సంకలనాలు
Telugu

నాన్నకు ప్రేమతో... వంద కోట్ల బ్రాండ్ !

28th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

భారతదేశంలో స్పోర్ట్స్ వేర్ పరిశ్రమ గురించి లలిత్ కిషోర్ కంటే ఎక్కువగా తెలిసినవాళ్లుండరు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆయన వెటరన్ అని చెప్పుకోవాలి. ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అయిన నైకీ, లొట్టోను ఇండియాకు పరిచయం చేసిన ఘనత ఆయనది. ఎంతలేదన్నా ఈ పరిశ్రమలో పాతికేళ్ల అనుభవం ఉంది ఆయనకు. ఇండియాలో నైకీ లైసెన్సీగా తొలి అడుగు వేసిన లలిత్... ఆ తర్వాత ఆ గ్రూపుకి సీఎఫ్ఓ, వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అంతే కాదు...లొట్టో మాస్టర్ ఫ్రాంఛైజ్ అయిన స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఫౌండర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు కూడా. 


2011లో లలిత్ కూతురు ఎంట్రీతో అసలైన ఇన్నింగ్స్ మొదలైంది. గ్లోబలైట్ పేరుతో మార్కెట్లోకి సొంత బ్రాండ్ ను తీసుకొచ్చారు. లలిత్ కూతురు ఆయుషీ కిశోర్ ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ నుంచి కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవగానే తండ్రి బిజినెస్ ను పరుగులు తీయించారు. భారతదేశంలో దేశీయ స్పోర్ట్స్ ఫుట్ వేర్ బ్రాండ్స్ ఎక్కువగా లేవని గుర్తించి గ్లోబలైట్ పేరుతో ఇండియన్ బ్రాండ్ భారతీయులకు పరిచయం చేశారు.

"భారతదేశంలో కొన్ని టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుక్కునే స్తోమత కొద్దిమందికి మాత్రమే ఉంది. ఇవి కాకపోతే స్థానిక ఫ్యాక్టరీలు తయారు చేసే ఫుట్ వేర్ మాత్రమే ఉంది. సరైన ధరకు షూ అందించే మిడ్ రేంజ్ సెగ్మెంట్ బ్రాండ్లు చాలా చాలా తక్కువగా ఉన్నాయి" అంటారు ఆయుషీ కిషోర్.

మార్కెట్

మార్కెట్లో ఉన్న మంచి అవకాశాల్ని గుర్తించిన తండ్రీ కూతుళ్లు... మిడ్ సెగ్మెంట్ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన గ్లోబలైట్ రీటైల్ ను పట్టాలెక్కించారు. తయారీ దగ్గర్నుంచి సేల్స్ వరకు అన్నీ వీరి ఆధ్వర్యంలోనే ఓ పద్ధతిగా జరుగుతున్నాయి. అందుకే వీరి ఉత్పత్తులు తక్కువ ధరకే (రూ.499-రూ.999) లభిస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను పోలి ఉండటంతో ఫ్యాషన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ రోజుకు ఏడువేల జతల్ని ఆన్ లైన్ లో అమ్ముతోంది. వెబ్ సైట్, యాప్, టీవీ ఛానెల్, షాపుల ద్వారా గ్లోబలైట్ సేల్స్ జరుగుతున్నాయి. మూడేళ్లలో గ్లోబలైట్ వందకోట్ల అమ్మకాల్ని దాటేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అరవై కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. టీవీ కామర్స్ ప్రస్తుత మార్కెట్ విలువ ఐదు వేల కోట్ల రూపాయలు ఉండటం గ్లోబలైట్ కు కీలకంగా మారింది.

ఐదేళ్ల క్రితం మా బ్రాండ్ ప్రారంభించినప్పుడు అరవై శాతం బిజినెస్ ఆఫ్ లైన్ పద్ధతుల్లో జరిగేది. ఇఫ్పుడు మా 70 శాతం సేల్స్ ఆన్ లైన్ లో... 20 శాతం ఆధునిక హోల్ సేల్ విధానంలో జరుగుతున్నాయి. అయితే టెలివిజన్ కామర్స్ లో ఫుట్ వేర్, లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సేల్స్ 30 శాతం ఉండటం వల్ల గ్లోబలైట్ కు మంచి అవకాశాలున్నాయంటారు ఆయుషి.

undefined

undefined


కాంపిటిషన్

స్పోర్ట్స్ షూ నుంచి క్యాజువల్ షూ వరకు, స్నీకర్స్, లోఫర్స్, స్లిప్పర్స్, శాండల్స్... ఇలా అన్ని రకాల ఫుట్ వేర్ ని ఒకేచోట తయారు చేయడానికి కావాల్సిన సదుపాయాలున్నాయి వీరి దగ్గర. ఫ్యాక్టరీలో ఐదువందల మంది సిబ్బంది ఉన్నారు. సరికొత్త డిజైన్లు తయారుచేసిచ్చే రీసెర్చ్ అండ్ డెవలప్ టీమ్ చైనాలో ఉంది. ఇండియన్ డిజైన్ టీమ్ తో సమన్వయపర్చుకుంటూ కొత్తకొత్త డిజైన్లను రూపొందిస్తోంది. భారతదేశంలో ఓ బ్రాండ్ కు పేరుతీసుకురావడమంటే పెద్ద సవాల్. ఆ సవాల్ ని అధిగమించేలా మార్కెట్ వ్యూహాలను అమలుచేస్తోంది గ్లోబలైట్.


"టైర్ వన్, టైర్ టూ సిటీల్లో కొన్ని టాప్ బ్రాండ్లకు విశ్వాసపాత్రులుగా ఉన్నవారిని ఆకట్టుకోవడం మొదట్లో కష్టంగా మారింది. కానీ తీసుకున్న డబ్బులకు సరిపోయేలా ఉత్పత్తుల్ని అందిస్తూ మేము మార్కెట్లోకి చొచ్చుకొనిపోయాం. దాంతోపాటు ఇండియన్ మార్కెట్లో మొదటి అడుగు వేసింది మేమే కాబట్టి ఆ అడ్వాంటేజ్ మాకు ఉంది"-ఆయుషి.

స్థానిక కంపెనీలు వీరిని అనుకరించాలని చూశాయి కానీ సక్సెస్ కాలేదు. సొంతగా తయారీ సంస్థ, ఆర్ అండ్ డీ టీమ్, వివిధ మార్గాల్లో అమ్మకం లాంటి వాటితో ఇండస్ట్రీలో పట్టుసాధించింది గ్లోబలైట్. త్వరలో వెబ్, యాప్, టీవీ లాంటి వాటితో నేరుగా కస్టమర్లకు అందుబాటులో ఉండాలనుకుంటోంది. మొత్తానికి మూడేళ్లలో వంద కోట్ల బిజినెస్ తో మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నారీ తండ్రీకూతుళ్లు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags