సంకలనాలు
Telugu

గ్రేటర్ ఎన్నికలకు అమెరికా క్యాంపెయిన్

ashok patnaik
26th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

షుకూర్ మహమ్మద్ మన హైదరాబాదీనే. 1983లో భాగ్యనగరాన్ని విడిచి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ దాదాపు 16 ఏళ్ల పాటు ఎన్నికల క్యాంపెయిన్, క్యాండిడేట్ సెలక్షన్ లాంటి ప్రక్రయల్లో శాస్త్రీయతను జోడించారు. ఇక్కడ ఎన్నికల్లో మొదటిసారి ఇవే పద్దతులను ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

“డబ్బులు సంపాదించడం మా లక్ష్యం కాదు. బెటర్ సొసైటీని తయారు చేయాలనేదే మా గోల్,” షుకూర్

కార్పొరేషన్ ఎన్నికల్లో పరిమితులుంటాయి. దీంతో తమలాంటి వారికి పనిచేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుదని అంటన్నారాయన.

image


టెక్నాలజీని తయారు చేశాం

సరైన అభ్యర్థి లేకపోవడం వల్ల పార్టీలు ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. పార్టీ అభ్యర్థి విషయంలో ముందుగానే ప్రణాళిక లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఎవరు పేరుదొరికితే వారిని అభ్యర్థులుగా నిర్ణయించడం జరుగుతోంది. అన్ని చోట్లా ఇలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ చాలా చోట్ల , చాలా పార్టీల్లో ఇదే జరుగుతుందని మాత్రం తాను చెప్పగలనని అంటున్నారాయన.

“భారతీయ రాజకీయాలు మరింత వ్యవస్థీకరించబడాలి.” షుకూర్

దీనికోసం తామున్నామని అంటున్నారాయన. సాధారణంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడంతోపాటు అన్ని రకాలుగా ఆ అభ్యర్థి కరెక్టా కాదా అనే విషయాలను విశ్లేషించి పార్టీలకు సజెస్ట్ చేస్తామని షుకూర్ చెప్పుకొచ్చారు. మొదటి సారి జీహెంఎంసీ ఎన్నికల్లో అభ్యర్థి ప్రొఫైల్స్ యాప్ లో ఉంచుతామంటున్నారు.

image


క్యాంపైనింగ్ లో కూడా టెక్నాలజీనే

ఎన్నికల ఖర్చు పార్టీలకు తడిసి మోపెడవుతోంది. అయినప్పటికీ చివరిరోజు వచ్చేటప్పటికి సరైన ప్రచారం చేశారా లేదా అనే విషయంలో సందేహం ఉంటుంది. ఈ పద్దతి మారాలని షుకూర్ అభిప్రాయపడ్డారు.

“అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత, అతని క్యాంపెయిన్ బాధ్యతనూ తీసుకుంటాం,” షుకూర్

అభ్యర్థిని ఎంత శాస్త్రీయపద్దతిలో ఎన్నుకున్నామో అంతే శాస్త్రీయంగా ప్రచారం చేస్తామని షుకూర్ ప్రకటించారు. డిజిటల్ క్యాంపెయినింగ్ తోపాటు ఇమేజ్ బిల్డింగ్ లాంటి ప్రక్రియల్లో అభ్యర్థిని ప్రొజెక్ట్ చేస్తామని అంటున్నారు. సాధారణంగా ఇంటింటికీ అభ్యర్థి వెళ్లి ప్రచారం చేయడం మనం చూసేదే. ఇక్కడ ఇంటింటికీ అభ్యర్థి వెళ్లకపోయినా, అతని వివరాలు ఓటర్లకు తెలిసేలా చేస్తాం అంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫోకస్ పొందే మార్గాల్లో క్యాంపెయిన్ చేస్తామని అంటన్నారు.

image


20 మంది అభ్యర్థులే టార్గెల్

మొదటి విడత 20 మంది అభ్యర్థులను ఎన్నుకొని వారికి పూర్తిస్థాయి క్యాంపైన్ చేయాలని అనుకుంటున్నట్లు షుకూర్ చెప్పారు. ఇప్పటికే తమ దగ్గర 8 మంది అభ్యర్థులు ఉన్నారని. మరికొంతమంది మంది తమకు వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకున్నారని ప్రకటంచారాయన. అయితే వీరు ఏపార్టీ నుంచి పోటీ చేస్తారనేది ముఖ్యం కాదు అన్ని పార్టీల్లో వీరుండొచ్చు. కానీ తాము అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్ ను మరింత బలవంతగా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారాయన.

“డాక్టర్, లాయర్, ఇంజనీర్, స్కూల్ మాస్టర్ ఇలా అన్ని రకాల అభ్యర్థులుండాలి,” షుకూర్

కార్పొరేషన్ అనేది సంఘానికి సంబంధించింది. అన్ని రకాల సమస్యలు తెలుసుకోవాలంటే అన్ని ఫీల్డుల నుంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఇలా అన్ని ఫీల్డులకు సంబంధించిన వ్యక్తులు కార్పొరేటర్లుగా ఉంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

షుకూర్, అతని టీం

హైదరాబాద్ నుంచి 500 డాలర్లతో అమెరికా ఇమ్మిగ్రేషన్ వీసా పట్టుకొని చేరిన షుకూర్ ఇప్పుడొక సోషల్ యాక్టివిస్ట్, ఓ సంస్థ అధిపతి, ఓ విజయవంతమైన ఆంత్రప్రెన్యువర్ అయ్యారు. వ్యాపారం చేస్తూ సమాజానికి ఎలా ఉపయోగపడాలో తన కంపెనీ చూస్తే అర్థం అవుతుందని అంటారాయన.

“నాకు 26 ఏళ్లు ఉన్నప్పుడు అమెరికా వచ్చేసాను.” షుకూర్

ఇప్పుడు భారత్ దేశంలో రాజకీయాలను తన దైన సేవలందించడానికి తిరిగి ఇక్కడ అడుగు పెట్టారు. గ్రేటర్ క్యాంపెయిన్ కోసం షుకూర్ తో పాటు మరో నలుగురు అంటే ఐదుగురు పనిచేయనున్నారు.

image


సవాళ్లు

  1. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలైనా, మరే ఇతర ఎన్నికలైనా ఇక్కడ ఉండే డేటా అంత ఆర్గనైజ్డ్ గా ఉండదు. దీన్ని గాడిలోపెట్టి అధిగమించాల్సి ఉంది.
  2. ప్రజాస్వామ్య విలువలు పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎన్నికల నుంచే అనే విషయాన్ని షుకూర్ నమ్ముతారు. సిద్ధాంతాలతో పార్టీలన్నీ ఓ రకమైన వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజాసేవ చేసే నాయకులను తయారు చేయాలి. అది పార్టీల తోనే సాధ్యం. దీనికి తాము చేతనైన సాయం అందిస్తామంటున్నారు.
  3. అమెరికాతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు వేరు, ఓటర్లు వేరు, నాయకులు వేరు, వీటన్నింటి అర్థం చేసుకోవాలి. దీన్ని అధిగమించాలి. తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగానని, దీన్ని అధిగమించడం కష్టం కాదని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు షుకూర్.
వందమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మేం చేసేది కూడా అదే. మార్పుకు మేమే మొదటి అడుగు వేస్తున్నామని ముగించారు షుకూర్

వెబ్ సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags