సంకలనాలు
Telugu

దేశీయ దుస్తులకు పూర్వ‌వైభ‌వం తెస్తున్న స్ట్రీట్‌బాజార్‌

రోడ్‌సైట్ దుస్తులు కావాలా? అయితే.. స్ట్రీట్‌బాజార్‌లో వెతకండి-

Karthik Pavan
25th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మాల్స్‌లో బ్రాండెడ్ బ‌ట్ట‌ల‌కంటే.. కొన్నిసార్లు రోడ్‌సైడ్ దుకాణాల్లో దుస్తులు ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. రోడ్డుమీద అలా న‌డిచి వెళుతుంటే ఏ కోటి మార్కెట్‌లోనో రాజ‌స్ధాన్ వీధుల్లోనో.. మ‌న‌కు ఇష్ట‌మైన డ్ర‌స్ క‌న‌బ‌డుతుంది. చూడగానే కొనేయాలనిపిస్తుంది.కానీ.. అక్క‌డ దిగి షాపింగ్ చేయాలంటేనే చిరాకు వ‌స్తుంది. ఆ హ‌డావుడి.. ఆ జ‌నాల‌ను చూసి మ‌ళ్లీ వ‌ద్దాంలే అనుకుంటారు చాలామంది.కానీ.. అవే వ‌స్తువులు చ‌క్క‌గా ఆన్‌లైన్‌లో దొర‌కితే ఎంత ఈజీగా ఉంటుంది? ఆ ఆలోచ‌న నుంచి పుట్టిందే స్ట్రీట్ బాజార్ డాట్ ఇన్‌. ఇదో ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్‌. అలా అని క‌న‌బ‌డిన‌వ‌న్నీ అమ్మేయ‌రు. కేవ‌లం ఎధినిక్ స్ట్రీట్ ఫ్యాష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

స్ధానిక వ్యాపారుల‌కు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ క‌ల్పించాల‌నే ఉద్దేశంతో మొద‌లైందే Streetbazar.in వెబ్‌సైట్‌. అల‌నాటి బాలీవుడ్ తార‌లు ధ‌రించిన దుస్తుల్లాంటివి ద‌గ్గ‌ర్నుంచి స్ధానికంగా ఆద‌ర‌ణ పొందిన ప్ర‌తీ ఫ్యాష‌న్ వ‌స్తువూ ఇందులో దొరుకుతుంది. 2014లో ఇండోర్‌లో బ్యాగుల అమ్మ‌కంతో మొద‌ల‌యిన ఈ వెబ్‌సైట్‌.. 2015 ఫిబ్ర‌వ‌రి నాటికి దుస్తుల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు ప‌దివేల‌మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించ‌గ‌లిగింది.

image


వంద‌ల సైట్లు ఉండ‌గా.. స్టీట్‌ఫ్యాష‌న్ ఎందుకు?

ఈ కంపెనీ ఫౌండ‌ర్స్ 26 ఏళ్ల నీర‌జ్ వాణి, 24 ఏళ్ల సుర‌భి వాణి ఇద్ద‌రూ ఒక‌రోజు పుణెలో స్ట్రీట్‌షాపింగ్ చేయాల‌నుకున్నారు. కానీ.. మంచి వ‌స్తువులు దొరికే మార్కెట్ ఎక్క‌డుందో తెలియ‌దు. క‌ళ్ల‌ముందు అన్నీ షాపింగ్ మాల్సే క‌న‌బ‌డ్డాయి. ఆ స‌మ‌యంలో స్ట్రీట్‌మార్కెట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకువ‌స్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చింది.

క్వాలిటీ ప‌రంగా ఢోకాలేదు

"దాదాపు అన్ని ఈకామ‌ర్స్ సైట్ల‌లో ఎథ్నిక్ వేర్‌ను అమ్ముతున్నారు. అయితే, అందులో 90శాతం సైట్ల‌లో దొరికే దుస్తులు క్వాలిటీ ఉండ‌టంలేదు. అందుకే.. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు క‌స్ట‌మ‌ర్ల‌కు క్వాలిటీ బ‌ట్ట‌లు అందించాల‌ని అనుకున్నాం"...అంటారు సుర‌భి. 

"ఉదాహ‌ర‌ణ‌కు త‌మ సైట్‌లో క్వాలిటీ కుర్తీ.. రూ.300కి దొరుకుతుంది. బ్రైడ‌ల్ వేర్‌లో లెహెంగా డ్రెస్సెస్ రూ.7000 ద‌గ్గ‌ర్నుంచి అందుబాటులో ఉన్నాయి.ఎవ‌రికి ఎంత‌లో కావాలో.. అంత‌లో దొరుకుతాయి" అంటారామె. దేశ‌వ్యాప్తంగా వీలైనంత‌మంది స్ట్రీట్‌వెండ‌ర్స్‌ని త‌మ‌తో క‌లుపుకుంటామ‌ని అంటున్నారు.


image


"దేశీయ దస్తుల‌కు ఎన్నేళ్ల‌యిన ఆద‌ర‌ణ త‌ర‌గ‌దు. అందుకే.. అత్యుత్త‌మ క్వాలిటీ దుస్తుల‌ను అందించాల‌న్నదే మా సంక‌ల్పం"అంటారు నీర‌జ్‌.

ఉత్స‌వ్ ఫ్యాష‌న్‌, సీ బాజార్‌, క్రాఫ్ట్స్ విల్లా లాంటి సంస్ధ‌ల పోటీతో.. ఎథ్నిక్ వేర్ మార్కెట్ రూ.700 కోట్లు చేరుకుంది. కానీ.. ఆన్‌లైన్ వ్యాపారాన్ని అటు క‌స్ట‌మ‌ర్ల‌కు, ఇటు వ్యాపారుల‌కు సుల‌భంగా అందించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని సుర‌భి అంటున్నారు.

ఇండోర్‌లోని ఐపీఎస్ కాలేజ్ నుంచి బీఈతో పాటు.. ఐఐటీ ఢిల్లీలో ఎంట్ర‌ప్యూన్య‌ర్‌షిప్‌పై డిప్లొమా చేశారు నీర‌జ్‌. స్ట్రీట్‌బాజార్ మొద‌లుపెడ‌దామ‌న్న త‌న ఆలోచ‌న‌ను ముందుగా ఫ్రెండ్స్ అంగీక‌రించ‌లేదు. ఎంబీఏ చేసిన సుర‌భి.. త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసి వ‌చ్చారు.ఇద్ద‌రూ క‌లిసి స్ట్రీట్‌బాజార్‌ను మొద‌లుపెట్టారు.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు

వంద రూపాయ‌ల ద‌గ్గ‌ర్నుంచి వేల వ‌రకూ..బ్యాగ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని ఫేమ‌స్ స్ట్రీట్ మార్కెట్ల‌లో దొరికే ఫ్యాష‌న్ జువెల్ల‌రీ ప్ర‌స్తుతం ఈ సైట్‌లో దొరుకుతున్నాయి.

“ రాబోయే రోజుల్లో మ‌రింత మంది వ్యాపార‌స్థులను క‌లుపుకోవ‌డంతో పాటు.. అంతర్జాతీయంగా కూడా వ్యాపారం చేయాల‌ని టీమ్ ప్లాన్ చేస్తున్నాం" అని సుర‌భి చెబుతున్నారు.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags