సంకలనాలు
Telugu

క్యాష్ బ్యాక్ ఆఫర్లతో క్రేజ్ సంపాదిస్తున్న'గెట్ ఎక్స్‌ట్రా బక్స్'

గెట్ ఎక్స్‌ట్రా బక్స్ తో ఎక్స్ ట్రా ఆదా ..క్యాష్ బ్యాక్‌తో ఆకట్టుకుంటున్న స్టార్టప్

CLN RAJU
17th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ వస్తోందంటే తెగ హ్యాపీ ఫీలవుతుంటాం. క్యాష్ బ్యాక్ స్కీమ్‌లో ఉన్న ఆకర్షణమంత్రం అదే. ఎందుకంటే ఏమీ చేయకుండానే మనకి అదనంగా ఆదాయం వస్తుంది. ఇక ఈ రోజుల్లో క్యాష్ బ్యాక్ పొందడం కూడా చాలా ఈజీ. ఏముంది పెద్దపెద్ద కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ సంపాదించడం... ఆ తర్వాత దాన్నిక్యాష్ చేసుకోవడం. లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్ చేసే వెబ్ సైట్లలోకి సైనప్ అవ్వడం ఆన్ లైన్ కొనుగోళ్లతో క్యాష్ బ్యాక్ రూపంలో లాభం పొందడం.

భారతీయ క్యాష్ బ్యాక్ సైట్ల మార్కెట్లో ఇప్పటికే చాలా ప్లేయర్లున్నారు. క్యాష్ కరో.కామ్, పెన్నీఫుల్.ఇన్, బ్యాగౌట్.కామ్,అప్నాక్యాష్ బ్యాక్.కామ్ వంటి సైట్లు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి.

image


విభిన్నంగా గెట్ ఎక్స్ ట్రా బక్స్

సుమారు 200 చిల్లర వ్యాపార సంస్థల గురించి వీళ్లూ ఢంకా బజాయిస్తుంటారు. క్యాష్ బ్యాక్ రూపంలో కొంత మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తుంటారు. కూపన్లు ..డిస్కౌంట్లంటూ ఆకర్షిస్తారు. మిగతా వాటిలాగే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది వీటి వ్యవహారం. అయితే ఇతర వెబ్ సైట్లకీ... గెట్ ఎక్స్‌ట్రా బక్స్‌కి ఉన్న వ్యత్యాసమేంటంటే ఈ సైట్‌లో ధరలను సరిపోల్చుకునే వెసులుబాటు , స్మార్ట్ లాగిన్ సౌలభ్యం.

వాస్తవానికి ధరలు సరిపోల్చుకోవడం అనేది కొత్త విషయం కాకపోయినా క్యాష్ బ్యాక్ ఇచ్చే వెబ్ సైట్లలో ప్రైస్ కంపారిజన్‌తో పాటు కూపన్ అందివ్వడమే దీని స్పెషాలిటీ. ప్రైస్ కంపారిజన్ పేజీలోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసే వీలుంటుంది అని గెట్ ఎక్స్‌ట్రా బక్స్ సహ వ్యవస్థాపకులు కేఆర్ ముర్లే చెబ్తున్నారు. స్మార్ట్ లాగిన్ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే గెట్ ఎక్స్ ట్రా బక్స్ సైట్‌లోకి లాగిన్ అవ్వకుండానే సరాసరి రిటైల్ సైట్ నుంచే క్యాష్ బ్యాక్‌తో కొనుగోలు చేసుకోవచ్చు.

మార్కెటింగ్

ఈ సైట్ వయసు ఎనిమిది నెలలే. ఇప్పటివరకు ప్రమోషన్, మార్కెటింగ్‌పై పెద్దగా పెట్టబడి పెట్టలేదు. ‘ప్రస్తుతానికి సాంకేతికంగా ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపైనే మా ఆలోచన. నిధులు సమకూరగానే దూకుడుగా మార్కెటింగ్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాం. మాకున్న ప్రత్యేకతలతో క్యాష్ బ్యాక్ సైట్ విపణిలో దూసుకుపోతామన్న నమ్మకముంది’ అన్నారు ముర్లే. ఫ్లిప్ కార్ట్, మింత్ర, అమెజాన్.కామ్ నుంచే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ప్రతీరోజు సుమారు పదిహేను వందల మంది ఈ సైట్‌ని చూస్తుంటారు. గడిచిన కొద్ది నెలల్లో సుమారు లక్ష రూపాయల వరకు క్యాష్ బ్యాక్ రూపంలో అందించాం. ‘కాలేజీ స్టూడెంట్స్, ఐటీ కుర్రాళ్లే మా టార్గెట్. అందుకే కొన్ని కాలేజీల్లో ఫెస్ట్‌లు కూడా స్పాన్సర్ చేశాం. దీంతో మా సైట్ గురించి వారిలో అవగాహన పెరిగింది. అయితే సృజనాత్మకతను జోడించి ఇంకా దీన్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నామన్నారు ముర్లే.

సవాళ్లు

కనీస నిధులతోనే ముందుకు కొనసాగాల్సిన పరిస్థితి తమ ముందున్న పెద్ద సవాల్ అని ముర్లే చెప్పారు. రోజుకి పదివేల లావాదేవీలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ముందు ఆ లక్ష్యాన్ని చేరుకోగానే మిగతావాటిపై ఫోకస్ పెడతామన్నారు. అయితే గడిచిన మూడేళ్లలో ఏ ఒక్కనెలా జీతం తీసుకోలేదని నిట్టూర్చారు ముర్లే.

ప్రాధాన్యతలు

మేం చాలా విషయాలపై ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నాం. స్మార్ట్ లాగిన్, ప్రైస్ కంపారిజన్ ఈ రెండే మా ప్రత్యేకతలు

ప్రస్తుతం ఆగ్మెంటెడ్ రియాల్టీ (Augmented Reality) పై మా ఫోకస్ అంతా పెట్టాం. మలేసియా,సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లను ఆకర్షించేందుకు సింగపూర్‌లో లైవ్ ప్రదర్శననిచ్చాం. సింగపూర్‌లో ఫస్ట్ క్యాష్ బ్యాక్ వెబ్ సైట్ మాదే కాబోతోంది. నిధులు సమకూరగానే సింగపూర్ వెబ్ సైట్ మార్కెటింగ్ కూడా స్పీడందుకుంటుంది. Redmart.com, qoo10.com, foodpanda.sg తదిరత సైట్లు సింగపూర్ లో మాతో భాగస్వాములుగా ఉన్నాయని ముర్లే తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ , మింత్రా అనుబంధ సైట్లు మా కంటే భిన్నంగా ఉంటాయ్. అవి అలాగే కొనసాగుతాయని భావిస్తున్నాం. వాటి ప్రభావం మా పై అంతగా ఉండదని అంచనా వేస్తున్నామని ముర్లే చెప్పారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags