సంకలనాలు
Telugu

అనగనగా ఒక స్టార్టప్..! దానికొక 14 సూత్రాలు.. !!

17th Jan 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

మసయోషి సన్. సాఫ్ట్ బ్యాంక్ సీఈవో క‌మ్ ఫౌండర్. స్నాప్ డీల్, ఇన్ మొబి, హౌసింగ్, ఓయో వంటి కంపెనీల్లో పెట్టుబ‌డులున్నాయి. స్టార్ట‌ప్ ల విష‌యంలో ఇతను బీభత్సమైన ఎక్స్ ప‌ర్ట్. మ‌రి పండంటి స్టార్టప్స్ కు మ‌స‌యోషి చెప్పిన 14 సూత్రాలు ఆయ‌న మాట‌ల్లోనే చదవండి.

image


1. అస‌లు ఆంట్రప్రెన్యూర్స్ లో ఏం చూడాలి?

సూటిగా చెప్పాలంటే క‌ళ్లలోకి చూడాలి. పెట్టుబడి పెట్టే ముందు ఆంట్రప్రెన్యూర్ ను బాగా ప‌రిశీలించాలి. వారిలో స్పెషాలిటీని ప‌సిగ‌ట్టాలి. పని మీద ప్యాషన్ ఉందో లేదో అంచనా వేయాలి. మంచి టీమ్ ఏర్పాటు చేసుకున్నారో ఆరాతీయాలి. ఆ కంపెనీ మార్కెట్ పెరిగే అవకాశముందా అన్న‌ది విశ్లేషించాలి.

2. ఇండియా ఇప్ప‌టికీ 10 బిలియన్ డాలర్ల మార్కెట్టేనా?

భారత్ లో పదేళ్లలో 10 బిలిబన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తానని ఇదివ‌ర‌కు చెప్పాను. అన్నట్టుగానే గత ఏడాది సాఫ్ట్ బ్యాంక్ ఇండియన్ కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. నిజానికి ఇక్కడి వాళ్లు చాల స్మార్ట్. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. 80 కోట్ల మంది యువతరం. ఐటీ, సన్ షైన్, ఇంగ్లిష్ స్పీకింగ్- ఇండియా గొప్పతనం గురించి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి?

3. భారత స్టార్టప్ లు ఎప్పుడు ఫలితాలిస్తాయి?

తొలి ఐదు నుంచి పదేళ్లలో స్టార్టప్ కు లాభాలే కొలమానం కాదు. ముందుగా కస్టమర్లను సంపాదించుకోవాలి. వారు మెచ్చేలా సేవలందించాలి. బిజినెస్ మోడల్ మెరుగు పరుచుకోవాలి. ఇవన్నీ ఉంటే లాభాలు వాటంతట అవే వస్తాయి. అంతేగానీ కంపెనీలు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేయ‌కూడ‌ద‌న్న‌ది నా ఉద్దేశం.

4. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అవసరమా?

నాక‌ది బాగా అనుభ‌వం. 2000 సంవత్సరంలో అలీబాబాలో ఇన్వెస్ట్ చేశాం. అప్పుడు కంపెనీని చెక‌ప్ చేయ‌డానికి నాకు స‌రైన టీం లేదు. ఇప్పుడలా కాదు. దేనికైనా లాజిక్ వుండాలి.

5. ఇన్వెస్ట్ మెంట్ లో మార్పుల గురించి..

ఇదివరకు గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకున్న ఇన్ మొబి వంటి కంపెనీల్లో సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టిన భారత స్టార్టప్స్ లో పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు ఇండియా టైమ్ వచ్చింది. ఇండియన్ ఎకానమీ చాలా పెద్దది. చైనాలా భారత్ కూడా దూసుకెళ్తుంది.

6. ప్రపంచ మార్కెట్లతో ఇండియన్ స్టార్టప్స్ పోటీ

ఈ-కామర్స్ వంటి రంగాల్లో స్థానిక ఆంట్రప్రెన్యూర్లకు మంచి అవకాశాలున్నాయి. చిన్న మార్కెట్ ఉన్న చిన్న దేశంలో ఆంట్రప్రెన్యూర్ కు టాలెంట్, సత్తా ఉన్నప్పటికీ.. గ్లోబల్ మార్కెటీర్లతో పోటీ ఒక్కోసారి కష్టతరంగానే ఉంటుంది. చైనా, భారత్ లకు దేశీయంగా పెద్ద మార్కెట్ ఉంది. అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

7. 2000 సంవత్సరానికి, నేటికి తేడా?

భారత్ లాంటి దేశానికి ఇది తొలిఅడుగు అని నా ఫీలింగ్.

8. మానవ మేథస్సును అధిగమించే శ‌క్తి?

స‌రిగ్గా 30 ఏళ్ల త‌ర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించగలను. ప్రతీ మనిషికి పర్సనల్ కంప్యూటర్ లేదా అలాంటి ఇతర డివైజ్ ఉంటుందని 30 ఏళ్ల కిందటే ఊహించి చెప్పాను. రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సు హ్యూమన్ ఇంటలిజెన్స్ ను చాలా రకాలుగా అధిగమిస్తుంది. కృత్రిమ మేథస్సు ద్వారా కాలిక్యులేషన్, స్టోరేజీ, కమ్యూనికేషన్ పది లక్షల రెట్లు వేగంగా ఉంటుంది. ఇక అప్పుడు బిజినెస్ మోడల్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ ఒక రేంజ్ కు వెళ్తుంది. సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న బిజినెస్ విధానం మారాలి. వ్యాపారాల్లో కంప్యూటింగ్, డీప్ లర్నింగ్ ప్రాసెస్ పెరగాలి.

9. ప్రభుత్వ పాత్ర

లైసెన్స్ ప్రక్రియ! కంపెనీలకు అదో పెద్ద అవరోధం. అలాంటి అడ్డంకులను తొలగించడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. కంపెనీలకు మౌలిక వసతులు కల్పించడమూ ప్రభుత్వ బాధ్యతే. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలు మొబైల్ ఫ్రెండ్లీ బ్రాడ్ బ్యాండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ సదుపాయాలు కల్పించాలి.

10. ఇండియా ఈ-కామర్స్ ఐపీవో

వచ్చే ఐదూ పదేళ్లలో భారత ఈ-కామర్స్ ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) తెరమీదికి వస్తుంది. ఇప్పుడే తొందరపడాల్సిన పనిలేదు. అయితే ఇండియన్ ఈ-కామర్స్ లోకి నిధుల ప్రవాహాన్ని కొనసాగిస్తాం.

11. సంపద

2000 సంవత్సరంలో ఓ మూడు రోజులు బిల్ గేట్స్ కన్నా నేనే రిచ్. ఆ తర్వాతి ఏడాదే షేర్ ధర 99 శాతం ప‌డిపోయింది. చేసే ప‌నిమీద ప్యాష‌న్ ఉండాలే గానీ ఎలాంటి ఎదురుదెబ్బ‌లైనా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది.

12. సాఫ్ట్ బ్యాంక్ విజ‌న్

తెలివితేట‌లు, విజ్ఞానం విష‌యంలో నంబ‌ర్ వ‌న్ ప్రొవైడ‌ర్ గా ఉండాల‌న్న‌దే మా విజ‌న్. అదెప్ప‌టికీ మార‌దు. ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌ల్యూష‌న్ క‌న్నా ఇన్ఫ‌ర్మేష‌న్ రెవల్యూష‌న్ వంద రెట్లు పెద్ద‌ది.

13. ఆంట్ర‌ప్రెన్యూర్ల ఫెయిల్యూర్స్

కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎప్పుడూ ఒక విష‌యం గుర్తుపెట్టుకోవాలి. షిప్ లో తానే ఆఖ‌రి వాడిన‌ని భావించాలి. ఏదైనా సంక్షోభం పొంచి ఉన్న‌ప్పుడు- షిప్ ను తాను సేవ్ చేయ‌గ‌ల‌న‌న్న విశ్వాసం ఆంట్ర‌ప్రెన్యూర్ కి ఉండాలి. అప్పుడే జ‌నం మిమ్మ‌ల్ని ఫాలో అవుతారు.

14. ఇండియాలో బిగ్ రిస్క్

ఇండియ‌న్ స్టార్ట‌ప్స్ పెద్ద ఫిగర్ వున్న చెక్స్ అందుకుంటున్నాయి. మంచిదే. అయితే ఇక్క‌డ ఒక విష‌యం! ఇంకా ఎలాంటి సేవ‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు అందించకముందే డ‌బ్బు చేతిలోకి వ‌చ్చిందన్న విష‌యాన్ని ఆంట్ర‌ప్రెన్యూర్లు గుర్తించాలి. అది తెలుసుకొని మ‌స‌లుకుంటే మంచిది.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags