సంకలనాలు
Telugu

అభిలాష్... కుంభ స్థలానికే గురిపెట్టాడు..!

 

SOWJANYA RAJ
1st Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఈ-కామర్స్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ మెట్రో సిటీలేనా..?

ఆన్ లైన్ కస్టమర్లను ఆకర్షించాలంటే హై-ఫై నగరాల్లో ఉండాల్సిందేనా..?

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనా..?

ప్రస్తుతం నడుస్తున్న ఈ-కామర్స్ రివల్యూషన్ లో మనిషి జీవితంలో రోజువారీ జీవితానికి కావాల్సిన వినియోగవస్తువులు, సేవలు అన్నీ ఆన్ లైన్ లో పూర్తయిపోతున్నాయి. వీటి కోసం లెక్కకు మిక్కిలి ఈ-కామర్స్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. స్టార్టప్ హబ్ లలో యువతరం మదినుంచి పుట్టగొడుగుల్లా పుట్టుస్తున్న ఆలోచనల్లోంచి ... కొన్ని వృక్షాలుగా ఎదిగి సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టెక్ స్టార్టప్ రంగంలో తమదైన ముద్ర వేసేందుకు చదువు పూర్తి చేసినవారు...ఆ సమయాన్ని కూడా వృధా చేయడం ఎందుకనుకునేవారు.. ఇప్పటికే ఉద్యోగంలో స్థిరపడిపోయినవారూ.. ఇలా ప్రత్యేకమైన అర్హతలతో సంబంధం లేకుండా ఆలోచన.. ఆసక్తి.. ఆచరణ.. అనే మూడు అస్త్రాలతో బరిలోకి దిగుతున్నారు. వారంతా తమ తమ ఊళ్లను వదిలిపెట్టి మెట్రోలవైపు పరుగులు పెడుతున్నారు. మెట్రో సిటీల మార్కెట్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.

అయితే హైదరాబాద్ .. లేకపోతే బెంగళూరు. ఇదీ నేటి స్టార్టప్ ఆశావాహుల గమ్యస్థానం. మరి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈకామర్స్ కంపెనీలు మనుగడ సాగించలేవా..?. అక్కడ కంపెనీ పెట్టిన వాళ్లను పిచ్చోళ్ల కింద జమకట్టాల్సిందేనా..? ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మార్కెట్లు ఈ-కామర్స్ కు పనికి రావా..?. ఇప్పటిదాకా అయితే అదే పరిస్థితి. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని ఈ కామర్స్ కంపెనీలను, వాటి ఫౌండర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అయితే ఈ పరిస్థితిని మార్చి చూపిస్తానంటున్నారు మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన ఈ-కామర్స్ స్టార్టప్ ఫౌండర్ అభిలాష్ పిళ్లయ్.

లాతూర్ స్పెషల్ ఈ-కామ్ "కోట్స్"

ఆన్ లైన్ లో ఫ్యాషన్ ఔట్ ఫిట్స్ కొనాలంటే అందరూ మింత్రా, జబాంగ్ జపమే చేస్తూంటారు. కానీ మహారాష్ట్రలోని లాతూర్ లో మాత్రం యువత "కోట్స్" అంటుంటారు. Kots లాతూర్ లో పురుడుపోసుకున్న స్టార్టప్. అభిలాష్ పిళ్లయ్, అతని భార్య ఈ సంస్థ ఫౌండర్స్. ముందుగా మెన్స్ ఫ్యాషన్ ఔట్ ఫిట్స్ ను అమ్ముతున్నారు. టీ షర్ట్స్ కు కావాల్సిన గ్రాఫిక్స్ వగైరా అన్నీ ఇంట్లోనే క్రియేట్ చేస్తూంటారు. తయారీ మాత్రం నైన్టీ నైన్ ప్రింట్స్ అనే సంస్థకు అప్పగించారు. వారే టీ షర్ట్ రెడీ చేసి షిప్పింగ్ కూడా చేస్తారు. యువత అభివరుచులకు అనుగుణంగా టీషర్ట్స్ ను డిజైన్ చేసే క్రియేటివ్ టీంను అభిషేక్ పిళ్లై రెడీ చేసుకున్నారు. వీరి గ్రాఫికల్ టీ షర్ట్స్ కు క్రేజ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. బీటా వెర్షన్ లో వెబ్ సైట్ ని లాంఛ్ చేశారు. జీన్స్, ట్రౌజర్స్ కోసం లాతూర్ లోనే స్థానిక ఉత్పత్తిదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆన్ లైన్ మార్కెట్ గురించి పెద్దగా తెలియని వారికి.. వాటిలో ఉన్న లాభాలను విడమర్చి చెప్పి మరీ వారి ఉత్పత్తులను ఆన్ లైన్ లో ఉంచుతున్నారు అభిలాష్ టీం.

ఆన్ లైన్ మార్కెట్ విషయంలో చిన్న నగరాలకు ఉండే పరిమితులు తెలుసుకాబ్టటి... బ్యాకప్ సపోర్ట్ కోసం రీటైల్ స్టోర్ కూడా లాంఛ్ చేశారు. ఇప్పటికే ఆన్ లైన్ మార్కెట్ లో వచ్చిన ప్రచారం వల్ల దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఆన్ లైన్ మార్కెట్ లో కోట్స్ పుంజుకునేవరకూ ఈ రీటైల్ వ్యాపారం సపోర్ట్ గా ఉంటుందని పిళ్లై నమ్మకంతో ఉన్నారు. అభిలాష్ ఆలోచనలు నచ్చిన ఇద్దరు ఫైనల్ ఇయర్ బీసీఏ స్టూడెంట్స్ సుమిత్ జాదవ్, దబాద్ గవాకర్ టీంలో జాయినయ్యారు. ఇప్పటికే శుభాగ్ని కదమ్, ప్రియా విబుతే అనే ఇద్దరు ఇప్పటికే కోట్స్ ను ముందుకు తీసుకెళ్లేందుకు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం తనతో కలిపి ఐదుగురితో కోట్స్ ను నడిపిస్తున్నారు అభిలాష్.

image


ఎన్నో పరాజయాలు - పట్టువదలని ప్రయత్నాలు

39 ఏళ్ల అభిలాష్ పిళ్లైకి టెక్నాలజీ రంగంలో ఇదే మొదటి ప్రయత్నం కాదు. ఇప్పటికా చాలా ట్రయల్స్ చేశాడు. కొన్నింటిలో దారుణంగా ఫెయిలతే ..మరికొన్నింటిలో మాత్రం ... సో.. సో ఫలితాలు సాధించాడు. అయినా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఈ-కామర్స్ కంపెనీలకు అద్భుతమైన మార్కెట్ ఉందని.. అక్కడి నుంచి కూడా ఈ-కామర్స్ జెయింట్స్ వస్తాయని నిరూపించాలనే పట్టుదలతో అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అభిలాష్ తండ్రి కేరళకు చెందినవారు. ఉద్యోగ రీత్యా ముంబైకి వచ్చినా... తర్వాత లాతూర్ కేంద్రంగా సొంత వ్యాపారాలు ప్రారంభించారు. దాంతో అభిలాష్ కు లాతూరే జన్మభూమి అయింది. సీఏ పూర్తి చేసిన తర్వాత తండ్రి వ్యాపారాల్లో చేదోడువాదోడుగా ఉన్నా... కంప్యూటర్ సైన్స్ పై తనకున్న మక్కువతో ఎక్కువ రోజులు ఉండలేక పోయాడు. 2006లో "స్పైడర్ రూస్ట్ టెక్నాలజీస్" పేరుతో కంపెనీ ప్రారంభించాడు. వెబ్ డెవలప్ మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ( SEO ) సేవలు అందించేందుకు దీన్ని ప్రారంభించారు. ఎన్నో ఆశలతో దీన్ని ప్రారంభించిన అభిలాష్ కు గూగుల్ షాక్ ఇచ్చింది. సెర్చింగ్ అల్గారిథమ్ లో మార్పు చేయడంతో "స్పైడర్ రూస్ట్ టెక్నాలజీస్" కు పని లేకుండా పోయింది. పరిస్థితి ఎలా మారిందంటే... ఎంపీ త్రీ వచ్చాక.. ఆడియో క్యాసెట్స్ ఎంత వేగంగా ఫేడవుట్ అయిపోయాయో.. అలా "స్పైడర్ రూస్ట్ టెక్నాలజీస్" గడ్డు పరిస్థితి వచ్చింది. చివరికి కొట్టు కట్టేయాల్సి వచ్చింది.

"గూగుల్ కొత్త అల్కారిథమ్ పై వర్క్ చేయడానికి చాలా స్కిల్స్ కావాల్సి వచ్చాయి. కానీ నేను, మా టీం దానికి సిద్ధం కాలేకపోయాం. దీంతో కంపెనీని మూసేసి... వెబ్ డిజైనర్ గా ఫ్రీలాన్స్ చేసుకోవడానికి సిద్ధపడిపోయా"- అభిలాష్ పిళ్లయ్

ఆ పరాజయంతో నిరాశపడినా... నిస్ప్రహ చెందలేదు అభిలాష్. తనకు ఎంతో ఇష్టమైన వెబ్ డిజైనింగ్ లో కొత్త కొత్త అంశాలు నేర్చుకున్నాడు. లాతూర్ లోనే చిన్న వ్యాపార సంస్థలకు వెబ్ సైట్స్ చేసి ఇచ్చేందుకు ఉత్సాహం చూపించాడు. వాళ్లు చిన్నమొత్తం ఇచ్చినా ఒప్పుకునేవాడు అభిలాష్. అయితే చిన్న వ్యాపారులకు వెబ్ సైట్ అవసరాన్ని గుర్తించేలా చేయడమే పెద్ద పని అంటాడు పిళ్లై. అయితే ఒకసారి వారికి దీని విలువ తెలిస్తే మాత్రం వదిలిపెట్టరంటారు. మంచి టైమ్ కోసం చూసిన అభిలాష్... 2010లో రినీషా వెబ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించారు. వెబ్ సర్వీసులు స్పెషాలిటీగా దీన్ని ప్రారంభించారు. లాతూర్ లో మొదటి క్లైంట్ ను పొందినా... పుణె, ముంబైల్లో రెండు కంపెనీలతో చాలా వేగంగానే ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు దానిపైనే దృష్టిపెట్టారు. లాతూర్ లాంటి చిన్న పట్టణం నుంచి ప్రారంభించి.. కొనసాగిస్తున్నా ప్రపంచం మొత్తానికి చేరవకాగల సామర్థ్యం ఉందని అభిలాష్ నమ్ముతున్నారు. అందుకే 2015లో kotsపేరుతో ఈ కామర్స్ కంపెనీని ప్రారంభించారు.

రైట్ పర్సన్ - రాంగ్ సిటీ..?

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మార్కెట్ చాలా విస్త్రతమైంది. కానీ పూర్తిగా లోకల్ సెల్లర్స్ చేతిలోనే వ్యాపారం ఉంటుంది. వ్యవస్థీకృతం కాలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆన్ లైన్ మార్కెట్ అనూహ్యంగా వృద్ధి నమోదు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అభిలాష్ గట్టిగా చెబుతున్నారు.

" నన్ను అందరూ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ సిటీ అంటూంటారు. పెద్ద నగరాల కేంద్రంగా వెళ్తే ఎంతో భవిష్యత్ ఉంటుందని చెబుతుంటారు. అయితే నేను లాతూర్ నుంచే ఏదైనా కొత్తగా... భిన్నంగా ఉండేలా ఇంటర్నెట్ రివల్యూషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ తొమ్మిది పదేళ్లలో ఎంతో నేర్చుకున్నాను"- అభిలాష్ పిళ్లయ్, కోట్స్ ఫౌండర్

ఇంటర్నెట్ విప్లవం గ్రామగ్రామానికీ పాకుతున్న ఈ దశలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇంకా వ్యవస్థీకృతం కాని మార్కెట్ కొత్త అంట్రపెన్యూర్లకు అద్భుతమైన అవకాశంలా కనిపిస్తోంది. సృజనాత్మక ప్రయత్నం చేస్తే దీన్ని అందుకోవడం పెద్ద విషయమేం కాదు. ఈ విషయాన్ని నేను రుజువు చేస్తున్నానంటున్నారు అభిలాష్ పిళ్లయ్. కొన్నాళ్ల తర్వాత మనం ఇది నిజమేనని మరో స్టోరీలో చెప్పుకోవచ్చు కూడా..!

వెబ్ సైట్: 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags