సంకలనాలు
Telugu

రోడ్డుపై కార్ సడన్‌గా ఆగిపోయిందా ? అయితే మేం ఉన్నాం అంటోంది 'మోటర్‌మెక్స్'

GOPAL
12th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఏ మెట్రో నగరం రోడ్డు చూసినా భారీ ట్రాఫికే కనిపస్తుంది. ఇక ఆఫీస్ వేళల్లోనైతే దీని గురించి మాట్లాడుకోవాల్సిన పనేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెహికిల్ బ్రేక్‌డౌన్ అయితే.. అంతే సంగతులు. గంటల పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సిందే. అంతే కాదు ట్రాఫిక్ జామ్‌ అయ్యేందుకు కూడా కారణమవుతాం. అటుగా వెళ్లే వాళ్లంతా మనల్ని దోషులుగా చూస్తూ ఉంటే.. ఆ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేం. కానీ ఇలా రోడ్డుపై బ్రేక్‌డౌన్ అయిన వెహికిల్స్‌ను త్వరగా రిపేర్ చేసి పంపించేస్తోంది మోటర్‌మెక్స్ సంస్థ. ఒక్క కాల్‌తో బెంగళూరు నగరంలో ఎక్కడికైనా అరగంటలోపే చేరుకుని వాహనాన్ని రిపేర్ చేస్తోంది. తమకు ఎదురైన సమస్య ఇతరులకు రాకూడదు అనే ఉద్దేశంతో ప్రేమ్ కుమార్ మీనన్, ఉన్ని కృష్ణన్, డేవిడ్ సంగ్మాలు మోటర్‌మెక్స్‌కు శ్రీకారం చుట్టారు.

కస్టమర్లకు, సర్వీస్ సెంటర్లకు మధ్య వారధిగా మోటర్‌మెక్స్ పనిచేస్తోంది. రోడ్లపై ఆకస్మాత్తుగా వాహనాలు బ్రేక్ డౌన్ అయితే వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. వాళ్లకు సాయం చేసేందుకు దగ్గరలోని సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను ఈ సంస్థ అందిస్తుంది.


సమస్యే పరిష్కారానికి దారి

సమయం సాయంత్రం ఆరుగంటలు.. రోజంతా ఆఫీసు వర్క్‌తో బిజీ బిజీ. పని పూర్తి చేసి ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యమంలో వాహనం బ్రేక్‌డౌన్. దీంతో సర్వీస్ సెంటర్ అడ్రస్‌ల కోసమే గంటలపాటు వెతుకులాట. ఇలాంటి సమస్యలను ప్రేమ్, ఉన్నికృష్ణన్, డేవిడ్ సంగ్మాలు తమ నిజ జీవితంలో ఎదుర్కొన్నారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే మోటర్‌మెక్స్‌ను ప్రారంభించారు. వాహనదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టిన వీరు మొదట్లో కొన్ని సర్వీస్ సెంటర్లను సందర్శించారు. వెహికల్ బ్రేక్‌డౌన్ అయితే సర్వీస్ సెంటర్లు ఏంచేస్తాయి ? ఎంతసేపట్లో దాన్ని రిపేర్ చేసి ఇస్తాయి ? అనే విషయాలపై అంతా అవగాహనకు వచ్చారు. ‘‘ అప్పట్లో ఇదో సంచలనం. చాలా వరకూ సర్వీస్ సెంటర్లలో టోయింగ్ వెహికిల్స్ ఉండేవి కావు. వాటిని సరఫరా చేసేవారిపై ఆధారపడేవారు’’ అని డేవిడ్ చెప్పారు.


టోయింగ్ ప్రొవైడర్లతో మాటల సందర్బంలో ఈ రంగం కూడా అసంఘటితంగా ఉందని అర్థమైంది. సర్వీస్ సెంటర్ల కాల్స్‌, ఆన్‌లైన్ అడ్వర్టయిజ్‌మెంట్ క్లాసిఫైడ్ యాడ్స్‌పైనే వీళ్లూ ఆధారపడేవారు. అంతే కాదు ఛార్జీలు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వసూలు చేసేవారు. కస్టమర్ల అవసరాన్నిబట్టి డబ్బులు వసూలు చేసేవారు.

మోటర్‌మెక్స్ టీమ్

మోటర్‌మెక్స్ టీమ్


వర్కింగ్ మోడల్

బెంగళూరులో ఉన్న మొత్తం టోయింగ్ సర్వీస్ ప్రొవైడర్లను ఈ బృందం గుర్తించింది. వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఒక్క సెంటర్‌ను అయిదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉండేలా చూసుకుంది. ఇలా చేయడం ద్వారా రోడ్డుపై ఆగిపోయిన వాహనాలను 30 నిమిషాలలోపే అక్కడి నుంచి తరలించవచ్చని వీరి ఆలోచన. అలాగే దూరాన్ని బట్టి కూడా ధరను మోటర్‌మెక్స్ టీం ఫిక్స్ చేసింది.

బ్యాటరీ రన్ డౌన్, మైనర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వంటి వాటికి కూడా వాహనదారులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేస్తున్న విషయాన్ని వీరు గుర్తించారు. అలాంటి చిన్న సమస్యల పరిష్కారానికి మరికొందరు రిపేరర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. రోడ్డుపై బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని తాత్కాలికంగా రిపేర్ చేసి సర్వీస్ సెంటర్‌కో లేదా వాహనదారుడి ఇంటికి తరలించే పనులను వీరికి అప్పగించారు.

మరింత విస్తరణ

రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తరించాలన్న ఆలోచనలో మోటర్‌మెక్స్ యాజమాన్యం ఉంది. ‘‘ త్వరలో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్ (ఓఈఎంఎస్), మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. షెడ్యూల్ సర్వీసెస్‌తో పాటు అవసరమైతే రోడ్డుపైనే సర్వీస్ చేసే విధంగా వీరితో ఒప్పందం చేసుకోనున్నాం’’ అని డేవిడ్ తెలిపారు.

ప్రస్తుతం మోటర్‌మెక్స్ టీమ్ లో 12 మంది ఉద్యోగులున్నారు. వీరిలో సంస్థ వ్యవస్థాపకులతో పాటు సేల్స్, మార్కెటింగ్, సపోర్ట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు.

సర్వీస్ చేసేవారే గగనం

అవకాశాలు అపారంగా ఉన్నప్పటికీ, సరైన సర్వీస్ ప్రొవైడర్ దొరకడమే వీరికి చాలా కష్టమవుతోంది. వచ్చిన వాళ్ల దగ్గరి నుంచే ఎక్కువ తీసుకోవడం బదులు, ఎక్కువ మందికి సర్వీస్ ఆఫర్ చేయడం ద్వారా.. మరింత డబ్బును సంపాదించవచ్చని వాళ్లకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

ఈ ఏడాది జులైలో మోటర్‌మెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్లకు 400కుపైగా సర్వీస్ రిక్వెస్టులు వచ్చాయి. 100 మందికిపైగా సర్వీస్ ప్రొవైడర్లతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్వీస్ సెంటర్లకు కస్టమర్ చెల్లించే దానిలో కొంతమొత్తాన్ని కమిషన్‌గా స్వీకరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

‘‘ ఇప్పటి వరకైతే వ్యక్తిగతంగా ప్రమోటర్ల నుంచే నిధులు సమీకరించాం. ఈ నిధులతో బెంగళూరులో ఏడాది పాటు సేవలను అందించగలుగుతాం. ఈ ఏడాది చివరికల్లా మా సేవలను మరో రెండు మూడు పెద్ద నగరాలకు విస్తరించాలనుకుంటున్నాం. 2016 చివరికల్లా మరో ఐదు నగరాల్లో మా సేవలను అందిస్తాం ’’ అని డేవిడ్ వివరించారు.

మార్కెట్ ప్లేస్..

ప్రస్తుతం దేశంలో వెహికిల్ సర్వీస్ సెక్టార్ అవ్యవస్థీకృతంగా ఉంది. మైపిట్ స్టాప్, కార్టిజమ్, స్పీడ్ కార్ వంటి సంస్థలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. ప్రపంచంలోనే భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ అతి పెద్దది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో 21.48 మిలియన్ల వాహనాలను రూపొందించారు.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags