ఇన్వెస్టర్లు రెడీ.. పర్ఫెక్ట్ ఐడియాలే హైదరాబాద్‌లో కొరత

స్టార్టప్స్ ఉన్నా ఫండింగ్ విషయంలో అసంతృప్తి ఉంది.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించలేకపోవడమే సమస్యకంపెనీలో వేల్యూను చూపించడంలో మనవాళ్లు వెనుకబడ్తున్నారుదాన్ని అధిగమిస్తే ఫండింగ్ సమస్యే కాదుస్టార్టప్ సాటర్‌డేలో ఏంజిల్ ఇన్వెస్టర్స్

ఇన్వెస్టర్లు రెడీ.. పర్ఫెక్ట్ ఐడియాలే హైదరాబాద్‌లో కొరత

Sunday September 13, 2015,

2 min Read

స్టార్టప్ సాటర్ డే పేరుతో.. ప్రతీనెలా రెండో శనివారం హైదరాబాద్‌లోని లామకాన్‌లో స్టార్టప్ మీట్ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే ఔత్సాహికులు అక్కడ నెట్వర్కింగ్ చేసుకోవడంతోపాటు కొంత మంది సక్సెస్ స్టోరీలు విని ఉత్సాహం పొందుతూ ఉంటారు. ప్రతీ వారం ఒక్కో కాన్సెప్ట్‌తో ఇలాంటి మీట్ ఆర్గనైజ్ చేస్తుంటారు నిర్వాహకులు. అయితే ఈ సారి ఫండింగ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ కంపెనీలు.. ఇతర్ నగరాల స్థాయిలో ఫండ్స్ ఎందుకు రెయిజ్ చేయలేకపోతున్నారనేది ఈ సారి హాట్ టాపిక్. గతంలో ఎలా ఉన్న ఇప్పుడు మాత్రం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయనే సంకేతాలు మాత్రం మొదలయ్యయి. 

ఇప్పుడిప్పుడే నగరంలో ఇన్వస్ట్‌మెంట్ మీట్‌లు, ఫండర్స్ మీటప్స్ విరివిగా జరుగుతున్నాయి ఏంజిల్ ఇన్వెస్టర్స్ వివరించారు. ఇక్కడ మొదలయ్యే స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లేకపోవడం ఫండింగ్ పొందడానికి ప్రధాన డ్రాబ్యాక్ గా ఆటో డెస్క్ ప్రతినిధి రాజీవ్ శివాని అభిప్రాయపడ్డారు. సాధారణంగా స్టార్టప్ అంటే బూట్ స్ట్రాపుడ్ గానే ప్రారంభమవుతాయని, 18నుంచి 24మాసాల పాటు దానికి సీడ్ ఫండింగ్ చేసుకుంటూ మార్కెట్ లో నిలదొక్కుకుంటే ఖచ్చితంగా మంచి ఫండ్‌ని రెయిజ్ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

image


"మన స్టార్టప్ లకు మరింత ప్రొఫెషనలిజం అవసరం. ప్రారంభించడమే కాదు దాన్ని మరింత ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకెళ్లాలి" అన్నారు రమేష్ లోగనాథన్.

చర్చకి హోస్ట్‌గా వ్యవహరించిన హైసియా అధ్యక్షుడు రమేష్ లోగనాథన్ కూడా విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఫండర్స్ దగ్గర డబ్బు ఉంది కానీ.. ఈజీ మనీ మాత్రం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. స్టార్టప్‌కు ఫండింగ్ ఇవ్వడం ఒక కోణమైతే.. అది ఎలాంటి పెద్ద సమస్యలకు పరిష్కారం సూచించగలుగుతోంది.. అనే విషయాన్ని కూడా చూపించగలిగితే ఫండ్ రెయిజ్ చేయడం పెద్ద కష్టం కాదని ఇన్వెస్టర్ వివేక్ అన్నారు. సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ విషయంలో కూడా ఇది ముఖ్యమని వివరించారు. వాళ్ల సంస్థ ద్వారా ఎలాంటి ప్రభావాన్ని సమాజంపై చూపించారు, దానివల్ల క్రియేట్ అయిన వేల్యూని అర్థమయ్యేలా వివరిస్తే ఖచ్చితంగా ఫండ్ రెయిజ్ చేయొచ్చని మరో ఏంజిల్ ఇన్వస్ట్‌మెంట్ ప్రతినిధి వినుతా చెప్పారు.

image


ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో స్టార్టప్‌లు ప్రారంభం మాత్రమే చూశాం. చాలా తక్కువ కంపెనీలు ఫండ్స్‌ని రెయిజ్ చేశాయి. కానీ ప్రస్తుతం సీన్ మారుతోంది. వచ్చే ఆరు నుంచి 12 నెలల వ్యవధిలో స్థానిక స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలా ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమ్మిట్‌లతోపాటు మరికొన్ని ఈవెంట్స్ ప్రధానంగా ఫండ్ రెయిజింగ్ పైనే సాగుతుండటం, తరచూ జరిగే చర్చలు ఇక్కడి స్టార్టప్‌లకు మంచి పరిణామమే.