సంకలనాలు
Telugu

మీ ఫర్నిచర్‌కు మీరే డిజైనర్ అంటున్న స్టిచ్ వుడ్

ఫర్నిచర్ తయారీలో కొత్త స్టార్టప్కస్టమైజ్డ్ సోఫాలతో సేవలుఆన్ లైన్లోనే ఫర్నిచర్ డిజైన్ చేసుకునే వెసులుబాటుస్థానిక కార్పెంటర్లకి ఆన్ లైన్‌లో ఆల్టర్నేటివ్

ashok patnaik
14th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్టిచ్ఉడ్ అనేది ఓ ఆన్ లైన్ కస్టమైజ్డ్ ఫర్నిచర్ స్టోర్. ఐఐటి, ఐఐఎం-బి పూర్వవిద్యార్థులు దీన్ని స్థాపించారు. అవసరాలకు కావల్సిన ఫర్నిచర్ తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కొనడానికి ముందే కస్టమర్లకు ఆన్‌లైన్లో డిజైన్‌ను చూపించి అందించడం దీని ప్రత్యేకత. టంగ్రమ్ ఫర్నిచర్ సొల్యూషన్ అనేది స్టిచ్ఉడ్‌కి పేరెంట్ కంపెనీ. ఇటీవలి ఈ కంపెనీ లక్ష అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీంతోపాటు ప్రస్తుతం డెబ్బై ఐదు లక్షల అమెరికన్ డాలర్లను కలిగి ఉంది. కస్టమర్లే వారికి కావల్సిన ఫర్నిచర్ డిజైన్ చేసుకొని దాన్ని పొందేలా చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. 

image


టీం విషయానికొస్తే.. అజిత్ షెగోంకార్, వికాస్ నాయర్‌లు స్విచ్ వుడ్‌ని 2014లో స్థాపించారు. అజిత్ ఐఐటి బాంబే నుంచి 2004లో డిగ్రీ పొందారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్, అర్బానా కేంపైన్‌లో మాస్టర్స్ చేశారు. తర్వాత ఇండియా చేరుకున్నారు. అటు తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఆరేళ్లు పనిచేశారు. వికాస్ నాయర్ 2005లో ఐఐటి బాంబే నుంచి డిగ్రీ పొందారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పిజి పూర్తి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు సప్లై చెయిన్ మేనేజ్ మెంట్‌లోనూ, మరో నాలుగేళ్లు స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. వీళ్లతో పాటు అజీత్ ఖురానా స్టిచ్ఉడ్‌లో మరో ఇన్వెస్టర్. మార్కెట్లోకి సత్తా ఉన్న ఆంట్రప్రెన్యూర్లే రావాలని బలంగా నమ్మే వ్యక్తి ఆయన.

అజిత్ షెగోంకార్, వికాస్ నాయర్‌ - స్టిచ్ వుడ్ వ్యవస్థాపకులు

అజిత్ షెగోంకార్, వికాస్ నాయర్‌ - స్టిచ్ వుడ్ వ్యవస్థాపకులు


భారత్ దేశంలో ఏ ఇద్దరి ఇల్లూ ఒకేలా ఉండదు. మరాలాంటప్పుడు అందరి ఇళ్లలో ఒకేలాంటి ఫర్నిచర్ ఉండాలని ఎలా అనుకుంటారు ? ఇదే ఐడియాతో పనిచేస్తుంది స్విచ్ ఉడ్. వినియోగదారుల అవసరార్థం వారికి కావల్సిన ఫర్నిచర్ వారే డిజైన్ చేసుకునే విధంగా దీనిలో అవకాశాన్ని కల్పిస్తున్నారు. డిజైన్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వల్ల టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

కస్టమైజేషన్ అంటే అందరూ అనుకున్నట్లు కాదు. ఇది ఎంతో ఆర్గనైజ్డ్‌గా ఉంటుందని కంపెనీ చెబ్తోంది. ఈ స్టార్టప్‌లో ఏడుగురు కోర్ టీం ఉంటారు. ఇప్పటి వరకూ అయితే ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను ఔట్‌ సోర్స్ చేస్తున్నారు. అయితే స్టిచ్ వుడ్‌కి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ టీం దీని వెనకుండి పర్యవేక్షణ చేస్తుంది. 

స్టిచ్ఉడ్ ఎలా పనిచేస్తుంది ?

యూజర్లు వెబ్ సైట్‌ను విజిట్ చేసి వారికి కావాల్సిన సోఫాలను రెండు రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. యూజర్లు విజువల్ చూసి, వారి అవసరాలకు అనుగూణంగా ఫ్రేమ్‌ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికైతే స్టాండర్డ్, కంఫర్ట్, సెక్షనల్, స్టెర్లిన్ లాంటి విషయాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. దీని ఎన్నిక పూర్తయిన తర్వాత ఆర్మ్స్, పైభాగం, కుషన్, లెగ్స్ లాంటివి సరిచూసుకోవాలి. ఈవిషయంలో కూడా విజువల్‌ని చూపించే వెసులుబాటుంది.

image


డ్రీమ్ సోఫాను అప్ లోడ్ చేసేయడమే :

యూజర్లు తమకు కావల్సిన సోఫా ఫోటోలను అప్ లోడ్ కూడా చెయ్యొచ్చు. లేదా 9819409663 నంబర్‌కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు సరాసరి దీనికి ఎంత ఖర్చులో తయారు చేయాలి, ఆర్డర్‌ని ఎక్కడ డెలివరీ చేయాలో వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన మార్పుచేర్పులు ఉంటే అవి చెప్తే.. కస్టమర్లను కలవడానికి స్విచ్ ఉడ్ టీం వచ్చి చర్చిస్తుంది. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సమీప భవిష్యత్ లో ఈ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

పెప్పర్ ఫ్రై, హోం హీరో,అ ర్బన్ లేడర్, ఫ్యాబ్ ఫర్నిష్‌ వంటి మరికొన్ని స్టార్టప్ లు ఇదే రకమైన వ్యాపారంలో ఉన్నాయి. చాలరకాలైన కంపెనీలు ఫర్నిచర్, హోం ఈకామర్స్ రంగంలోకి వస్తుండటం మనం గమనించొచ్చు.

ఫ్యూచర్ ప్లాన్స్ :

స్టిచ్ఉడ్ ప్రారంభించిన నెల రోజుల నుంచి కస్టమర్ల నుంచి చక్కని స్పందన వస్తోంది. ప్రస్తుతానికి బాంబేలో ఉన్న ఈకంపెనీ ఢిల్లీ,పూణా లోకి ప్రవేశించబోతోంది. ఇప్పటి వరకూ సోఫాలను మాత్రమే అందిస్తోంది. తొందరలోనే టేబుల్స్, మంచాలను అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్ లో మొబైల్ యాప్ ని కూడా లాంచ్ చేయనున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags