సంకలనాలు
Telugu

లోక‌ల్ రిటైల్ మార్కెట్‌పై క‌న్నేసిన ట్రేడ్‌ జీనీ!

Karthik Pavan
2nd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లెక్క‌లేనంత మంది ఆన్‌లైన్ సెల్ల‌ర్స్‌.. ల‌క్ష‌ల్లో ఆఫ్‌లైన్ రీటైల‌ర్స్‌. ఎవ‌రి ప‌ని వాళ్ల‌ది.. ఎవ‌రి వ్యాపారం వాళ్ల‌ది. కొంత‌మంది సెల్ల‌ర్స్‌ మాత్ర‌మే త‌మ వ్యాపారాన్ని విస్త‌రించ‌డానికి ఈ కామ‌ర్స్‌ని వినియోగిస్తున్నారు. స‌మాచారం లేక‌నో.. పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేక‌నో.. చాలామంది రీటైల‌ర్స్ ఇప్ప‌టికీ ఈకామ‌ర్స్ జోలికి వెళ్ల‌డంలేదు. పెద్ద‌గా టెక్నాల‌జీని వినియోగించ‌డంలేదు. దీంతో సెల్ల‌ర్స్‌కు, రీటైల‌ర్స్‌కు మ‌ధ్య చాలా గ్యాప్ ఏర్ప‌డింది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు ఇద్ద‌రు వ్య‌క్తులు వినూత్న ఆలోచ‌న చేశారు. ఆ ఆలోచ‌న నుంచి పుట్టిందే.. అప్లికేట్‌.


image


ఎలా మొద‌లైందంటే..!

హిందుస్ధాన్ కోకాకోలా బెవ‌రేజెస్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో 43 ఏళ్ల రంజీత్‌కు,, 45 ఏళ్ల దీప‌క్‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. జూన్ 2014న రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ఆప‌రేష‌న్స్ హెడ్‌గా ఉన్న ఇద్ద‌రు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశారు. ఒక కంపెనీలో ప‌నిచేసే సేల్స్ టీమ్‌, స‌ర్వీస్‌, మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్ధ‌ల‌ను ఒకే చోట చేర్చే ఎక్సీడ్ అనే ప్లాట్‌ఫాంను డెవ‌ల‌ప్ చేశారు. అది స‌క్సెస్ అవ‌డంతో.. 2015 మే నెల‌లో అర్బ‌న్ ఇన్‌ఫ్రా వైస్‌ప్రెసిడెంట్ అమిత్‌గుప్తా, టీసీఎన్ కెనడా డైర‌క్ట‌ర్ రాజీవ్‌ల‌తో పాటు మరికొంత‌మంది ప్రొఫెష‌న‌ల్స్ ద్వారా రూ.3.5 కోట్ల ఏంజెల్ ఫండింగ్ ద‌క్కించుకున్నారు.

ఇదే టీమ్ లేటెస్ట్‌గా త‌యారుచేసిన ‘Trade GINI’, అనే మొబైల్ అప్లికేష‌న్‌.. ఆఫ్‌లైన్ రీటైలర్స్‌, ఆన్‌లైన్ సెల్ల‌ర్స్‌కు మ‌ధ్య వార‌ధిగా నిలుస్తోంది.

ఈ యాప్‌తో.. ఎవ‌రైనా రీటైల‌ర్లు.. కావాల్సిన కంపెనీ నుంచి కానీ.. స‌ప్ల‌యర్ నుంచి కానీ వ‌స్తువుల‌ను డైర‌క్ట్‌గా కొనుగోలు చేసుకునే వీలుంటుంది. దీనితో పాటే ఆ వ‌స్తువుకు సంబంధించిన ప్ర‌మోష‌న్‌, డిస్కౌంట్స్ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఏదైనా స‌మ‌స్య‌లు వ‌స్తే హెల్ప్ డెస్క్‌తో మాట్లాడి ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. ప్రస్తుతం.. 130 మంది స‌ప్ల‌య‌ర్ల‌తో.. 4500 మంది క‌స్ట‌మ‌ర్ల‌ను ఇప్ప‌టికే సంపాదించుకుంది ట్రేడ్ జీనీ. 2015లో కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టిన నాటి నుంచి కెల్లోజీస్‌, బ్రిటానియా, మారీకో, ఎంటీఆర్‌లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ట్రేడ్ జీనీని వినియోగించుకుంటున్నాయి.

" గుర్గావ్ లాంటి మెట్రో న‌గ‌రాలు, జైపూర్‌లాంటి మిని మెట్రో న‌గ‌రాల‌తో పాటు రాజ‌స్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మా ఐడియా సక్సెస్ అయింది. ఫుడ్‌, పానీయాలు, ప‌ర్స‌న‌ల్ కేర్‌, మొబైల్ యాక్స‌స‌రీస్ ఇండ‌స్ట్రీల‌పైనే ప్ర‌ముఖంగా దృష్టిపెడుతున్నాం" అంటున్నారు రంజీత్‌.

ప్ర‌స్తుతానికి ట్రేడ్ జీనీ రీటైల‌ర్ల‌కు ఉచితంగా సేవ‌లు అందిస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో స‌ప్ల‌య‌ర్ల ద‌గ్గ‌ర్నుంచి ఇన్‌క‌మ్ రాబ‌ట్టుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆర్డ‌ర్ పెట్టిన ద‌గ్గ‌ర్నుంచి వాటిని రిటైల‌ర్ల‌కు చేర్చే వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన స‌ర్వీసుల‌న్నీ.. అంటే ఎండ్ టు ఎండ్ స‌ర్వీసులను ఇవ్వ‌డం ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. కొంత కాలం త‌ర్వాత కొన్ని ఎంపిక చేసిన ప్రొడ‌క్ట్స్‌కు ప్రైవేట్ లేబ్లింగ్ చేయాల‌నే ఆలోచ‌న కూడా ఉందంటున్నారు టీమ్ మెంబ‌ర్స్‌.

ఎలా ప‌నిచేస్తుంది?

ఒకేసారి డేటా మొత్తం డంప్ చేయ‌డం కాకుండా క‌స్ట‌మ‌ర్ అవ‌స‌రాన్ని బ‌ట్టి డేటాను అందించేలా రూబీ టెక్నాల‌జీని ఈ యాప్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో వినియోగించారు. ఇంట‌ర్‌ఫేస్ ద‌గ్గ‌ర్నుంచి స‌మ‌స్త స‌మాచారం క‌స్ట‌మ‌ర్ క‌స్ట‌మ‌ర్‌కూ మారిపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మొబైల్ యాక్స‌స‌రీస్ కోసం రిజిస్ట‌ర్ చేసుకున్న రీటైల‌ర్‌కు ఒక ఇంట‌ర్‌ఫేస్ క‌నిపిస్తుంది. అందుకు సంబంధించిన స‌మాచారం మాత్ర‌మే ఇస్తుంది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్‌కు త‌న‌కు కావాల్సిన ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఈజీగా ఐడెంటిఫై చేసుకునే అవ‌కాశం దొరుకుతుంది.

"అన్ని కేట‌గిరీల‌కు సంబంధించిన చెత్తా చెదారంతో యాప్‌ను నింపేయ‌కుండా రూబీ టెక్నాల‌జీతో చాలా ఈజీగా ఉండేలా దీన్ని త‌యారుచేశాం. ఇండ‌స్ట్రీ టైప్‌, కేట‌గిరీ, లొకేష‌న్‌లాంటి సెర్చ్ ఆప్ష‌న్స్‌తో మినిమైజ్డ్ రిజ‌ల్ట్స్‌ను అందిస్తున్నాం. దీని వ‌ల్ల ఇంట‌ర్‌ఫేస్ క్లీన్‌గా ఉండ‌ట‌మే కాకుండా.. క‌స్ట‌మ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ పెరుగుతుంది" అంటున్నారు కంపెనీ సీటీవో, ఫౌండ‌ర్ మ‌ధుసూద‌న్‌.

సెక్టార్ ప‌నితీరు

అటూ ఇటుగా 180ల‌క్ష‌ల ఆఫ్‌లైన్ రీటైల‌ర్ల‌ను.. ల‌క్ష ఆన్‌లైన్ సెల్ల‌ర్స్‌ను క‌ల‌ప‌డం ద్వారా అటు డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫ‌రా అందిచాల‌న్న‌ది అప్లికేట్ ల‌క్ష్యం. ఈ నేప‌ధ్యంలో అత్యంత శ‌క్తిమంతమైన స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటుచేయ‌డ‌మంటే క‌ష్ట‌మైన ప‌నేనంటారు అప్లికేట్ క‌స్ట‌మ‌ర్ల‌లో ఒకరైన మ‌ధురా గార్మెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మ‌నీష్ .డిమాండ్‌, స‌ప్ల‌య్ వ్య‌వ‌స్ధ‌ను ఏదైనా ప్లాట్‌ఫాం సుల‌భ‌త‌రం చేయ‌గ‌లిగితే.. అది వ్యాపారంపై ప్ర‌భావం చూపిస్తుంది అంటారాయ‌న‌. ఇప్ప‌టికే అమెజాన్‌లాంటి జెయింట్ కంపెనీలు రీటైల‌ర్స్‌, సెల్ల‌ర్స్ మ‌ధ్య ఏర్ప‌డిన ఈ గ్యాప్‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు

"ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఆప‌రేష‌న్స్ మొదుపెట్టిన త‌ర్వాత ప్ర‌తీవారం కంపెనీ రెవెన్యూ రెండింత‌లు పెరుగుతోంది.దీంతో..2016 ద్వితీయార్ధానికి కోటి ప్రాఫిట‌బుల్ రెవెన్యూ" చేరుకుంటామ‌ని కంపెనీ ఫౌండింగ్ టీమ్ మెంబ‌ర్ న‌వీన్ రాణా చెబుతున్నారు. 

టెక్నాల‌జీ, సేల్స్ టీమ్ క‌లిపి ప్ర‌స్తుతానికి అప్లికేట్‌లో 55 మంది ప‌నిచేస్తున్నారు. అతిత్వ‌ర‌లో మ‌రో 100మందిని సేల్స్‌, ఆప‌రేష‌న్స్‌లో తీసుకోబోతున్న‌ట్టు్ రంజీత్ అంటున్నారు.

యువ‌ర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

ఈ కామ‌ర్స్ మార్కెట్ వేగంగా విస్త‌రిస్తున్న ఇండియాలో.. ఈ మోడ‌ల్ స‌క్సెస్ అవ్వాలంటే కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. లోక‌ల్ మార్కెట్ అక్క‌డ‌క్క‌డా విస్త‌రించి ఉండ‌టం అందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఈ కామ‌ర్స్ సంస్ధ‌లు, లోక‌ల్ రీటైల‌ర్లు ఎక్కువ‌కాలం పాటు మ‌నుగ‌డ సాధించాలంటే వ్య‌యాన్ని త‌గ్గించ‌డంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది.

కేవ‌లం మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో ప‌నిచేస్తున్న‌జీనీలో.. క‌స్ట‌మ‌ర్ అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇంట‌ర్‌ఫేస్‌, డేటా మారిపోవ‌డం అనేది మంచి రీటైల‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. కిరాణా షాపులు, రీటైల‌ర్లు టెక్నాల‌జీకి అల‌వాటుప‌డుతున్న ఈ త‌రుణంలో..ఇది ఎంతో స‌హ‌క‌రించే అవ‌కాశ‌ముంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags