సంకలనాలు
Telugu

మీకు సులువుగా ఇంగ్లీష్ నేర్పించే దోస్త్

ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ అందుబాటులోకి ‘ఇంగ్లీష్ దోస్త్’ యాప్

9th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇంగ్లీష్ ప్రావీణ్యం లేకపోతే కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు కోల్పోతాం. మరి ఇంగ్లీషును నేర్పించేందుకు మీ వెంటే ఒక స్నేహితుడు ఉంటే.. ఇదుగో మీ కోసమే పలు అవార్డులు గెల్చుకున్న ‘ఇంగ్లీష్ దోస్త్’ యాప్ అందుబాటులోకి వచ్చింది. స్పీకింగ్ గేమ్ మాదిరిగా సులువుగా నేర్చుకునేలా దీనిని రూపొందించారు. కొద్దిపాటి ఇంగ్లీషు వస్తే చాలు. ప్రస్తుతానికి హిందీ మాట్లాడే వారికేనండోయ్. కొద్ది రోజులు ఆగితే మరో 10-12 భాషల్లోనూ ఈ యాప్ రూపొందనుంది.

ఇదే మీ ఇంగ్లిష్ దోస్త్

ఇదే మీ ఇంగ్లిష్ దోస్త్


చాటింగ్ చేసినట్టుగా...

యూజర్ (రామ్) కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి. సహచరులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో రామ్ జరిపిన సంభాషణ ఒక కథనంలా సాగుతుంది. మరోలా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసినట్టుగా ఉంటుంది. ప్రతి సందర్భంలో ఆయన మాట్లాడే మాటలను ఇందులోని స్పీచ్ రికగ్నిషన్ గుర్తించి తప్పులుంటే సరిదిద్దుతుంది. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన రామ్‌తో తన సహచరులు ఇంగ్లీషులో మాట్లాడిన దానికి ప్రతిగా ఇంగ్లీషులో ఏం చెప్పాలో హిందీ భాషలో వాక్యాలు ప్రత్యక్షమవుతాయి. ఆ వాక్యాలకు తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్‌లో స్పీక్ నౌ బటన్ వద్ద క్లిక్ చేసి ఇంగ్లీషులో చెప్పాలి. సరైన జవాబు అయితే ఎంత శాతం కరెక్టో స్క్రీన్‌పై చెబుతుంది. చెప్పే జవాబులను బట్టి స్కోర్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీషు పరిజ్ఞానాన్నిట్టి లెవెల్స్ కూడా ఉంటాయి. ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తే 30 రోజుల్లో చక్కని మార్పు వస్తుందని కంపెనీ చెబుతోంది. కథ చెప్పినట్టుగా ఉంటేనే బోధన సులువుగా అర్థమవుతుందన్నది కంపెనీ వ్యవస్థాపకుల అభిప్రాయం. అందుకే రామ్ అనే క్యారెక్టర్‌ను రూపొందించారు.


పంకజ్ చంద్,రామ్ కక్కడ్, వివేక్ అయ్యర్

పంకజ్ చంద్,రామ్ కక్కడ్, వివేక్ అయ్యర్


నేర్చుకునే క్రమంలో..

ఈ యాప్‌ను రామ్ కక్కడ్, వివేక్ అయ్యర్, పంకజ్ చంద్ అభివృద్ధి చేశారు. ఐఐటీ ముంబై విద్యార్థి అయిన రామ్ స్పానిష్ చేర్చుకోవడానికి ఉత్తమ విధానం కనుగునే క్రమం, ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సమస్యకు పరిష్కారం కనుగునే దిశగా సహచరుడైన వివేక్‌తో తన ఆలోచనలను పంచుకున్నారు. మార్కెట్లో ఉన్న భాష సంబంధ అప్లికేషన్లు డువోలింగో, బసూ వంటి వాటిని అధ్యయనం చేశారు. చివరకు భిన్నమైన ఆలోచన ద్వారా ఈ స్టార్టప్ ప్రాణం పోసుకుంది. మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వచ్చిన విద్యార్థులూ ఇంగ్లీషులో భావ వ్యక్తీకరణ అంతంతే ఉండడాన్ని ఆయన గమనించారు. చైనా, జపాన్, కొరియా దేశాల్లో పనిచేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయనకు అర్థమైంది. ఇరువురు 2014 ఏప్రిల్‌లో ఇన్‌మొబికి రాజీనామా చేసి అప్లికేషన్ అభివృద్ధిపై దృష్టిసారించారు. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్థి పంకజ్ వీరికి తోడయ్యారు. ఐఐటీ మద్రాస్‌కు వచ్చేంత వరకు పంకజ్ కూడా ఇంగ్లీషు విషయంలో సమస్యను అనుభవించినవాడే. వీరి ఆలోచన యాప్‌గా కార్యరూపంలోకి రావడంలో పంకజ్ కీలక పాత్ర పోషించారు.

స్పందన అనూహ్యం..

యాప్ తీసుకొచ్చిన నాలుగు నెలల్లోనే 10,000లకుపైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ప్రతివారం 20 శాతం వృద్ధి చెందుతోంది. 500లకుపైగా రివ్యూలు, 4.5 రేటింగ్ సొంతం చేసుకుంది. ప్రతిరోజు 1,100 మంది యాక్టివ్ యూజర్లున్నారు. వీరి ప్రాక్టీస్ ప్రకారం సగటున అయిదు సంభాషణలు నమోదవుతున్నాయి. ఈ లెక్కన ప్రతిరోజు 65 వేలకుపైగా సంభాషణలు, 5 లక్షలకుపైగా ఇంగ్లీషు వ్యాక్యాలు ఇప్పటికే ప్రాక్టీస్ చేశారు. ఆఫ్‌లైన్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఈ టీం కసరత్తు చేస్తోంది. డిసెంబరుకల్లా 10 లక్షల మంది యూజర్లను కైవసం చేసుకోవాలన్నది వీరి లక్ష్యం. అయితే ఈ సేవలను ఉచితంగా కొనసాగించాలని భావిస్తున్నారు. ఇంగ్లీషు వచ్చిన వారిని నియమించుకోవడం, ఇప్పటికే ఉన్న సిబ్బందికి ఇంగ్లీషు శిక్షణ ఇవ్వాలని భావించే కంపెనీలతో చేతులు కలపాలన్నది వీరి ఉద్ధేశం. బిజినెస్ టు కస్టమర్ సొల్యూషన్‌నూ అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. నిధుల సమీకరణపై కంపెనీ దృష్టి పెట్టింది.


జాబ్ మార్కెట్లో ప్రవేశించబోయే 20 కోట్ల మంది అభ్యర్థులకు ఇంగ్లీషు మాట్లాడతామన్న ఆత్మ విశ్వాసం కల్పించాలన్నది వీరి విజన్.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags