సంకలనాలు
Telugu

10 నిమిషాల్లో వెబ్‌సైట్ రెడీ చేసి ఇచ్చే 'వెబ్‌జర్'

60 సెక‌న్ల‌లో ఫేస్‌బుక్ పేజ్ వెబ్‌సైట్‌గా మార్పువెబ్ రంగంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న వెబ్‌జ‌ర్‌50 ల‌క్ష‌ల SMEల‌కు వెబ్‌సైట్‌లు క్రియేట్ చేయాల‌నే భారీ లక్ష్యం

3rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అంకిత్ గుప్తా మూడేళ్ల క్రితం యానిమేష‌న్ క్యాపిట‌ల్ అయిన సింగ‌పూర్ నుంచి భార‌త్‌లోకి కాలుమోపారు. ఇండియా వ‌చ్చిన త‌ర్వాత‌ ఢిల్లీలో ముయ్‌తాయి జిమ్స్ కోసం గూగుల్‌లో చాలాసేపు వెతికారు. చివ‌రికి ఓ జిమ్ దొరికినా దాని వివ‌రాలు ఆన్‌లైన్‌లో పూర్తిగా లేవు. దేశంలోని చాలా చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి (SME) బిజినెస్‌ల వ్యాపారాల ప‌రిస్థితి ఇంతేన‌ని ఆయ‌న గ్ర‌హించారు. వాళ్లకు ఆన్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దేశంలో 80 శాతం బిజినెస్‌ల‌కు సంబంధించిన వివ‌రాలు ఆన్‌లైన్‌లో లేవు. కానీ వెబ్‌సైట్‌ను త‌యారు చేసి, దాని నిర్వ‌హించ‌డం సామాన్యులకు అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఈ విష‌యాన్ని అంకిత్ గుర్తించారు.

image


"ఈ గ్యాప్‌ను స‌రిచేసేందుకు మేం వెబ్‌జ‌ర్‌ను ప్రారంభించాం. దాని అభివృద్ధి కోసం రెండేళ్లు శ్ర‌మించి, వెబ్‌సైట్‌ను నిర్వ‌హించ‌డాన్ని సుల‌భ‌త‌రం, వేగ‌వంతం చేశాం" అని అంకిత్ గుప్తా చెప్పారు.

2012 మ‌ధ్య కాలంలో జో సెబాస్టియ‌న్‌ను అంకిత్ క‌లిశారు. అప్ప‌టికే వెబ్‌జ‌ర్‌ను అభివృద్ధి చేసే ప‌నిలో ఉన్నారాయ‌న‌. ఈ వెబ్‌సైట్ అభివృద్ధి లో ఆయ‌న స‌హ‌కారం కూడా తీసుకున్నారు. ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా జో ప‌రిచ‌య‌మ‌య్యారు.

"నా ప‌నిలో ఎవ‌రైనా సాయం చేస్తారా అని నేన‌స్స‌లు ఆలోచించ‌లేదు. మార్కెటింగ్ కార్య‌క‌లాపాల్లో సాయం చేసే ఓ వ్య‌క్తి అనుకోకుండా ఓ రోజు జోను నాకు ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి వెబ్‌సైట్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై వ‌ర్క్ చేస్తున్నాం" అని అంకిత్ వివ‌రించారు.

గేమ్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ టెక్నాల‌జీ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో అంకిత్‌కు డిప్లొమా ఉంది. అమిటి యూనివ‌ర్సిటీ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో జో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఎలాంటి కోడింగ్ ప‌రిజ్ఞానం లేకున్నా వెబ్‌సైట్‌ను ప‌ది నిమిషాల్లో క్రియేట్ చేసేందుకు ఉప‌యోగ‌డుతుంది వెబ్‌జ‌ర్.కామ్‌. ఎస్ఎంఈస్‌, ఎన్జీవోలు, ఫ్రీలాన్స‌ర్లు, స్టార్ట‌ప్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు.

వెబ్‌సైట్ ప‌నితీరు ఇలా..

"మా బ్యాకెండ్ కార్య‌క‌లాపాల గురించి వివ‌రించేందుకు మాకు అనుమ‌తి లేదు. కానీ పీహెచ్‌పీ ఫ్రెమ్‌వ‌ర్క్ ఆధారంగా ప‌నిచేస్తుంది. మా డెడికేటెడ్ స‌ర్వ‌ర్ల ద్వారా హోస్టింగ్స్‌ను పూర్తి చేస్తాం. అని జో చెప్పుకొచ్చారు. ఇదంతా మొబైళ్ల శ‌కం. దీంతో స్టార్ట‌ప్స్‌, రెస్టారెంట్స్‌, ఎన్జీవోస్‌, ఉద్యోగార్థుల‌ను దృష్టిపెట్టుకుని వెబ్‌జ‌ర్‌ను రూపొందించారు. అత్యంత సుంద‌ర‌మైన డిజైన్లు ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెబ్‌సైట్‌ను ఉప‌యోగించుకునేందుకు ఈ ప్రాడ‌క్ట్ ఉపయోగపడ్తుంది.

"మా వినియోగ‌దారులు సాధార‌ణ‌మైన వెబ్‌సైట్‌ను పొంద‌డ‌మే కాదు.. దాని ద్వారా బిజినెస్‌లో అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఇప్ప‌టికైతే ఫ్రీమియం మోడ‌ల్‌లో మేం వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇస్తున్నాం. మాకు వారు మంత్లీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ డ‌బ్బులు చెల్లించడానికి ముందే ఫ‌లితాలు చ‌విచూస్తారు. అని జో వివ‌రించారు.

మొబైల్ జ‌న‌రేష‌న్ కోస‌మే ఈ వెబ్‌జ‌ర్‌ను సృష్టించారు. అనుకున్న‌ట్టుగానే దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన భాష‌ల్లో వినియోగ‌దారులు వె బ్‌సైట్‌ల‌ను రూపొందిస్తున్నారు. 60 సెక‌న్ల‌లో వెబ్‌సైట్ నిర్మాణం అనే ఫీచ‌ర్ కూడా వెబ్‌జ‌ర్‌లో ఉండ‌టం విశేషం. ఇది లింక్‌డిన్ ప్రొఫైల్‌ను, ఫేస్‌బుక్ పేజీల‌ను ఫుల్ పొర్టుఫోలియో వెబ్‌సైట్‌గా మారుస్తుంది. చాలామంది ఫ్రీలాన్స‌ర్లు, ఉద్యోగార్థులు ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకుని తమ కాంపిటీటర్ల కంటే ముందు నిలుస్తూ.. ప్రొఫెష‌న‌ల్‌గా స‌త్తా చాటుతున్నారు.

ఆన్‌లైన్ ఇండియా

ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం దేశంలోని చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల సేవ‌ల‌ను ఆన్‌లైన్ చేయ‌డ‌మే. దేశ‌వ్యాప్తంగా 5 కోట్ల రిజిస్ట‌ర్డ్ ఎస్ఎంఈస్ ఉన్నాయి. ఇందులో ప‌దిశాతం సంస్థ‌ల‌కు మాత్ర‌మే సొంతంగా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మిగ‌తావ‌న్నింటి వివ‌రాలు ఆన్‌లైన్‌లో ఎంత వెదికినా దొర‌క‌వు. దీంతో ఈ అతి పెద్ద మార్కెట్‌ను సొంతం చేసుకోవాల‌ని అంకిత్ టీమ్ ప‌ట్టుద‌ల‌గా ఉంది. క‌నీసంగా 50 ల‌క్ష‌ల సంస్థ‌ల‌కైనా ఆన్‌లైన్ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని భావిస్తున్న‌ది. ఈ వెబ్‌జ‌ర్ అభివృద్ధిపై అంకిత్‌, జోల‌కు భారీ ఆశ‌లున్నాయి. ఎన్నో ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌నుకుంటున్నారు.

"ఇప్ప‌టికి మేం సాధించింది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే. ఎన్నో ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌నుకుంటున్నాం. మొబైల్ ద్వారా వెబ్‌సైట్ ఎడిటింగ్ చేయ‌డం, ఈ కామ‌ర్స్‌, ఎడిట‌ర్ ఫ‌ర్ డిజైన‌ర్స్‌, హైర్ ఏ ప్రొ స‌ర్వీస్‌, బీహాన్స్ పేజ్ క‌న్వ‌ర్ట‌ర్ వంటివాటిని అందుబాటులోకి తేవాల‌నుకుంటున్నాం" అని అంకిత్ వివ‌రించారు.

Website : Webbzer.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags