సంకలనాలు
Telugu

10 వేల పెట్టుబడితో 1000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన కున్వర్ సచ్‌దేవ

6th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

“ఇంటర్ సెకండియర్ చదువుతున్నపుడు నా గోల్ డాక్టర్ కావడం” అంటారు కున్వర్ సచ్‌దేవ. పారిశ్రామిక రంగంలో ఈయనని 'ఇన్వర్టర్ మేన్ ఆఫ్ ఇండియా' అని చెప్పుకుంటారు. పెన్స్, స్టేషనరీ విభాగంలో సేల్స్‌మెన్‌ నుంచి ప్రయాణం ప్రారంభించిన కున్వర్... తర్వాత ఓ సమాచార సంబంధిత కంపెనీలో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. దేశంలో ఇన్వర్టర్ పరిశ్రమలో వినూత్న మార్పులు తెచ్చే స్థాయికి ఎదిగేవరకూ.. కున్వర్ సచ్‌దేవ ప్రయాణంలో ఎన్నో మలుపులు, అవరోధాలు, కీలక మార్పులు ఉన్నాయి.

ఢిల్లీలోని సాధారణ పంజాబీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కున్వర్.. చిన్నతనంలో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులతో కలిసి ఉండేవాడు. తండ్రి భారతీయ రైల్వేలో క్లర్క్‌గా పని చేయగా.. తల్లి గృహిణి బాధ్యతలు నిర్వహించేంది. ప్రాథమిక విద్యను ప్రైవేట్ స్కూల్‌లో చదివిన కున్వర్... ఆర్థిక సమస్యల కారణంగా హైస్కూల్ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు 50శాతం మార్కులు అవసరం కాగా.. 49శాతం మాత్రమే స్కోర్ చేయగలిగాడు కున్వర్. 

“దీంతో మరో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి 12వ క్లాస్ మళ్లీ రాసి.. ఇంటర్మీడియట్‌లో స్కూల్ టాపర్‌గా నిలిచాను. అయితే.. రెండో సారి కూడా మెడికల్ ఎంట్రన్స్ పాస్ కాలేకపోయాను”అని పాత రోజులు గుర్తుచేసుకుంటారు కున్వర్.

మెడికల్ సీట్ రాకపోయినా.. ఇంజినీరింగ్‌లో మాత్రం సీట్ వచ్చింది కున్వర్‌కి. కానీ ఈ కోర్స్‌పై కనీస స్థాయి ఆసక్తి కూడా లేదాయనకు. తనకు నచ్చినది ఏదైనా చేసేందుకు ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో అవకాశం లభిస్తుందని భావించారు. దీంతో హిందు కాలేజ్‌ నుంచి స్టాటిస్టికల్ ఆనర్స్ కోర్స్ పూర్తి చేశారు. కున్వర్‌కు తాను చేసిన కోర్స్‌పై ఆసక్తి లేకపోవడంతో.. ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ పేరు సంపాదించి, స్థిరపడేందుకు ప్రయత్నించారు.

ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం

కాలేజ్ రోజుల్లో ఉండగా.. విపరీతంగా చదవడాన్ని ఓ అలవాటుగా చేసుకున్నారు కున్వర్. తర్వాత ఇన్వర్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాక.. ఈయనకు ఇదే సానుకూల అంశంగా మారుతుందని అప్పుడు తెలీదు తనకి. సోదరుడితో కలిసి పెన్నులు, స్టేషనరీ అమ్మడం ప్రారంభించాల్సి వచ్చింది ఓ సమయంలో.

“ఇలా పెన్నులు అమ్మడం నేను ఎంచుకున్న ఉద్యోగం కాదు.. అప్పుడది మాకు అవసరం కూడా. 12వ క్లాస్ పూర్తయ్యాక మా అన్నయ్య పెన్నుల వ్యాపారం ప్రారంభించాడు. కాలేజ్ పూర్తయ్యాక సాయంత్రాలు సహాయం చేసేవాడిని. కాలేజ్ చదువు అయిపోయాక ఫుల్ టైం అదే ఉద్యోగం చేయడం మొదలుపెట్టాన”ని చెప్పారు కున్వర్.

ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య చదివిన కున్వర్.. తర్వాత ఓ కేబుల్ కమ్యూనికేషన్ కంపెనీలో సేల్స్ విభాగంలో పనిచేశారు. ఈయనకు ఇదే మొదటి, ఆఖరి ఉద్యోగం. “కేబుల్ కమ్యూనికేషన్స్ కంపెనీలో నేను చేసిన తొలి ఉద్యోగంతోనే... 1988కాలంలో మన దేశంలో వ్యాపారానికి ఎంతటి అవకాశం ఉందో అర్ధమైంది. అందుకే ఉద్యోగం మానేసి.. ఢిల్లీలోనే కేబుల్ వ్యాపారం ప్రారంభించాను. దానికి నేను పెట్టిన పేరు సు-కమ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్” అని చెప్పారు కున్వర్.

సేల్స్ విషయంలో అనుభవం, సామర్ధ్యం ఉన్నా.. తయారీ, ఇన్‌స్టలేషన్, దాని వెనక ఉన్న టెక్నాలజీలపై ఇసుమంత కూడా అవగాహన లేదు కున్వర్‌కి. హోటల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో కమ్యూనిటీ యాక్సెస్ టెలివిజన్ (CATV), మాస్టర్ యాంటెన్నా టెలివిజన్(MATV)లను ఇన్‌స్టాల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో చేసిన తప్పుల కారణంగా... జనాలు వెంటబడేవారట. కొన్నిసార్లు దెబ్బలు కూడా తిన్న తరువాత.. ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసే వ్యక్తులతో వెళ్లి.. ఆ పనిపై ప్రావీణ్యత సంపాదించారు. దీంతో ఇన్‌స్టలేషన్ విషయంలో పర్ఫెక్ట్ అయ్యే అవకాశం లభించింది కున్వర్‌కి.

కున్వర్ సచ్‌దేవ్, సు కమ్ అధినేత

కున్వర్ సచ్‌దేవ్, సు కమ్ అధినేత


“ ఎక్కువగా చదివే అలావాటే నన్ను కాపాడింది. నా సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా... నా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడింది. దీంతో సొంత టీంను తయారు చేసుకుని.. ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించా”నని చెప్పారు కున్వర్. 

ఆ సమయంలో ప్రతీ ఇంటికీ కేబుల్ టీవీ ఉండడం ఒక అవసరంగా మారడం... తన వ్యాపారానికి అదృష్టంగా చెబ్తారాయన. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. దీనికి సరిపడేంతటి విజ్ఞానం సంపాదించుకున్నారు. డైరెక్షనల్ కప్లర్స్, యాంప్లిఫైయర్స్, మాడ్యులేటర్స్ వంటి కేబుల్ టీవీ ఎక్విప్‌మెంట్ తయారు చేసే అవకాశం ఇచ్చింది ఈ వ్యాపారం.

“అప్పట్లో స్పెక్ట్రం అనలైజర్ కోసం వెచ్చించినదే అతి పెద్ద పెట్టుబడి. నా ఉత్పత్తుల నాణ్యత, సాంకేతికత పెంచేందుకు ఇది సహాయపడింది. ఈ రెండూ ఎప్పటికప్పుడూ అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటాయని నేను విశ్వసిస్తాను” అని చెబ్తున్నారు కున్వర్.

ఎవరికీ తెలియని కొత్త వ్యాపారం

ఇన్వర్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం అనుకోకుండా జరిగింది. కేబుల్ టీవీ వ్యాపారం అద్భుతంగా సాగుతున్న సమయంలోనే.. ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ నిరంతరం సమస్యలు తెచ్చిపెట్టేది. అప్పుడే దేశంలో పవర్ బ్యాకప్ రంగంపై ఆలోచించండం మొదలుపెట్టారు కున్వర్.

“మా ఇంట్లో ఇన్వర్టర్ ఎప్పుడూ బ్రేక్ డౌన్ అవుతుండేది. ప్రతీసారీ ఎలక్ట్రీషియన్‌ని పిలవాల్సి వచ్చేది. దీంతో తీవ్రంగా విసుగు చెందిన నేను... ఓసారి దాన్ని ఓపెన్ చేసి.. సమస్య ఏంటో తెలుసుకోవాలని భావించాను. అందులో ఓ నాణ్యత లేని పీసీబీ బోర్డ్ కనిపించింది. దాన్ని సు-కమ్ కేబుల్ టీవీ వ్యాపారంలోని పరిశోధన మరియు అభివృద్ధి టీంకి అప్పగించి, దాన్ని విశ్లేషించాల్సిందిగా సూచించాను” అని చెప్పారు కున్వర్.

తమ యజమాని నుంచి వచ్చిన సూచనతో... 90ల్లో దేశంలో లభ్యమవుతున్న ఇన్వర్టర్ల నాణ్యతపై తగినంత పరిశోధన నిర్వహించారు ఆర్ & డీ టీం. మార్కెట్‌ని పరిశీలించిన వారికి.. ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. దాదాపు మార్కెట్లో ఉన్న ఇన్వర్టర్లు అన్నీ నాణ్యత లేనివే. అంతే కాదు ఈ సమస్యను అధిగమించేందుకు వారు ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించలేదు కూడా. దీంతో ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు .. టెక్నాలజీని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు కున్వర్. ఇందుకు ఇంటి అవసరాల కోసం వినియోగించని.. కెనడా ఇన్వర్టర్లను కూడా తెప్పించారు. సరైన ప్రొడక్ట్ ఎలా ఉంటుందో... దాని పనితీరు, సాంకేతికత అర్ధం చేసుకోవడమే ఈయన ప్రధాన ఉద్దేశ్యం అపుడు.

“కొన్ని ప్రాథమిక ప్రయోగాల తర్వాత.. ఇన్వర్టర్ల తయారీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అలా 1988లో సు-కమ్ పవర్ సిస్టమ్స్ ప్రారంభమైంది. మరోవైపు కేబుల్ టీవీ వ్యాపారం అప్పుడు బూమ్‌లో ఉంది. అప్పటికే ఈ పరిశ్రమలో నా బ్రాండ్‌ని సృష్టించగలిగాను. ఆ తర్వాత రెండేళ్లకు కేబుల్ టీవీ ఎక్విప్‌మెంట్ తయారీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్వర్టర్ పరిశ్రమలో నాకు ఉజ్వలమైన భవిష్యత్తు కనిపించడమే దీనికి కారణంమం”టారు కున్వర్.

కున్వర్ నిర్ణయంతో.. కేబుల్ టీవీ వ్యాపారం నిర్వహిస్తున్న టీం మొత్త సు-కమ్ పవర్ సిస్టమ్స్‌లోకి మారిపోయారు. అలా వారు ఇన్వర్టర్/యూపీఎస్‌లు తయారు చేయడం ప్రారంభించారు. మొదట్లో నేరుగానే అమ్మకాలు చేసినా.. అభివృద్ధికి ఈ మోడల్ సరికాదనే విషయం తొందరగానే అర్ధమైంది కున్వర్‌కి. దీంతో డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు.

జనాలు అంత ఈజీగా ఒప్పుకోలేదు

అప్పట్లో సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే ఇన్వర్టర్లతో పోల్చితే.. సు-కమ్ ప్రోడక్టుల సైజ్ నాలుగోవంతు కూడా ఉండేది కాదు. ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అని జనాలకు అర్ధం అయ్యేట్లు చెప్పి ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చేది. అయితే సు-కమ్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పనిచేస్తున్న మా ఉత్పత్తుల పనితీరు చూసిన తర్వాత.. చాలామందికి నమ్మకం కలిగింది.

“అప్పటి నుంచీ నేను ఈ పరిశ్రమని లీడ్ చేయడం ప్రారంభించాను. ఎప్పటికప్పుడు వినూత్నమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు... కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ప్రోడక్టులు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డాను. మొదట నేను తయారు చేసిన ఇన్వర్టర్ల కారణంగా.. ఇళ్లలో జనరేటర్ల అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎయిర్ కండిషనర్లను నడపగలిగేలా, ఆ తర్వాత పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగేలా... ఇన్వర్టర్ల తయారీ ప్రారంభించాన”ని చెప్పారు కున్వర్.

2000వ సంవత్సరం నాటికి.. ప్రపంచంలోనే ప్లాస్టిక్ బాడీతో ఇన్వర్టర్లు తయారు చేసిన మొదటి కంపెనీగా సు-కమ్ చరిత్ర సృష్టించింది. ఇన్వర్టర్ కారణంగా ఓ బాలుడికి విద్యుత్ షాక్ కొట్టడంతో.. ఈ ఆలోచన చేశారు కున్వర్. ఇవి ప్రజల ఇళ్లలో భాగంగా మారిపోతుండడంతో.. వీలైనంత ఎక్కువగా భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తెలిసొచ్చింది. అయితే.. ఇన్వర్టర్ల నుంచి వెలువడే వేడిని తట్టుకునేంతగా ఎటువంటి ప్లాస్టిక్ అందుబాటులో లేదు అప్పటి మార్కెట్లో.

జీఈ ప్లాస్టిక్స్‌ని సంప్రదించి.. సు-కమ్ ఇన్వర్టర్ల కోసం ప్రత్యేకమైన ప్లాస్టిక్ మెటీరియల్‌ను రూపొందించేలా ఒప్పించారు కున్వర్. ఇలా మొదటి ప్లాస్టిక్ బాడీ ఇన్వర్టర్ అయిన చిక్... ఆ దశాబ్దానికే వినూత్నమైన ఉత్పత్తిగా పేరుగాంచింది. రెండేళ్ల తర్వాత.. సైన్ వేవ్ ఇన్వర్టర్‌ని తయారు చేయడం ద్వారా.. స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ల కారణంగా ఫ్యాన్స్, లైట్స్ నుంచి వచ్చే బజ్జింగ్ సౌండ్‌కు అంతం పలికారు. అంతే... మార్కెట్ లీడర్‌గా ఎదిగిపోయింది సు-కమ్. ఆవిష్కరణ, టెక్నాలజీలతో కూడిన ఉత్పత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందంటారు కున్వర్.

విదేశాల్లో ఉద్యోగాలు వదులుకుని మరీ వచ్చారు !

సు-కమ్ పవర్ సిస్టమ్స్ కోసం కున్వర్, అతని టీం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉన్నా.. ఈ రంగంలో నిపుణులను, సరైన వ్యక్తులను ఎంచుకోవడం చాలా కష్టంగా అనిపించేది అని చెప్పారు కున్వర్. అత్యుత్తమ ప్రతిభ కలిగిన నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఆ రోజుల్లో చాలా క్లిష్టమైన విషయం. భద్రత గల పెద్ద కంపెనీలను వదిలేసి... స్టార్టప్‌ల కోసం పని చేసేందుకు అతి తక్కువ మందే మొగ్గు చూపేవారు. ఐదుగురు టీంతో ఈ ప్రయాణం మొదలుపెట్టాం. అందులో ఒకరు పార్ట్ టైం మాత్రమే పని చేసే ప్లంబర్” అని పాత జ్ఞాపకాలను కున్వర్ గుర్తు చేసుకున్నారు.

ఉద్యోగుల నిర్వహణ కూడా సవాల్‌గానే పరిణమించింది. తన అనుభవమే హెచ్ఆర్ విభాగంలో నైపుణ్యాన్ని ఆపాదించిపెట్టిందంటారు కున్వర్. సాంకేతిక నైపుణ్యంతోపాటే అనుభవం కూడా ఉన్న వ్యక్తులను బోర్డులోకి తీసుకుని... వారిని ఓ టీంగా మార్చి పని చేయించుకోగలగడానికి అనుభవం ఉపయోగపడింది. విపరీతంగా కష్టపడ్డంత మాత్రాన అద్భుత ఫలితాలు వచ్చేస్తాయని అనుకోవడం సరికాదని... కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేయాలని చెబ్తారు కున్వర్. ఈ మధ్యలో వచ్చిన అపజయాలను పాఠాలుగా తీసుకోవాలని సూచిస్తున్నారు

తన ఆలోచనలకు అనుగుణంగా టీంని ఒప్పించగలగడం కూడా తాను ఎదుర్కున్న సవాలే అంటారు కున్వర్. ఈయన ఆలోచించిన, ఊహించుకున్న అనేక ప్రొడక్టులను ఇంజినీర్లు కూడా అసాధ్యమని తేల్చేశారు చాలాసార్లు.

“మా వ్యాపారం పెద్దదిగా మారుతున్న కొద్దీ.. మరింత సామర్ధ్యం ఉన్న వ్యక్తులు మాతో జతయ్యారు. ఇప్పుడు సు-కమ్‌లో పూర్తిగా నిపుణులు మాత్రమే ఉన్నారని గర్వంగా చెబ్తాను నేను. బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు వదిలేసి.. సు-కమ్‌లో చేరేందుకు అనేకమంది ఉత్సాహం చూపుతున్నార”ని చెప్పారు కున్వర్.

90ల్లో స్టార్టప్‌కి నిధులు ఎలా ?

ఇతర స్టార్టప్స్ మాదిరిగానే.. సు-కమ్‌కి కూడా నిధుల సమస్య ఎదురైంది. 1990ల్లో అంటే ఇది ఇంకా కష్టమైన విషయమనే చెప్పాలి. ఈ విషయంలో తనకు సాయం చేసేందుకు ఎవరూ లేరని, కనీసం తాకట్టు పెట్టేందుకు కూడా ఎలాంటి ఆస్తులు అప్పట్లో లేవంటారు కున్వర్. తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తుల్లో ఎవరూ పెట్టుబడులు చేయగల స్థోమత ఉన్న ధనవంతులు కాదు. అందుకే స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తెచ్చి కంపెనీని నిర్వహించారు కున్వర్.

“చెప్పిన డేట్ నాటికి డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితులు అనేకమార్లు ఎదురయ్యాయి. అయితే... నేను ఏనాడూ డబ్బు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు. వారిని కలిసి.. మరింత సమయం ఇవ్వాలని అభ్యర్ధించేవాడిని. అప్పులు ఇచ్చినవారికి వాస్తవ పరిస్థితిని తెలియచేయడం చాలా ముఖ్యమని భావిస్తాను నేను. సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కంటే... వారికి టచ్‌లో ఉండడం ద్వారా నమ్మకం పెంచుకోవచ్చు. 2006లో రిలయన్స్ పవర్ ఫండ్.. మా కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఇది టెమాసెక్, అంబానీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్” అని వివరించారు కున్వర్.

సుదీర్ఘ ప్రయాణం

“సు-కమ్‌తో నా ప్రయణాన్ని రెండు మాటల్లో చెప్పాలంటే.. గొప్ప విషయమే కాదు.. నమ్మశక్యం కానిది కూడా అంటాను. నిర్వహణ, అనేకమందితో కలిసి పనిచేయడం వంటి విషయాలను ఎన్నిమార్లు నేర్చుకున్నానో, మరెన్నిసార్లు మార్చుకున్నానో నాకు కూడా గుర్తు లేదు. కొన్ని విషయాలను నేర్చుకోవడం కంటే... వాటిని వదిలిపెట్టేయడం చాలా కష్టం. కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలతో ఎంతో అనుబంధం ఉన్నాసరే.. వాస్తవ జీవితంలో అవి ఎదురైనపుడు గుడ్డిగా వదిలేయాల్సి వస్తుంది. అదే 90 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సు-కమ్ లాంటి కంపెనీని నడుపుతున్నపుడు.. చేసిన పని తప్పు అని అంగీకరించాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇదే అత్యంత సౌకర్యవంతమైన విధానం అనే భావన నుంచి బయటకు వచ్చి.. కొ్త్త విషయాలను విభిన్నంగా చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది” అన్నారు కున్వర్.

కున్వర్ సచ్‌దేవ

కున్వర్ సచ్‌దేవ


ఆంట్రప్రెన్యూర్‌గా మారాలన్న ఆలోచన తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమమైనదిగా భావిస్తారు కున్వర్. స్వయంగా తనను తాను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుకున్న వ్యక్తికి.. ప్రతీ రోజూ కొత్త సవాళ్లే కాదు.. రివార్డులు కూడా దక్కుతాయంటారు. కొత్త సమస్యలను వచ్చినపుడు ఎదుర్కోవడం, కీలకమైన నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవాల్సి రావడం.. ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయంటారు కున్వర్.

ఒకానొక సమయం వచ్చేసరికి సంపాదించినా, లేకపోయినా.. డబ్బు విషయం వదిలిపెట్టేయాల్సి వస్తుంది. అక్కడ నేర్చుకునే అనుభవమే విలువైనదిగా అనిపిస్తుంది. నీ దగ్గర పని చేసే వ్యక్తుల స్కిల్‌ని కూడా పెంచాల్సి ఉంటుంది. నేను ఇంజినీర్‌నీ కాదు... ఎంబీఏ కోర్సునూ చదవలేదు. కానీ నాకు అవసరమైన పని ప్రతీ వ్యక్తి నుంచీ చేయించుకోగలను. గార్డెనర్ అయినా, ఐఐటీ చదివినవారైనా, లండన్ నుంచీ ఎంబీయే చేసొచ్చినా.. ఎవరితో అయినా నా పని చేయించుకుంటాను. సుదీర్ఘకాలం ఆంట్రప్రెన్యూర్‌గా నిలవగలిగితే.., కళ్ల ఎదురుగా మారిపోతున్న పరిస్థితులు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. నేనిప్పటికి మూడు తరాలకు చెందిన వారితో కలిసి పనిచేశాను. టైప్ రైటర్స్ నుంచి ట్యాబ్లెట్స్ వరకూ అన్నిటినీ చూశాను, చూస్తున్నాను ” అన్నారు కున్వర్.

దేశంలో కొత్తగా అభివృద్ధి సాధిస్తున్న సోలార్ విప్లవంపై దృష్టి సారించారు కున్వర్. భవిష్యత్తులో ప్రతీ ఇంటిలోనూ సౌరవిద్యుత్‌తో నడుస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు... ఆయన దృష్టి పథంలో కనిపిస్తున్నాయి. త్వరలో సౌరశక్తిని సరిగా వినియోగించుకునే దేశాల్లో.. భారత్ అగ్రగామిగా ఎదుగుతుందని ఢంకా బజాయించి మరీ చెబ్తున్నారు కున్వర్. ఇప్పుడు పలు స్టార్టప్‌లకు సలహాదారుగా, మార్గదర్శకునిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కున్వర్. భారతీయులు ఎన్నో వినూత్న వస్తువులను ఆవిష్కరించగల సత్తా ఉన్నవారని,.. ప్రపంచం దీన్ని గుర్తిస్తోందని అంటున్నారాయన.

నేను ప్రారంభించినపుడు ఈ స్థాయికి చేరతానని కలలో కూడా అనుకోలేదు అందుకే యువ ఔత్సాహిక భారతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని భావిస్తున్నాన”న్నారు కున్వర్.

హైద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎల్ఈడీ లైట్స్ తయారు చేస్తున్న ఓ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కున్వర్.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags