సంకలనాలు
Telugu

వీళ్లు తయారుచేసిన రెజ్యూమె మాట్లాడుతుంది

ఉద్యోగాన్వేషకులకు ఎంతగానో ఉపయోగపడే మోడల్... ఆరంభమైన ఐదు నెలలకే 20వేల ప్రొఫైల్స్...

21st May 2015
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి ? మనకున్న అర్హతలతో మంచి సీవి తయారు చేయాలి. అంతేనా అంతకు మించి ఉందంటున్నారు పిన్ హోప్స్. సీవితో పనిలేకుండా ఇప్పుడు వీడియోకి పనిచెప్పాలంటున్నారు. పిన్ హోప్స్ అనేది ఓ వీడియో జాబ్ అప్లికేషన్ పోర్టల్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సులభతరం చేయడంతోపాటు జాబ్ సీకర్స్, రిక్రూటర్స్ సమయాన్ని ఇది సేవ్ చేస్తుంది. వీడియో ప్రొఫైల్ రికార్డు చేసి అప్లై చేసుకొనే వెసులుబాటుని జాబ్ సీకర్లకు కల్పిస్తోంది. స్మార్ట్ ప్లానెట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రాడక్ట్ ఈ పిన్ హోప్స్. 2014 జనవరి మైసూర్‌లో దీన్ని ప్రారంభించారు. వినోద్ జయరాం (సిటిఓ), సతిష్ నరహరి మూర్తి(సీఈఓ) లు దీని వ్యవస్థాపకులు. రిక్రూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, దీనిపై ఎన్నో రకాలైన సర్వేలు చేసిన తర్వాత దీన్ని మొదలు పెట్టారు.

ఐటి, బిపిఓ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, మీడియా, రిటైల్ రంగాలకు ఈ కాన్సెప్ట్ చక్కగా పనికొస్తుంది. ముఖ్యంగా సేల్స్‌లో ఉన్నవారికీ ఉపయోగపడుతుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్ అంతంత మాత్రంగా ఉన్నవారికైతే ఇది ఎంతగానో సాయపడుతుంది.

పిన్‌హోప్స్ టీమ్

పిన్‌హోప్స్ టీమ్


వీడియో ప్రొఫైల్‌తో ఉద్యోగాలకు

ఇటీవల కంపెనీలు ఉద్యోగులకు సంబంధించిన వీడియో ప్రొఫైల్స్‌ను అడగటం ప్రారంభిస్తున్నాయి. దీంతో వీడియో ప్రొఫైల్‌ను తయారు చేసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది. మూడు నుంచి ఐదు నిముషాల నిడివిలో ప్రొఫైల్ తయారు చేసుకోవడం ఈ యాప్‌తో సాధ్యపడుతుంది. అదికూడా ఎంతో సులభం.

స్క్రీన్ ప్రొఫైల్స్

కొన్ని పారామీటర్లలో పిన్‌హోప్స్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానం చేసింది. దీంతో రిక్రూటర్ల టైం సేవ్ అవుతుంది. టాప్ 20 క్యాండెట్ల ప్రొఫైల్స్‌ను షార్ట్ లిస్ట్ చేయడం లాంటి ఎన్నో విషయాలు దీంతో సాధ్యపడతాయి. పిన్ హోప్స్ సాయంతో అటు జాబ్ సీకర్ల తోపాటు ఇటు రిక్రూటర్లకు ఇంటర్వూ స్కెడ్యూల్ బాధలు తీరిపోయాయి. ఎందుకంటే వీడియో ప్రొపైల్ చూడటం వల్ల ప్రిలిమినరీ రౌండ్ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ హోప్స్ సాయంతో మొదటి రౌండ్ స్క్రీనింగ్ పూర్తవుతుంది. ప్రొఫైల్ నచ్చితే తర్వాతి రౌండ్‌కి సెలక్ట్ చేసుకోవచ్చు. సాంప్రదాయ బద్దమైన ఇంటర్వ్యూలకు భిన్నంగా ఇందులో పనిచేసుకోవచ్చు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూని కూడా కొన్ని సార్లు స్కిప్ చేయొచ్చు. అది ఎలా అంటే .. అసింక్రోనస్ ఇంటర్వ్యూ లాంటిది. రిక్రూటర్ అడగాల్సిన ప్రశ్నలను పిన్ హోప్స్‌లో అడుగుతారు. దీనికి జాబ్ సీకర్ వీడియో ప్రొఫైల్ సాయంతో సమాధానం చెబుతాడు. అలా గంటలకొద్దీ జరగాల్సిన ఇంటర్వ్యూలు ఎంతో సులభంగా, తక్కువ సమయంలో పూర్తయ్యే వెసులుబాటు ఉంది. రిక్రూటర్లకు వీడియో ప్రొఫైల్ చేరుకున్నాక, ఆ రోల్‌కి ఫిట్ అవుతాడో లేదో అనే విషయం అర్థం అవుతుంది. 

ఎందుకంటే క్యాండిడేట్ గతంలో పనిచేసిన పొజిషన్ గురించి ప్రొఫైల్‌లో క్లుప్తంగా వివరిస్తారు. ఎంతో తేలిగ్గా అభ్యర్థి గురించి విశ్లేషించొచ్చు. ఇక రెజ్యూమె మిస్ మ్యాచ్ కావడం, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లో ఎలిమినేషన్ లాంటివాటిని ఈ పద్దతిలో దూరం చేయడానికి వెసులుబాటుందని విక్రమ్ ముర్దేశ్వర్ అన్నారు. ఆయన పిన్‌హోప్స్‌లో సేల్స్ మార్కెటింగ్‌కి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి పిలిచే ముందు విద్యార్థిని ఇంకేవైనా అడగాల్సి వస్తే వాటిని అడిగే అవకాశం ఈ పద్దతిలో ఉండటం విశేషం. ఈ డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి పిలవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవచ్చన్న మాట. ఈ పద్దతిలో ఇంటర్వ్యూలు 5నుంచి 10 నిముషాల నిడివి ఉంటుంది. అయితే అవసరం మేరకూ పెంచుకోవడానికి వెసులుబాటుంది.

కార్పొరేట్లకు సరికొత్త బ్రాండింగ్

కంపెనీలు తమ బ్రాండ్‌ని కొత్తగా ప్రజెంట్ చేసుకోడానికి పిన్ హోప్స్ ఎంతగానో సాయపడుతుంది. బ్రాండ్‌లు తమ కార్పొరేట్ వీడియో, బ్రౌచర్, స్లైడ్ షేర్ ప్రజెంటేషన్‌తో పాటు ఇతర లింకులను ఇందులో షేర్ చేసుకోవచ్చు. ఇకపోతే చాలా మంది క్యాండెట్‌లకు కెమెరా షై ఉండటంతో వారు ఈ విడియో ప్రొఫైల్ తయారు చేసుకోలేరనే బాధ అక్కర్లేదు. వారు పంపిన కంటెంట్‌ని ఎంతో జాగ్రత్తగా గైడ్ చేసి ప్రొఫైల్‌ను తయారు చేసేలా చూసుకుంటుంది పిన్ హోప్స్. కంపెనీ ప్రతినిధులు సైతం వీడియో ప్రొఫైల్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీంతో ఈపద్దతికే మొగ్గు చూపుతున్నారని విక్రమ్ చెప్పుకొచ్చారు.

ప్రారంభమైన ఐదు నెలల్లోనే పిన్ హోప్స్ 20వేల రిజిస్ట్రేషన్ లను పొందగలిగింది. ఫిప్కార్ట్, హ్యాపియెస్ట్ మైండ్స్, సిసిడి, ఫస్ట్ సోర్స్ లాంటి కంపెనీలు 10వేల మందిని షార్ట్ లిస్ట్ కూడా చేసుకున్నాయి.

Website: Pinhopes

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags