారనేది ఇందులో నిర్ణయిస్తారు. ఆడవారు నడుపుతున్న స్టార్టప్‌లను ఈవెంట్లలో షోకేస్ చేస్తారు. కొత్తవారితో పాటు ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేస్తారు. కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అందిస్తారు. దీంతో వారు తొందరగా రాణించడానికి అవకాశం లభిస్తుంది.


image


స్టార్టప్ ఎకో సిస్టంలో నేను సైతం

ఆంట్రప్రెన్యూర్లుగా మారడం కంటే ఉద్యోగులగానే స్థిరపడిపోదామని ఆలోచించే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. సొంతగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది. మగువల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఈ పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. ముగువల అవసరాలను తీర్చడానికి ముందుకొస్తోందీ ఏంజిల్ హబ్. కాలేజీ తర్వాత అమ్మాయిలు ఎక్కువ మంది ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. కొద్ది మంది మాత్రమే సొంతగా వ్యాపారం, స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. దీనికి ఫైనాన్స్‌తోపాటు వారికి సరైన గైడ్‌లెన్స్, మెంటారింగ్ లేకపోవడం కారణాలుగా చెప్పొచ్చు. ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామంటున్నారు సీత.

“ ఇప్పటి వరకూ నేను చాలా మంది అమ్మాయిలతో కలిసాను. వారంతా వ్యాపారానికి ముందుకొస్తున్నారు, పెట్టుబడి విషయంలో వెనకడుగు వేస్తున్నారు.” సీత

అలాంటి వారికి మేం సాయం అందిస్తాం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారం. వ్యాపారం లాభాల్లో నడిచేలా సరైన మెంటార్షిప్ అందిస్తాం అంటున్నారామె.

image


సవాళ్లు,భవిష్యత్ ప్రణాళికలు

ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి స్టార్టప్‌లు చాలా ఉన్నాయి. అయితే మన దేశంలో ఈ తరహా స్టార్టప్ ఇదే. భారత్‌లో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ మగువల వ్యాపారానికి కావల్సిన సాయం అందించడానికి ఇప్పటికే ఓ కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి కమ్యూనిటీలను కలుపుకుంటూ తమ సంస్థ పనిచేస్తుందని సీత చెప్పుకొచ్చారు. ఎక్కువ మందికి తమ సంస్థ కార్యకలాపాలను చేరవేయడం, తర్వాత వారిలో లీడర్షిప్ పెంచే విధంగా ప్రొగ్రామ్స్ చేపట్టడం లక్ష్యాలుగా పెట్టుకున్నామని అన్నారామె.

“విశ్వవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవలను స్థానికంగా వ్యవస్థీకరించి మన వాళ్లకు సాయం అందించడమే తమ లక్ష్యమని ముగించారు సీత”
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags