సంకలనాలు
Telugu

కలిసి వెళ్తే కలదు లాభం అంటున్న లెట్స్ డ్రైవ్ ఎలాంగ్

పొల్యూషన్ కాదు సొల్యూషన్ అవసరంకార్ పూలింగ్ కాన్సెప్ట్‌పై రూపొందిన లెట్స్ డ్రైవ్ ఎలాంగ్అందరూ మాట్లాడేవారే, చేతల్లో కనిపించని కార్ షేరింగ్ఒక రోడ్డుపై ఎక్కువ కార్ల కంటే, ఒక కారులో ఎక్కువమంది ప్రయాణించొచ్చనే ఐడియాకార్ పూలింగ్‌తో సొంత లాభమే కాదు, పర్యావరణానికి మేలు చేసినట్లే

Poornavathi T
2nd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లెట్స్ డ్రైవ్ ఎలాంగ్.. ఈ యాప్‌ను స్పాంటద్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసింది. రోడ్లపై పరుగులు పెట్టే కార్ల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో... ఓ ఆలోచన వచ్చిందంటారు వ్యవస్థాపకులు. స్టార్టప్ స్థాయిలోనే ఉన్న ఈ సంస్థ... భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సమస్యలపైనా సమగ్రంగా దృష్టి పెట్టింది. అలాగే సమయానుకూలంగా మనం వెళ్లాల్సిన రూట్లో కార్ లభించేలా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం అభివృద్ధి చేసిన యాప్‌ను పరిశీలించి, సమగ్రంగా తెలుసుకుంటే... కార్ ఓనర్లెవరైనా... కార్-పూలింగ్‌కు అంగీకరిస్తారని నమ్మకంగా చెబ్తోంది లెట్స్ డ్రైవ్ ఎలాంగ్ సంస్థ. వ్యక్తులకే కాదు, కార్పొరేట్లు, ఏజన్సీలు, సొసైటీల్లోనూ ఈ కాన్సెప్ట్‌ను పరిచయం చేయాలనే ప్రయత్నాల్లో ఉంది.

image


అవస్థలూ జీవితంలో భాగమే !

నానా అవస్థలూ పడుతూ ఆఫీసుకెళ్లడం మన నిత్య జీవితంలో ఓ భాగం. కొన్నాళ్లపాటు తిప్పలు పడ్డాక ఎలాగోలా సొంతకారు ఏర్పాటు చేసుకుని, ఖర్చైక్కువైనా అలుపు లేకుండా ఇంటికి చేరాలనుకుంటాం. అయితే... ఒక వ్యక్తి కోసం కార్‌ని మెయిన్‌టెయిన్ చెయ్యడం చాలా కష్టమైన విషయం. ఆదాయం భారీగా ఉన్నవారికి తప్ప సాధ్యం కాని విషయం. అయినా సరే చాలా మంది రాజీ పడిపోతుంటారు. అలాగే కొంతమంది సమయానుకూలంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో లేకపోవడంతో... కారు కొనక తప్పని స్థితిలోకి జారిపోతుంటారు. దీనిమూలంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు... పర్యావరణానికి విపరీతమైన హాని చేస్తున్నాయి. ఒక్కో నగరంలో లక్షల కొద్దీ ప్రైవేటు వాహనాలు తిరుగుతుండడంతో... అవన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇంత శరవేగంగా పెరిగిపోతున్న కార్ల సంఖ్యతో... పార్కింగ్ సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

కార్ పూలింగ్ వచ్చే లాభాలను వివరిస్తూ పోస్టర్లు లాంచ్ చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, కర్నాటక కాలుష్య నియంత్రణా మండలి

కార్ పూలింగ్ వచ్చే లాభాలను వివరిస్తూ పోస్టర్లు లాంచ్ చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, కర్నాటక కాలుష్య నియంత్రణా మండలి


కార్ పూలింగ్‌కు ప్రజలు అలవాటు పడితే... లక్షల కొద్దీ వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. చివరకు ఈ విధానంతో కార్పొరేట్ కంపెనీలుకూడా భారీగా లబ్ధి పొందుతాయని అంచనా.

డిమాండ్‌కి సాంకేతికతో అనుసంధానం

పెరిగిపోతున్న వాహనాల డిమాండ్‌ను సాంకేతిక రంగ సహాయంతో అధిగమించొచ్చంటోంది స్పంటద్ సొల్యూషన్స్. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సమస్యలు అధిగమించి, జీవితాన్ని సులభంగా మార్చుకోవన్నది ఈ కంపెనీ చెప్పే మాట.


ఎందుకోసం ? ఎవరికి లాభం ?

"నగరాల్లో జీవించే ప్రజలే మా మొదటి లక్ష్యం. ట్రాఫిక్ సమస్యను అందరం ప్రతీ రోజూ ఎదుర్కుంటూనే ఉంటాం. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసులు, వాలంటీర్ల సహాయంతో ట్రాఫిక్ జంఝాటాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను మెరుగుపర్చడమే ఇందుకు తగిన పరిష్కారం. అయితే దీనికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇప్పుడున్న వసతులు ఇలాగే ఉంచి సమస్యను అధిగమించడమంటే అది సవాలే. దీనికి పరిష్కారంగానే కార్ పూలింగ్ అభివృద్ధి చేయాలని సంకల్పించాం. నిజానికి ఇది చాలా మంచి ఆలోచన. దీన్ని అందరూ ఒప్పుకుంటారు కూడా. అయితే మాట్లాడేవారే తప్ప... ఆచరణ విషయంలో దీన్ని అమల్లో పెట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. స్పంటద్ సొల్యూషన్స్ కార్ పూలింగ్‌నే మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. కార్ షేరింగ్ చేసుకునేందుకు టెక్నాలజీని జోడించి మరింత సౌకర్యంగా తీర్చిదిద్దుతున్నాం. కార్ ఓనర్లు, కార్పొరేట్లు, ఏజన్సీలు దీని ద్వారా చాలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతారు. ఒక అంచనా ప్రకారం... కార్ పూలింగ్‌తో ఖర్చులు 80శాతం తగ్గిపోతాయి. "అంటోంది లెట్స్ డ్రైవ్ ఎలాంగ్.


పొల్యూషన్ కాదు.. సొల్యూషన్ ముఖ్యం

"ఒక యాప్‌తో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని... లెట్స్ డ్రైవ్ ఎలాంగ్ ఇందులో భాగమని అంటున్నారు వ్యవస్థాపకులు శ్రీనాథ్ సుదర్శన్, ఘనశ్యామ. ఈ కాన్సెప్ట్‌కు పేటెంట్ హక్కులు కూడా అప్లై చేశారిప్పటికే. ఇది రాగానే తమ ఆలోచనను పూర్తి స్థాయిలో అమలు పెట్టనున్నారు.

ఐటీ రంగంలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది శ్రీనాథ్ సుదర్శన్‌కి. ఈయన మలంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. తర్వాత ఐఐఎం బెంగళూరు నుంచి ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు.

ఎల్‌డీఏ(లెట్స్ డ్రైవ్ ఎలాంగ్)ను ఉపయోగించడం ద్వారా డబ్బు ఆదా చేయచ్చు. సమాజం, పర్యావరణం ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సినది పొల్యూషన్ కాదు సొల్యూషన్ అంటున్నారు లెట్స్ డ్రైవ్ ఎలాంగ్ టీం.

శ్రీనాథ్ సుదర్శన్‌, లైట్స్ డ్రైవ్ ఎలాంగ్ కో ఫౌండర్

శ్రీనాథ్ సుదర్శన్‌, లైట్స్ డ్రైవ్ ఎలాంగ్ కో ఫౌండర్


గుర్తింపు పొందిన క్షణాలివే

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ యాప్‌ని ఆమోదించడమే కాకుండా... అధికారికంగా లాంఛ్ చేశారు. కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు కూడా లెట్స్ డ్రైవ్ ఎలాంగ్ యాప్‌కి ఆమోదం తెలిపారు. పర్యావరణ సహితం కోసం ఐటీ సంబంధిత పరిష్కారాలు చూపిన వారికి దక్కే రోటరీ బీఎస్ఈ ఎస్ఎంఈ జాతీయ అవార్డ్ కూడా దక్కడం విశేషం.

కార్ పూలింగ్ వల్ల వచ్చే లాభాన్ని వివరించే ప్రయత్నం

కార్ పూలింగ్ వల్ల వచ్చే లాభాన్ని వివరించే ప్రయత్నం


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags