సంకలనాలు
Telugu

రూ.30 వేల కోట్ల కిడ్స్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టూన్జ్ రిటైల్

₹30వేల కోట్ల సామర్ధ్యం గల చిల్డ్రన్ ఐటెమ్స్ మార్కెట్ఇంతటి అవకాశాలున్నా కనిపించని చెప్పుకోదగ్గ బ్రాండ్స్బేబీకేర్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న టూన్జ్చిన్నారుల అన్ని అవసరాలకు తగిన ఉత్పత్తులుఆఫ్‌లైన్ అమ్మకాలే ప్రధానంగా వ్యాపార నిర్వహణ

ABDUL SAMAD
2nd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పిల్లల వస్తువుల మార్కెట్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ప్రి-కేర్డ్‍, బేబీఓయే, లిటిల్1 వంటి స్టార్టప్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఈజాబితాలో ఉంటాయి. ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌లో పోటీపడుతున్నాయి. ఇప్పుటు టూన్జ్ రిటైల్ కూడా చిన్నారుల ఉత్పత్తుల మార్కెట్లో అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే.. ఆఫ్‌లైన్ సేల్స్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుండడం ఈ స్టార్టప్ స్పెషాలిటీ.

క్లోత్స్ నుంచి క్రేయాన్స్ వరకూ, ప్రామ్స్ నుంచి పజిల్స్ వరకూ, వాకర్స్ నుంచి రాకర్స్ వరకు, బ్లాక్స్ నుంచి బోర్డ్ గేమ్స్ వరకూ. రాటిల్స్ నుంచి రిమోట్ కార్స్ వరకూ, డయాపర్స్ నుంచి డాల్స్ వరకూ... పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులను విక్రయిస్తుంది టూన్జ్ రిటైల్. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా విస్తరించిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 50కిపైగా రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఒక్కో స్టోర్ విస్తీర్ణం 1200-2000 చదరపు అడుగులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

image


టూన్జ్ సంస్థను క్రిస్టల్ గ్రూప్‌నకు చెందిన అంకుర్ అగర్వాల్ ప్రమోట్ చేస్తున్నారు. ఎండీగా శరద్ వెంకట బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు ఈయన. దీనికి ముందు పాంటలూన్, ఫ్యూచర్ రిటైల్‌లో కీలక విధులు నిర్వహించారు శరద్. అక్కడ సక్సెస్ అయిన అనేక విధానాలను, ప్రణాళికలను టూన్జ్‌లోనూ ఉపయోగిస్తున్నారు శరద్.

2010లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభంలో ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం మర్కండైజ్ విక్రయాలే. కార్టూన్ కేరక్టర్లకు సంబంధించిన మర్కండైజ్‌ను అమ్మాలని భావించారు. అయితే, ఇలా చేయడంతో మార్కెట్ పరిధి తగ్గిపోతోందనే విషయం అర్ధమైంది. “నిజానికి కార్టూన్ మర్కండైజ్ విక్రయించాలనే ఆలోచన సరైనదే. కానీ అన్ని కార్టూన్ కేరక్టర్ల లైసెన్స్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా ఉండవు. దీనితో రెండు సమస్యలు వస్తాయి. ఒకవేళ కార్టూన్ కేరక్టర్ విజయవంతమయితే... అనేక మంది దీన్ని కాపీ చేసేందుకు, డూప్లికేట్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేల సక్సెస్ కాకపోతే... పట్టించుకునే వారు ఉండరు. మరోవైపు కొత్తవాటిని కనిపెట్టేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది”అంటూ కార్టూన్ మర్కండైజ్ వ్యాపారంలో ఇబ్బందులను శరద్ వివరించారు.

ముందుగా నిర్ణయించుకున్న బిజినెస్ మోడల్‌లో ఇబ్బందులు ఎప్పుడైతో గుర్తించారో... తమ సొంత బ్రాండ్లను విడుదల చేయడం ప్రారంభించారు. 2012లో శరద్ కంపెనీలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ విధానం మొదలైంది. ప్రధానంగా రెండు బ్రాండ్లతో రెండు ఏజ్ గ్రూపులను టార్గెట్ చేసింది టూన్జ్. మూడేళ్ల వయసు వరకూ క్లోతింగ్, యాక్సెసరీస్, నర్సరీ ఉత్పత్తులను విక్రయించేలా 'వావ్‌మామ్'అనీ.... 4-12 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లోని చిన్నారుల కోసం.. అన్ని వస్తువులను 'సూపర్ యంగ్ ' అనే బ్రాండ్ పైనా సేల్స్ నిర్వహిస్తోంది టూన్జ్.

వెంకట శరద్, ఎండి టూన్జ్ రిటైల్

వెంకట శరద్, ఎండి టూన్జ్ రిటైల్


సాధారణంగా కంపెనీలన్నీ మెట్రో నగరాలపైనే దృష్టిపెడతాయి. అయితే టూన్జ్ మాత్రం కొంచె డిఫరెంట్‌గా ఆలోచించి, విస్తరణ కోసం ద్వితీయ-తృతీయ శ్రేణి పట్టణాలను టార్గెట్ చేసింది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనూ, ఉత్తరాదిలో హర్యానాలోనూ విస్తరించింది. ఈ మార్కెట్లలో ఫ్రాంచైజీ విధానంలో వ్యాపారం నిర్వహిస్తోంది కంపెనీ. ఈ విధానంలో కంపెనీ బ్రేక్ఈవెన్ సాధించడం, అలాగే ఫ్రాంచైజీలు బ్రేక్ఈవెన్ సాధించడం ఒకేసారి జరుగుతుందంటారు శరద్.

“చిన్నారుల ఉత్పత్తుల మార్కెట్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో ఈ మార్కెట్ విలువ ₹30వేల నుంచి ₹80వేల కోట్లు ఉంటుంది. ఇంత విస్తారమైన మార్కెట్ ఉన్న ఈ రంగంలో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ బ్రాండ్లు పెద్దగా లేవు”అంటూ.. అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు శరద్.

ఆఫ్‌లైన్ విక్రయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినా.. ఫ్లిప్‌కార్ట్, జబాంగ్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి బడా ఆన్‌లైన్ రిటైలర్లతోనూ 'వావ్‌మామ్', 'సూపర్‌యంగ్' బ్రాండ్లను విక్రయించేందుకు టాన్జ్ ఒప్పందాలు చేసుకుంది. ఆన్‌లైన్ ద్వారా నెలకు వెయ్యి లావాదేవీలు నిర్వహిస్తున్నామని, ఆఫ్‌లైన్ విక్రయాలతో పోల్చితే... ఇది నామమాత్రమే అంటారు శరద్. అయితే.. భవిష్యత్తులో ఆన్‌లైన్ సేల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో... ఈ భాగస్వామ్యాలను కొనసాగిస్తున్నామని చెప్పారాయన.

“ప్రస్తుతం ఆన్‌లైన్ బిజినెస్ చాలా తక్కువ. మా బ్రాండ్‌ని ఇంకా ప్రమోట్ చేయాల్సి ఉంది. మా ప్రోడక్టులే మా గురించి ప్రచారం చేస్తాయనే నమ్మకం ఉంది. అయితే ఈ స్థాయిని అందుకునేందుకు, జనాల బ్రౌజర్లలో మా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసే రేంజ్‌ను చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. రాబోయే కాలంలో ఆన్‌లైన్ విక్రయాలపై మరింతగా దృష్టి పెడతాం. ఆఫ్‌లైన్ రంగాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్నాం. ఆన్‌లైన్ సేల్స్ పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామ”ని చెప్పారు శరద్. సొంత ఈకామర్స్ సైట్ ప్రారంభించే యోచన లేదని, ఆఫ్‌లైన్ విక్రయాలే తమ వ్యాపారానికి కీలకమంటోంది టూన్జ్. ఈ వ్యవస్థను మరింతగా అర్ధం చేసుకుని, సమర్ధవంతంగా నిర్వహించబోతున్నామని శరద్ చెబ్తున్నారు.

పెద్ద మార్కెట్లలోకి ప్రవేశించేందుకు వ్యతిరేకం కాకపోయినా... ఇక్కడ బిజినెస్ నిర్వహించడం కొంత ఇబ్బందులతో కూడిన వ్యవహారమంటోంది టూన్జ్. “పెద్ద నగరాల్లో స్టోర్స్ ప్రారంభించడంలో రెండు సమస్యలున్నాయి. వీటికి సొంత సంస్కృతి ఉంటుంది. అలాగే ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో సాధారణ రిటైల్ రంగం కుదురుకోవడం కష్టం. లాభదాయకత కూడా తక్కువ కావడంతో... బ్రేక్ఈవెన్ సాధించేందుకు ఎక్కువ సమయం పడుతుందం”టున్నారు శరద్.

2014 ఆర్ధిక సంవత్సరంలో టూన్జ్ ₹30కోట్ల టర్నోవర్ సాధించింది. 2016-17నాటికి ₹100 కోట్ల స్థాయికి ఎదగాలన్నది ఈ కంపెనీ లక్ష్యం. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరకే పేరెంట్స్‌కు అందించే లక్ష్యంతో వ్యాపారం నిర్వహిస్తున్నామని చెబ్తున్నారు. కిడ్స్ మార్కెట్‌లో తాము సక్సెస్ కావడానికి ఇదే కారణమవుతోందని నమ్మకంగా చెబ్తున్నారు శరద్. బేబీకేర్ రంగానికి ఉన్న విస్తృతమైన అవకాశాలుండడంతోపాటు.. వీటి అవసరాన్ని ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన పని లేకపోవడమే.. ఈమార్కెట్ ప్రత్యేకత అంటున్నారు శరద్.

సాఫీగా సాగని టూన్జ్ ప్రయాణం

ఎన్నో అడ్డంకులు, మరెన్నో సవాళ్లు ఎదుర్కుని ఈ స్థాయికి చేరింది టూన్జ్‌ రిటైల్‌. ఒకే తరహా ఆలోచనకు కలవాళ్లను ఒకచోటకు తేవడమే అతిపెద్ద సమస్య అంటారు శరద్. ఉద్యోగులు, భాగస్వాములు, బోర్డ్ మెంబర్లు... ఇలా అందరూ ఒకే రకంగా ఆలోచించాల్సిన అవసరంతోపాటు... దూరదృష్టి ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం చాలా క్లిష్టమైన విషయంగా శరద్ చెబ్తున్నారు.

టూన్జ్ అవసరాలకు తగినంతగా నిలకడగా సప్లై చేయగల సయర్లను పెద్ద సంఖ్యలో గుర్తించడం కూడా సవాల్ అంటున్నారాయన. గతంలో కార్పొరేట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించడంతో... ఈ సమస్యలను ఎదుర్కోగలిగానని అంటారు శరద్.

“నా సామర్ధ్యాన్ని, పనితీరును నేనే అకౌంటింగ్ చేసుకుంటాను. నేనిక్కడ ఫైనాన్స్ విభాగాన్ని నిర్వహించడం, చెక్స్ సైన్ చేయడం, రిటర్న్‌డ్ ప్రోడక్టులను తిరిగి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టే విధులు నిర్వహిస్తున్నాను. నాకు ఇక్కడ పూర్తి స్థాయి యాజమాన్య బాధ్యతలున్నాయి. ఓ బిడ్డ స్థాయిలో ఉన్న ఈ వ్యాపారాన్ని సరిగా పెంచి, సరైన రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నా”నంటున్నారు శరద్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags