సంకలనాలు
Telugu

ఇంటర్వ్యూలో మూడు చిక్కు ప్రశ్నలు

Sri
3rd Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


నా కెరీర్ తొలిరోజులవి. అప్పుడే నేను ఉద్యోగాల్లోకి అడుగుపెట్టాను. అందరిలాగే ఇంటర్వ్యూలను ఎదుర్కొన్నా. ఇంటర్వ్యూలకు ఎంత బాగా సిద్ధం అవుతామన్నది ముఖ్యం కాదు... గూగుల్ లో దొరకని ప్రశ్నలు అక్కడ ఎదురవుతుంటాయి. అందరికీ ప్రశ్నలు ఒకేలా ఉంటాయి కానీ... సమాధానాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అలాంటి ప్రశ్నలపై మీరు దృష్టిపెట్టాలి. చిన్నచిన్న అంశాలే ఒక్కోసారి ఉద్యోగాలు తెచ్చిపెట్టగలవు. లేదా అవకాశాలు కోల్పోయేలా చేయగలవు. చూడ్డానికి మామూలు ప్రశ్నల్లా అనిపించినా సమాధానాలు ఊహించినంత సులువేమీ కాదు. ఆ ప్రశ్నలేంటో చూద్దామా...

మొదటి ప్రశ్న: మీ గురించి కాస్త చెబుతారా?

లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోగానే పలకరింపులు అయిపోగానే.. అడిగే మొదటి ప్రశ్న ఇదే.. మీరు కచ్చితంగా బాగా సిద్ధమవ్వాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే... ఇక్కడ మీరు వేసే ఎత్తులతో సంభాషణను మీరు అనుకున్న దిశగా నడిపించొచ్చు. మీ వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమగ్రంగా, చక్కగా వివరించేలా కొన్ని లైన్లు రాసిపెట్టుకోండి. మీరు ఎవరు, నైపుణ్యాలు, ఆ ఉద్యోగానికి కావాల్సిన వ్యక్తిగత విశిష్ట లక్షణాలేమి ఉన్నాయి మీలో అన్న వివరాలన్నీ అందులో ఉండాలి.

* మీ ఉద్యోగ చరిత్రంతా వివరిస్తూ గందరగోళం చేయకండి. అవన్నీ చెప్పడానికి ఎలాగూ రెజ్యూమె ఉంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా మీలాగా కసరత్తు చేసి వచ్చే ఉంటారు. కాబట్టి జాగ్రత్త.

* మీ వ్యక్తిగత వివరాల నుంచి పక్కదారి పట్టకండి. సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పేప్పుడు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉండటం మంచి ఆలోచన. కానీ మరీ వ్యక్తిగతంగా తీసుకోకండి. ఎందుకంటే అది జాబ్ ఇంటర్వ్యూ అన్న విషయం గుర్తుంచుకోండి.

* ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. కానీ అదేదో రిహార్సల్ లా ఉండకుండా చూసుకోండి. రిలాక్స్డ్ గా సహజంగా సంభాషించాలి.

రెండో ప్రశ్న: మీ కీలక బలహీనతలేంటీ?

* ఇంటర్వ్యూ అయినా మరేదైనా ఎప్పటికీ పనిచేసేది నిజాయితీనే. ముఖ్యంగా ఇలాంటి సమయంలో నిజాయితీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేవాళ్లు చూసేది నిజాయితీనే. అలా ఉండటం వల్ల భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.

* బలహీనతల గురించి గందరగోళంగా ఉండకండి. మీ సమాధానం స్పష్టంగా, వివరంగా ఉండాలి. మీరు చెప్పడం మొదలుపెట్టక ముందే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ సామర్థ్యాల గురించి ఓ నిర్ణయానికి వచ్చేలా ఉండ కూడదు. మన అందరికీ ఏవో బలహీనతలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.

మూడో ప్రశ్న: మీకు ఈ ఉద్యోగం ఇస్తే తొలి 30, 60, 90 రోజులు ఎలా ఉంటాయి?

* మీకు ఉద్యోగం వస్తుందా... రాదా అని తేల్చే కీలక ప్రశ్న ఇది. మీ విజన్, లక్ష్యం, సామర్థ్యాలను స్పష్టంగా వివరించేలా సమాధానం ఉండాలి. విషయం పక్కదారి పట్టకూడదు.

* మీ బృందం లేదా కంపెనీ లక్ష్యాలేంటి...? అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుందో వివరించాలి. ఆ జాబ్ లేదా పోస్ట్ మీకు ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు, పరిజ్ఞానం మీకు ఉన్నాయని అనుకునేలా ఉండాలి ఇంటర్వ్యూలో మీ ప్రదర్శన. మీ లక్ష్యం, కంపెనీ లక్ష్యం ఒకేలా ఉండాలి.

* మీ వ్యూహాలు ఆలోచనకు అందేలా వాస్తవికంగా ఉండాలి. మీ శక్తిసామర్థ్యాలను ప్రతిబింబించేలా ఉండాలి. ఇంటర్వ్యూలో మీరేదైనా సలహాలు, సూచనలు ఇచ్చేముందు కాస్త జాగ్రత్త. ఇవే పరిస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేస్తాయి.

చివరగా నిర్భయంగా, విశ్వాసంతో ఉండండి. ఇంటర్వ్యూనే కాదు, జీవితంలో అయినా సరే ఈ రెండు అంశాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. సత్తా చాటండి. అద్భుతాన్ని ఆవిష్కరించండి.

రచయిత గురించి:

నిధి అగర్వాల్, కార్యహ్ లైఫ్ స్టైల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ & కో-ఫౌండర్. స్ట్రాటజీ కన్సల్టింగ్, ఆడిటింగ్ లో ఆమెకు పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉంది. భారతదేశంలో స్పేస్, మిస్సైల్స్ బిజినెస్ చేసేందుకు స్ట్రాటజీ డైరెక్టర్ హోదాలో హనీవెల్ కంపెనీకి సాయం చేశారు. దానికంటే ముందు బెయిన్&కో లో స్ట్రాటజీ కన్సల్టెంట్ గా పనిచేశారు. FMCG కంపెనీలకు మార్కెట్ ఎంట్రీ స్ట్రాటజీస్ రూపొందించారు. ఆమె KPMG, భారతీ ఎయిర్ టెల్ కు కూడా గతంలో పనిచేశారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags