సంకలనాలు
Telugu

ముంబైకర్ల సామాన్య శాస్త్రం 'పీపుల్ కాల్డ్ ముంబై'

ముంబై సామాన్యుల బతుకు చిత్రంపొట్టపోసుకునే వారి జీవితాల పలకరింపురైల్వే స్టేషన్లు,బస్ స్టాండ్లు, బీచుల దగ్గరుండే అతి సామాన్యులుపుస్తక రచయిత ఆర్కిటెక్ట్ నిషానాయర్ గుప్తా

bharathi paluri
28th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
image


మీరెప్పుడైనా సాయంత్రాలు మెరైన్ డ్రైవ్ వెళ్తే.. అక్కడ అడుగుడుగునా చాయ్ వాలాలు, భేల్ వాలాల హడావిడి కనిపిస్తుంది. ఈ హడావిడి మధ్యలోనే మీకు సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. సల్మాన్ ఖాన్ అంటే, బాలీ వుడ్ హీరో కాదు.. ఇతను మెరైన్ డ్రైవ్ హీరో.. రకరకాల పూలు, లైట్లతో అలంకరించిన తన గుర్రపు బగ్గీ .. విక్టోరియాతో ఠీవిగా నిలబడి వుంటాడు సల్మాన్ ఖాన్. అయితే, సల్మాన్ ముంబై వచ్చిన మొదటి రోజున అతని దగ్గర గుర్రపు బగ్గీ లేదు. అసలతనికి అప్పుడు గుర్రపు బగ్గీ నడపాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, అతనితో అప్పుడు అమ్మానాన్న, అక్క, చెల్లి వుండే వారు. అందరూ కలిసి ముంబై చూడ్డానికి టూరిస్టుల్లా ఈ నగరానికి వచ్చారు. ఆ రోజును తలచుకంటే ఇప్పటికీ సల్మాన్ కంట్లో నీళ్ళు సుడులు తిరుగుతాయి.

‘‘ఆరోజు మేం ప్రశాంతంగా దర్గా చుట్టూ తిరుగుతున్నాం. వున్నట్టుండి అలజడి. అరుపులు కేకలతో జనాలు అటూ ఇటూ పరిగెడుతున్నారు. రెప్పపాటులో ఓ గుంపు మా వైపు వచ్చింది. కత్తులతో స్వైరవిహారం చేసింది. మమ్మల్ని తీసుకని మా అమ్మానాన్నలు భయంతో పరుగుతీయబోయారు. మేం కదిలే లోపలే.. ఆ కత్తులు మా కుటుంబాన్ని ఛిద్రం చేసాయి. కళ్ళముందే అమ్మానాన్నా, చెల్లెళ్ళు రక్తపుమడుగులో ప్రాణాలు వదిలారు.’’

ముంబైలో హిందు ముస్లిమ్ ల మధ్య చెలరేగిన నాటి హింసాత్మక అల్లర్లకు సల్మాన్ ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు.. జీవితం చెల్లాచెదురైన బాధితుడు కూడా. అల్లారుముద్దుగా పెంచిన కుటుంబం కళ్ళముందే విషపుకత్తులకు బలయిపోగా.. ఆ ఎనిమిదేళ్ళ కుర్రాడి జీవితం ఆ తర్వాత బిచ్చగాడిగా మారిపోయింది. అయితే, కష్టాలను ఎదిరించి జీవితానికి ఎదురీది ఇప్పుడిలా టాంగేవాలాగా స్థిరపడిపోయాడు.

తన గుర్రపు బగ్గీతో సల్మాన్ ఖాన్

తన గుర్రపు బగ్గీతో సల్మాన్ ఖాన్


ఇప్పుడు గెయిటీ సినిమా ధియేటర్ దగ్గరకెళ్దాం.. అక్కడ మీకు అనిల్ కపూర్ కనిపిస్తాడు. ఇతను కూడా పేరుకు మాత్రమే అనిల్ కపూర్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. అసలు ఈయన పేరు అనిల్ కపూర్ కాదు.. అసలు పేరు నవీన్ రాథోడ్.. చూడ్డానికి అనిల్ కపూర్‌లా ఉంటాడు కాబట్టి జూనియర్ అనిల్ కపూర్‌లా స్థిరపడిపోయాడు. ఈ మధ్య కొన్ని ప్రాంతీయభాషా సినిమాల్లో ఈయనకు జూనియర్ అనిల్ కపూర్‌గా చిన్న చిన్నవేషాలు కూడా వస్తున్నాయి. ఈయనకి కూడా జీవితం ఓ పోరాటమే.


జూ.అనిల్ కపూర్.. నవీన్ రాథోడ్

జూ.అనిల్ కపూర్.. నవీన్ రాథోడ్


ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అప్పుడే డ్యూటీ ముగించుకున్న కూలీ నెంబర్ 1036ది ఇలాంటిదే మరో కథ. సత్తారామ్ అవ్వద్ నాసిక్ దగ్గరలో సిన్నార్ గ్రామవాసి. కరువు కారణంగా సిన్నార్ వదిలిన దత్తారామ్ ముంబై వచ్చి ఇంటర్మీడియట్ చదివాడు. ఆ తర్వాత కంప్యూటర్స్‌లో ఏదో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. పెద్దగా ఉద్యోగాలేం రాలేదు. దీంతో తండ్రిలాగే దత్తారామ్ కూడా ముంబై రైల్వే స్టేషన్‌లో కూలీగా మారకతప్పలేదు.

సత్తారామ్ అవ్వద్, రైల్వే కూలీ

సత్తారామ్ అవ్వద్, రైల్వే కూలీ


వీళ్ళతోపాటు మనం ఎనిమిదేళ్ళ గాయత్రిని కూడా చెప్పుకోవాలి.. చక్కటి నీలిరంగు డ్రెస్ లో కిటికీలోంచి ఆసక్తిగా చూస్తున్న గాయత్రి మెరిసే కళ్ళలో ఎన్నో కలలు.. రైళ్ళలో నెయిల్ పాలిష్, హెయిర్ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు అమ్మి కుటుంబాన్నిపోషించే నియాతి దేశ్ పాండే కూతురే.. ఈ గాయత్రి.

గాయత్రి, రైల్లో చిన్న వస్తువులు అమ్ముకునే పిల్ల

గాయత్రి, రైల్లో చిన్న వస్తువులు అమ్ముకునే పిల్ల


వీళ్ళే కాదు.. జూహూ బీచ్ లో ఫోటోగ్రాఫర్ కమ్ లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్న బంటీ రావ్, ముజావర్ ట్రావెల్స్ లో ఫెర్రీవాలాగా పనిచేస్తున్న అమిర్ ముజావర్ తోపాట మరో 49 మంది మామూలు వ్యక్తుల జీవితాలకు పట్టం కట్టిన పుస్తకం.. ‘పీపుల్ కాల్డ్ ముంబై’’

అందుకే ఈ పుస్తకం INTCESS (INTERNATIONAL CONFERENCE ON EDUCATION AND SOCIAL SCIENCES) గుర్తింపుకు అర్హత సంపాదించింది. పీపుల్ కాల్డ్ ముంబై లాంటి పుస్తకం నభూతో నభవిష్యత్ అని కీర్తించింది INTCESS. (కొత్త ఆలోచనలపై చర్చించడానికి ఏర్పడిన ప్రపంచస్థాయి సంస్థ.. INTCESS)

పీపుల్ కాల్డ్ ముంబై .. పుస్తకాన్ని రూపొందించిన నిషా నాయర్ గుప్తా.. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. డిజైన్ సంస్థలో ఆమె ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. నిషాలో ఒక ఆర్కిటెక్ట్, ఒక జర్నలిస్టుతో పాటు ఒక ఆర్టిస్టు కూడా వున్నారు. ఇప్పుడు తన స్టూడియోలో ఆమె రచన, డిజైనింగ్ మధ్య దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

నిషా నాయర్ గుప్తా, పీపుల్ కాల్డ్ ముంబై పుస్తక రచయిత

నిషా నాయర్ గుప్తా, పీపుల్ కాల్డ్ ముంబై పుస్తక రచయిత


పీపుల్ కాల్డ్ ముంబై రూపు దిద్దకోవడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ వుంది. ఓ వేసవిలో నిషా తన ఆఫీసులోనే ఆర్కిటెక్చరల్ విద్యార్థులతో ఓ వర్కషాప్ నిర్వహించింది. ముంబైలోని పలు కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు .. వ్యక్తుల ఇతివృత్తాలతో ముంబైరూపురేఖలను చిత్రించాలని చేసిన ప్రయత్నమే ఈ పీపుల్ కాల్డ్ ముంబై పుస్తకంగా మారింది.

ఒక సారి ఈ పని మొదలు పెట్టిన తర్వాత ఈ విద్యార్థులు ముంబై నలుమూలలా తిరిగారు. ఏ మాత్రం పరిచయం లేని అనేక మందితో గంటల కొద్దీ మాట్లాడారు. వారి కథలను సేకరించారు. మొత్తానికి ఈ వర్క్ షాప్ పూర్తయ్యేసరికి ముంబైలోని 27 మంది జీవితకథనాలు సిద్ధమయ్యాయి.

నిషా ఆఫీసుకు ఇంటర్న్ షిప్ అప్లికేషన్లు పెరిగే కొద్దీ ఈ కథల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. మొత్తం మీద పది మంది ఇంటర్న్ లు సేకరించిన 80 కథల నుంచి 55 జీవితాలను ఎంపిక చేసి ఈ పుస్తకంగా తీర్చిదిద్దారు.

వివిధ ముంబైకర్ల జీవిత గాధలు

వివిధ ముంబైకర్ల జీవిత గాధలు


కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ వికాస్ దిలావరి, బాంద్రాలో ది హైవ్ అనే కల్చరల్ హబ్ నడుపుతున్న సుదీప్ నాయర్, లాల్ బాగ్చారాజా గణపతి మండల్ లో వాలంటీర్ గా వున్న అమోల్ ఆప్టే, ఫ్లోరా ఫౌంటైన్ దగ్గర కెఫే మిలిటరీ నడుపుతున్న బెహ్రమ్ ఖోస్రవి .. ఇలా ఎందరో సామాన్యుల అసమాన గాధలు ఈ పుస్తకంగా మారాయి.

ఓ నగరాన్ని అర్థం చేసుకోవడానికి ఆ నగరవాసుల జీవితాలకంటే గొప్పమార్గం ఏముంటుంది? అందుకే రకరకాల సామాజిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక నేపథ్యాలకు చెందిన వ్యక్తుల జీవితాలను ఈ పుస్తకంలో ఆవిష్కరించాలని సంకల్పించాం. ’’అన్నారు.. నిషా.

అదే ఉత్సాహం..మరిన్ని జీవితాలు..

ఈ పుస్తకంతో మొదలైన ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని రచయితలందరూ అనుకుంటున్నారు. మరికొన్ని నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి ప్రయోగాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అలాగే ఈ పీపుల్ కాల్డ్ ముంబైని డిజిటల్ మీడియం లోకి కూడా తీసుకొచ్చి, ఈ జీవితాలను మరింత మందికి చేరువ చేయాలని కూడా ఇంకో ప్రయత్నం జరుగుతోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags