కన్నడనాట మహిళామణుల వ్యాపార సామ్రాజ్యాలు!!

కన్నడనాట మహిళామణుల వ్యాపార సామ్రాజ్యాలు!!

Tuesday February 02, 2016,

3 min Read

పట్టుపరిశ్రమ అయితే ఏంటి..! చెన్నపట్న బొమ్మలైతే ఏంటి..! సాంప్రదాయ పరిశ్రమలకు కర్నాటక పెట్టింది పేరు. ఘనమైన గత చరిత్రను ఒక్కసారి తరచిచూసుకుంటే కన్నడిగుల గుండెలు ఉప్పొంగుతాయి. హంపీ కావొచ్చు! మైసూర్ కావొచ్చు! చిత్రదుర్గ్ అయినా ధర్వాడ్ అయినా!! ప్రాంతానికో చరిత్ర! వన్నె తరగని వైభవం!! మరి గతం ఒక్కటేనా..!? చరిత్ర చెప్పుకుంటే సరిపోతుందా?! వర్తమానం ఎలా వుంది?! భవిష్యత్ ఎలా వుండబోతోంది?! ఈ ప్రశ్నలకు ఐటీ కేంద్రంగా విరాజిల్లుతున్న బెంగళూరు సమాధానం చెప్తుంది! గ్లోబల్ ఐటీ కంపెనీలన్నీ కన్నడనాట బలమైన పునాదులమీద నిలబడ్డాయి! గత కొన్ని ఏళ్లుగా ఆంట్రప్రెన్యూర్లకు, ఎన్నో స్టార్టప్ కంపెనీలకు తిరుగులేని వేదికగా నిలిచింది కర్నాటక!!

image


కర్నాటక గురించి ఇంత చెప్పేటప్పుడు- అసాధారణ విజయాలు సాధించిన ఆ రాష్ట్ర మహిళా వ్యాపారవేత్తల విజయాలను కూడా కీర్తించాల్సిన అవసరం ఉంది. తెలివితేటల్ని రంగరించి వ్యాపారాన్ని దశదిశలా విస్తరింపజేసి- లాభాలను ఆకాశమార్గం పట్టించిన సక్సెస్ ఫుల్ మహిళా ఆంట్రప్రెన్యూర్లు కన్నడనాట ఎందరో ఉన్నారు. ఉదాహరణకు కిరణ్ మజుందార్ చూసుకుంటే -ఆమెతోపాటు ఇంకొందరు కలిసి అసోసియేషన్ ఆఫ్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ ఆఫ్ కర్నాటక (AWAKE) నడిపిస్తున్నారు. వ్యాపార రంగంలో ఊహించని విజయాలను సాధించి- కర్నాటక బావుటాను హిమాలయమంత ఎత్తుకు ఎగురవేశారు. అలాంటి మహిళా ఆంట్రప్రెన్యూర్లలో కొందరిని మీకు పరిచయం చేస్తోంది యువర్ స్టోరీ.

కిరణ్ మజుందార్ షా

బయోకాన్ లిమిటెడ్. ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీకి కిరణ్ మజుందార్ షా చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. అంతకు ముందు కిరణ్ మజుందార్ డ్రీమ్ వేరే. లిక్కర్ తయారీ రంగంలో వెలిగిపోవాలి అనుకున్నారు. అందుకోసం ఆమె ఆస్ట్రేలియాలోని మంచి పేరున్న బీర్ కంపెనీ కార్ల్ టన్ బేవరేజెస్ లో ట్రైనీగా చేరారు. కానీ కొన్ని కారణాలవల్ల కల చెదిరిపోయింది. సరే. ఇప్పుడేం చేయాలి? ఏం చేయగలను? అలా ఆలోచిస్తుండగానే మరో ప్రయాణం మొదలైంది. దానిపేరు బయోటెక్. అదికూడా లిక్కర్ తయారీలాంటిదే. సేమ్ ఎగ్జయింటింగ్ అక్కడా ఉంటుందంటారామె! అయితే వ్యాపారం అనే పదానికే ఆమె కొత్త. అంతకుమందు బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. అట్లీస్ట్ ఐడియా కూడా లేదు. ఎలా? అయినా సరే ఏదో ఒక ఆవిష్కరణ జరగాలి! అలా వ్యాపార రంగంలోకి దూకారు! ఇదే విషయంపై గతంలో ఒకసారి ఆమె యువర్ స్టోరీతో తన లైఫ్ స్టోరీ చెప్పారు!!

అలాంటి దశ నుంచి మజుందార్ దేశంలోనే టాప్ విమెన్ ఆంట్రప్రెన్యూర్లలో ఒకరిగా ఎదిగారు. ఆమె కంపెనీ నెట్ వర్త్ ఇప్పుడు 1.1బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ మేగజిన్ ప్రకారం 2015లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కిరణ్ మంజుందార్ 85వ వ్యక్తి!!

డా. కామిని ఏ. రావ్

1989లో బెంగళూరులో మొదలైన మైలాన్ ఫార్మాకు డాక్టర్ కామినీ ఏ. రావ్ మెడికల్ డైరెక్టర్ కమ్ ఫౌండర్. ఆమె రిప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీలో స్పెషలిస్టు. అండాశయ శరీరధర్మ శాస్త్రం (ovarian physiology) కూడా ఆమెకి కొట్టిన పిండి!! ఫెటల్ ఇన్వాసివ్ థెరపీలో అందెవేసిన చేయి! దేశంలోనే తొలి సిఫ్ట్ బేబీకి ప్రాణం పోసిన ఘనత కూడా ఆమెదే!! డాక్టర్ కామినీ రావ్ మెడిసిన్ చదివింది బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికిల్ కాలేజీలో!!

మీనా గణేశ్

పోర్టీ మెడికల్ సీఈవో మీనా గణేశ్. హెల్త్ కేర్ రంగంలో పోర్టీ హోం ఫోకస్డ్ సార్టప్‌ను భర్తతో కలిసి 2013లో ప్రారంభించారు. గత ఏడాది ప్రముఖ ఇన్వెస్టర్ యాక్సెల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్ సీ), వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మెంబర్ క్వాల్ కామ్ వెంచర్స్ అండ్ వెంచర్ ఈస్ట్ సంస్థలు గత ఏడాదిలో 37.5 మిలియన్ డాలర్ల సిరీస్ బీ ఫండ్స్‌ ను ఇన్వెస్ట్ చేశాయి. ఇంకో నాలుగు స్టార్టప్స్ కు మీనా, ఆమె భర్త కో ఫౌండర్లు. ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీనా- కలకత్తా ఐఐఎం నుంచి ఎంబీయే కంప్లీట్ చేసింది. పీడబ్ల్యూసీ, మైక్రోసాఫ్ట్, టెస్కోలో పని చేసిన అనుభవం కూడా వుంది.

శ్రీవిద్యా శ్రీనివాసన్

శ్రీవిద్యా శ్రీనివాసన్ మొదటి వెంచర్ -ఇంపల్స్ సాఫ్ట్. దానికి ఆమె కో ఫౌండర్. అప్పటికి ఆమె వయసు 24 ఏళ్లు. 2006లో ఆ కంపెనీని SIRF అనే NASDAQ- లిస్ట్ చేసిన సెమికండక్టర్ కంపెనీ కొనుగోలు చేసింది. దాంతో ఆమె మరో కంపెనీని స్థాపించాలని సంకల్పించింది. రెండేళ్ల తర్వాత అంటే, 2008లో అమేజి టెక్నాలజీస్ అనే సంస్థకు కో ఫౌండర్ గా వ్యవహరించారు. అమేజీ అనేది క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ. ట్రెడిషనల్ శాటిలైట్ టీవీ బ్రాడ్ కాస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ఆ టెక్నాలజీ పూర్తిగా ప్రత్యామ్నాయం. గత ఏడాది జనవరిలో విప్రో నుంచి సీ రౌండ్స్ పెట్టుబడులు వెల్లువెత్తాయి.

రీచా కర్

ప్రతీ నిమిషానికో బ్రాసరీ అమ్మే ఆన్ లైన్ లింగరీ స్టోర్- జివామి. దానికి ఫౌండర్ కమ్ సీఈవో రీచా కర్. 2011లో మొదలైంది వ్యాపారం. హెడ్ క్వార్టర్ బెంగళూరు. జొడియస్ టెక్నాలజీ ఫండ్, ఖజనా నాసియోనల్ బెర్హాడ్ 250 కోట్ల రూపాయలు సంస్థలో సిరీస్ సీ పెట్టుబడులు పెట్టాయి. మలేషియా ప్రభుత్వం కూడా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టంది ఈ కంపెనీలో.

బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చేసిన తర్వాత- రీచా కొంతకాలం ఐటీ ఇండస్ట్రీలో పనిచేశారు. రిటైలర్ గ్లోబల్ టెక్నాలజీస్ లో కూడా పనిచేశారు. ఆ తర్వాత జివామి స్థాపించారు.

ఒక్క వీళ్లే కాదు యావత్ కర్నాటకలో ఎందరో మహిళా ఆంట్రప్రెన్యూర్లు వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించారు. పలు జిల్లాల్లో చిన్నపెద్దా బిజినెస్ చేసే మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్ల సక్సెస్ స్టోరీలు మీకు తెలిస్తే her.yourstory.comకి తప్పక రాయండి.

అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్శించడమే లక్ష్యంగా కర్నాటక ప్రభుత్వం తలపెట్టిన ఇన్వెస్ట్ కర్నాటక సమ్మిట్ లో యువర్ స్టోరీ సగర్వంగా పాలుపంచుకుంటోంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు బెంగళూరులో జరుగుతుంది.

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి!

దీనికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ కూడా డౌన్ లోడ్ చేసుకోండి!!