సంకలనాలు
Telugu

వ్యాపకంగా మొదలై అద్భుత వ్యాపార స్థాయికి‍ ! 15 మంది బేకింగ్ మహారాణుల సక్సెస్ సీక్రెట్స్

team ys telugu
17th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సృజనాత్మకతకు ఎల్లల్లేవు. ఆలోచనల్లో సృజనశీలత ఉంటే చేసే ఏ పనిలోనైనా అది ప్రతిఫలిస్తుంది. కృషికి కాస్తంత ఆలోచనా, వినియోగదారుల ఆలోచనల్ని పసిగట్టే నేర్పు ఉంటే చాలు. కొత్తదనానికి కొదవేం ఉంటుంది? అదే నిరూపించారా మహిళలు.

సరే, వీళ్ళ వ్యాపార సరళి ఎలా ఉంటుంది, ఇంటినుంచి వ్యావారాల్ని ఎలా నడపగలుగుతున్నారు, ఈ క్రమంలో వారికి ఎదురవుతున్న సవాళ్ళేమిటి? జవాబు తెలుసుకోవాల్సిన ప్రశ్నలే మరి. అందుకనే ఇటీవల పలువురు హోం బేకర్స్ తో మేం మాట్లాడాం. వారిలో- ఈ మార్గంలో ఇతరులకు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచే ముగ్గురు ప్రసిద్ధ బేకర్లు- రుమమా జస్సీల్, పూరన్ మరియా ప్రేమ, జీ టాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే దాని ద్వారానే హోం బేకర్లు ఒకరితో ఒకరు అనుసంధానం కాగలుగుతున్నారు, పరస్పరం స్ఫూర్తిని అందించుకోగలుగుతున్నారు.

తాము తయారు చేసే ప్రతి కేక్ మీదా తమదైన కళాత్మక ముద్రను సృష్టిస్తున్న 15 మంది మహిళా బేకర్ల వివరాలివిగో.. చదవండి...

  1. రుమనా జస్సీల్- ఇంక్రెడిబుల్ ఆర్ట్ IncrEDIBLE Art

వృత్తి పరంగా చూస్తే ఆమె రిజిస్టర్డ్ డైటీషియన్. కానీ బడికి వెళ్ళడం ఆరంభించినప్పటినుంచీ, అంటే పదమూడేళ్ళ వయసు నుంచీ బేకింగ్ అంటే రుమనాకి ఎనలేని ఇష్టం. అదే ఆమెను ఇంటి నుంచీ ఈ వ్యాపారం సాగించేందుకు ప్రేరేపించింది. 2008లో ఆమె ఈ వ్యాపారం ఆరంభించారు. అప్పట్లో ఆర్కుట్ మాత్రమే సామాజిక మాధ్యమం. 2011లో ఫేస్ బుక్‌లో అధికారికమైన వ్యాపార పేజీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసింది లేదు. కేరళలోని కొచ్చిన్ కేంద్రంగా కేక్ బేక్ అనే చిన్న ప్రయత్నంతో మొదలైన ఆమె పయనం ఇంక్రెడిబుల్ ఆర్ట్ అనే సంస్థ స్థాయికి ఎదిగిందంటే అదంతా బేకింగ్ మీద ఆమెకున్న అపారమైన ఆసక్తే.

తనకు ఇష్టమైన వారికోసం బేకింగ్ చేయడం ద్వారా ఈ వ్యాపకం మొదలై వ్యాపారంగా విస్తరించిందంటారు ముగ్గురు పిల్లల తల్లయిన రుమనా. తన కొత్త అకాడమీ ఇంక్రెడిబుల్ ఆర్ట్, ఆర్టిసన్ కేక్ బోటిక్ లలో ఆమె బేకింగ్ పాఠాలు కూడా చెబుతూంటారు.

2. పూనమ్ మరియా ప్రేమ్- జోయీస్ బేక్ హౌస్


జోయీస్ బేక్‌హౌజ్

జోయీస్ బేక్‌హౌజ్


హైదరాబాద్‌కు చెందిన పూనమ్‌ను ఇష్టపడనివారూ, ప్రశంసించనివారూ దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు.

“ఉద్యోగం మానేసిన తరువాత, ఫుల్ టైమ్ పనులేవైనా చేయాలనుకున్నాను, అయితే అది ఇంటినుంచి చేసేదై ఉండాలి, కాబట్టి ఆ రెండిటినీ సమన్వయం చేయడం ఎలా అన్న ఆలోచనలో పడ్డాను. పనినీ, జీవితాన్నీ సమన్వయం చేసుకోవడంలో తల్లులు ఎంతో హైరానా పడుతూండడం మనకు తెలిసిందే. నాకు అయిదేళ్ళ కూతురుంది. ఆమెను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఇంటి నుంచే పని చేసుకోవడం నాకు సౌకర్యంగా ఉంటుందనిపించింది” అని ఆమె అన్నారు. పూనమ్ ప్రయత్నం విజయవంతమయింది. ఆమె తయారుచేసేవాటికి గొప్ప డిమాండ్ ఉంది. ఆమె వెబ్ సైట్ నిర్వహణలో భర్త సాయం తీసుకుంటున్నారు

3. అదితి కోహ్లీ- పాపిల్లన్ కప్ కేక్స్ అండ్ మోర్

అదితి కోహ్లీది చాలా సామాన్యమైన ఆరంభం. ఢిల్లీకి చెందిన ఆమె ఓ ఫ్రెండ్ పుట్టినరోజు కేక్ తయారీ ఆర్డర్‌తో 2012లో బేకింగ్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.

ఇంటి నుంచీ పనిచేయడంలో సౌలభ్యం, సౌకర్యం ఉంటాయి. అందుకనే ఆమె హోమ్ బేకర్‌గా మారారు. “ఇంట్లోంచీ పని చేయడంలో దానివైన ప్రయోజనాలున్నాయి. నేను ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా పని మొదలుపెట్టగలను, నేను ఎంత ఆలస్యంగానైనా పని చేసేందుకు వీలుంటుంది” అన్నారామె.

అదితికి బేకింగ్ ను ఆమె కజిన్స్ పరిచయం చేశారు. వారితో కలిసి ఆమె బేకింగ్ మొదలెట్టారు. ఆమెకు ఆహారం అంటే ఇష్టం. అమెరికా వెళ్ళినప్పుడు తన అభిరుచిని చాలా సీరియస్‌గా తీసుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే Le Cordon Bleu లో పేస్ట్రీలూ, కేక్‌ల తయారీ డిప్లమా కూడా చేశారు.

4. మోనికా మన్‌చందా- సిన్-ఎ-మోన్

బెంగళూర్ నగర దీపావళి సందడిలో మోనికా మన్ ఛందా బేకరీ ఉత్పత్తులది ప్రత్యేక స్థానం. 2011లో ఆమె హోమ్ బేకింగ్ ఆరంభించారు. దీపావళి సందర్భంగా స్పైక్డ్ డెసర్స్ట్, ఫ్యూజన్ డెసర్స్ట్ తయారీ ఆమె ప్రత్యేకత. “నాకు అనువైన సమయంలో పని చేసుకునే వెసులుబాటునూ, అత్యుత్తమమైన దినుసులు ఉపయోగించే సౌలభ్యాన్నీ... అదే సమయంలో ఖర్చులు కాస్త నియంత్రణలో ఉండే అవకాశాన్నీ ఇది నాకు కల్పిస్తోంది. ఎందుకంటే అద్దెల్లాంటి భారాలేవీ దీనిలో ఉండవు” అంటారామె. అన్నట్టు ఆమె గతంలో ఐ.టి. రంగంలో పని చేశారు. ఆ అనుభవంతోనే సొంత వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నారు.

5. కార్తికా స్రవంతి- బేక్ మేన్ బిగిన్స్

వివాహ వేడుకల్లో నోరూరించే కేక్‌ల రుచి ఉంటే అదిరిపోవాలంటారా ? బేక్స్ మేన్ బిగిన్స్‌కు వెళ్ళాల్సిందే మరి. చెన్నైలో 2012 సెప్టెంబర్ లో కార్తికా స్రవంతి దీన్ని ఆరంభించారు. ఫ్రెంచ్ డెసెర్ట్స్, వేడుకలకోసం రూపొందించే కేక్‌లు- ముఖ్యంగా వెడ్డింగ్ కేక్స్ ఆమె ప్రత్యేకత. లండన్ లోని Cordon Bleu కి వెళ్ళి, పాఠాలు చెప్పాలన్నది కార్తిక తాజా ప్రణాళిక.

బేక్‌మెన్ బిగిన్స్

బేక్‌మెన్ బిగిన్స్


6. ప్రియా విజన్ గుప్తా- మెల్ట్ ఇట్ డౌన్

అభిరుచినే ఉపాధి మార్గంగా మార్చుకున్న ప్రియా విజన్ గుప్తా బెంగళూర్ కు చెందినవారు. 2012 ఏప్రిల్ లో బేకింగ్‌ను ఆమె మొదలెట్టారు. స్నేహితుల నుంచీ, జనం నుంచీ అందిన అభినందనలూ, ప్రేరణే తాను ఈ రంగాన్ని ఉపాధిగా ఎంచుకోవడానకి కారణమంటారామె. అన్నట్టు ఈ మధ్యనే ‘షుగర్ సైడ్ అప్!’ అనే బ్లాగ్‌ని డెసర్ట్ ప్రేమికుల కోసం ప్రత్యేకించి ఆమె ఆరంభించారు కూడా. బేకింగ్‌లో తనకున్న పరిజ్ఞానాన్నంతటినీ దీనిద్వారా ఆమె పంచిపెట్టగలరు. “ముడి సరుకుల కొనుగోలు నుంచీ బేకింగ్, అలంకరణ, తుదిమెరుగులు దిద్దడం లాంటివన్నీ నేనే స్వయంగా చేస్తూంటాను” అని ఆమె అంటున్నారు.

7. హీనా అవస్థ్తి- డూ ఇట్ స్వీట్

“స్వీపర్ నుంచి సి.ఇ.ఓ. వరకూ, కలుసుకునే కేంద్రంగా నేను నిలుస్తున్నా”నని సగర్వంగా చెబుతారు హీనా. ఆరేళ్ళ కిందట బేకింగ్ వ్యాపారంలో అడుగుపెట్టినప్పుడు ఇంత భారీ స్థాయికి ఇది పెరుగుతుందనీ, మళ్ళీ మళ్ళీ ఆర్డర్లు అందుకుంటాననీ బెంగళూరుకు చెందిన హీనా ఊహించలేకపోయారు. ఆమె తయారుచేసే గూయీ చాకోలేట్ కేక్, తాజా fruitgateaux లాంటివి ఆమె వినియోగదారుల్లో మంచి ప్రాచుర్యం పొందాయి. ఫోండెంట్‌ని ఆమె సొంతంగా తయారు చేస్తారు. కస్టమర్ల విషయంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఫోన్ కాల్స్, మెయిల్స్, ఆర్డర్ల విషయంలో పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని చెబ్తారు. ఇంటినుంచి పని చేయడం వల్ల ఆమెకు వెసులుబాటు దొరుకుతోంది. దీనితో నాణ్యతను పాటించేందుకూ, తాను తయారుచేసే ప్రతిదానిమీదా వ్యక్తిగత శ్రద్ధనూ, ప్రత్యేకతనూ చూపించేందుకూ అవకాశం లభిస్తోందని ఆమె అంటున్నారు.

8. నజియా ఆలీ- బేకింగ్ ఎక్స్‌ప్రెస్

అభ్యాసం, ప్రయోగశీలత మెరుగైన ఫలితాలను అందించాయి. తద్వారా ఆమె కలను సాకారం చేశాయి. “ఇద్దరు పిల్లలు పుట్టాక, ఫుల్ టైం ఉద్యోగం నాకు అందని కలగానే మిగిలిపోయింది. పిల్లల సంరక్షణలోనే నా సమయంలో చాలా భాగం గడిచిపోయేది. కానీ, నాకోసం కూడా ఏదో ఒకటి చేయాలనే తపన మాత్రం నాలో నిలిచే ఉంది. బేకింగ్ విషయంలో నాకున్న ఆసక్తి, ఆపేక్ష కలిసి బేకింగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఆరంభించేలా నన్ను ప్రోత్సహించాయి” అన్నారు నజియా

ప్రతిరోజూ ఓ కొత్త పాఠమే, ప్రతిఒక్కరూ తమతమ నైపుణ్యాలనూ, పరిజ్ఞానాన్నీ మెరుగుపరుచుకుంటూ ఉండాల్సిందే అన్నారు నజియా, తన అనుభవాల్ని క్లుప్తమైన మాటల్లో చెబుతూ.

బేకింగ్ ఎక్స్‌ప్రెస్

బేకింగ్ ఎక్స్‌ప్రెస్


9. పుర్బాషా సహా- స్వీట్ నథింగ్స్ కోచర్ కప్ కేక్స్

ఓ ఎలక్ట్రికల్ మిక్సర్, ఓ కన్వెన్షన్ ఓవెన్, కొలిచేందుకు కప్పులూ, స్పూన్లూ- ఓ హోమ్ బేకర్ కావడానికి ప్రాథమికంగా కావాల్సిన వనరులు ఇవేనా? ఊహూ... “ముఖ్యంగా కావాల్సింది మరోటుంది... అదే అంకితభావం” అంటున్నారు పుర్బాషా. వ్యాపారానికి సంబంధించిన చిట్కాలూ, రహస్యాలూ కూడా దీనితోపాటు తెలిసుంటే ఇక తిరుగే ఉండదు. పుర్బాషా బేకింగ్‌లో తనకు తానే గురువు. మన బలాలను మనం తెలుసుకోవడం, ఆధారపడదగిన వంట పద్ధతులనే ఉపయోగించడం ముఖ్యమని ఆమె నమ్ముతారు. కేకుల డిజైనింగ్ చేస్తున్నప్పుడు తన ఆర్కిటెక్చర్ డిగ్రీ అక్కరకు వస్తోందని పుర్బాషా అంటున్నారు. అంతేకాదండోయ్, ఆమె చెప్పే ఓ ముఖ్యమైన విషయం కూడా ఉంది. “స్టార్టప్‌ను చిన్న పాపాయిని సాకినంత శ్రద్ధగా సాకాలి” అంటారామె.

10. రజని శశిధర్ గంపా- జీనీస్ గూడీస్

రజనీకి మొదట్నుంచీ కళాత్మకమైన పనులంటే మక్కువ. అందుకనే బేకింగ్ ఆమె నైపుణ్యానికి ప్రదర్శన శాలగా మారింది. 2011 ఫిబ్రవరిలో ఈ వ్యాపారంలోకి ఆమె అడుగుపెట్టారు. బేకింగ్‌ను ఆమె మొదలెట్టింది తీవ్రమైన ఇష్టంతోనే తప్ప వ్యాపారంగా కాదు. “మా ఇంట్లో ఉన్న చిన్న సామాన్యమైన వంటింట్లోనే నా బేకింగ్ పని నేను ప్రారంభిస్తూంటాను. ప్రస్తుతం అందరూ ఇష్టపడుతున్నదీ, గిరాకీ ఉన్నదీ థీమ్‌ల ఆధారంగా తయారుచేసే కేకులకే. అయితే, కేక్స్ డిజైన్‌కి కూడా తత్సమానమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే చూడగానే ఆ డిజైన్లు కట్టిపడేస్తూంటాయి. ఇప్పుడు రెడ్ వెల్వెట్, ఫెర్రో రోచెర్, రసగుల్లాతో చాక్లెట్ లాంటి కొన్ని రుచుల హవా నడుస్తోంది” అని రజనీ చెప్పారు.

11. పూనమ్ అన్ వర్మ- బిగ్ కేక్ లిల్ కేక్

బిడ్డను ఆయా దగ్గర ఇంట్లో వదిలేసి వెళ్లాల్సిందేనా ? అనే ప్రశ్న ఎదురైనప్పుడు అక్కర్లేదనే నిశ్చయించుకున్నారు పూనమ్. ఇంట్లోనే ఉంటూ బేకింగ్ మొదలెట్టారు. ఆమె డిమాండ్లకూ, స్వీట్ ట్రీట్లకూ డిమాండ్ పెరగడంతో ఇంటినుంచే బేకింగ్ వ్యాపారం కొనసాగించారు. “బేకింగ్‌కు కావాల్సిన మొదటి దినుసు దాని మీద అంతులేని ఇష్టమే” అని చెబుతున్నారు పూనమ్.

12. అనఘా గుంజల్ రెడ్డి- సిన్‌ఫుల్ బేక్స్

అనఘా గుంజల్ రెడ్డి ఇష్టం కొద్దీ పడిన కష్టం అందించిన ఫలితం సిన్‌ఫుల్ బేక్స్. బెంగళూరుకు చెందిన ఆమె బేకింగ్‌ను సొంతంగానే నేర్చుకున్నారు. వీడియోలు చూశారు, ఆహారం, బేకింగ్‌ల గురించి తెలిపే బ్లాగులు చదివారు. పింట్రెస్ట్ అంటే ఆమెకు అపారమైన ఇష్టం. “చాలా ఏళ్ళ కిందట ఓ ప్రెజర్ కుక్కర్ లో మా నాయనమ్మ తయారుచేసిన మామూలు ఎగ్ లెస్ కేక్ కన్నా అసాధారణమైనవేవీ ఈ రోజున కనిపించడం లేదు” అన్నారు అనఘా.

సిన్‌ఫుల్ బేక్స్

సిన్‌ఫుల్ బేక్స్


13. లతాకిరణ్- ఇట్స్ యమ్మ్

వండడం అంటే లతకు బడికెళ్ళే వయసునుంచీ ఇష్టమే కానీ, బేకింగ్‌ను ఓ వృత్తిగా మొదలుపెట్టింది మాత్రం రెండేళ్ళ కిందటే. అకృతులతో ఉండే థీమ్ కేకుల తయారీ ఆమె ప్రత్యేకత. బెంగళూర్‌కి చెందిన ఆమె కోడిగుడ్లు లేకుండా బేకింగ్ నేర్పించే ఓ కోర్సు కూడా చేశారు. అదిమాత్రమే కాదండోయ్, కొన్ని స్టాల్స్ కూడా నిర్వహించారు. “సరైన పరికరాల సెట్ దగ్గరుండాలి, అవి కొమ్ము గరిటె లేదంటే బ్రెడ్ నైఫ్ లాంటి ప్రాథమికమైనవైనా కావచ్చు, అవి ఉత్పత్తికి తుదిమెరుగులు దిద్దడంలో ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి” అని ఆమె చెప్పారు.

14. రాధికా నాగరాజ్- ది వార్మ్ ఒవెన్

నాలుగేళ్ళ కిందట వాణిజ్యపరంగా బేకింగ్‌ని రాధిక ఆరంభించారు. ఆమె ఎక్కువగా చేసిన బర్త్‌డే కేక్‌లూ, హోల్ వీట్ బ్రెడ్ తయారు చేస్తారు, అవి కూడా ఆర్డర్ల మీదనే. ఆమె కుమారుడు ప్రీస్కూల్ కి వెళ్ళడం మొదలెట్టినప్పుడు, తల్లిగా పూర్తికాలపు బాధ్యతలే కాకుండా, ఇతర బాధ్యతలను కూడా చక్కబెట్టుకునేందుకు ఇది దోహదం చేసింది. ఇంట్లోనే బేకింగ్, కేక్ అలంకరణ తరగతుల్ని రాధిక నిర్వహిస్తున్నారు. “పోషకాహారం గురించీ, సరిపడని ఆహారాల గురించీ అవగాహన పెరుగుతోంది. అందుకనే గ్లుటెన్ లేని, చక్కెర లేని పదార్థాలను కూడా ఓ బేకర్ రూపొందించగలిగి ఉండాలి” అని ఆమె అన్నారు.

15. తృప్తి అహుజా- శిషామ్- హ్యాపీ బెల్లీ బేక్స్

తృప్తి అహూజా ఓ పేస్ట్రీ వంట నిపుణురాలు. శిషామ్ ఇంట్లోనే చాక్లెట్లు విక్రయిస్తూండేవారు. వీరిద్దరూ కలిసి 2008 నుంచీ బెంగళూరులో హ్యాపీ బెల్లీ బేక్స్ నిర్వహిస్తున్నారు. వారి సంయుక్త యాజమాన్యంలోని ఈ హ్యాపీ బెల్లీ బేక్స్ స్టోర్ కమ్ కేఫ్‌గా నడుస్తోంది. అన్ని సందర్భాలకూ ప్రత్యేకమైన కేక్‌లకు రూపకల్పన చేయడం వారిది అందెవేసిన చెయ్యి.

హ్యాపీ బెల్లీ బేక్స్

హ్యాపీ బెల్లీ బేక్స్


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags