సంకలనాలు
Telugu

ఏసీ హెల్మెట్ తయారు చేసిన హైదరాబాద్ కుర్రాడు..

శ్రవణ్ బుర్రలో 200 ఐడియాలు.. వాటిపైనే ఫుల్ టైం ఫోకస్

ashok patnaik
26th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఒక్కసారి ఊహించండి.. 

మాంచి ఎండాకాలం. మిట్టమధ్యాహ్నం. పైన 42 డిగ్రీల ఎండ. టూ వీలర్ మీద జర్నీ.

మాడు పేలిపోతోంది. అది సరిపోదన్నట్టు ట్రాఫిక్ జామ్. 

బండి బంపర్ టు బంపర్ నడుస్తోంది. కోపం, చిరాకు, ఆవేశం, ఫైనల్ గా బీపీ.

వీటన్నిటి మధ్య తలకు ఫెవికాల్ తో అతికిచ్చినట్టుగా హెల్మెట్. 

చెప్పడం కాదుగానీ- కిందనుంచి మీదివరకు పులుసు కారిపోతుంటుంది..

అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ బాధేంటో.. 

అయినా ఏం చేయలేని దుస్థితి..

నెత్తిమీద కుండ బోర్లించినట్టుగా హెల్మెట్.. 

లోపల పిసరంత కూడా దూరని గాలి.. వేడి.. చెమట.. 

ఇంతటి హారిబుల్ సిట్యువేషన్లో..

ఒక్క చల్లటి పిల్ల తెమ్మెర ఎక్కడి నుంచైనా వచ్చి.. చిలిపిగా హెల్మెట్లో దూరి అల్లరి చేస్తే ఎంత బావుంటుంది..

అదిగో.. సరిగ్గా అలాంటి ఐడియానే వచ్చింది ఆ కుర్రాడికి. ఆ ఐడియా పేరు ఏసీ హెల్మెట్. హెల్మెట్లో ఏసీ ఏంటి గురూ.. మరీ జోక్ కాకపోతే.. అని అనుకుంటున్నారా? అవును. అద్భుతమైన ఐడియాలెప్పుడూ మొదట నమ్మశక్యం కావు. ఆ తర్వాతే అది గొప్ప ఆవిష్కరణలుగా మారుతాయి

image


బుర్రలో క్రియేటివిటీకి- చేతిలో డిగ్రీ పట్టాకేం సబంధం లేదు. దమాక్ లో దమ్ముండాలే గానీ ఐడియాలు ఆరో తరగతిలో కూడా వస్తాయి. శ్రావణ్ అదే బాపతు. అతని బుర్ర ఐడియాల పుట్ట. ఒకటీ రెండు ఐడియాలకే ఆయాస పడుతుంటారు కొందరు. కానీ ఆ కుర్రాడు 200 ఐడియాల మీద వర్క్ చేస్తున్నాడు. అది కూడా ఫుల్ టైం. ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక చెప్పిన ఏసీ హెల్మెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం.. 

హెల్మెట్లో ఏసీ అనగానే.. అదేదో ఆమ్లెట్ మీద బ్రెడ్డేసి ఇచ్చినంత ఈజీ కాదు. బ్యాటరీలు, సర్క్యూట్లు, బ్లోయర్లతో పని. ఏ మాత్రం తేడా వచ్చినా పుర్రె పుచ్చకాయలా పేలిపోద్ది. అయితే మీరు అనుకున్నట్టుగా హెల్మెట్లో ఎలక్రికల్ సర్క్యూట్ హంగామా లేదు. బ్యాటరీల భయం ఉండదు. కరెంట్ అనే పదానికే తావులేదు. సెట్టింగ్స్ లో చిన్న తేడాలు. హెల్మెట్ బయటి మెటీరియల్ గట్టిగానే ఉంటుంది. లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. బయట ఎంత టెంపరేచర్ అయినా ఉండనీయండి. లోపల మాత్రం సాధరణ ఉష్ణోగ్రత కంటే 8-10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. మెత్తగా, చల్లగా, చెమట పట్టకుండా, ఒక చల్లటి రుమాలు తలకు చుట్టినట్టుగా ఉంటుంది.

imageహెల్మెట్ సంగతి అలా ఉంటే.. మనోడికి ఇంకో ఐడియా వచ్చింది. దాని పేరు మొబైల్ యాప్ తో పనిచేసే కార్ జాక్. ఓసారి లాంగ్ డ్రైవ్ కి వెళ్లినప్పుడు కారు టైరు పంక్చర్ అయింది. దాన్ని జాక్ పెట్టి పైకి లేపడానికి నానా తంటాలు పడ్డాడు. బేసిగ్గా మగవాళ్లకు కండబలం ఉంటుంది కాబట్టి ఎలాగోలా టైర్లను ఊడదీస్తారు. అదే ప్లేసులో అమ్మాయిలుంటే పరిస్థితి ఏంటి? ఎంతైనా మగవారికి ఉన్నంత బలం, గ్రిప్ వాళ్లకుండవు కదా. అందుకే ఈ సమస్యకు పెర్మనెంట్ సొల్యూషన్ ఏంటా అని ఆలోచించాడు. కారు జాక్ కి ఓ ఎలక్ట్రానిక్ డివైజ్ అమర్చి టైర్లను తొలగిస్తే ఎలా వుంటుంది..? అది కూడా ఒక మొబైల్ యాప్ తో ఆపరేట్ చేసేలా ఉంటే ఇంకెలా వుంటుంది..? ఇలా సాగాయి అతని ఆలోచనలు. దాంతోపాటు టైర్లలో గాలి నింపడానికి ఓ మినీ కంప్రెషర్ కూడా తయారు చేస్తే పోలా అనుకున్నాడు. అనుకున్నట్టే తయారు చేశాడు.

బేసిగ్గా కాలేజీ కుర్రాళ్లకు బండి ఇస్తే పట్టపగ్గాలుండవు. సిగ్నళ్లు కనిపించవు. గేర్ మార్చి ఒక్క గుంజుడు గుంజితే.. గాల్లో తేలిపోవాల్సిందే. ఇలాంటి దూకుడు చూసి పేరెంట్స్ భయంతో బిక్కచచ్చిపోతారు. బయటకి పోయిన పిలగాడు ఇంటికొచ్చేదాకా వాళ్లకు టెన్షనే. ఇది గమనించిన శ్రవణ్.. బైకుకు ముకుతాడు వేశాడు. ఆ తాడు పేరు స్పీడ్ ట్రాకర్. దాన్ని బండికి అమరిస్తే చాలు.. అబ్బాయి ఎంత స్పీడుగా వెళ్తున్నాడో ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిపోద్ది. తద్వారా కుర్రోడిని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఐడియా ఏదో బావుంది కదా.. 

ఏసీ హెల్మెట్ తయారు చేస్తున్న శ్రవణ్

ఏసీ హెల్మెట్ తయారు చేస్తున్న శ్రవణ్


ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు..కమ్ సే కమ్ 200 ఐడియాలు ఉన్నాయి. స్కూల్ డేస్ లోనే ఇలాంటి ఆలోచనలు శ్రవణ్ బుర్రనిండా చక్కర్లు కొట్టేవి. వాటన్నటినీ ఇప్పుడు పేపర్ మీద పెడుతున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రవణ్ తన ఐడియాలన్నింటినీ ప్రాడక్టులుగా మార్చుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ 40కి పైగా పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. మరికొన్నింటిని అప్లై చేశాడు.

శ్రవణ్ పక్కా హైదరాబాదీ. నాన్న బిజినెస్ చూసుకుంటాడు. అమ్మ హోం మేకర్. చేపట్టిన ప్రాడక్టులు అప్పటి అవసరానికి ఉపయోగపడినవి. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రాడక్టులను తయారుచేసే థాట్ ప్రాసెస్ లో ఉన్నాడు. దాదాపు అన్నీ పూర్తి కావొచ్చాయి. ఈ మధ్యలో మరికొన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాడు. ప్రాడక్టులు కమర్షియల్ యూజ్ లోకి వస్తే మిలియన్ డాలర్లు సంపాదించొచ్చు. అందులో పిసరంత డౌట్ కూడా లేదు.

ప్రస్తుతం శ్రవణ్ కనిపెట్టిన సింగిల్ ఫేజ్ లిఫ్ట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింతంగా జనంలోకి తీసుకెళ్లాలనేది ప్లాన్. దీంతో పాటు లిఫ్ట్ లో ప్రమాదాలు జరక్కుండా ఉండటానికి సేఫ్టీ డివైజ్ ని కూడా తయారు చేశాడు. సెన్సార్ తో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా డోర్లు ఓపెన్ కావడం, క్లోజ్ కావడం దాని ప్రత్యేకత. ప్రాడక్టులపై మరింత అధ్యయనం చేయడానికి ముందుకొచ్చి ఎవరైనా పెట్టుబడులు పెడతానంటే .. కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు శ్రవణ్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags