సంకలనాలు
Telugu

సర్వేల ప్రపంచంలో 29 ఏళ్ల ప్రేరణది ఓ ప్రత్యేక స్థానం

bharathi paluri
12th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

భారతీయ సంప్రదయాల్లో మహిళలకు కొన్ని పనులు చేయడంలో ఇబ్బందులుండొచ్చు. అడ్డంకులుండొచ్చు.. అయినంత మాత్రాన వాళ్లకు ఏమీ చేతకాదని అనుకోకూడదు. అవసరం, అవకాశం రావాలే కానీ, మహిళలు ఏ విషయంలోనూ మగాళ్లకు తీసి పోరు. ఈ నమ్మకంతోనే అవుట్ లైన్ ఇండియాకు శ్రీకారం చుట్టారు ప్రేరణ ముఖర్యా.

image


విశ్వసనీయమైన, నాణ్యమైన ఫీల్డ్ సర్వేలకు మారుపేరుగా మారిన అవుట్ లైన్ ఇండియా వ్యవస్థాపకురాలు ప్రేరణ. ఫీల్డ్ డాటా కలెక్షన్, రీసెర్చ్‌లతో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు డోనార్ సంస్థలకు విధానపరమైన సలహాలు అందించడం ప్రేరణ టీమ్ పని.

ప్రేరణ నమ్మకానికి తగ్గట్టే ఇప్పుడు ఆమె టీంలో ఎక్కువ మంది మహిళలే పని చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్ దగ్గర నుంచి నెట్వర్కింగ్, ప్రాజెక్టులకు బిడ్డింగ్ చేయడం, సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ఇవన్నీ ఇక్కడ మహిళలే చేస్తున్నారు.

చెప్పడం కాదు.. చేయాలి

ఔట్ లైన్ ఇండియా ప్రారంభించక ముందు ప్రేరణ శిక్షణా రంగంలో వున్నారు. ‘‘ మాన్యువల్స్ రూపొందించడం, సర్వేయర్లకు శిక్షణ అందించడం, సర్వే టూల్స్ తయారు చేయడం, ఎప్పటికప్పుడు మార్పులు చేయడం, ఇలా ఎన్నో సాయంత్రాలు గడిచిపోయాయి. ఇంత చేసినా ప్రాజెక్టు చివరికొచ్చేసరికి డేటా చాలా నిరుత్సాహకరంగా వుండేది. దాంతో విసుగొచ్చేది. మొత్తం మీద అభివృద్ధి రంగంలో చాలా బిజినెస్ అవకాశాలున్నా.. అందిపుచ్చుకునే వాళ్ళు లేరని అర్థమయింది.’’ అని తాను ఈ రంగం లోకి రావడానికి కారణాలు చెప్పారు ప్రేరణ.

image


అందుకే ఇండియాలో డాటా సేకరణ లో సమూల మార్పులు తేవలానుకున్నారు ప్రేరణ. ఆ దిశగానే ఔట్ లైన్ ఇండియా మొదలైంది. ఈ సంస్థను ప్రారంభించే ముందు చాలామందితో చర్చించారు. చివరికి ప్రపంచబ్యాంక్‌లో తనన సీనియర్ ఒకరు.. ఒక సలహా ఇచ్చారు. ‘‘ ప్రేరణా.. నీకు నచ్చని దానిని సరిచేసే బాధ్యత నువ్వే తీసుకో.. అంతే కానీ.. బాగోలేదని బాధ పడుతూ కూర్చోకు..’’ అని చెప్పారు.

నమ్మకమే బలం

' బిజినెస్ మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. చేతిలో ఓ ల్యాప్ టాప్.. బ్యాంక్ లో 2 లక్షల బ్యాలెన్స్. ఇవే నా పెట్టుబడులు. బిజినెస్ మొదలుపెట్టిన మూడునెలలకే వున్న ల్యాప్ టాప్ కూడా పాడయిపోయింది. దీంతో సర్వంకోల్పోయినట్టయింది. అయితే, ఈ ప్రయాణంలో ఇవన్నీ చాలా చిన్న విషయాలని అర్థమయింది. కోరిన లక్ష్యం సాధించినప్పుడు కలిగే తృప్తి ముందు ఇలాంటి ఇబ్బందులన్నీ పెద్ద లెక్కలోకి రావని ప్రేరణ అర్ధం చేసుకున్నారు.

ఔట్ లైన్ ఇండియా విషయంలో ప్రేరణ చాలా త్యాగాలే చేయాల్సి వచ్చింది. చాలా అవకాశాలే వదులుకోవలసి వచ్చింది. అయినా నచ్చిన పని చేయడంలోనే ఆమె ఆనందాన్ని వెదుక్కున్నారు. ఔట్ లైన్ మొదలైన ఆరు నెలలకు ఓ డెవలప్‌మెంట్ సంస్థ దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఔట్ లైన్‌ను కొనుక్కోవడమే కాక.. ఆ సంస్థలో రీసెర్చ్ హెడ్‌గా కూడా నియమిస్తామని ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్ ప్రేరణకు నచ్చలేదు.

ఇక సొంత బిజినెస్ అంటేనే పని ఒత్తిడి. ఉంటే ఒకే సారి విపరీతమైన పని వుండడం, లేకపోతే, వారమంతా పని కోసం ఎదురుచూడడం, అర్థరాత్రి ఫోన్ కాల్స్, ఫీల్డ్ వర్కర్లకు జ్వరాలొచ్చి పని ఆగిపోవడం, చెప్పిన టైం కంటే ముందే పని అయిపోవాలని క్లయింట్లు ఒత్తిడి చేయడం.. ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. అయితే, పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చిన గుర్తింపు, బాగా ప్రయాణాలు చేసే అవకాశం వుండడం, మంచి గార్డెన్‌తో కూడిన ఆఫీసు.. ఇవన్నీ ప్రేరణ టీమ్ ను ఉత్సాహపరుస్తూ వచ్చాయి.

‘‘ అంతే కాదు.. ఈ పని లో నాకు సంవత్సరానికి మూడు వెకేషన్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు కూడా నేను బెల్జియంలో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్తున్నాను’’ అని హుషారుగా చెప్తారు ప్రేరణ.

‘‘ ఎక్కువ శక్తి వున్న వాళ్ళకు ఎక్కువ బాధ్యతలు వుండాలంటాడు స్పైడర్ మాన్.. అలాగే మంచి డాటాతో సామాజిక మార్పొస్తుందని నమ్ముతాను నేను’’ అంటారు ప్రేరణ.

image


ఇండియాలో సమగ్ర అభివృద్ధి చూడాలంటే, ముందు సరైన డాటా వుండాలంటారు ప్రేరణ. అందుకే ఔట్ లైన్ సంస్థలో ఫీల్డ్ వర్కర్లుగా స్థానికులనే నియమిస్తారు. తాను సర్వే చేసే ప్రజల, ప్రాంతాల గురించి పూర్తి అవగాహన వున్నప్పుడే సరయిన డాటా వస్తుందని ఔట్ లైన్ విశ్వాసం.

‘‘మేం చేసే స్టడీ స్థానిక ప్రజల జీవితాల్లో, వారి గ్రామాల్లో, సమాజంలో ఎలా మార్పు తీసుకువస్తుందో వారికి వివరిస్తాం.’’ అని వివరించారు ప్రేరణ..

సర్వేటూల్స్ రూపొందించడం, సేవల పర్యవేక్షణ, ఇంటర్వెన్షన్స్‌‌ను ప్రతిపాదించడం, శిక్షణా తరగతులు, వర్క్ షాపులు, ఫోకస్ గ్రూప్ డిస్కషన్లు నిర్వహించడం, రిపోర్ట్స్ తయారు చేయడం.. ఇలా రకరకాల సేవలు అందిస్తుంది ఔట్ లైన్.

‘‘ కొత్త సామాజిక పథకాల రూపకల్పన, ఇప్పటికే ఉన్న పథకాల సమీక్షల వల్ల విధాన నిర్ణయాల పునరాలోచనలో మా సర్వే ప్రభావం చాలా వుంటుందని మా నమ్మకం’’ అంటారు 29 ఏళ్ళ ప్రేరణ.

బ్రహ్మాండమైన ప్రాజెక్టులు

ప్రస్తుతం ఔట్ లైన్ ఇండియా చేస్తున్న ప్రాజెక్టులు ఇవీ..

కేరళలో మతం...విద్యపై బ్రాండీస్ యూనివర్శిటీ చేస్తున్న అధ్యయనం, బ్రిక్స్(BRICS) దేశాల్లో యువత డిజిటల్ డివైసస్ అలవాట్లపై సిసేమ్ స్ట్రీట్ నిర్వహిస్తున్న అధ్యయనం, ఆంట్రప్రెన్యూర్స్‌లో రిస్క్ తీసుకునే స్వభావంపై యూనివర్శిటీ ఆఫ్ టోక్యో చేస్తున్న సర్వే, ఎన్నికలకు ముందు బ్రిటన్ యువతలో రాజకీయ అభిప్రాయలపై బ్రిటీష్ కౌన్సిల్ చేస్తున్న అధ్యయనంతో పాటు, బంగాళదుంపలు, పాల వ్యాపారులపై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్‌టిట్యూట్ చేస్తున్న సర్వేకి కూడా ఔట్ లైన్ ఇండియా తన సేవలు అందిస్తోంది.

‘‘ప్రస్తుతం మరింత భారీ ప్రాజెక్టులపై దృష్టిపెట్టాం. ప్రపంచ బ్యాంక్ స్టడీ తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం చేస్తున్న స్టడీకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయ’’ని ఉత్సాహంగా చెప్పారు ప్రేరణ.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags