సంకలనాలు
Telugu

"ఈ-చదువుల" రేసులో ఎలక్ట్రికల్ ఇంజినీర్ల దూకుడు

SOWJANYA RAJ
16th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

           

పిల్లల చదువులపై తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. వారు బాగా చదువుతారా లేదా అన్నది వారిష్టం..! కానీ వారికి చదువుల పరంగా ఏ లోటూ రాకుండా చూసే విషయంలో తల్లిదండ్రులు ఏ మాత్రం రాజీపడటం లేదు. నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలు రేసులో ఉండాలంటే అప్ టు డేట్ గా ఉండాలని తల్లిదండ్రులు కూడా ఆశిస్తున్నారు. అందుకోసం ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఇలాంటి ఆధునిక తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్న స్టార్టప్ "ఎడ్యు అవేక్"

పిల్లల చదువులు నేర్పిన వ్యాపారం

మార్టిన్ పాల్, శరవణన్ లక్ష్మణన్ ఇద్దరూ ఎలక్ట్రికల్ ఇంజినీర్లు. పద్నాలుగేళ్లుగా కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఓ సందర్భంలో వీరికి అనుకోని కష్టం ఎదురయింది. తమ పిల్లల్ని స్కూళ్లలో జాయిన్ చేసే సమయంలో వారికి కావాల్సిన పుస్తకాలు, వస్తువుల కోసం కారులో పెట్రోల్ అయిపోయే వరకూ తిరిగారు. అయినా లాభం లేదు. ఆన్ లైన్లో ట్రై చేసినా ప్రయోజనం పెద్దగా కనిపించలేదు. ఎంతగా వెదికినా పెద్ద పెద్ద ఈ-కామర్స్ సైట్లలో కొద్దో గొప్పో కనిపించే ఎడ్యూకేషన్ రిలేటెడ్ ఐటమ్స్ తప్ప... వారికేం దొరకలేదు. ఉన్నవాటితో పిల్లల్ని ఎలాగోలా సంతృప్తి పరిచినా వారికి మాత్రం అదే ఆలోచనలతో నిద్రలేకుండా పోయింది.

అయితే ఈ వీరి ఆలోచనలు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, వస్తువుల దగ్గరే ఆగిపోతే "ఎడ్యూ అవేక్" పుట్టి ఉండేదే కాదు. తాము ఇంత సమయం వెచ్చించి ఇంత తిరిగినా కావాల్సినవీ పూర్తి స్థాయిలో దొరకలేదు. మరి దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ అదే పరిస్థితి కదా..? అన్నదే వీరి ఆలోచన. మరి వీరి కష్టాలు తీర్చే స్టార్టప్ తో తమ కెరీర్ కి కొత్త టచ్ ఇస్తే ఎలా ఉంటుందన్నదే వీరికి నిద్రలేకుండా చేసిన ఆలోచన.

ఆలోచనతోనే ఆచరణ

వీరి ఆలోచన... పరిశోధన.. కార్యాచరణ అన్నీ రోజుల్లోనే పూర్తయిపోయాయి. తాము పడ్డ బాధలు దాదాపు ప్రతి తల్లిదండ్రి పడుతున్నాడని గ్రహించారు. వెంటనే అందరికీ ఆన్ లైన్ లో చదువులకు సంబంధించిన సమగ్ర వస్తువులు దొరికేలా ఎడ్యుఅవేక్.కామ్ కు రూపకల్పన చేశారు. టెక్ట్స్, రిఫరెన్స్ బుక్స్, ఎడ్యుకేషనల్ డీవీడీలు, జనరల్ నాలెడ్జ్ కిట్స్.. ఇలా విద్యార్థికి సంబంధించి.. స్కేల్ నుంచి జామెట్రీ బాక్స్ వరకు, పలకల నుంచి టెన్త్ నాన్ డీటేల్డ్ బుక్స్ వరకు.. బ్యాగ్ నుంచి సాక్సుల వరకు ఏదైనా సరే దొరికేలా తమ స్టార్టప్ ను డిజైన్ చేశారు.

తల్లిదండ్రులు, స్కూళ్లు, సబ్జెక్ట్స్ ఎక్స్ పర్ట్స్, రీటైల్ వినియోగదారులందర్నీ సమన్వయపరుస్తూ ఒకే గూటికి చేర్చారు. స్కూళ్లు, తల్లిదండ్రులు ఎవరైనా ఎలాంటి విద్యాసంబంధిత వస్తువునైనా బల్క్ గా సైతం ఎడ్యుఎవేక్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రచయితలు, ట్యూటర్స్, ఇతర ఫ్లాట్ ఫాముల్లో సేవలు అందించే ఎడ్యుకేషనల్ స్టార్టప్స్, పుస్తక విక్రేతలు ఇలా అందరికీ ఎడ్యుఅవేక్ ఓ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.

కేవలం స్కూళ్ల ప్రారంభ సమయంలోనే తల్లిదండ్రులు ఈ టెన్షన్ ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు వీరు. విద్యాసంవత్సరం మధ్యలో సైన్స్ ఒలింపియాడ్, NTSE ఎగ్జామ్ వంటి వాటి కోసం బుక్ షాపుల వైపు పరుగులు పెట్టక తప్పదు. 2014లో ప్రారంభమైన ఈ స్టార్టప్ జోరందకుంది.

ఎడ్యుఎవేక్ బృందం<br>

ఎడ్యుఎవేక్ బృందం


ఆదాయానికి మార్గాలెన్నో..!

ఎడ్యూఎవేక్ ను పూర్తిగా ఈ-కామర్స్ తరహాలోనే తీర్చిదిద్దారు ఈ ఇద్దరు మిత్రులు. ప్రైవేటు విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. B2C మోడల్ అంటే డైరక్ట్ గా తయారీ దారుల నుంచే వినియోగదారులకు అమ్మకాలు జరిపే విధానాన్ని కూడా ఇటీవలే లాంఛ్ చేశారు. దాదాపుగా 1200 ఉత్పత్తుల్ని ఈ పద్దతిలో అమ్మేందుకు తయారీదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. DIY యాక్టివిటీ కిట్లు, బొమ్మలు, స్కూల్ స్టేషనరీస్, పుస్తకాలు, పజిల్ బుక్స్, గేమ్స్, కాపింటీటీవ్ ఎగ్జామ్ గైడ్లు ఇలా సమస్తం అందుబాటులోకి తెచ్చారు.

B2C వెబ్ సైట్ ను కొద్ది నెలల్లోనే 12వేల మంది చూశారు. 200 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇదంతా ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ లేకుండానే జరిగింది. మేము ప్రధానంగా జనవరి నుంచి మే వరకు మార్కెట్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. బల్క్ ఆర్డర్స్ ను స్కూళ్ల నుంచి భారీగా ఈ సమయంలోనే పొందగలం- శరవణన్ 

అమ్మకం దారులు,తయారీదారులు, స్కూళ్లతో ఒప్పందాలు, అడ్వర్ టైజ్ మెంట్లు ద్వారా ఇప్పటికీ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఎడ్యూఅవేక్ పొందుతోంది. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 190 స్టార్టప్ లు ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తున్నాయి. 2017 కల్లా ఇండియా ఆన్ లైన్ మార్కెట్ 40 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. చాలా స్టార్టప్ లో ఏవో కొన్ని విభాగాల్లో మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఎడ్యుఅవేక్ మాత్రం ఆ పరిమితులను అధిగమించిందని వీరు చెబుతున్నారు.

మేజర్ ఈ-కామర్స్ కంపెనీల్లో విద్యాసంబంధిత వస్తువులు దొరుకుతాయి. కానీ వాటినే స్పెషలైజ్ చేసిన బీటూసీ మోడల్ ఈ-కామర్స్ కంపెనీలు దాదాపుగా లేవు. ఇక బీటూబీ మార్కెట్ లో మాకు పోటీ లేదు- మార్టిన్, ఎడ్యూఅవేక్ కో ఫౌండర్

ఆశావాహ ప్రణాళికలు

ఈ-చదువుల రేసులో పరుగందుకుంటున్న ఎడ్యూఅవేక్ కొద్ది రోజుల్లో మొబైల్ అప్లికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏడాది చివరి కల్లా 500 మంది అమ్మకం దారులతో, 4000 ఉత్పత్తుల్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన సర్వీసులును ఎడ్యుటెక్ రంగంలో అందించాలన్నదే తమ లక్ష్యమని మార్టిన్, శరవణన్ పట్టుదలగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎడ్యుఎవేక్... దేశంలో ఉన్న స్కూళ్లు ఎదుర్కొంటున్న టీచర్ల సమస్యపై దృష్టి కేంద్రీకరించింది. దీన్ని పరిష్కరించేందుకు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. తమదైన ఆలోచనలతో ఎడ్యూటెక్ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.

వెబ్ సైట్ 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags