సంకలనాలు
Telugu

విదేశీ భాషలు నేర్చుకోవడం ఇక యమా ఈజీ !!

-ఆన్‌లైన్‌లో పలు భాషలను నేర్పుతున్న లింగోస్‌మియో-భాషతోపాటు యాక్సెంట్‌ను కూడా నేర్పుతున్న సంస్థ-లింగోస్‌మియోకు 70 వేలకు పైగా యూజర్లు

GOPAL
21st Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం విదేశాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దీంతో విదేశీ భాషలపై చాలామందికి మక్కువ పెరిగిపోయింది. ఇలాంటి విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో వివిధ భాషలను అందిస్తున్నది లింగోస్‌మియో..

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక రంగంలో విజయవంతంగా కొనసాగాలంటే ఎన్నో భాషలను నేర్చుకోగలగాలి. అర్థం చేసుకోగలగాలి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే లింగోస్ మియో ఆవిర్భవించింది. వివిధ రకాల భాషలను సులభంగా, వినోదాత్మకంగా, ప్రభావవంతమైన పద్ధతిలో నేర్చుకునేందుకు ఈ యాప్ సాయం చేస్తుంది. దక్షిణ అమెరికా వెళ్లిన సమయంలో అలోక్ అరోరా మదిలో ఈ ఆలోచన మెదిలింది.

లండన్‌లోని బార్‌క్లేస్‌లో బ్యాంకర్‌గా పనిచేసేవారు అలోక్‌. స్పానిష్ తెలిసుంటే దక్షిణ అమెరికా భాషలు మాట్లాడటం చాలా సులభమని ఆయన గ్రహించారు. అయితే పోర్చుగీస్ తెలియకపోవడ వల్ల బ్రెజిల్‌లో ఎంతో మిస్సయ్యానని అలోక్ బాధపడుతుంటారు.

‘‘నేను తిరిగి వచ్చిన తర్వాత పోర్చుగీస్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే మంచి ట్యూటర్‌ను వెతకడం చాలా కష్టమైంది. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడే లింగోస్ మియో ఐడియా వచ్చింది’’ అని అలోచ్ వివరించారు. వ్యక్తిగతంగా కూడా వివిధ రకాల భాషలను నేర్చుకోవడం అలోక్‌కు ఇష్టం. తన ఇష్టాలను పూర్తిచేసుందుకే లింగోస్ మియోను ఏర్పాటు చేశారు.

లింగోస్‌మియో ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అన్న అంశంపై అలోక్‌కు చాలా స్పష్టత ఉంది. కేవలం భాషలను నేర్చేందుకు మాత్రమే ప్రజలకు సహకరించడం కాదు.. వినోదాత్మకంగా నేర్పించాలన్నదే ఆయన ఉద్దేశం.

లింగోస్‌మియో వ్యవస్థాపకుడు, సీఈఓ అలోక్ అరోరా

లింగోస్‌మియో వ్యవస్థాపకుడు, సీఈఓ అలోక్ అరోరా


బాలారిష్టాలు

ఆరంభంలో కొన్నాళ్లపాటు ఎలాంటి ఆఫీసు ఉండేది కాదు. దీంతో టీమ్ సమావేశాలను కేఫ్, కాఫీ డే లాంటి వాటిలో నిర్వహించేవారు. తొమ్మది భాషలను తెలిసిన ఓ భాష పండితుడితోపాటు మరి కొందరు డెవలపర్స్‌తో కలిసి ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు అలోక్. ‘‘ఫ్రీలాన్సర్లను, మరికొంతమంది భాషా పండితులను, స్థానిక భాషలు మాట్లాడేవారిని, వివిధ భాషలను నేర్చుకునే విద్యార్థులను ఒక్క చోటకు తీసుకురావాల్సి వచ్చేది’’ అని అలోక్ వివరించారు. ఎంతో విలువైన కోర్సులను క్రియేట్ చేసేందుకు లింగోస్‌మియో టీమ్ ఖచ్చితమైన సరదాగా, ఇంటరాక్టివ్, ప్రభావవంతంగా ఉండేలా కోర్సులు సృష్టించగలిగింది.

మంచి ఫారిన్ లాంగ్వేజ్ టీచర్ కాకపోవడం, యాప్ డెవలపర్ కాకపోవడంతో ఆరంభంలో మంచి టీమ్‌ను ఏర్పాటు చేయడం చాలా కష్టమైందని అలోక్ చెప్తుంటారు. ఆ తర్వాత పేపర్‌పైనా, ఆన్‌లైన్‌లో ప్రభావవంతమైన, ఇంటరాక్టివ్‌ మ్యానర్‌లో కోర్సు మెటిరియల్‌ను రూపొందించడం మరో పెద్ద సవాలు.

‘‘ఆరంభంలో యూజర్లు దొరకడం కూడా చాలా కష్టమైంది. ఐతే ప్రభావవంతమైన పద్ధతిలో భాషలను నేర్పుతుండటంతో లింగోస్‌మియో వేగంగా స్ప్రెడ్ అయింది’’ అని అలోక్ వివరించారు.

జనవరిలో లింగోస్‌మియో ప్రారంభమైనప్పటికీ, ఆండ్రాయిడ్ యాప్ మాత్రం మార్చిలో విడుదలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 70 వేల మంది యూజర్లను ఆకర్షించగలిగింది. 60 వేలకు పైగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

‘‘తొమ్మిది దేశాల్లో టాప్‌టెన్ ఎడ్యుకేషనల్ యాప్‌లలో ఒకటిగా లింగోస్‌మియో ఇప్పటికే గుర్తింపు పొందింది. ఒకటి రెండు దేశాల్లో మాది నంబర్‌వన్ ఎడ్యుకేషనల్ యాప్’’ అని అలోక్ చెప్పారు.

ప్రస్తుతం ఎన్నో రకాల యాప్స్, వెబ్‌సైట్‌లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. అయితే అన్నింటిలో కంటే అదనపు టూల్స్ లింగోస్‌మియోలోనే ఉన్నాయంటారు అలోక్. వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆరంభం నుంచి భాషను నేర్చుకోవచ్చని ఆయన అంటుంటారు. చాలామందికి భాషలను నేర్చుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ, సరైన సమయం, వనరులు లేకపోవడం కారణంగా నేర్చుకోలేకపోతున్నారని అలోక్ చెప్తారు.

లింగోస్‌మియో వ్యవస్థాపకులు అలోక్ అరోరా

లింగోస్‌మియో వ్యవస్థాపకులు అలోక్ అరోరా


లింగోస్‌మియో ద్వారా భాషను నేర్చుకోవడమే కాదు, పదాల పరిణామాలను, వాటిని సాధారణ జీవితంలో ఎలా వాడాలో కూడా సులభంగా నేర్చుకోవచ్చు.

‘‘ఆలోచనా ప్రక్రియే భాష అన్నది మా నమ్మకం. నేర్చుకునే భాషను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే ఈ ఆలోచనా ప్రక్రియను అర్థం చేసుకోవడం ముఖ్యం. చాలామంది ప్రజలు గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం వల్ల త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది’’ అని అలోక్ చెప్పారు.

భాషను ఎలా ఉపయోగించాలో చెప్పడంతోపాటు యాక్సెంట్‌ను కూడా నేర్చుకునేందుకు లింగోస్‌మియో సాయం చేస్తుంది. కన్వర్షనల్ స్కిల్స్‌ను నేర్పుతుంది. స్థానిక ప్రజలు మాట్లాడే సంభాషణతో ప్రతి చాప్టర్ ముగుస్తుంది. ఈ విధానం ద్వారా విద్యార్థులు వాటిని అనుకరిస్తూ నేర్చుకోవచ్చు.

ఉచితం..

ప్రస్తుతానికైతే వెబ్‌సైట్‌, యాప్ ద్వారా కోర్సులు నేర్చుకోవడం ఉచితం. అలాగే కోర్సు కంటెంట్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. అయితే మరింత మంచి కంటెంట్‌ను కొద్దిపాటి ఫీజుతో విద్యార్థులకు అందిస్తున్నది లింగోస్‌మియో.

మార్కెట్.. గ్రోథ్‌...

స్మార్ట్‌ఫోన్లు పెరిగిపోవడంతో పలురకాల భాషలను నేర్పించే బాబెల్, డ్యూలింగో, బుస్‌ వంటి యాప్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. అమెరికా, యూరప్‌లతో పోలిస్తే ఇతర భాషలను యాప్‌ల ద్వారా నేర్చుకోవడం భారత్‌లో పెద్ద కష్టమేమీ కాదు.

‘‘భారత్‌లో చాలామంది హిందీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. వారి కారణంగానే మా యూజర్ల సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఇది మేం అసలు ఊహించలేదు. ఇండియాలోలాగే చాలామంది ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే భారత్‌తో పోలిస్తే ఇతర భాషలను నేర్చుకోవాలన్న ఆసక్తి ఇతర దేశ ప్రజలకే ఎక్కువగా ఉంది’’ అని అలోక్ అంటున్నారు.

స్పానిష్, పోర్చుగీస్, హిందీ, ఉర్దూ మాట్లాడేవారి కోసం ఇంగ్లీష్‌ను, ఇంగ్లీష్ మాట్లాడేవారి కోసం స్పానిష్, హిందీ, మాండ్రియన్ చైనీస్‌ను నేర్పిస్తున్నది లింగోస్‌మియో.

మరిన్ని భాషల్లో కూడా ఇలాంటి కోర్సులను ప్రవేశపెట్టాలని అలోక్ భావిస్తున్నారు. అలాగే ఇంకొన్ని దేశాల్లో కూడా సంస్థను విస్తరించే ప్రయత్నంలో ఉన్నారాయన. కొత్త కోర్సులను కూడా త్వరలోనే పరిచయం చేయనున్నారు. త్వరలోనే పోర్చుగీస్ భాషను కూడా తమ వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా నేర్పిస్తామని అలోక్ వివరించారు.

వెబ్‌సైట్: www.lingosmio.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags