సంకలనాలు
Telugu

మీరు జస్ట్ ఇల్లు కట్టుకోండి.. ఇంటీరియర్ సంగతి వీళ్లు చూసుకుంటారు..

Pavani Reddy
7th Mar 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share


ఇల్లుదేముంది.. డబ్బు పడేస్తే లంకంత కొంపను కూడా నెలరోజుల్లో కట్టేసి పోతారు. కానీ ఇంటీరియర్ మాత్రం అలా కాదు. దానికో టేస్ట్ కావాలి. ఈస్థటిక్ సెన్స్ ఉండాలి. కర్టెన్ చూస్తే చాలు కడుపు నిండి పోవాలి. వాడ్రోబ్ చూస్తే వారెవా అనుకోవాలి. కానీ, అదంత అర్రిబుర్రిగా తేలే యవ్వారం కాదు. నాలుగు గోడల మధ్య కలల ప్రపంచాన్ని ఆవిష్కరించాలి. నందనవనంలా తీర్చిదిద్దడం రావాలి. బీన్ బ్యాగ్ దగ్గర్నుంచి బీరువా వరకు.. డ్రస్సింగ్ టేబుల్ మొదలుకొని డైనింగ్ టేబుల్ దాకా.. ఇల్లంటే ఇదేరా అనేలా ఉండాలి. అలాంటి టేస్ట్ ఉన్నవారి కోసమే మై గుబ్బీ స్టార్టప్.

దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఏటా లక్షకు పైగా అపార్టుమెంట్లు అమ్ముడవుతున్నాయి. ఇటీవల రియల్ ఎస్టేట్ కాస్త మందగించినా మళ్లీ క్రమంగా పుంజుకుంది. ఇల్లు కొనుగోలుకే కాదు ఫర్నిచర్ కు కూడా జనం ప్రాధాన్యతనిస్తున్నారు. సగటున ఒక్కో ఇంటికీ ఫర్నిచర్ కోసం పది లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారని అంచనా. ఈ మార్కెట్ ను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో బెంగళూరు కుర్రాళ్లు.. ఉమేశ్ , రవి రావు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదులుకున్నారు. ఇద్దరూ కలిసి మై గుబ్బీ స్టార్టప్ ను 2015లో ప్రారంభించారు. ఇందులో బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ విపుల్ పరేఖ్ సహా చాలామంది 17 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టారు.

రవి రావు ఎజైల్ కంప్యూటింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. ఉమేశ్ ఒక మల్టీ నేషనల్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. ఉద్యోగాలు చేస్తూనే చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇళ్లు అమ్మే సమయంలో హోం అప్లయన్సెస్ కూడా సప్లై చేసే బాగుంటుందన్న ఆలోచన తట్టింది. 

undefined

undefined


మై గుబ్బీ పేరెలా వచ్చింది?

గుబ్బీ అంటే కన్నడంలో పిచ్చుక అని అర్థం. అది ఒక్కో గరికపోచతో తన గూడుని పొందికగా అల్లుకుంటుంది. జడివాన వచ్చినా పిట్టగూడు చెక్కుచెదరదు. ఈ ప్రపచంలోనే అదొక అంతుపట్టని అద్భుత నిర్మాణం. అలాంటి పిచ్చుకలు కాంక్రీట్ జంగిల్ పుణ్యమా అని బెంగళూరులో అంతరించి పోయాయి. వాటి ఉనికి ఎలాగూ పోతోంది. కనీసం తమ కంపెనీకి పిచ్చుక పేరైనా పెడదామని అనుకున్నారు. దానికే ఫిక్సయ్యారు. 

మై గుబ్బీ అంటే ఏదో మొక్కుబడిగా సేవలందించే సాదా సీదా ఫర్నిచర్ కంపెనీ కాదు. టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. హోం డెకార్ కు సంబంధించి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. కస్టమర్ టేస్టుకు తగ్గ డిజైన్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ఫర్నిచర్ మార్కెట్ లో అర్బన్ ల్యాడర్, పెప్పర్ ఫ్రై లాంటి దిగ్గజ కంపెనీలున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. డజన్ కు పైగా ఆన్ లైన్ మార్కెట్ కంపెనీలు… ఫర్నిచర్, డెకరేషన్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నాయి. అయితే హోమ్ లేన్, మై గుబ్బీ కంపెనీలే డిజైన్, వస్తువులు ఇంటికి చేర్చడం లాంటి పూర్తిస్థాయి సేవలందిస్తున్నాయి. ఫర్నిచర్ డెలివరీ చేసి చేతులు దులుపుకోవడం లేదు. డెకరేట్ చేసే బాధ్యతను కూడా తీసుకుంటోంది.

ఇన్ హౌస్ డిజైనర్లు బృందం మై గుబ్బీలో పనిచేస్తోంది. కస్టమర్ల అభిరుచి మేరకు ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. మాగ్జిమం 45 రోజుల్లో ఇంటి డెకరేషన్ మొత్తం చేసేస్తారు. ఫర్నిచర్ సప్లై కోసం పలు ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసుకుంది మై గుబ్బీ. ఐటమ్స్ అన్నింటినీ ఒకచోట కూర్చి అందంగా అలంకరించే బాధ్యత మై గుబ్బీదే. నెలన్నరలో పక్కా డిజైన్ తో ఇంటిని స్వర్గంలా మార్చేస్తారన్నమాట. మాడ్యులర్ డిజైన్ కు 5 లక్షలు, డెకరేషన్ కు 2 లక్షలు, సోఫాలు, మంచం, పరుపుకోసం మూడు లక్షలు ఖర్చవుతుంది. గృహోపకరణాలు అందించేందుకు చాలా ఫర్నిచర్ కంపెనీలున్నాయి. పోటీని తట్టుకునేందుకు మాడ్యులర్ పార్ట్ పై దృష్టిపెట్టామంటున్నారు ఉమేశ్. కస్టమర్లు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

undefined

undefined


ప్రస్తుతం బెంగళూరుకే పరిమితమైన మై గుబ్బీ వ్యాపారం త్వరలో హైదరాబాద్ సహా దేశంలోని ఐదు మహానగరాలకు విస్తరించనున్నారు. పాత ఇళ్లకు సైతం గృహోపకరణాలు అందించి… కొత్తగా మార్చేస్తారు. దేశంలో కొత్త ఇళ్ల కొనుగోళ్లలో మందగమనం ఉన్నా… పాత ఇళ్లను రీమోడలింగ్ చేసుకోవడం మాత్రం ఇటీవలికాలంలో పెరిగింది. దేశంలో 95శాతం గృహోపకరణాల మార్కెట్ ఒక పద్దతీ పాడూ లేకుండా ఉంది. ఈ రంగంలోని ధరల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత ఏడాది 54.2 మిలియన్ డాలర్లు సేకరించిన హోమ్ లేన్ కంపెనీలాగే మై గుబ్బీ సేవలందిస్తోంది. తొలిసారిగా మై గుబ్బీ సంస్థలో సిక్వియా క్యాపిటల్ సంస్థ 4.5 మిలియన్ల పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి ఫర్నిచింగ్ కంపెనీలకు పెట్టుబడులు వస్తాయా అని మొదట్లో అనుకున్నా.. తర్వాత పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. 

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags