సంకలనాలు
Telugu

నెంబర్లు లేకపోయినా ఫోన్ చేసుకునే అవకాశం కల్పించే హోలర్

యూజర్ నేమ్ ఉంటే చాలు, ఎవరికైనా ఫ్రీ కాలింగ్సెర్చ్ ఆప్షన్‌తో అవసరమైన వ్యాపారులను వెతుక్కునే ఛాన్స్వాణిజ్య రంగం టార్గెట్‌గా ఫ్రీ కాలింగ్, మెసేజింగ్ యాప్

ABDUL SAMAD
19th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వ్యాపారాలు నడవాలన్నా, వ్యక్తిగత సంబంధాలు నిలబెట్టుకోవాలన్నా వారి మధ్య తగినంత సమాచార పంపిణీ ఉండాలి. అందుకు తగినట్లుగా వ్యవస్థ ఉండాలి. వాణిజ్య వ్యవహారాల్లో అయితే ఇది మరింత కీలకం.

మనకు తెలిసిన వ్యక్తిని చేరుకోవడం, అతనితో సంభాషించడం, కాంటాక్ట్ మెయింటెయిన్ చేయడం తేలికే. మరి తెలీని వారి విషయంలో ఏంటి ? కొత్త వ్యాపారాలకు ఇది ఎలా సాధ్యమవుతుంది ? వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలందించడం సాధ్యమేనా ? వీటన్నిటికీ సమాధానం హోలర్. వ్యక్తులు, వ్యాపారుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను సమగ్రంగా నిర్వహించగలిగే ఏర్పాటే హోలర్.

image


అసలేంటీ హోలర్ ?

వ్యాపారులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరికైనా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం కల్పించే యాప్ హోలర్. వైఫై, మొబైల్ డేటా ఇలా ఏదైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు... ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. వారి నెంబర్స్ మీ దగ్గర లేకపోయినా సరే. ఇప్పటికీ ఆలోచన కొత్తగానే అనిపిస్తున్నా... దీన్ని డిజైన్ చేసిన విధానం తెలుసుకుంటే... ఇది పక్కాగా సక్సెస్ అయ్యే సూపర్ ఐడియా అనిపించక మానదు.

యూజర్లు వారి మొబైల్ నెంబర్ల ద్వారా సైనప్ అయ్యి... వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వారికిష్టమైన యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి సమాచారమంతా ఆ యూజర్ నేమ్ ఆధారంగానే ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్, పేరు, స్టేటస్ కూడా ఇన్‌పుట్ ఇవ్వచ్చు. అయితే ఇవి కంపల్సరీ కాదు. తమ నెంబర్లను పర్సనల్ అనో, బిజినెస్ అనో రిజిస్టర్ చేసుకునే సదుపాయం యూజర్లకు ఉంటుంది.

హోలర్ ఇలా ఉంటుంది..

- అవతలి వ్యక్తులకు కాల్ చేసేందుకు యూజర్ల దగ్గర వారి ఫోన్ నెంబర్లు ఉండక్కర్లేదు. అలాగే ఎలాంటి రిక్వెస్టులు పంపాల్సిన పని లేదు. అవతలి వ్యక్తి మనకు ఖచ్చితంగా పరిచయం ఉండాలనే నిబంధన ఈ యాప్‌లో లేదు. యూజర్ నేమ్ అందరికీ కనిపించాలో, కూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రారంభ స్థాయిలో ఉన్న కంపెనీలకు ఇది చాలా అవసరం కూడా. ఎక్కువమంది వ్యక్తులకు దగ్గరయ్యేందుకు పబ్లిక్‌గా యూజర్‌నేమ్ ఉండేలా చూసుకోవచ్చు.

ఒక మాటలో చెప్పాలంటే స్కైప్, వైబర్ వంటి యాప్‌లలో ఉండే బెస్ట్ ఫీచర్స్ అన్నీ తీసుకుని రూపొందించిందే హోలర్. ఈ యాప్ ఓపెన్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై తయారైంది కావడం విశేషం. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితమే. అనేక మంది వ్యాపారులను ఈ హోలర్ పరిధిలోకి తేవాలన్నది హోలర్ వ్యవస్థాపకుల అలోచన. అయితే... ప్రస్తుతం హోలర్ వారికి కూడా ఉచితంగానే అందుబాటులో ఉంది.

image


బ్యాక్ బోన్ లాంటి టీం ఇదే

జాన్ జకారియా, బిందేష్ విజయన్‌లు హోలర్ వ్యవస్థాపకులు. వీరిద్దరూ చాలాకాలంగా కొలీగ్స్ కూడా. ప్రతీ ఒక్కరు ప్రతీ ఒక్కరితో ఉచితంగా కాంటాక్ట్ అయ్యే రోజులు రావాలన్నదే హోలర్ ప్రధాన లక్ష్యమని చెబ్తారు వీళ్లు. ఫోన్ నెంబర్ మిస్ అయితేనో, కాంటాక్ట్ లేకపోతేనో... ఇతరులతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా మారిపోయిందని గుర్తించామంటారు వీళ్లు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో మొదలైందే హోలర్.

image


హోలర్ సంస్థకు సీఈఓ, క్రియేటివ్ డైరెక్టర్ బాధ్యతలను జాన్ నిర్వహిస్తున్నారు. సీటీఓగా విధులు నిర్వహిస్తూ సాఫ్ట్‌వేర్ ఆధారిత సమస్యలను డీల్ చేస్తున్ననారు బిందేష్. క్రైస్ట్ యూనివర్సిటీలో చదివిన ఆకాష్ జైన్... సీఓఓ విధులు నిర్వహిస్తున్నారు. ఈయన జాన్ క్లాస్‌మేట్ కూవడం విశేషం. ఎంతో నిలకడైన వైఫై కనెక్షన్లు కూడా కొన్నిసార్లు ఆడియా క్వాలిటీ యావరేజ్‌గానే ఉంటోంది. అంటే ఒకటి రెండు సెకన్లు ఆలస్యంగా ఆడియా ట్రాన్స్‌మిట్ అవుతుంది. ఈ సమస్యను టెక్నాలజీ ఆధారంగా అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామంటారు జాన్. కొన్నిసార్లు మినహా... సాధారణ ఫోన్ కాల్స్ మాదిరిగానే ఆడియో క్వాలిటీ ఉండడం హోలర్ స్పెషాలిటీ.

image


హెల్ప్ లైన్ చాలా సులభం

ఆడియో క్వాలిటీ సరిగా లేకపోవడమో, మరేదైనా సమస్యో ఎదురైతే చాలు... వెంటనే హోలర్ పేరుతో సెర్చ్ చేస్తే హోలర్ హెల్ప్ లైన్ వచ్చేస్తుంది. వారి నెంబర్లేవీ మన దగ్గర లేకపోయినా కాల్ చేసేయచ్చు. కస్టమర్ ఫీడ్ బ్యాక్ కోసం ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. కేవలం కాలింగ్ వరకే కాదు... మెసేజింగ్‌కూ ఇందులో అవకాశం ఉండడం విశేషం.

ప్రస్తుతం హోలర్ చాలా వేగంగా యూజర్ బేస్ పెంచుకుంటోంది. రిజిస్టర్ అవుతున్న వ్యాపారవర్గాల సంఖ్య కూడా స్పీడ్‌గానే ఉంది. వాణిజ్యం, వర్తకుల సంఖ్య బాగా పెరిగాక మరిన్ని ప్రణాళికలు అమలు చేస్తామని చెబ్తున్నారు వీళ్లు. అప్పటివరకూ యూజర్లు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు ఉచితంగా.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags