సంకలనాలు
Telugu

వెడ్డింగ్ నుంచి ట్రాన్స్ పోర్టు దాకా.. అన్నిటికీ ఒకే అడ్డా ఫ్లాట్ పెబెల్

ashok patnaik
7th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒక ఈవెంట్ జరుగుతోంది. ఫోటోగ్రాఫర్ కావాలి? ఎవరైతే బాగా తీస్తారు? వెతికే పని పెట్టుకోవడం కంటే -తెలిసిన వాళ్లెవరైనా వుంటే అరేంజ్ చేస్తాం. ఒకవేళ అలా దొరకకుంటే, ఫేస్ బుక్ లోనో, మరో సైట్ లోనో చూసి ఎంగేజ్ చేసుకుంటాం. కానీ, వచ్చిన వ్యక్తి కచ్చితంగా మనం అనుకున్నట్టుగా వర్క్ చేస్తాడనడానికి గ్యారెంటీ ఏంటి? 

పోనీ ఫోటోగ్రాఫర్ కాదు. ఈసారి మనకు ఇంటీరియర్ డెకొరేషన్ అవసరమొచ్చింది. ఇక్కడా వెతుకులాట తప్పదు. మెహిందీ ఎవరు బాగా పెడతారు? కపూల్ షూట్ ఖతర్నాక్ తీసేదెవరు? బేబీ సెరిమనీ సూపర్ గా రావాలంటే ఎవరిని పిలవాలి? ఇలా వెడ్డింగ్ నుంచి ట్రాన్స్ పోర్టు దాకా అన్నిటికీ ఒకే ఒక అడ్డా ఫ్లాట్ పెబెల్.

image


ఫోటోగ్రాఫర్స్ ని ఎంగేజ్ చేయడంలో స్మార్ట్

పప్పులో కాలేస్తుంటాం ఒక్కోసారి! మంచి ఫోటో గ్రాఫర్ అని ఎక్కువ డబ్బులు పెట్టి పిలిపించుకుంటే.. అంతకంటే తక్కువ డబ్బులకే మంచి వర్క్ చేసే మరో ఫోటో గ్రాఫర్ ఉన్నాడని తెలిసి ఉసూరుమంటాం.

“మీ వెడ్డింగ్ ఆల్బమ్ మీ స్టోరీని చెబుతుంది,” వెంకటేశన్ శేషాద్రి

వెంకటేశన్ ఫ్లాట్ పెబెల్ కో ఫౌండర్. పెళ్లి అనేది జీవితంలో మరుపురాని అనుభూతి. దాన్ని పదికాలల పాటు పదిలంగా దాచుకోవాలి. ఆల్బమ్ ఒకసారి చూసి పక్కన పడేసేలా ఉండొద్దు. చూసినప్పుడల్లా ఒక కొత్త అనుభూతికి లోనవ్వాలి. అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ తమ దగ్గర కచ్చితంగా దొరుకుతుందంటారు వెంకీ. ఫోటోగ్రాఫర్లను ఎంగేజ్ చేయడంలో మేం చాలా స్మార్ట్ అంటున్నారాయన.

ఈ స్టోరీ కూడా చదవండి

image


ఫ్లాట్ పెబెల్ పనితీరు

గత ఏడాది ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇప్పటి వరకూ చిన్నా పెద్దా కలిపి 100 నగరాల్లో సర్వీస్ చేస్తోంది. దాదాపు 3వేలకు పైగా ప్రొఫెషనల్స్ ఇందులో రిజిస్ట్రర్ అయ్యారు. నెలకి యాక్టివ్ యూజర్ల సంఖ్య నలభైవేలకు పైమాటే. ఓ ఈవెంట్ జరుగుతుందంటే దానికి సంబంధించిన అన్ని సేవలూ మా దగ్గర ఉంటాయని వెంకి చెప్పుకొచ్చారు.

“పెళ్లిళ్లకు కావల్సిన ట్రాన్స్ పోర్టేషన్ కూడా మేం ప్రొవైడ్ చేస్తున్నాం,” వెంకి

ఈ మధ్య వారిని ఈవెంట్ మేనేజర్లు కూడా కాంటాక్ట్ చేస్తున్నారట. ఈ మధ్యే ముగ్గురు కలిశారని వెంకీ అంటున్నారు. ప్రారంభించి దాదాపు ఏడాది కావొస్తున్న ఈ స్టార్టప్ ఐదు కోట్ల ఆన్ లైన్ లావాదేవీలను నడిపింది. ఫ్లాట్ పెబెల్ లో పేమెంట్ చేసే పద్దతి కూడా చాలా సింపుల్ అంటున్నారు వెంకీ.

ఫ్లాట్ పెబెల్ టీం

ప్రణవ్ మెహతా, వెంకటేషన్ శేషాద్రి ఈ స్టార్టప్ ఫౌండర్లు. ప్రణవ్ మైక్రో సాఫ్ట్ లో దశాబ్ద కాలం పాటు పని చేశారు. మలేషియాతో పాటు చాలా దేశాలు తిరిగారు. స్టార్టప్ ప్రారంభించాలను ఉద్దేశంతో మార్కెట్ రీసెర్చి చేశారు. అప్పుడు తట్టిన ఆలోచన ఇది. దీన్ని ప్రారంభించడాని ముందు వెంకీతో కలిశారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఫ్లాట్ పెబెల్ మొదలైంది. వెంకీకి కూడా అపారమైన ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ ఉంది. టెక్ క్లోవ్ టెక్నాలజీస్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ప్రస్తుతానికి పెబెల్స్ లో దేశం మొత్తం 20 మంది ఉద్యోగులున్నారు.

సవాళ్లు, పోటీ దారులు

ఫ్లాట్ పెబెల్ అనేది సాధారణ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే పని. ఈవెంట్ మేనేజర్ల దగ్గర నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించాల్సి ఉంది. బిటుబి సెగ్మెంట్ లో మాత్రమే రెవెన్యూ మోడ్ కనిపిస్తున్న ఈ స్టార్టప్ కి, కస్టమర్లను ఎంగేజ్ చేయడం మరో పెద్ద సవాల్. టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ తో కస్టమర్లు కనెక్ట్ అయితే , తర్వాత క్లయింట్స్ దొరకడం కష్టం అవుతుంది. దీన్ని అధిగమించాల్సి ఉంది. టెక్నాలజీతో దీనికి పరిష్కారం చూపగలమని వెంకి చెప్పుకొచ్చారు.

image


ఫండింగ్, భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతానికి సీడ్ ఫండింగ్ ఉన్న ఈ స్టార్టప్, ఇదే ఏడాదిలో మరోసారి ఫండింగ్ కి వెళ్లాలని చూస్తోంది. బిటుబి మోడ్ లో ఆదాయానికి ఢోకా లేకపోయినా, ఫండింగ్ వస్తే యాప్ ప్లాట్ ఫాంలో మరింత టెక్నాలజీని యాడ్ చేయాలని చూస్తున్నారు.

కస్టమర్ బేస్ పెంచుకోవాలన్నది కూడా మరోె ఆలోచన. ఇప్పటి కే ఇండియా మొత్తం విస్తరించిన ఈ సంస్థ, ఇప్పుడున్న వ్యాపారం డబుల్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెండ్డింగ్ సీజన్లలో మార్కెట్ 30 శాతం పెరుగుతుంది, దీన్ని డబుల్ చేయాలని వెంకి అంటున్నారు. ప్రి బుకింగ్ ఆర్డర్ లతో పాటు కరెంట్ బుకింగ్ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తున్నామని వెంకి ముగించారు.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags