సంకలనాలు
Telugu

ఆకలిగా ఉన్నపుడే డెలివరీ ఇస్తే వ్యాపారం సూపర్ హిట్ అంటున్న 'స్విగ్గీ'

మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్న ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న కంపెనీలుకేవలం ఎనిమిది మాసాల్లో ₹12 కోట్ల టర్నోవర్ స్విగ్గీ స్టార్టప్ విజయ పరంపర

25th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆగస్టు 2014లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైంది ఫుడ్ స్టార్టప్ 'స్విగ్గి'. అందరిలా కాకుండా ఫుడ్ ఆర్డరింగ్ ఫ్లాట్‌ఫాంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డెలివరి చేసే వ్యక్తుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. యాప్ ద్వారా రూటింగ్ వాళ్లకు తెలుస్తుంది. ఆర్డర్ ఎక్కడ ఇచ్చారనేది ఖచ్చితంగా గుర్తించవచ్చు. దీంతో స్విగ్గీ నిరాటంకంగా.. ఆర్డర్ ఇచ్చిన క్షణాల్లోనే డెలివరీ ఇవ్వగలుగుతోంది. మినిమమ్ ఆర్డర్‌ని లెక్కలోకి తీసుకోకుండా.. కస్టమర్లు కోరిన వాటిని.. వారి డోర్‌స్టెప్‌కి చేర్చడంతో స్విగ్గీకి... మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ వచ్చింది. అందుకే ప్రారంభమైన 8 నెలల్లోనే రెండు మిలియన్ డాలర్ల ఫండింగ్‌ను యాక్కెల్ పాట్నర్స్, సైఫ్ పాట్నర్స్ నుంచి పొందగలిగింది.

image


ఆరంభం వెనుక అసలు కథ

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నస్విగ్గీ స్టార్టప్ వెనుక పెద్ద కథే ఉంది. బిట్స్ పిలానీ, ఐఐఎం విద్యార్థి అయిన శ్రీహర్ష మాజెటి... నిత్యం విదేశీ పర్యటనలు చేస్తూండేవారు. వ్యాపార నిమిత్తం సౌత్ ఈస్ట్ ఏషియాల్లో ఈయనకు బలమైన నెట్‌వర్క్ ఉంది. ఆయనతోపాటు బిట్స్ పిలానీ విద్యార్ధి నందన్‌రెడ్డితో కలిపి స్టార్టప్ టేబుల్ బేస్ట్ పీవోఎస్‌కి రూపకల్పన చేశారు. భారతదేశంలో తొలి రూరల్ బీపీఓ ఇదే కావడం గమనార్హం.

గత ఏడాది వీరంతా కలిసి బండ్ల పేరుతో లాజిస్టిక్ వ్యాపారం మొదలెట్టారు. అయితే జూన్ 2014 నాటికి అది మూతపడింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో లాజిస్టిక్ డెలివరీ వ్యాపారం నిర్వహించినా.. ఇది వారికి సంతృప్తిని ఇవ్వలేదు. అనంతరం స్విగ్గీని ప్రారంభించారు. వారికి ఖరగ్‌పూర్ ఐఐటికి చెందిన రాహుల్ జైమనీ జతకలిశారు. రాహుల్ అప్పటికి మింత్రాలో పనిచేయడం ప్లస్ పాయింట్ అయింది. స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం, డెలివరీ చేయడం ప్రారంభించారు.

ఆగస్టు 2014 లో బెంగళూరుకు బయట ఉన్న కోరమంగళలో ఈ స్టార్టర్ హబ్‌ని ప్రారంభించారు. ప్రారంభించిన 8 నెలల్లో 2 మిలియన్ డాలర్లకు చేరుకుంది టర్నోవర్. వినియోగదారులకు కావలసిన వివిధ ఆహారపదార్ధాలను సమీపంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి సేకరించి సాధ్యమైనంత త్వరగా వినియోగదారులకు అందిస్తోంది. 

‘‘డెలివరీ బాయ్స్‌కి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంచడంతో... వారెక్కడున్నారో తెలుసుకోవడం సులభమవుతోంది. వినియోగదారుడికి ఇచ్చిన టైంకంటే ముందే డెలివరీ చేస్తున్నారు. కస్టమర్లు కూడా తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆర్డర్ స్టేటస్‌ని ట్రాక్ చేసేందుకు వీలవుతుంది. ఎందుకంటే ఆకలి వేసినప్పుడు తమకిష్టమయినవి తినాలనుకుంటారు. ఆకలి చల్లారకుండా వాటిని డెలివరీ ఇవ్వగలగాలి. వినియోగదారుల మెప్పు పొందితే అదే మంచి పబ్లిసిటీ అవుతోంది ’అంటారు శ్రీహర్ష.

వివిధ రెస్టారెంట్ల నుంచి సేకరించిన ఫుడ్ మీద కొంచెం కమిషన్ అందుతోంది స్విగ్గీకి. రూ.200 లోపు ఆర్డర్లు వర్కవుట్ కావడంలేదని.. వీటి విషయంలో ఆలోచించాల్సి వస్తోందంటున్నారు నిర్వాహకులు శ్రీహర్ష మాజెటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమనీ. అయితే హైదరాబాద్‌లో మాత్రం రూ.150 కంటే తక్కువగా ఉన్న ఆర్డర్లపై డెలివరీ కోసం అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారు.

స్విగ్గీ వ్యవస్థాపకులు - నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజేటి, రాహుల్ జమానీ

స్విగ్గీ వ్యవస్థాపకులు - నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజేటి, రాహుల్ జమానీ


‘‘స్విగ్గీ ప్రారంభించినప్పటినుంచీ మా బిజినెస్ ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతోంది. మా పరిధిని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం. అలాగే కొత్త భాగస్వాముల గురించిన అన్వేషణ సాగుతోంది. గత నెలతో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య మూడింతలు అయింది’’ అంటున్నారు శ్రీహర్ష.

మౌత్ పబ్లిసిటీ బెస్ట్

‘‘మౌత్ పబ్లిసిటీకి మించిన శక్తిమంతమయిన మార్కెటింగ్ ఛానెల్ లేదని శ్రీహర్ష బలంగా నమ్ముతున్నారు. 11 బ్రాంచీలతో బెంగళూరు అంతటా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే 300 రెస్టారెంట్లనుంచి 1000 పైగా ఆర్డర్లను తీసుకుని డెలివరీ చేస్తున్నాం. కొన్నికొన్నిసార్లు కమిషన్ లేకుండా రెస్టారెంట్లకు అదనపు సేవలు అందిస్తున్నాం. ఇలాంటి వాటివల్ల స్విగ్లీ విశ్వసనీయత పెరుగుతుంది. ప్రస్తుతం బెంగళరుతో పాటు హైదరాబాద్, గుర్గావ్, పూణె, ఢిల్లీ, ముంబైలో స్విగ్గీ సేవలను అందిస్తోంది. త్వరలో కోల్‌కతా సహా మిగిలిన నగరాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పెట్టుబడితో పాటు స్థానికంగా టీంని నడిపించేవారి కోసం అన్వేషిస్తున్నట్టు శ్రీహర్ష అండ్ టీం చెబ్తోంది.

మార్కెట్ సామర్ధ్యం, పోటీ

దేశంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ బాగా విస్తరించింది. ఓ సంస్థ సర్వే ప్రకారం ప్రతినెలా ఈ బిజినెస్ విలువ 20-30 శాతానికి పెరుగుతోంది. 2014 లో ఆన్ లైన్ ద్వారా జరిగిన ఫుడ్ బిజినెస్ విలువ 5 నుంచి 6 వేల కోట్లు. భారతీయ మార్కెట్ విలువ 2020 నాటికి లక్ష కోట్లు దాటిపోతుందని అంచనా.

దేశంలో ఇప్పుడు Zomato, FoodPanda కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫుడ్ బేవరేజెస్ లో Tinyowl కూడా విప్లవాత్మకమయిన మార్పులను చూపిస్తోంది.

‘‘ఫుడ్ బిజినెస్ కు ఆకాశమే హద్దు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నదే మా తాపత్రయం. కష్టపడుతూ.. సకాలంలో వినియోగదారుల చెంతకు చేరుకోవడం, వారిని సంతృప్తి పరచడమే లక్ష్యం’’ అంటారు స్విగ్గీ శ్రీహర్ష.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags