సంకలనాలు
Telugu

కామిక్స్ ప్రియుల కేరాఫ్ అడ్రస్ 'లీపింగ్ విండోస్ కేఫ్'

team ys telugu
17th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కామిక్స్...చిన్న పిల్లలకే కాదు, పిల్లల మనస్తత్వం ఉన్న పెద్దల్నీ ఆకర్షిస్తాయి. చిన్నతనంలోనే కాదు పెద్దయ్యాక కూడా కామిక్స్‌పై ఉన్న ప్రేమతో వాటిని చదువుతారు ఎంతో మంది. ప్రఖ్యాత కార్టూనిస్ట్, రచయిత డా. స్యూస్ మాటల్లో చెప్పాలంటే "బొమ్మలు, అక్షరాలు కలిస్తే భావం ఉట్టిపడ్తుంది. రెండింటినీ విడివిడిగా చూసిన దాని కంటే కలిపి చూస్తే మంచి ఫలితం వస్తుంది", నిజమే ఈ రెండు కలిసిన కామిక్స్ మనల్ని కట్టిపడేస్త్టాయి.

image


కొందరికి కామిక్స్ చదవడం ఇష్టమయితే, కామిక్స్ మీద ఇష్టంతో బిజినెస్ ప్రారంభించే వారు మరొకరు. బిదిషా బసు ఈ కోవలోకే వస్తారు. కోల్‌కతాలో పుట్టి పెరిగిన బిదిషా, అమెరికాలో జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. అయితే భవిష్యత్తును ఎలా మలచుకోవాలనే ఖచ్చితమైన ప్లాన్ మాత్రం లేదు. కోల్‌కతా నుంచి ముంబై చేరుకున్న బిదిషా ఏడాదిపాటు సాంక్చురి అనే వైల్డ్ లైఫ్ మ్యాగజైన్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఫ్రీలాన్స్ రైటర్‌గా, యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లో ఉద్యోగాలు చేశారు. మరికొంత కాలానికి మనసు మార్చుకుని జపాన్ వెళ్లి, అక్కడి పిల్లలకు ఇంగ్లిష్ నేర్పాలని అనుకున్నారు. జపాన్ ఎంబసీ నిర్వహిస్తున్న ఇండియన్ చాప్టర్‌కూ పనిచేశారు. మంచి జీతం వచ్చిన ఉద్యోగం అది. ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకున్నారు. ఇలా అతి చిన్న వయస్సులోనే ఎన్నో ఉద్యోగాలు చేసిన తనకు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన మనసులో బలంగా ఉండేది. దీనికి జపాన్ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. జపాన్ కేఫ్స్ నుంచి పొందిన స్ఫూర్తితో 'కామిక్స్ లైబ్రరీ' ప్రారంభించాలని అనుకున్నారు.


కామిక్స్ లైబ్రరీ

" ఏదైనా ఉద్యోగంలో సుదీర్ఘకాలం పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలా వచ్చే బెనిఫిట్స్ గురించి నేనెపుడూ ఆలోచించలేదు. చేసిన అన్ని ఉద్యోగాల్లోనూ తొందరగా బోర్ ఫీలయ్యేదాన్ని. ఒకే జాబ్ ఎక్కువ కాలం చేయలేదు. చాలా ఆలోచించి, ఫ్రెండ్స్‌తో మాట్లాడి నాకంటూ నేనే ఏదైనా చేయాలనుకున్నా. అలా అయితే నా కోసమే నేను కష్టపడొచ్చని భావించా. అపుడే సరైన న్యాయం చేయొచ్చని అనిపించింది. నా కోసమే అయితే ఎక్కువ కాలం పనిచేస్తాననే ధీమా ఉంటుంది '' అంటారు బిదిషా.

image


"ఆస్టెరిక్స్, రిచీరిచ్ కామిక్ పుస్తకాలు తెగచదివేదాన్ని. ఆస్టెరిక్స్ నాకిష్టం, ఎందుకంటే అది నా మనసుకు దగ్గరగా ఉంటుంది. కాల్విన్ అండ్ హాబ్స్ కూడా అంతే. ఇవన్నీ కూల్ క్యారెక్టర్స్. ఎప్పుడైనా, ఎక్కడైనా చదవాలనిపిస్తుంది. అయితే జపాన్ వెళ్లినపుడు వాటిని మిస్సయ్యాను. దీంతో అలాంటివన్నీ ఒకే చోట దొరికితే బాగుండనిపించింది" అంటారు బిదిషా. ఇదే కామిక్స్ లైబ్రరీ ఏర్పాటుకు కారణమైంది.

తన ఫ్రెండ్స్ లో ఎక్కువ మంది ముంబైలో ఉండడంతో తానూ అక్కడే ఉండిపోయారు. అలా అంధేరీలోని ఒక ప్రాంతంలో ఓ బుక్ షాప్, లైబ్రరీ స్థానంలో 'లీపింగ్ విండోస్ కేఫ్' ప్రారంభించారు. ఏదో ఒక విభాగానికి చెందిన పుస్తకాలన్నీ ఒకే చోట ఉంచడం వల్ల ఉపయోగాలు ఎక్కువని బిదిషా భావించారు. అలా అయితేనే తనకు కావాల్సిన మైలేజ్ వస్తుంది అనుకుని పూర్తిగా కామిక్స్‌తో లైబ్రరీని నింపేశారు.

వెబ్ సైట్ ద్వారా కామిక్స్ సెలెక్ట్ చేసుకునే సౌలభ్యం ఈ లైబ్రరీకి ఉంది. ముంబైలో ఉన్నవారు సైట్లో లాగిన్ అయి బుక్ సెలెక్ట్ చేసుకుంటే బాయ్స్ డెలివరీ చేస్తారు. వీటితో పాటు కామిక్స్ రిలీజ్ ఈవెంట్స్ కూడా అక్కడే కండక్ట్ చేస్తుంది బిదిషా.

image


కామిక్స్ + కాఫీ

లీపింగ్ విండోస్ కేఫ్‌కు ఎన్నోసార్లు మేకోవర్ చేసింది బిదిషా. ప్రారంభంలో శాండ్విచ్, మ్యాగీని వాళ్ల కిచెన్‌లో తయారు చేసి అందించేవారు. ఆ తర్వాత కాంటినెంటల్, తర్వాత అమెరికన్ ఆహారాన్ని అందించడం మొదలుపెట్టారు. ఇప్పుడక్కడ 25 మంది కేఫ్‌లో, ముగ్గురు లైబ్రరీలో పనిచేస్తున్నారు.

ఇలా ఈ కేఫ్ నిర్వహణ ఆమెకో పెద్ద సవాల్‌గా మారింది. దీని నిర్వాహణలో భాగంగా అకౌంట్స్, టాక్స్ గురించి కూడా నేర్చుకున్నారు. బాకీల వసూలు అంత సులభమూ కాదని అర్థమైంది. లైసెన్స్ సంపాదించడమైతే.. ఎంత కష్టమో కూడా తెలుసుకున్నారు.

ముంబై తర్వాత బెంగళూరులో కూడా మరో బ్రాంచ్ ప్రారంభమైంది. అయితే దాన్ని నడిపించడం, సమన్వయం చేసుకోవడం కష్టంగా మారాయి. పుస్తకాల రవాణా కష్టతరమని తొందరగానే తెలుసుకున్నారు. దీంతో ఆఖరికి ముంబైకే పరిమితమైంది బిదిషా.

image


బిదిషా జర్నీ

వాస్తవానికి లైబ్రరీకి ఆదరణ తగ్గి.. ఆశ్చర్యకరంగా కేఫ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కామిక్స్ మార్కెట్ స్లోగా పెరుగుతున్నా, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఉండడంతో కేఫ్ జోరు పెరిగింది. జీవితంలో ఎంతో కొంత సాధించాననేది బిదిషా కాన్ఫిడెన్స్. 

" సుదీర్ఘమైన ప్రణాళికలు వేసుకోవాలనుకున్నా.. ఎందుకో ఒక్కోసారి ఆలోచనలు మారిపోతుంటాయి. కానీ స్వల్పకాల పర్యవేక్షణతో స్వతంత్రంగా పనిచేసే ఏదో ఒక అవుట్ లెట్ ఉండడం మంచిది" అంటూ ముగిస్తారు బిదిషా.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags