క్యాన్సర్‌‌తో కుంగిపోలేదు.. పారిశ్రామికవేత్తగా మారి పది మందికీ ఆదర్శంగా నిలిచాడు

By CLN RAJU|30th Apr 2015
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Share on
close

ఏదైనా జబ్బు చేస్తే ఇక పనైపోయిందనుకుని నిరాశపడతాం. ఇక క్యాన్సర్ లాంటి మహమ్మారి సోకితే మరణశయ్య దగ్గరపడిందని అనుకుంటాం. కానీ రాహుల్ యాదవ్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. క్యాన్సర్‌ను జయించి యోధుడనిపించుకున్నారు. మరికొంతమందిని యోధులుగా మారుస్తున్నారు.

క్యాన్సర్‌ను జయించిన రాహుల్ యాదవ్

క్యాన్సర్‌ను జయించిన రాహుల్ యాదవ్


పది రోజుల్లో కూల్ డూడ్ నుంచి క్యాన్సర్ డూడ్ గా అవతారం

దేవుడు నవ్వుకునేలా చేయాలంటే.. అతడికి మీ ఆలోచనలన్నీ చెప్పండి అనేది తత్వవేత్త ఊడీ అలెన్ మాట. కానీ రాహుల్ యాదవ్ మాత్రం తను విషాదంలో చిక్కుకున్నప్పుడు కూడా చిరునవ్వు నవ్వాడు. 

“అది ఆగస్టు 2013. నాకు అప్పుడు 28 ఏళ్లు. నా పనేదో నేను చేసుకుపోతున్నా. HCL టెక్నాలజీస్ నుంచి వైదొలిగి బెంగళూరులోని ఫ్రెంచ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ – సొసైటీ జనరల్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. అప్పుడే నా చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నా.. కొత్త ఇంటికి మారి సర్దుకుంటున్న రోజులవి.

ఆఫీస్ కు సైకిల్ పై వెళ్లేవాడిని (భారత్ లో ఇలా వెళ్లదగ్గ నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి). బ్యాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టం. గంటలకొద్దీ ఆడేవాడిని. తొలిసారి కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్న రోజులవి. అంతేకాదు.. మా నాన్న ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యేలోపు ఫ్యామిలీతో కలసి అండమాన్ వెళ్లాలనుకున్నాను.

అదే సమయంలో ఒక రోజు అనారోగ్యానికి గురుయ్యాను. జలుబు, దగ్గు మొదలైంది. రోజురోజుకూ అది తీవ్రమవుతోంది. బహుశా డెంగ్యూ ఏమోనని భావించాను. అయితే.. క్యాన్సర్ అని నిర్ధారణ అయింది.

2013 ఆగస్టు 23న నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలింది. అందులో చాలా తక్కువ మందిలో కనిపించే మల్టిపుల్ మైలోమా ఉందని తేలింది. అంతే.. పదిరోజుల్లో నేను క్యాన్సర్ రోగిగా మారిపోయాను.

ఎక్కడవేసిన గొంగళి అక్కడే..!

ఇది అందరినీ నిర్ఘాంతపరిచింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారిపోయింది అనేది రాహుల్ మాట.

''అయితే కుటుంబం మొత్తం నాకు పూర్తి అండగా నిలిచింది. నా భార్య, తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు అందరూ చాలా అండగా నిలబడ్డారు. ఇలాంటి వ్యాధులు ఇటీవలి కాలంలో సహజమేనని, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదని నాకు ధైర్యం చెప్పి దాని నుంచి నేను తేరుకునేందుకు దోహదపడ్డారు. నా భార్య మోములో కనిపించే చిరునవ్వు నాకు చాలా స్ఫూర్తినిచ్చేంది. కష్టకాలంలో అండగా నిలిచే వాళ్లే నీకు నిజమైన సన్నిహితులు” అని వాళ్లే చెప్పేవాళ్లు. అది నిజం''. కానీ అతను జీవితాన్ని నిలబెట్టుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.

భార్యతో రాహుల్

భార్యతో రాహుల్


“ తోటివాళ్లంతా నాతో మెలుగుతున్న విధానం నన్ను చాలా అసహనానికి గురిచేసింది. సాధారణంగా ఏదో కర్మ చేసినవాళ్లకే క్యాన్సర్ వస్తుందని అందరూ భావిస్తుంటారు. (కొంతమంది అదే నిజమనుకుంటారు). క్యాన్సర్ రావడం పూర్తిగా దురదృష్టకరం అయితే మాపై జాలి చూపాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా ఈ రోగంపై యుద్ధం చేయడానికి కావల్సిన సపోర్ట్. ఆకస్మికంగా దాడి చేసే శతృవును తుదముట్టించడానికి కావల్సిన బలం.!

క్యాన్సర్ మా ఇంటికి వచ్చిన అనుకోని అతిథి. అతిథి మాత్రమే కాదు... నా చుట్టూ పరిస్థితులన్నింటినీ మార్చేశాడు. కొత్త ఉద్యోగంలో చేరలేకపోయాను. ఉన్న ఉద్యోగం పోయింది. ఇల్లు వదిలి ట్రీట్‌మెంట్ కోసం ఢిల్లీ బయలుదేరాను. నేను స్థిమితం కోల్పోయాను” అనేది అతడి ఆవేదన.

image


కొత్త చరిత్రకు నాంది

2014లో రాహుల్ యోధాస్ ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులకు అండగా, వారిలో మనోధైర్యం నింపేందుకు ఆలంబనగా దీన్ని మొదలుపెట్టారు. దీనికోసం తన శక్తినంతా ధారపోశారు. తన సంస్థకు యోధాస్ అని పేరు పెట్టారు. అంటే యుద్ధంలో పోరాడేవారని అర్థం. క్యాన్సర్‌పై పోరాడే యోధులనేది అతని ఉద్దేశం. ఈ హిందీ పదాన్ని ఎంచుకోవడానికి కారణం భారత్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారందరికీ అండగా నిలవాలనే..!


యోధాస్

“ ఇది పూర్తిగా రోగి మరొక రోగికి సహాయం చేసుకునే గ్రూప్. ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఫేస్‌బుక్, వాట్సాప్, వెబ్‌సైట్స్ లాంటి వాటి ద్వారా ఎంతోమందికి ఇది చేరుతోంది. ఇవన్నీ మేము కలుసుకోవడానికి దోహదపడే మార్గాలు. రోగం పట్ల వారికున్న భయాలు, ప్రశ్నలు, పురోగతి లాంటి ఎన్నింటినో ఇక్కడ చర్చించుకోవచ్చు. ఇలా మానసికంగా, వ్యక్తిగతంగా ఎన్నో అంశాలను ఇక్కడ మేము పంచుకుంటున్నాం..”

కేన్సర్‌పై పోరాడే యోధానుయోధుడు

కేన్సర్‌పై పోరాడే యోధానుయోధుడు


“కేవలం గ్రూప్ ద్వారానే కాదు ఫోన్ ద్వారా, మెసేజ్‌ల ద్వారా కూడా సభ్యులు అనుభవాలు పంచుకుంటున్నారు. బాధితులు పంపించిన సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు క్రోడీకరించి ఒక క్రమపద్ధతిలో అమర్చడంలో మేం సక్సెస్ అవుతున్నాం. ఉదాహరణకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసే మంచి ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి. కొత్త రోగులకు ఇది ఎలా సహకరిస్తుంది లాంటి సమాచారమంతా గ్రూప్‌లో లభిస్తుంది. అయితే మాకు ఏ ఆసుపత్రితో కానీ, మందుల కంపెనీతో కానీ ఒప్పందం లేదు. అంతేకాక రోగుల వ్యక్తిగత వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం”.

“ కాలేజీలలో, సోషల్ మీడియాల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి అనేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. క్యాన్సర్‌కు కారణాలు, దాని ప్రభావాలను వివరిస్తున్నాం. అంతేకాక ప్రత్యక్ష కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఉదాహరణకు మారథాన్ లాంటివి”.

మంచి కోసం పోరాటం

క్యాన్సర్‌పై పోరాటం చేయాలనే రాహుల్ సంకల్పం పిడుగుపాటు లాంటిది. “ వ్యాధి నిర్ధారణ అట్టహాసంగా ప్రారంభమైంది. గంటకు 3వందల కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టిన ట్రైన్ లాంటింది. ఆ తర్వాత పరిస్థితి అంతా మరింత క్షీణించింది. ఆసుపత్రుల్లో గంటలకొద్దీ ఎదురుచూశాను. మళ్లీ మా ఇంటికి చేరడానికి ఏడాది సమయం పట్టింది. నేను 15 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాను (1సారి = 1నెల సమయం). మూత్రాశయం, దంతాల తొలగింపు లాంటి ఎన్నో ఆపరేషన్లు. కీమోథెరపీని తట్టుకునేంత శక్తి శరీరానికి లేకపోవడం, సైడ్ ఎఫెక్టులు ఇందుకు కారణం. అర్ధరాత్రిళ్లు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ రూముకు పరుగెత్తిన సందర్భాలెన్నో ఉన్నాయి. వీటన్నిటి తర్వాత చివరకు ఎముక మజ్జను మార్చారు.

పరిస్థితి అంతా రోలర్ కోస్టర్‌లో రైడ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అయితే ఆ ప్రయాణం నన్ను మరింత నిజాయితీగా, మానవత్వం కలిగిన మనిషిగా మార్చింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉంది. 2015 ఫిబ్రవరి 14 నాటికి నాకు ట్రాన్స్ ప్లాంట్ జరిగి వందరోజులు పూర్తయింది. ఇదో మైలురాయి.

క్లిష్ట సమయంలో ఇలాంటి ఓ సంస్థను ప్రారంభిస్తున్నట్టు రాహుల్ చెప్పగానే చాలా మంది పిచ్చివాడిగా చూశారు. కానీ రాహుల్ జీవితాన్ని కాపాడింది అదే. “ క్యాన్సర్ పై యుద్ధంలో గెలవాలన్న తపనను, బలాన్ని, మద్దతును ఇచ్చారు చాలామంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న నాలాంటి వాళ్లను చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అలాంటి వాళ్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాను.. మద్దతు ఇస్తున్నాను.

ఎవరైనా ఇలాంటి ఓ ఐడియాను ఆచరణరూపంలో పెట్టొచ్చు. ఆ ఆనందం వెలకట్టలేనిది” అనేది రాహుల్ మాట.

ప్రశంసలు, ఇబ్బందులు..!

ప్రపంచం నలుమూలల నుంచి యోధాస్‌కు వచ్చిన రెస్పాన్స్ రాహుల్‌లో మరింత ఉత్తేజం నింపింది. “ అంతరాన్ని పూడ్చాననేది నా నమ్మకం. ప్రజలు మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా యునెస్కో నుంచి గుర్తింపు పొందడం మరో మైలురాయి. ఈరోజు యోధాస్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం యునెస్కో గుర్తింపే.! ప్రపంచవ్యాప్తంగా యెనెస్కో గుర్తించిన 8వందల సంస్థల్లో మా సంస్థకు సెకండ్ ప్రైజ్ లభించింది. అంతేకాక మోస్ట్ పాపులర్ ఛాయిస్ అవార్డ్ దక్కడం మా అదృష్టం. భారత్ తరపున ఈ అవార్డు అందుకోవడానికి నాకు, మా భార్యకు ఆహ్వానం అందింది. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ నుంచి నాకు లభించిన మద్దతు అనూహ్యం. ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది దోహదపడింది.”

యోధాస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. “ భారత్‌లో ఎముక మజ్జ మార్పిడిపై అవగాహన కల్పించడం మా ముందున్న కర్తవ్యం. భారత్‌లో ఇప్పటివరకూ లక్షకు లోపే దాతలున్నారు. ఈ సంఖ్యను పెంచాల్సి ఉంది. సరైన దాత దొరక్కపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి చాలా విధాలుగా ఆలోచిస్తున్నాం. రోగులకు సులువుగా పునరావాసం కల్పించాలని యోచిస్తున్నాం. ఉద్యోగం నుంచి జీవిత భాగస్వామిని వెతకడం కూడా మా ఆలోచనల్లో భాగం.

యోధాస్ కు అంతర్జాతీయ మయోలోమా ఫౌండేషన్(IMF) తో భాగస్వామ్యం ఉంది.

యోధాస్ కోసం ప్రస్తుతం రాహుల్ తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారు. అంతేకాక క్యాంపెయిన్స్ ద్వారా వచ్చిన కొంత సొమ్మును కూడా ఇందుకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఫండింగ్ చేసేవారికోసం సంస్థ ఎదురుచూస్తోంది.

సైన్యంలో సైనికుడిలాగా యోధ పనిచేస్తోంది. “ ఉత్సాహవంతులైన యువతీయవుకులు వివిధ స్థాయిల్లో సంస్థకోసం పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 మందికిపైగా మద్దతుదారులు పనిచేస్తున్నారు. జాతీయ కార్యదర్శి శివాని నాయక్, ఢిల్లీ కోఆర్డినేటర్ హితేశ్ మాండ్లా.. సంస్థను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రణయ్, పాలక్, ఆదితి కూడా సంస్థలో ముఖ్యమైన భాగస్వాములు. ఇక స్వచ్చంధంగా సేవలందిస్తున్న ఎంతోమంది సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉత్సాహవంతులైన స్వచ్చంధ సేవకులు సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో సహకరిస్తున్నారు” అనేది రాహుల్ మాట.

యోధుడిగా మారిన తీరు..!

అందరు క్యాన్సర్ రోగుల్లాగే రాహుల్ కూడా దాన్ని అనుభవించినవారే..! “ కష్టాలు మనిషిని ప్రపంచం గురించి, ప్రజల గురించి ఆలోచింపజేస్తాయి. మనలో నిగూఢమైన శక్తిని బహిరంగ పరుచుకునేందుకు ఇదొక సదవకాశం. జీవితం అనూహ్యం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ప్రతీ మలుపు నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వాటిని చూసి మనమే కుంగిపోతే లాభం లేదు. నాకు ఈ సామెత చాలా ఇష్టం. నా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఇదెంతో దోహదం చేసింది.


జీవితం నీకు నిమ్మకాయలాంటిదైతే.. నిమ్మరసం చేయడం గురించి మరిచిపో..
కానీ నిమ్మకాయలు పండించడం నేర్చుకో..

ఎదురైన సవాళ్లను గురించి చెప్తూ.. “ సంస్థ అంకురార్పణే నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. విత్తనం నాటి నీరుపోసి ఫలాలకోసం ఎదురుచూశా. అయితే చాలా రోజులపాటు ఎలాంటి ఫలాలు దక్కలేదు. ఎంతో కష్టపడి స్థాపించిన సంస్థ ఎలాంటి ఫలతాన్ని ఇవ్వకపోతే ఎవరికైనా నిరాశ, నిస్పృహ కలుగుతాయి. అయితే ఎవరైనా ఫలితం ఆశించకుండా లక్ష్యంకోసం పనిచేస్తూ పోవాలి.. తొందర్లోనే ఫలితం తప్పకుండా దక్కుతుంది. అంగవైకల్యం (క్యాన్సర్ ) తో బాధపడుతున్న నేనే ఇక్కడ సక్సెస్ అయినప్పుడు ఎవరైనా సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్త కాగలరు.”

image


మరింత ముందుకు..!

“ ఎన్జీవో ట్రస్ట్ కింద మా సంస్థను రిజిస్టర్ చేశాం. న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు చిన్న నగరాలలకు కూడా విస్తరించేందుకు సిద్ధమవుతున్నాం.” అన్నారు రాహుల్. కిందిస్థాయి నుంచి రాహుల్ ఎదిగిన క్రమాన్ని చూస్తే భవిష్యత్తులో ఏదైనా సాధ్యమేననిపిస్తోంది. “ భవిష్యత్తు చాలా ఆశావహంగా కనిపిస్తంది. ఎంతోమందికి మేం చేరువవుతున్నాం. ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నాం.. ఐఐటీలు, ఐఐఎంలు, సింబయాసిస్ తో పాటు పలు యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం..”

ఓ సలహా..

ఓ వ్యక్తి రెండేళ్లలో ఎంత గొప్పగా ఎదగొచ్చు..? క్యాన్సర్ బారిన పడడం నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన రాహుల్ ను చూస్తే అర్థమవుతుంది.. కాదంటారా..? ఈ సందర్భంగా రాహుల్ చెప్తున్న మాట ఇదే.. “ పయనించడం మొదలు పెట్టండి. మంచి సమయం మించిన దొరకదు. దానిలో పూర్తిగా మునిగిపోండి.”


Website: Yoddhas

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding Course, where you also get a chance to pitch your business plan to top investors. Click here to know more.