సంకలనాలు
Telugu

కారు కొనాలనుకుంటున్నారా? 'ఫస్ట్ రైడ్’ని ట్రై చేయండి!

మీ అభిరుచికి తగిన కార్ వెతికి పెట్టే సైట్కొత్త ప్రాడక్టులపై గైడ్ లైన్స్కార్ కొనేటప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు సరైన సమాధానంటెస్ట్ డ్రైవ్ ఏర్పాటు చేయడంతో మొదలయ్యే సేవలు

ashok patnaik
15th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కారు కొనటమంటే అనుకున్నంత సులువు కాదు. టెస్ట్ డ్రైవ్‌లుటాయి, రంగు సెలక్షన్ ఉంటుంది.. అన్నీ అయ్యాక పేజీల కొద్దీ డాక్యుమెంట్లు నింపాలి. ఇలా ఒకటేంటి, ఎన్నో పనులు. అందుకే కారు కొనాలనుకునే వాళ్లను ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కించటానికి ఒక టీమ్ రెడీ అయింది. మీ కారుకు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తిచేసి పెడతామంటూ విజయకుమార్ రెడ్డి, ప్రసూన్ అగర్వాల్ అనే ఇద్దరూ కలిసి ఫస్ట్ రైడ్ డాట్ ఇన్ ప్రారంభించారు. కారు కొనేటప్పుడు ఎదురయ్యే అనేక ప్రశ్నలు, సమస్యల నుంచి కొనుగోలుదారులకు విముక్తి కలిగించి సాఫీగా ఆ వ్యవహారమంతా సాగిపోవటానికి వీలుగా వీళ్ళు ఈ కంపెనీ మొదలు పెట్టారు. ఒక కారు ట్రయల్ వేయటం మొదలుకొని పూర్తిగా దానికి యజమాని అయ్యేదాకా మొత్తం పనులన్నీ దగ్గరుండి చూసుకుంటారు.

image


కొనేవాళ్ళు సరైన కారు ఎంచుకోవటానికి వీలుగా టెస్ట్ డ్రైవ్ ఏర్పాటు చేయటంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత లోన్ శాంక్షన్ అయ్యేట్టు చూడటం, ఇన్సూరెన్స్‌లో సాయం చేయటం, అమ్మకం తరువాత సేవలు సక్రమంగా అందేట్టు చూడటం, కారు మెయింటెనెన్స్‌లో సాయపడటం వరకూ సాగుతుంది. ఈ బృందం ఎలాంటి పక్షపాతమూ లేకుండా మొత్తం ప్రక్రియలో వినియోగదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. పూర్తి సమాచారం ఆధారంగా కస్టమర్ తగిన నిర్ణయం తీసుకోగలిగేలా చాలా కీలకమైన సమాచారం సేకరించి అందించటం వీళ్ళ ప్రత్యేకత. ఈ క్రమంలో మార్కెట్లోని అనేకమందితో వీళ్ళు భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు.

ప్రసూన్ అగర్వాల్

ప్రసూన్ అగర్వాల్


ఈ వెంచర్ ఆలోచన, దాని వెనుక ఉన్న అదర్శాల గురించి అడిగితే విజయ్ చెప్పారు “గడిచిన కొద్ది సంవత్సరాలలో కార్ల కొనుగోళ్లు సెల్లర్స్ మార్కెట్ నుంచి బయ్యర్స్ మార్కెట్‌గా మారిపోయింది. అంటే, ఒకప్పుడు అమ్మింది కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు కొనేవాళ్ళు కోరిందే అమ్మాలి. ఈ రోజు కొనుగోలుదారుడు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తన కొనుగోలు మీద ఒక స్పష్టతతో ఉంటున్నాడు. ఇప్పుడు డీలర్ షిప్పులనేవి కేవలం అప్పటికే నిర్ణయించుకున్నవాళ్ళకి దారిచూపటానికే పరిమితం. అంతకు ముందు మనకు సంప్రదాయంగా డీలర్ల దగ్గర కనిపించే సేల్స్‌మన్ ఇప్పుడు దాదాపుగా మాయమైనట్టే. ఇప్పుడంతా డేటా, నాలెడ్జ్, సమాచారం, ఫీడ్ బాక్ అన్నీ ఇంటర్నెట్ లోనే దొరుకుతున్నాయి. “

కాలం మారుతోంది. ఆన్ లైన్ లో వస్తువులు కొనే కస్టమర్ మనస్తత్వంలోనూ అలాగే మార్పు వస్తోంది. భారత వినియోగదారుడు నాణ్యమైన వస్తువు నేరుగా ఇంటికే రావాలని, ఎలాంటి అసౌకర్యమూ కలగకూడదని కోరుకుంటున్నాడు అనటానికి ఉవ్వెత్తున ఎగసిన ఈ-కామర్స్ వ్యాపారమే ఒక ఉదాహరణ. మిగిలిన అన్ని విభాగాలకంటే వినియోగదారులు ఎక్కువగా బుక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులే ఇలాకొంటున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ అడగాల్సిన ఒక మంచి ప్రశ్నేంటంటే “ఆన్ లైన్ లో కారెందుకు కొనగూడదు ?” అని.

విజయ్ కుమార్ రెడ్డి

విజయ్ కుమార్ రెడ్డి


కచ్చితంగా అలాంటి రోజు ఎంతో దూరంలో లేదని చెప్పగలం. కార్లు కూడా ఆన్ లైన్‌లో కొంటాం. అనేక అంశాలు ఆ దిశను సూచిస్తున్నాయి కూడా. ఏమో, స్నాప్ డీల్ ప్రత్యేకంగా టాటా కార్లు అమ్మబోదని ఎలా చెప్పగలం ? ప్రసూన్ అగర్వాల్ కూడా అదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. “కార్లు కూడా ఆన్‌లైన్ లో కొనే సమయం వచ్చేసింది. ఆన్ లైన్ లోనే రీసెర్చ్ చేయటం, టెస్ట్ డ్రైవ్‌కి బుక్ చేసుకోవటం, ఆ తరువాత ఆన్ లైన్‌లో కొనేయటం జరిగిపోతాయి” అంటారు. వాళ్ళ సేవల గురించి చెబుతూ, “మేం యూజర్స్‌కు అనుకూలంగా ఉండే వెబ్ సైట్ తయారుచేశాం. కారు కొనటంలో టెస్ట్ డ్రైవింగ్ చాలా ముఖ్యమైన అడుగు అనేది మా నమ్మకం. ఎందుకంటే, చాలామందికి ఇంటి తరువాత అత్యంత ఖరీదైన కొనుగోలు కారే కాబట్టి. టెస్ట్ డ్రైవింగ్ వల్ల ఆ కారు మీద, దాని ఫీచర్స్ మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన వస్తుంది. ఈ రోజు టెస్ట్ డ్రైవ్ బుకింగ్ విధానం మొత్తం మాన్యువల్ గా జరుగుతోంది. అంతా గందరగోళం. కానీ మేం నగరంలోని అందరు డీలర్ల దగ్గరా ఉన్న కార్ల అందుబాటు వివరాలతో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించాం” అన్నారు

ప్రస్తుతానికి వీళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. త్వరలో చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలకూ విస్తరించాలనుకుంటున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags