సంకలనాలు
Telugu

నష్టాల్లో ఉన్న తండ్రి కంపెనీ బాధ్యతలు చేపట్టి.. ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్ స్థాయికి...!

Sri
25th Oct 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

కోల్డెక్స్... కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ కంపెనీ. ఏడాదికి రెండు వందల కోట్ల అమ్మకాలు సాధించడం ఈ కంపెనీ రికార్డ్. ఈ సక్సెస్ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ముందు గౌరవ్ జైన్ గురించి తెలుసుకోవాలి. గౌరవ్ జైన్ మెరిక లాంటి ఆంట్రప్రెన్యూర్. 1999లో వ్యాపార రంగంలో అడుగుపెట్టారాయన. స్నేహితులతో కలిసి తన తండ్రి నిర్వహిస్తున్న ట్రకింగ్ కంపెనీ.. 'స్వస్తిక్ రోడ్ లైన్స్'లో అడుగుపెట్టారు గౌరవ్. అప్పటికే ఆ కంపెనీకి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. స్వస్తిక్ రోడ్ లైన్స్ చాలా పెద్ద కంపెనీ. కానీ వారి వ్యాపారమంతా ప్రధానంగా ఒకే ఒక్క క్లైంట్ (జేకే టైర్స్)పై ఆధారపడి ఉండేది. ఎప్పుడైతే ఆ క్లైంట్ పక్కకు తప్పుకున్నారో... అంతే కంపెనీ నేలచూపులు చూసింది. కానీ గౌరవ్ ఆత్మస్థైర్యం ఎక్కడా చెక్కుచెదర్లేదు. ఏ అవకాశం లేని చోట కొత్త అవకాశాలు సృష్టించుకోవాలన్నది గౌరవ్ లెక్క. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ప్రారంభించాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. నిజం చెప్పాలంటే ఇదీ ఓ పెద్ద ప్రయోగమే. కానీ ధైర్యంగా ముందుకెళ్లారు.

image


మొదటి అడుగే సూపర్ హిట్

తొలి క్లైంట్‌గా క్యాడ్బరీ కంపెనీ దొరికింది. దాంతో స్వస్తిక్ దశ తిరిగింది. కొన్నేళ్లలోనే తన కంపెనీని డ్రై లాజిస్టిక్స్ నుంచి కోల్డ్ చైన్ బిజినెస్ వైపు మళ్లించారు గౌరవ్. 2007 నుంచి స్వస్తిక్ రోడ్ లైన్స్ బ్రాండ్ పేరు మార్చి 'కోల్డెక్స్ లాజిస్టిక్స్' పేరుతో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం కోల్డెక్స్ ప్రముఖ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ కంపెనీ. QSR (క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్) చైన్స్ లాంటి ప్రముఖ బ్రాండ్లకు సర్వీసులు అందిస్తోంది. ఆరు ప్రముఖ QSR కంపెనీల్లో ఐదింటికి సేవలందిస్తోంది కోల్డెక్స్. ఔషధాలు, స్వీట్లు, చాక్లెట్లు, మాంసం, పళ్లు, కూరగాయలు, పౌల్ట్రీ లాంటివాటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం కోల్డెక్స్‌కు ఆరు గిడ్డంగులు ఉన్నాయి. వాటిలో ఐదు లీజుకు తీసుకున్నవి, ఒకటి సొంతది. వచ్చే 18 నెలల్లో కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని ఆరు వేల ప్యాలెట్ల నుంచి 30 వేల ప్యాలెట్లకు పెంచాలనుకుంటున్నారు.

"మాకు 825 ట్రక్కులున్నాయి. 1500 మంది డ్రైవర్లున్నారు. డెలివరీలో చివరి మైలురాయికి చేరుకోవడమే మా లక్ష్యం. అంటే డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చెయ్యడమే కాదు... వాళ్ల కస్టమర్లకు టూ వీలర్ల ద్వారా డెలివరీ చేసే బాధ్యత కూడా మేమే తీసుకోవాలనుకుంటున్నాం. అందుకోసం స్కూటర్ల సంఖ్య పది నుంచి నాలుగు వందలకు పెంచాం" అంటారు గౌరవ్.

టాప్ బ్రాండ్స్ వీరి సొంతం

2007 నుంచి కోల్డెక్స్ పెద్ద కస్టమర్లను ఆకట్టుకుంటోంది. భారతదేశంలోని ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లు సబ్ వే, డొమినోస్ పిజ్జా, స్టార్ బక్స్, కేఎఫ్‌సీ లాంటి కంపెనీలకు సేవలందిస్తోంది. నెస్లే ఇండియా, హెర్షే ఇండియా, అమూల్, క్వాలిటీ వాల్స్, గ్లాక్సో స్మిత్ క్లైన్ లాంటి కంపెనీల ఉత్పత్తుల్ని సరఫరా చెయ్యడంలో కోల్డెక్స్ పాత్ర కీలకం. -18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో శీతల ఉత్పత్తులను రవాణా చేస్తోంది.

"ప్రస్తుతం మా కంపెనీ అమ్మకాలు రెండు వందల కోట్లకు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఏడాదికి 35 శాతం వృద్ధి కనిపిస్తోంది" అంటారు గౌరవ్.
image


భారతదేశంలో టెంపరేచర్ కంట్రోల్డ్ లాజిస్టిక్స్ వ్యాపారం 12 నుంచి 15 వేల కోట్లు ఉందని అంచనా. వచ్చే నాలుగైదేళ్లలో ఏడాదికి కనీసం 20 శాతం వృద్ధి కనిపించడం ఖాయం. కోల్డ్ చైన్ ఇండస్ట్రీ మరింత పెరగాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... లక్ష్యాలు సాధించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. 2011-2012 ఆర్థిక సంవత్సరంలో కోల్డ్ చైన్ సెక్టార్ కోసం కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. అలాగే కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల్లో ఉపయోగించే ఎయిర్ కండీషన్డ్ పరికరాలు, శీతలీకరణ ప్యానళ్లకు ఎక్సైజ్ డ్యూటీలో మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ఈ రంగానికి అదనపు బలం అంటారు గౌరవ్. కానీ మిగతా వ్యాపారాల్లాగా ఇందులోనూ అనేక సవాళ్లున్నాయి. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులే కీలకం. పరికరాలు, వాహనాలు, ఉష్ణోగ్రత నియంత్రించే గిడ్డంగుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలి.

"ఈ రంగం ఎక్కువగా ఊష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. కావాల్సినంత ఉష్ణోగ్రత ఉంచేందుకు భారీగా ఇంధనం ఖర్చవుతుంది. ప్రపంచంలో సప్లై చైన్ బిజినెస్ ఎదుర్కొంటున్న సవాళ్లే భారతదేశంలో కోల్డ్ చైన్ బిజినెస్ కూడా ఎదుర్కొంటోంది. పెట్టుబడులు సాధించడం, మార్కెట్లో సేవలందించడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, వనరులు, సామర్థ్యంలో పరిమితులు లాంటివి సవాళ్లున్నాయి" అంటారు గౌరవ్.

ట్రెడిషనల్ ఇండియన్ బిజినెస్‌కు కోల్డెక్స్ గొప్ప ఉదాహరణ. భారతదేశంలో ఈ రంగంలో కోల్డెక్స్ మార్గదర్శకంగా నిలిచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఐదేళ్లలో కంపెనీని ఎలా నడిపించాలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా ఏడు వందల కోట్ల రూపాయల వ్యాపారానికి మేం సులువుగా చేరుకోగలమన్నది వీరి ధీమా. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ లో ప్లగ్ అండ్ ప్లే మోడల్ రూపొందించాలనుకుంటున్నారు. ఇవి QSR లాంటివాటికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం కోల్డెక్స్ ఆదాయమంతా బిజినెస్ టు బిజినెస్ మోడల్ పైనే ఆధారపడి ఉంది. అయితే త్వరలో కస్టమర్(బర్గర్స్, ఫ్రైస్ తినేవాళ్లు) వరకు చేరుకోవాలనుకుంటోంది. చిన్నచిన్న ప్రాంతాల్లో ఉన్న రీటైల్ షాపుల వరకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇ-కామర్స్ కంపెనీలపై దృష్టిపెట్టాలనుకుంటోంది.

website

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags