సంకలనాలు
Telugu

ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్పిస్తారు..!!

28th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం. లెక్కల జోలికి అంత సామాన్యంగా వెళ్లరు. ఎంత గొప్ప టీచరైనా పిల్లలందరికీ మ్యాథ్స్ పై ఆసక్తి కలిగించేలా చేయలేరు. అందరిలో స్ఫూర్తి రగిలించడం అసాధ్యం. అయితే మ్యాథ్స్ ఒక ఆటలా ఉంటే ఎలా వుంటుంది. ఫన్నీగా సాగితే పిల్లలు ఎందుకు ఇష్టపడరు? ఆ ఐడియాతోనే మక్కాజై అనే స్టార్టప్ పుట్టుకొచ్చింది.

కరికులమ్ ఆధారంగా ఎడ్యుకేషనల్ గేమ్స్ తయారు చేసి చిన్నారులకు అందిస్తున్నారు. ఈ గేమ్స్ ఆడితే మెదడుకు కావాల్సినంత మేత. అదీగాక అసలు సిసలైన క్లాస్ రూం ఎక్స్ పీరియన్స్. గేమ్ ఆడటం పూర్తయ్యాక ఎలా ఆడారో కూడ అవి చెప్పేస్తాయి. ఎప్పటికప్పుడు తల్లి దండ్రులు, టీచర్స్ ఫీడ్ బ్యాక్ అందిస్తాయి. విద్యార్థి బలాలు, బలహీనతలను పెద్దవారికి చెప్పేస్తాయి. 

మక్కాజై గేమింగ్ స్టార్టప్ స్థాపించాలన్న ఆలోచన 2011లో రూపేష్ షినోయ్, వినాయక్ పలాన్కర్ కు వచ్చింది. ఎడ్యుకేషనల్ స్టార్టప్ వ్యాగ్ సన్స్ కోసం పనిచేస్తున్నప్పుడు ఈ ఆలోచన బుర్రలో మెరిసింది. ఇప్పుడున్న విధానం విద్యార్థికి సంపూర్ణ విద్యను అందించలేకపోతోందని, అందుకే గేమింగ్ స్టార్టప్ స్థాపించాల్సి వచ్చిందంటున్నారు.

undefined

undefined


ఆట మొదలయ్యిందిలా…

ఎంబీఏ చదవడానికి హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేరినప్పుడే వినాయక్ కు… అభిషేక్ స్నేహితుడయ్యారు. వీరికి రూపేష్ తోడయ్యారు. ఈ ముగ్గురు స్నేహితులకు చదువన్నా… గేమ్స్ అన్నా ప్రాణం. కైనెట్ టెక్నాలజీ ఆధారంగా… ఎడ్యుకేషనల్ గేమ్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఐఎస్బీలో చదువుకుంటూనే… అన్ని స్కూల్స్ ను సందర్శించి పరిశోధనలు చేశారు. మొబైల్ గేమ్స్ రూపొందించాలనుకున్నారు.

కోడ్ గురూగా పేరు సంపాదించిన దీప్ షా అప్పటికే అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉద్యోగం మానేసి తమతో చేరేలా దీప్ షాను ఒప్పించారీ ముగ్గురు స్నేహితులు. మార్కెట్లో అప్పటికే ఉన్న గేమ్స్ పై చాలా పరిశోధనలు చేశారు. గేమ్స్ ఆధారంగా లెర్నింగ్ అన్ని విధాలా ఉపయోగకరమని నిర్ణయించుకున్నారు. మార్కెట్లో ఎక్కువ గేమ్స్ ఆధారిత లెర్నింగ్ లేవని గుర్తించామని… అందుకే ఈ స్టార్టప్ ఏర్పాటుచేశామని యువర్ స్టోరీతో చెప్పారు 32 ఏళ్ల అభిషేక్.

మార్చివేసేయ్…

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న విద్యావ్యవస్థ గజిబిజిగా ఉందంటారు అభిషేక్. అందుకే ముందు వ్యవస్థలో సమస్యలను గుర్తించారు. మూడు సమస్యలను నోట్ డౌన్ చేశారు.

1 నాట్ ఎంగేజింగ్ అండ్ నాట్ ఇంటరాక్టివ్ కంటెంట్ : ఈ విధానంలో విద్యార్థి పాత్రేమీ ఉండదు. టీచర్ అలా చెప్పుకుంటూ పోతుంటారు. దీంతో విద్యార్థికి ఆసక్తి పోతుంది. నేర్చుకోవాలన్న తపన చచ్చిపోతుంది.

2 కంటెంట్ లో స్పష్టత లేని విద్య: ఇటు టీచర్స్ … అటు పేరెంట్స్, స్టూడెంట్స్ కు సిలబస్ లో గందరగోళం ఉంటుంది. ఆ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి.

3 పీరియాడిక్, స్టాండర్ డైజ్డ్ ఎసస్ మెంట్: ఒక టాపిక్ ను బోధించిన తర్వాత నేర్చుకోవడంలో సమస్యలు అర్థమవుతాయి. దీంతో ప్రతిదానికి లిమిటేషన్ ఏర్పడుతుంది.

ఈ సమస్యలను పరిష్కరించాలంటే టీచర్స్ చాలా సమయం కంటెంట్ కు కేటాయించాల్సి ఉంటుంది. పిల్లలు కూడా చాలా సమయం కేటాయించాలి. దీనివల్ల విద్యార్థులు సరిగా నేర్చుకోలేకపోవచ్చు.

 “ ట్యాబ్లెట్ పై ఉండే ఇంటరాక్టివ్ కంటెంట్ వల్ల సమస్యలు చాలా తేలికగా పరిష్కారమవుతాయి. యాప్ స్టోర్స్ లో ఎన్ని యాప్స్ ఉన్నా… నాణ్యమైన విద్యను , కంటెంట్ ను అందించలేకపోవడం నిజంగా దురదృష్టకరం. అందుకే మేం అన్ని హంగులతో ఎడ్యుకేషనల్ గేమ్స్ రూపొందిస్తున్నాం. వీటితో చాలా సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది"-అభిషేక్ 

కొత్త మార్గాల అన్వేషణ

2014లో ఈ స్టార్టప్ ప్రారంభించినప్పుడు యాప్ స్టోర్ లోని ఎడ్యుకేషనల్ యాప్స్ కు కేవలం బ్యాకప్ మాత్రమే ఇవ్వగలమనుకున్నారు. అయితే మార్కెట్లో ఉన్న గేమ్స్ ను స్టడీ చేశాక… వీరే కొత్తవి డిజైన్ చేయగలిగారు. ఇవి విద్యార్థులకే కాదు… ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరం అంటున్నారు రూపేష్, దీప్. ఇప్పటికే మాన్ స్టర్ మ్యాథ్స్ గేమ్స్ తయారు చేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లల వరకు ఇదే టాప్ మ్యాథ్స్ గేమ్ గా ఇది గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇందులో 40 బేకిస్ అర్థమేటిక్ స్కిల్స్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

గేమ్స్ డిజైనింగ్ కోసం ఫొటోషాప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న రూపేష్ తల్లి శిల్ప సహాయంకూడా తీసుకున్నారు. పిల్లలను ఆకట్టుకునేందుకు మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్టకథలు పెట్టారు. అమెరికన్ ఆర్మీలో డిజైనర్ గా పనిచేసిన జేమ్స్ రమ్ ఫెల్ట్ కొంత హెల్ప్ చేశారు.

undefined

undefined


ఆన్ బోర్డింగ్ ఎక్స్ పర్ట్స్

ఈ మ్యాథ్స్ గేమ్స్ తయారు చేయడానికి టీచ్ ఫర్ ఇండియా టీం కు చెందిన 50 మంది నిపుణులు ముందుకొచ్చారు. ఆదిత్య కొల్లి అనే మేధావి గేమ్స్ కు సంబంధించిన టిప్స్ ఇచ్చారు. హోప్ స్కాచ్ సంస్థ సీఈఓ ఆరతి గుప్తా మార్కెటింగ్ వ్యూహాలపై సలహాలు , సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారు. క్యూకి డిజిటల్ మీడియా సీఈఓ సమీర్ బంగ్లా సైతం మార్కెటింగ్ చేయడంలో సహాయం చేశారు. ఈయన గతంలో డిస్నీ ఇండియా సీఈఓగా పనిచేశారు.

“యాప్ స్టోర్ లో ఫ్రీగా గేమ్స్ పెట్టాం. డౌన్ లోడ్, ఇన్ స్టాలేషన్ అంతా ఫ్రీ… దీంతో ఏడాదిలోనే దాదాపు పది లక్షల మక్కాజై గేమ్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. మాకు మార్కెట్ లో మంచి పేరు వచ్చింది” ఆదిత్య.

నంబర్స్ ఏం చెబుతున్నాయి?

మాన్ స్టర్ మ్యాథ్స్ పేరుతో 2014 నవంబర్ లో మొదటిసారిగా గేమ్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. 2015 డిసెంబర్ లో మాన్ స్టర్ మ్యాథ్స్ టూ పేరుతో మరో గేమ్ విడుదల చేశారు. మోన్ స్టర్ గేమ్ ను పది లక్షల మంది డౌన్ లోడ్ చేసుకోగా… మాన్ స్టర్ మ్యాథ్స్ టూ గేమ్ ను నెల రోజుల్లోనే లక్షమంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

“మా పాపులారిటీ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతోంది. మా వినియోగదారుల సంఖ్య నెలకు 30 నుంచి 35 శాతం చొప్పున పెరుగుతోంది. మా ఆదాయం నెలకు 30 శాతం చొప్పున ఎగబాకుతోంది. మిగతా ఎడ్యుకేషనల్ యాప్స్ తో పోల్చితే మావి బెస్ట్ అని చెప్పగలం. మా గేమ్ పై సగటున రోజుకు 15 నిమిషాలు గడుపుతున్నారు"- అభిషేక్ 

ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి… ఈ గేమింగ్ కంపెనీకి తొలుత కొంత ఫండింగ్ ఇచ్చారు. ఈ యాప్ ఉపయోగిస్తున్న పిల్లల బ్రెయిన్ షార్ప్ గా తయారయ్యిందని… మునుపటికన్నా మ్యాథ్స్ బాగా చేస్తున్నారన్న ప్రశంసలొచ్చాయి. క్రేజ్ పెరగడంతో… నంబర్ సెన్స్ అనే సరికొత్త గేమ్ ను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు.

విద్యా విధానంలో మార్పు

ప్రపంచ వ్యాప్తంగా విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి. మూస పద్ధతికి దూరంగా … ప్రయోగాత్మక విద్యకు దగ్గరగా ఈ ప్రపంచం అడుగులేస్తోంది. ఫన్నీగా నేర్చుకోవడానికే పిల్లలు ఇష్టపడుతున్నారు. ఐబీఈఎఫ్ నివేదిక ప్రకారం… ఇండియన్ హైస్కూల్స్ లో రాబోయే 20 ఏళ్లలో ఏడు కోట్లమంది చేరతారు. వారికి ఉపయోగపడే గేమ్స్ తయారుచేస్తే… విజయం సాధించవచ్చు.

ఇప్పటికే ప్రయోగాత్మక విద్యావిధానంలో… నాలెడ్జ్ ఎక్సపీ లాంటి స్టార్టప్స్ వచ్చాయి. బెంగళూరులోని ఐ నర్సర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సంస్థ కూడా ఇలాంటిదే. 2017 నాటికి ఇండియాలో గేమ్స్ ఆధారిత లెర్నింగ్ ఇండస్ట్రీ 230 కోట్ల డాలర్లకు చేరనుంది. మిగతా గేమ్స మార్కెట్ కూడా కలుపుకుంటే…890 కోట్ల డాలర్లు. స్మార్ట్ ఫోన్లు పెరిగే కొద్దీ… గేమింగ్ బిజినెస్ పెరుగుతునే ఉంటుంది. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags