సంకలనాలు
Telugu

మహిళల హక్కుల కోసం మేమున్నాం అంటున్న ఐప్లీడర్స్

దేశంలో పల్లవి పరీక్ తన్వి దూబే ఉద్యమంమహిళల హక్కులు తెలియజెప్పడమే ఉద్దేశంఅన్ని ప్రాంతాల్లో విస్తారంగా ప్రచారంలక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ఏకైక సంస్థ

ashok patnaik
3rd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

“మా అమ్మ ఒక తెలివైన వక్త , మంచి మహిళ, అత్యంత ఆత్మవిశ్వాసం కలది. ఆలోచనలను ఎలా వ్యక్తపరచాలో చక్కగా తెలిసిన మనిషి . నా చిన్నప్పుడు మా అమ్మకు రైలాలో సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి అర్హత లభించింది . మా నాన్నతో చర్చించిన ఆమె ఎన్నికలలో పోటీచేయడ౦ కంటే కుటుంబం మీద దృష్టి సారించడం ఉత్తమమని నిర్ణయం తీసుకుంది . అన్ని విధాల సామర్ద్యం ఉన్న ఆమె ఆ పదవిని అలవోకగా నిర్వహించవచ్చు కానీ అలా చేయలేదు. అప్పటినుండి ఇప్పటిదాకా మా కుటుంబం విధులకు వ్రేలాడుతూ కాలం గడుపుతోంది.” అని పరీక్ తన్వి కధను మొదలు పెట్టారు. 

పల్లవి పరీక్ తన్విదూబే

పల్లవి పరీక్ తన్విదూబే


ఆమెకు ఏదో చేయాలని 10-15 ఏళ్ల నుండి మేం చెప్పేప్రయత్నం చేసినా.. అమ్మ మాత్రం పరిమితమైపోయింది. అందుకే తాను ఈ దేశంలో మహిళలను మార్చడానికే నిర్ణయించుకున్నానని అంటారు ప్రరీక్. అంతకంటే ముందు అమ్మలను మార్చడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. నేను స్త్రీ వాదిని . ఇవాళ సమాజంలో పురుషాధిక్య౦తో కూడిన అధికారం చలామణి అవుతోంది. అలాకాకుండా మనకు ఒక సమతుల్య సమాజం కావాలన్నది నా అభిప్రాయం అంటారు పరీక్. 

భారతదేశంలో చట్టపరమైన విద్య.. రీ-ఇంజనీరింగ్ వైపు పనిచేస్తుంది. జ్యుడీషియల్ సైన్సెస్ నేషనల్ విశ్వవిద్యాలయం, కోలకతా నుండి 'కార్యాలయాల్లో లైంగిక వేధింపులు నివారణ మేనేజ్‌మెంట్ కోర్సు రూపకల్పనలో పరీక్ కీలక పాత్ర పోషించింది. మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం , జీవితంలో ఏదైనా సాధిద్దాం అనుకొన్న వారు ఆ దిశగా నిలబడి ముందుకెళ్ళడం ముఖ్యమంటారామె. జీవితం బ్రతకడానికి ఛాయిస్‌లు కోరుకొనే వారికి ఆమె స్టోరీ చదివితే గొప్ప ఉపశమనంగా భావిస్తారు. రాజస్థాన్‌లోని భిల్వారా (వస్త్రాలకు ప్రసిద్ది) అనే చిన్న జిల్లాలో మా అమ్మానాన్నలకు నేను రెండో సంతానం. మా ఫ్యామిలీ నిలదొక్కుకోవడానికి నాన్న నైట్ షిఫ్టుల్లో కూడా పనిచేసే వారు. నాన్నకు అమ్మ చేదోడు వాదోడుగా ఉండేది. మమ్మల్ని ఎంతో బాధ్యతగా పెంచింది. మాది ఒక సాధారణ జీవితం. 

నాకిప్పటికీ బాగా గుర్తుంది అవి మా జీవితాల్ని మలుపు తిప్పిన రోజులు నాన్నకు వస్త్ర వ్యాపారం చూసుకోవడానికి ఫిలిప్పైన్స్ వెళ్ళవలసి వచ్చింది . నేను అక్కడే ఎడ్యుకేషన్ పూర్తి చేశాం. ఇండియా కంటే ఫిలిప్పైన్స్ లో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని మా పేరెంట్స్ ఆలోచించారు. కాకపోతే ఇండియాకంటే ఫిలిప్పైన్స్‌లో బతకడం కాస్త ఖరీదైన వ్యవహారం. ఇక్కడేమో పితృస్వామ్య సమాజం అక్కడ మాతృస్వామ్య సమాజం ఈ తేడా నాలో సరికొత్త జీవన విధానానికి తెరలేపింది. ఫిలిప్పైన్స్ సమాజం నాకు చిన్నవయసులోనే ఆచరణాత్మక విషయాల్లోని లోపాల్ని ప్రశ్నించడం నేర్పింది. నాలోని ఈ మార్పును అన్ని వేళలా అభినందించి ప్రోత్సాహాన్ని అందించారు మా పేరెంట్స్. మా ఇద్దరికీ మంచి జీవితాన్ని అందించారు. మేము తిరిగి భారత దేశం తిరిగి రావాలనుకున్నప్పుడు అమ్మ కొంత చింతించింది. భారత సమాజంతో నేను ఏ విధంగా సర్దుబాటుకాగాలనోనని. మన దేశంలో మహిళలకు చాయిస్‌లు చాలా తక్కువ. ఒక మహిళ తను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక నిమిషం మాత్రమే సమయం వుంటుంది. కుటుంబ గందరగోళాలు, నాటకీయ పరిణామాలెన్నో అడ్డుతగులుతాయి.

కొన్ని నాన్ స్టాప్ ప్రశ్నలు వర్షం :

ఆమె ఏ రకమైన పని చేస్తుంది ?

ఆమె మరింత డబ్బు ఎలా సంపాదిస్తుంది ?

ఆమె డబ్బు కోసం పని చేస్తుందా లేదా కొంత సమయం మాత్రమె డబ్బుకోసం వెచ్చిస్తుందా ?

ఆమె కార్యాచరణ ఇలాగే కొనసాగితే ఆమె జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా నెట్టుక రాగలదు ..? ఒక వేళ అలా చేస్తే తను అనుకొన్న పనికి ఈ సమాజం సంపూర్ణ మద్దతు ఇస్తుందా ?

ఈ భర్త, అన్నదమ్ములు, నాన్నల నుంచి సగర్వంగా "అనుమతి" తీసుకుని ఒక మహిళ అనుకొన్నది సాధించగలదా ..? ఎలా తమ కోరికలను నెరవేర్చుకోవడం ?

ఈ సమస్యలను ఎవరు సృష్టించారు ? సమానత్వం లేని ఈ సమాజంలో తను విజయం వైపు ఎలా వెళ్ళింది ?

సమాధానంగా ...

ఒక కుటుంబం లేక ఒక జంట వీటన్నింటినీ పక్కన పెట్టి చూసినప్పుడే వారు విజయం వైపు ప్రయాణించారని తెలుసుకున్నాను. నేను కూడా వారి దారిలోనే వెళ్ళ దలచాను. అప్పుడే ఈ దేశంలో ముందుకు వెళ్ళగలం. ఫిలిప్పైన్స్ iPleaders లో చదువుతున్నప్పుడు హైస్కూల్ విద్యలో (11 మరియు 12 ) ఆప్షన్ వుండేది. దానితో నావిద్యను వేగవంతం చేయగలిగాను . 15 ఏళ్ళకే కాలేజీ విద్యను స్టార్ట్ చేశాను. నాలుగేళ్ల కంప్యూటర్ సైన్స్ డిగ్రీని అడిషినల్ క్రెడిట్స్‌తో పూర్తిచేయగలిగాను. అందులో నాన్న సహకారం మరువలేనిది. నేను 21 సంవత్సరాలకే MBA పూర్తి చేశా. అక్కడ రెండు సంవత్సరాలు వివిధ సంస్థలలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశా. తర్వాత 2009 ఇండియాకి వచ్చాను. మొదట ముంబైలో విలాసవంతమైన బోటిక్ కన్సల్టెంట్లో పనిచేశాను. నేను రెండేళ్ళలో నన్ను బాగా బాధించిన విషయం ఏంటంటే మహిళలు వారి హక్కుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు . మగాళ్లు మాత్రం తమ జీవితం పట్ల సరైన ధృక్పధంతోనే వున్నారు .కొన్ని న్యాయ పరమైన ప్రశ్నలు వేసినపుడు మా ఇంట్లో వాళ్లు కూడా సరైన సమాధానం చెప్పలేక పోవడాన్ని గమనించా! దాంతో నేను ఆన్ లైన్లో వెతకడం ప్రారంభించా. అక్కడ సబ్జెక్టు ఎక్కువగా వుంది కానీ.. ఆచరణకు వీలుకాదని తెలుసుకొన్నా. 

ఒక స్టార్టప్ ఈవెంట్లో రామనుజ్‌ని కలిసాను . రామనుజ్, అభ్యుదయలు ఐ ప్లీడర్స్‌కు కో ఫౌండర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్ లీగల్ లిటర్సీ పై వాళ్ళ విజన్ ఏంటో తెలియజేశారు. నన్ను కూడా చేరమని అడిగారు నేను ఒక్కక్షణం నిరీక్షించకుండా జాయిన్ అయ్యాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసి౦దే లేదు. మేము ఐ ప్లీడర్స్ తో కలిసి lawsikho.com అనే వెబ్ సైట్ను స్టార్ట్ చేశాం. ఇందులో లాయర్ల,ఇతరులకు న్యాయ విద్యపై అవగాహనతో పాటు పనిచేస్తున్న చోట ఏళ్లుగా లైంగిక వేధింపులు ఎలా అభివృద్ధి చెందుతోందో విశదీకరిస్తున్నాం. ఒకప్పుడు ఈ వేధింపులను చాలా సంస్థలలో అతి సాధారణమని భావించేవారు. మా ప్రయత్నమంతా అలాంటి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. 

ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకప్పుడు ఆడవాళ్ళపై చేయి వేసి మాట్లాడటం ,డాన్స్ చేయమనడం ఆఫీస్ పార్టీలలో జరుగుతుండేవి. ఎక్కువగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి జరిగేవి. దీన్ని కూడా లైంగిక వేధింపులుగానే చూడాలి. ఇప్పుడు వాళ్ళలో చాలా తేడా వచ్చింది ఒంటరిగా ఉన్న వాళ్లకు కూడా స్పష్టత ఉంది. లైంగిక వేధింపులపై ఓ అవగాహన వచ్చింది. ఇటువంటి అనుభవం నాక్కూడా ఎదురైంది. సంస్థలలో అధికారం చలాయిస్తున్నవారు దర్పంతో తమ వాంఛ తీర్చుకోవడానికి ఒంటరిగా వున్న వారిపై కన్నేసి హెరాస్ చేస్తుండేవారు. ఇది స్త్రీలపైనే కాకుండా పురుషులపై కూడా జరగడం గమని౦చాను. ఒంటరిగా వున్న మహిళలకు గార్డియన్‌గా వుండి సపోర్ట్ ఇయ్యడం వరకే నాపని కాలేదు. ఒక జెండర్ వాళ్ళు ఇంకొకరిపై అఘాయిత్యం చేయకుండా వారిలో పరివర్తన తేవడం ముఖ్యం. 

ఇండియాలో దాదాపు 20 లక్షల కార్యాలయాల్లో లైంగి వేధింపుల నివారణ యాక్ట్ - 2013 అమలు చేయగలిగాం. కానీ ఈ విషయాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగిన వారు చాలా తక్కువమంది. 

image


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags