సంకలనాలు
Telugu

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. మల్టీనేషన్ కంపెనీకి సీఈవోగా ఎదిగాడు..

ఎన్టీపీసీలో ఉద్యోగం వ‌దిలేశాడు.. 32 దేశాల్లో వ్యాపారాన్ని ఆకాశమార్గం పట్టించిన నిజామాబాద్ జిల్లా వాసి 

HIMA JWALA
28th Dec 2015
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

కడుపులో చల్ల కదలని ఉద్యోగం. అయినా ఎందుకో తృప్తినివ్వలేదు. కొత్తగా ఏమైనా ట్రై చేయాలి. పదిమందిలో యునిక్ గా ఉండాలి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన కంపెనీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ గా నిలిచింది. సామాన్య మధ్యతరగతి కుటుంబలో పుట్టి.. మల్టీ నేషన్ కంపెనీకి సీఈవోగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అశుతోష్ విజయగాథ ఇది.

image


ఐటీ దిగ్గజాలన్నీ యాక్టిఫియో కస్టమర్లే

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారీ ఖర్చుతో కూడుకున్న నిత్యావసరం. సర్వర్లు, సమాచారం, ఉద్యోగులు, జీతాలు, క్లయింట్లు, సవాలక్ష సవాళ్లు. అన్నిటికిమించి డేటా ప్రిజర్వేషన్ తలకుమించిన భారం. మెగా, గిగా, జెటా బైట్లు. లక్షల ఫైళ్లు. ఇవి చూసుకోడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉంటేగానీ కంపెనీ రిలాక్స్ గా వర్క్ చేసుకోదు. అలాంటి డేటా సేవ్ చేసే కంపెనీల్లో యాక్టిఫియో ప్రముఖమైంది. 30 దేశాలకు విస్తరించిన ఈ ఐటీ రిలేటెడ్ సంస్థ ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కస్టమర్లుగా చేసుకుంది. వర్చువల్ డేటా పైప్ లైన్ టెక్నాలజీతో డేటాను స్టోర్ చేస్తారు. ఉదాహరణకు ఒక ఫైల్ యాక్టిఫియోకు ఇచ్చామనుకోండి. వాల్యూమ్స్, బ్యాకప్స్, క్లౌడ్, ఆన్ లైన్ కాపీస్.. ఇలా వివిధ రకాలుగా, ఎన్నంటే అన్ని కాపీలు తీసుకోవచ్చు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా డేటా చెక్కు చెదరదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ కావచ్చు. యాక్టిఫియో యాప్ వేసుకుంటే.. మునివేళ్లపై డేటాను మేనేజ్ చేసుకోవచ్చు. టైమ్ కి టైమ్, డబ్బుకి డబ్బు రెండూ ఆదానే. కుప్పలకొద్దీ డేటాను నిల్వ చేసుకోవడానికి ఎక్కువ స్టోరేజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదన్నదే యాక్టిఫియో వ్యాపార సూత్రం. అదొక్కడే కాదు కస్లమర్ల బిజినెస్ ను పరుగులు పెట్టించడంలోనూ సాయం చేస్తుంది. అందుకే ఐబీఎం, సన్ గార్డ్, హెచ్‌బీవో, డెల్ వంటి ఎన్నో ఐటీ దిగ్గజ సంస్థలన్నీ యాక్టిఫియో కస్టమర్లు అయిపోయాయి.

image


ఎన్టీపీసీలో జాబ్ వదిలేసినప్పుడు అందరూ నవ్వారు

30 దేశాలు. వేలాది ఉద్యోగులు. దిగ్గజ కంపెనీలన్నీ కస్టమర్లు. కోట్లాది రూపాయల టర్నోవర్. ఇవన్నీ ఓవర్ నైట్లో రాలేదు. పదేళ్ల యజ్ఞం. అంతుకు మించి మేథోమథనం. తెలుగువాడిగా.. అందునా నిజామాబాద్ జిల్లా వాసిగా అశుతోష్ సాధించిన విజయం. ఇంతపెద్ద కంపెనీకి సీఈవో అంటే నేపథ్యం కూడా అంతే పెద్దదని అనుకుంటే పొరపాటే. మామూలు వ్యవసాయ కుటుంబం. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫోర్త్‌ స్టాండర్డ్‌ వరకు వివేకవర్ధినిలో చదివారు. తర్వాత రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇంటర్ వరకు బోర్డింగ్ స్టూడెంట్‌. తర్వాత వరంగల్ కిట్స్‌ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. 81-85 బ్యాచ్‌. వెంటనే ఎన్టీపీసీలో ఉద్యోగం. మంచిజీతం. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం. 

రెండున్నరేళ్లు గడిచాయి. ఎందుకో సంతృప్తి లేదు. లైఫ్ అంటే ఇంతేనా. వందలమందిలో ఒక ఉద్యోగిగా మిగిలిపోవాలా. ఆ మాటే ఎందుకో నచ్చలేదు. ఏదైనా కొత్తగా ఆలోచించాలి. నలుగురిలో నారాయణలా ఉండొద్దు. వందమందిలో ఉన్నా గుర్తించాలి. అందుకోసం ఏదో ఒకటి చేయాలి. అనుకున్నదే తడవు. వేరే ఆలోచన లేకుండా ఎన్టీపీసీ ఉద్యోగానికి గుడ్‌ బై కొట్టారు. యుఎస్‌లో ఎమ్మెస్ అప్లయ్ చేశారు. 1988లో అమెరికా ప్రయాణం. 89లో ఎమ్మెస్ కంప్లీట్ అయింది. 1990లో ఇంటర్‌గ్రాఫ్‌ లో ఉద్యోగం దొరికింది. అక్కడ నాలుగేళ్లు చేసిన తర్వాత ఎన్‌సీఆర్‌ అనే కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. అక్కడా నాలుగేళ్లు. మొత్తం ఎనిమిదేళ్ల అనుభవం. మళ్లీ అదే రొటీన్ జీవితం. ఆఫీసు-ఇల్లు-వీకెండు. ఒక్కోసారి ఆఫీసుకు వెళ్లకున్నా పనులు అయ్యేవి. యునిక్‌గా ఆలోచించేవారికి ఇలాంటి ఉద్యోగాల మీద, వాళ్లిచ్చే జీతాల మీద అస్సలు ప్రేమ ఉండదు. 

అశుతోష్‌ అలాంటి ఐడియాలజీ ఉన్నవాడే. అందుకే ఆ జాబ్ మీద అంతగా శాటిస్‌ఫై కాలేదు. బుర్రనిండా కావల్సినన్ని ఐడియాలు. దేనికదే ప్రత్యేకం. వాటిని వర్కవుట్ చేయాలి. ఒక కొత్త ఒరవడి సృష్టించాలి. ఇద్దరు స్నేహితులు కలిశారు. వాళ్లకు మరో ఇద్దరు తోడయ్యారు. ఐడియాలు షేర్ అయ్యాయి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా? ఎన్నో నిద్రలేని రాత్రులు. కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడైనా రిస్కే. కొత్తలో చాలా మంది నవ్వుతారు. ఎన్టీపీసీలో జాబ్ వదిలేసినప్పుడు కూడా అందరూ అలాగే నవ్వారు. రిస్క్ ఎందుకని డిస్కరేజ్ చేశారు. కానీ అశుతోష్ వినేరకం కాదు. ఒకవేళ అది వర్కవుట్ కాకుంటే మునుపటి జాబ్ చేసుకోవచ్చు. వస్తానంటే కాదనరు. విల్ పవర్‌, కన్విక్షన్. ఈ రెండింటినీ నమ్ముకున్నాడు. 

image


ఒక బెటర్ స్టార్టప్ నుంచి ఒక కంపెనీ పుట్టుకొచ్చింది. ఇంటిగ్రేటెడ్ చిప్ తయారు చేసేది. రెండేళ్లలో మార్కెట్‌ని డామినేట్‌ చేయగలిగారు. 2001లో కంపెనీ బాస్టన్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ మరో కపెంనీ మొదలుపెట్టారు. అదీ విజయవంతంగా నడిచింది. 2005 వరకు మార్కెట్‌ వీళ్ల చేతుల్లోనే ఉంది. దాంతో హెచ్‌పీ వీరి కంపెనీని టేకోవర్ చేసింది. మళ్లీ అక్కడా ఉద్యోగం. జీవితం అటుతిరిగి ఇటు తిరికి మళ్లీ మొదటికొచ్చింది. 2008లో ఎందుకో ఖాళీగా ఉండాలనిపించింది. ఈసారి బుర్రలో ఇన్వెస్ట్ మెంట్‌ ఆలోచన మొలకెత్తింది. అందులోంచి పుట్టుకొచ్చిందే యాక్టిఫియో ఇన్ కార్పొరేషన్‌. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆలోచనలకు తగ్గ కంపెనీ మొదలైంది. అలా ఏర్పాటయిన యాక్టిఫియో ప్రస్థానం 32 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద బ్యాంకులన్నీ యాక్టిఫియో కస్టమర్లే.

ముచ్చటగా మూడు సూత్రాలు

ఏదైనా కంపెనీ మొదలుపెడితే ముచ్చటగా మూడు సూత్రాలు ఉండాలంటారు అశుతోష్. ఒకటి మార్కెట్. రెండు టీమ్‌. మూడు -కల్చర్‌. వాటన్నికంటే ముందు ఐడియాని స్ట్రెంగ్త్‌ చేయాలంటారాయన. తర్వాత దాన్ని మార్కెట్‌ కి తీసుకురావాలి. కంపెనీ మొదలుపెడితే ఉద్యోగులు జీతాల గురించి మాట్లాడుకోవద్దు. వరల్డ్‌ క్లాస్ సంస్థలో పనిచేస్తున్నాం అనే భావనలో ఉండాలి. యాక్టిఫియో కంపెనీ సీఈవోగా ఆశుతోష్ గర్వంగా చెప్పే విషయం కూడా అదే . తన కంపెనీలో జీతం కోసం ఎవరూ రారంటారాయన. ఈ ఏడాది ఇండియా, చైనాలో బ్రాంచ్ నెలకొల్పారు. మార్కెట్ కావల్సినంత ఉంది కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులున్నారు. హైదరాబాలో వచ్చే ఏడాది ఎంప్లాయిస్ సంఖ్య డబుల్ అవుతుంది. డెవలప్ మెంట్ కు మాసివ్ స్కోప్ ఉన్న సిటీ హైదరాబాద్‌ అంటారు అశుతోష్‌. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు.. పనిచేసే కల్చర్ సిటీకి ప్లస్ పాయింట్ అంటారు. పైగా స్టేబుల్ గవర్నమెంట్ మార్కెట్‌ కి ఫెచ్‌ అవుతుందని అంటున్నారు.

image


సంకల్పం ఒక మనిషికి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. చేసే పని ఏదైనా దాన్నొక యజ్ఞంలా భావించాలి. ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే గుర్తింపు కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. చిన్న స్టార్టప్ కంపెనీగా పుట్టిన యాక్టిఫియో ఇవాళ బిలియన్ డాలర్ల మార్కెట్‌ ని సొంతం చేసుకుంది. దాని వెనుక అశుతోష్ టీం కృషి, పట్టుదల, కమిట్మెంట్, ఐడియాలజీ, అన్నీ కలగలిసి ఉన్నాయి.

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags